ప్రపంచ మూడవ అర్దిక శక్తిగా వెలుగొందుతున్న జపాన్, మొన్న ఫసిఫిక్ మహ సముద్రంలో ఏర్పడిన భూకంపం కారణంగా వచ్చిన సునామీ దెబ్బకి కుదేలయ్యింది. సునామీ జపాన్ తీర ప్రాంతం పై విరుచుకుపడుతున్న దృశ్యాలు చూసి ప్రతిఒక్కరూ ఎంతో అవేదనకు గురయ్యారు. రెండవ ప్రపంచ యుద్ద గాయాల నుండి తేరుకొని ఆరు దశాబ్దాల కాలములోనే ప్రపంచ అగ్రరాజ్యముగా ఆవిర్బవం కావడానికి దోహదపడిన ఆ దేశ ప్రజల విశేషకృషిని ప్రశంసించకుండా యుండలేము. కాని అభివృద్ది పేరిట ప్రకృతి ధర్మానికి విరుద్దంగా వెళితే, ఇలానే భూకంపాలు, సునామీల బారిన పడవలసియుంటుందని మనమందరం గమనించాలి. ఈ రోజు ప్రపంచ దేశాలన్ని అభివృద్ది పేరిట ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ అభివృద్ధిదంతయూ మధ్యయుగ కాలంలోనే సాధ్యమయింది. కాని ఆ రోజులలో ప్రకృతి ధర్మమునకు అనుగుణముగానే చేసేవారు. కాబట్టే ఆ రోజులలో ఇలాంటి ఉపద్రవాలు చాలా అరుదుగా మాత్రమే వచ్చేవి. ఏది ఏమైనప్పటికి సునామి ధాటికి సర్వం కోల్పోయిన జపాన్ ప్రజలకు ఈ సందర్బంలో సరయిన చేయూత నివ్వడమే ప్రస్తుతం మనం ప్రపంచ దేశాలు చేయవలసిన పని.
No comments:
Post a Comment