Thursday 10 March 2011

గతితప్పిన తెలంగాణా ఉద్యమం

భారత దేశము నా జన్మభూమి, నేను భారతీయుడైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. దానికి భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి  కల్పించిన ప్రాధమిక హక్కులు ముఖ్యకారణం. కాని రాజ్యాంగంలోని కారణమును చూపించి కొంత మంది విచ్చలవిడిగా ప్రవర్తించడం భాదాకరం.

భారత జాతీయ జెండాను చూస్తే నా చాతీ కొలత కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే అది నా దేశ అభ్యునతిని తెలిపే ఒక అద్బుత కావ్యం.
ప్రపంచంలో ఒక మదర్ ధెరిస్సా, కౌటిల్యుడు, ఆశోకుడు,  అమర్త్వసేన్, సచిన్ టెండెలక్కర్ లకు ఉన్న కీర్తిని చూస్తే నా చాతీ ఇంకొంచెం పొంగుతుంది. ఎందుకంటే వారందరు నా జన్మభూమికి చెందినవారు.
అమెరికా ప్రభుత్వంలో మన తెలుగు వాడు ఉన్నత స్దానంను అలంకరిస్తే, వాడు  మన వాడేనని గొప్పగా ఫీల్ ఆవుతాము.
వాస్తవానికి పైన ఉదహారించిన వార్కి మనము ఎవరో తెలియదు. కాని వారి విజయములు చూసి, మన విజయములుగా భావిస్తాము. ఎందుకంటే మనమందరం భారతీయులం కనుక....
భారతీయత అనే వాక్యంలో ఉన్న పవర్ అది.....  మన ఉనికిని చాటి చెప్పేది, మన సంప్రదాయములను చాటి చెప్పేది అదే.
తర్వాత భాషాబిమానం. మన దేశంలో భాషా ప్రతిపాదికన చాలా రాష్ట్రాలు ఏర్పడాయి. అందులో మన రాష్ట్రం ఒకటి.
భాషలు, మతములు, ప్రాంతాలు వేరయిన అఖిలాండ భారతంలోని ప్రజలందరు ఒక్కటేనన్న భావన ప్రతి భారతీయుడిది.
ఒకప్పుడు అంటే స్వాతంత్రనికి ముందు సువిశాల అవిభక్త భారతవని( నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో కలపి)ని మహమ్మద్ అలీ జిన్నా మరియు కొంత మంది తమ స్వలాభం మరియు యితర తాయిలాలు ఆశించి మత ప్రాతిపాదికను విడదీసారు. వారు నూరిపోసిన విషమాటల ప్రభావంగా అన్నదమ్ముల వలె కలసియున్న ప్రజలు అప్పటి నుండి విడిపోయి పరస్పరం ద్వేషించుకుంటున్నారు.
దెబ్బలను కాలక్రమేణా మరిచిపోయి గణతంత్ర దేశముగా వర్దిలుతున్న భారతవనిలో, ఆంద్రరాష్ట్రంలో నూతన మహమ్మద్ అలీ జిన్నాలు ఉద్బవించడం మన దౌర్బాగ్యం........
మధ్య కాలములో ఆంధ్రరాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే, పై సంఘటనలు గుర్తుకుతెస్తునాయి.
నిన్న మిలియన్ మార్చ్ పేరుతో రాష్ట్రరాజధానిలో, ట్యాంక్ బండ్ వద్ద జరిగిన విద్వంసకాండను చూచిన తర్వాత నాలో ఉన్న ప్రతి రక్తం బొట్టు ఉడుకిపోయింది. ఎందుకంటే పైన చెప్పినట్టు నేను భారతీయుడుని, తర్వాత తెలుగువాడిని..... నా దేశములో, నా తెలుగు నేల పైన లబ్దప్రతిష్టులు అన్నదగిన విశిష్టవ్యక్తుల విగ్రహాలను నేలపాలుచేయడం, అది కూడా భారతీయులే కావడం ఎనలేని అవేదనను కల్గిస్తుంది.......
మిలియన్ మార్చ్ విజయవంతమైందన్న ప్రొ.కొదందరామ్ కోరుకొనేదేమిటి......  మన దేశ, రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచం నలుమూలల చాటిచెప్పిన విశిష్ట వ్యక్తుల విగ్రహాలను కూల్చడమే విజయవంతమా???

నాకు ఇప్పటివరకు తెలంగాణా ఉద్యమం మీద సానుకూల ధృక్పధం ఉండేది. కాని రోజు నుండి నా ధృక్పధంలో మార్పు రావచ్చు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావలన్న ఆకాంక్ష ఉండడం తప్పు కాదు. దానిని సాధించుకోవడానికి ఉన్న మార్గాలు చరిత్ర చదవడం ద్వారా తెలుసుకోవచ్చు.  తమిళులను కించపరచడం ద్వారా మద్రాసు రాష్ట్రం నుండి  ఆంధ్రరాష్ట్రం పొందలేదని గమనించాలి.... తెలంగాణేతరులను ద్వేషించడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం వస్తుందనుకోవడం పరమ మూర్ఖత్వం కాకపోతే ఇంకోకటి కాదు........
తెలంగాణా కోసం పోరాడుతున్నమనుకొనే ప్రొ.కొదండరామ్, కేసిఆర్ మరియు యితర సన్నాసి వెదవలకు చెప్పేదేమిటంటే, మీరు కూలగొట్టిన విగ్రహాలు కేవలం మీరు ద్వేషించడమే పనిగా పెట్టుకున్న సీమాంధ్ర వ్యక్తులు మాత్రమే కాదు. వారు తమ ప్రతిభాపాటవలతో  విశిష్ట స్దానమును అలంకరించిన మహోన్నతులు. వీరికి ప్రాంతియతత్వం ఆపాదించడము మీ మూర్ఖతమును తెలియజేస్తుంది. వారు గురించి మీకు తెలియకపోతే క్రింది వివరిస్తున్నాను. ఎందుకంటే ప్రతి భారతీయుడు విజయాన్ని మిగతా ప్రతి భారతీయుడు దానిని తమ విజయముగా భావిస్తాడు. కాని మీరు అలా భావించలేదంటే, మీరు భారతీయులమని ఒప్పుకోవడము లేదని భావించాలి.

ఆధునిక సాహితీ విమర్శకు ఆద్యుడు, విద్యాపరిపాలనారంగాలలో అనవద్యుడు......... సర్ సి.ఆర్.రెడ్డి
అధునికాంధ్ర కవితా వైతాళికుడు, సువిశాల మానవతావాద ప్రతిపాదకుడు.............. శ్రీ గురజాడ అప్పారావు
ఆంధ్రనాటక రంగ ప్రభాకరుడు, సముదాత్ర నటనా ప్రదీపకుడు.............. శ్రీ బళ్లారి రాఘవ్
గోదావరి జలాలను పొలాలకు తరలించిన భగీరధుడు, నిస్వార్ద ప్రజాసంక్షేమ నిరతుడు.. సర్ ఆర్దర్ కాటన్
అపార హేతువాద కృపాణ ధరుడు, వినూతన సాహితీ సృష్టికరుడు........ శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి
సంఘసంస్కరణ రణ పండితుడు, బహుముఖ సాహితి ప్రక్రియా పండితుడుశ్రీ కందుకూరి వీరేశలింగం
నవయుగ కవి చక్రవర్తి, దళితవర్గ జ్వలన్మూర్తి...........శ్రీ గుర్రం జాషువా
సంపాదకీయ రచనా ప్రబోధశీలి, ఆంధ్ర సముజ్జీవన చైతన్యశాలి..................శ్రీ ముట్నూరి కృష్ణారావు
అభ్యదయ కవితా యుగ ప్రయోక్త, సమసమాజ సంస్దాపన ప్రవక్త............ శ్రీ శ్రీ శ్రీ
తెలుగుసీమలో బ్రహ్మసమాజ కులపతి, బ్రహ్మర్షి బిరుద సార్దక విద్యావతి...  శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు
సాహితీ సమరాంగణ చక్రవర్తి, కర్ణాటకాంద్ర సమన్వయ నిత్యవిస్ఫూర్తి................ శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు
మువ్వగోపాల పదమోహన గాయకుడు, మధురభక్తి భావ, రాగ రంజకుడు........... శ్రీ క్షేత్రయ్య
పలనాటి సీమ పండించుకొన్న ధర్మవేది, చాపకూటితో సమతను నేర్పిన సామ్యవాది.... శ్రీ బ్రహ్మనాయుడు
కూచిపూడి నృత్య రీతికి ఆద్యుడు, తెలుగు నాట్య జగతికి ఆరాధ్యుడు................ శ్రీ సిద్దేంద్రయోగి
ఆంద్రభాషా పదకవితా పితామహుడు, శ్రీ వెంకటేశ్వర సంకీర్తన ప్రవీణుడు.............. శ్రీ అన్నమయ్య
అశేష ఆగమ శాస్త్ర తత్వనిపుణుడు, ఆంద్ర మహభారత పూరణాదక్షుడు............. శ్రీ ఎర్రాప్రగడ
ప్రధమాంధ్ర మహకావ్య నిర్మాణ చణుడు, వాగనుశాసన సార్దక బిరుద విభూషణుడు........ శ్రీ నన్నయ్య


పై వారందరికి ప్రాంతియవాదం అంటగట్టిన తెలంగాణా సాధన కోసం పాటు పడుతున్నమని చెప్పుకొనే కొంతమంది చదువుకున్న బర్రెలు మన మధ్యలో ఉండడం దౌర్బగ్యకరం. ఉన్నత చదువులు చదివిన ప్రొ.కొదందరామ్ లాంటి వారే మన తెలుగు జాతి ఔన్నత్యమును సాటిచెప్పిన  మహనీయులకు ప్రాంతియవాదం ఆపాదించడం సిగ్గుచేటు. వారు కూడా మొదట తెలుగు వారు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. తర్వాతే వారు తెలంగాణా వాదులుగా చెప్పుకోవాలి. ఇతరులను ద్వేషించడం, లేదా తరిమికొట్టడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం రాదన్న సంగతి తెల్సుకోవాలి.
ప్రభుత్వం కూడా విషయమును సీరియస్ గా తీసుకొని ఎవరైతే విగ్రహాలను ద్వంసం చేసారో, వారి నుండే, వాటి నిర్మాణ ఖర్చులు రాబట్టాలి.
ఎందుకంటే వారు ముందుగా తెలుగువారు, తర్వాతే ఏదైనా......

"చిరకాలంగా తెలుగుజాతికి జీవగర్రలై, స్ఫూర్తిప్రదాతలై, పధ నిర్దేశకులై, ధ్రువతారలుగా నిలిచిన మహానీయులను మన సృతిపధంలో నిలిపి గౌరవించుకోవడం, చెరిగిపోని రీతిగా సుస్దిరంగా ప్రతిష్టించుకోవడమై తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళాప్రాంగణ రూపకల్పన పరమార్దం"

విగ్రహాల స్దాపన సందర్బంగా ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు వెలిబుచ్చినది.

సదరు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధముగా వారు కేవలం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు. మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి వారందరివి. ఆయినప్పటికి మీరు ఇంకా ద్వేషిస్తామంటే, మీరు కోరవలసినది ప్రత్యేక రాష్ట్రం కాదు, ప్రత్యేక దేశమే........

No comments:

Post a Comment