Friday, 1 April 2011

జన సముద్రం

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జనాభా లెక్కల ప్రకారం, ప్రస్తుతం భారత దేశ జనాభా 121 కోట్లుకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో చైనా తర్వాత రెండో స్దానములో కొనసాగుతున్న భారత్, వచ్చే ఇరవై ఏళ్ళలో చైనాను అధిగమించనుందనే అంచనాలు అందోళన కలిగించేవే. ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న భారత్ వంటి దేశాలకు అధిక జనాభా చేటు కలిగించేదే. ఇప్పటి కైనా సరయిన ప్రణాలికబద్దంగా జనాభా అదుపులో తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవలసియున్నది. అధిక జనాభా దేశానికైనా ఇబ్బందికరమే. కాబట్టి చైనా తరహాలో మన దేశములో కఠిన జనాభా నియంత్రణ చట్టం తేవలసిన అవసరముంది. కానియెడల మరికొంత కాలానికి జనాభాకి సరిపడ మౌళిక వసతులు మరియు ఆహరం లభ్యతకు లోటు ఏర్పడి వినాశనమునకు దారితీసే అవకాశాలు కలవు. కావున ప్రజలకు ఇబ్బందికరమైనప్పటికి, దేశ హితము దృష్ట్యా కఠిన జనాభా నియంత్రణ చట్టమును అమలుచేయవలసియున్నది.

No comments:

Post a Comment