Monday, 8 August 2011

స్నేహితులు కోసము ప్రత్యేక దినోత్సవం అవసరమా??...


ఏటా అగష్టు నెలలో మొదటి ఆదివారము స్నేహితుల దినోత్సవము జరుపుకుంటున్న మన వాళ్ళకి, అసలు ఆ రోజును ఎందుకు స్నేహితుల దినోత్సవముగా జరుపుకుంటున్నారో మనలో ఎంత మందికి తెలుసు??? తల్లిదండ్రులు మనము ఎంచుకోలేము.. ఎందుకంటే అది దేవుడి నిర్ణయము.. అదే విధముగా బంధువులను కూడా మనము ఎంచుకోలేము.... కేవలము మన స్నేహితులను మాత్రమే ఎంచుకోగలము... అందుకే స్నేహితుల ఎంపికలో పూర్తిగా మన ఇష్టాలకనుగుణంగానే ఎంచుకొంటాము.... స్నేహము యొక్క విలువ ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య గల నమ్మకమును బట్టి ఉంటుంది... కొంత మంది స్నేహితులకు చాలా విలువనిస్తారు... కొంత మంది స్నేహితులను తమ కాలక్షేప అవసరముల కోసము ఉపయెగించుకొంటారు... కాని నాకు తెలిసి స్నేహితుడు లేని వ్యక్తులు ఉండరు.... ప్రతి ఒక్కరూ స్నేహమనే మధురనుభూతిలో ఈదితీరతారు...
అటువంటి స్నేహానికి సం.రం.లో ఒకరోజు కేటాయించుకొని విషెస్స్ చెప్పుకొంటే దాని విలువ పెరిగిపోతుందా........ పెరగదు.... ఇదే కాదు తల్లిదండ్రుల దినోత్సవము, పిల్లల దినొత్సవములు జరుపుకోవడం మన సంపద్రాయం కాదు... ఎందుకంటే పైన ఉదహరించిన వారందరూ మన భారత సంస్కృతిలో భాగముగా మన డైలీ జన జీవనంలో భాగము..... కాని పాశ్చాతులు మాత్రము అలా కాదు.... వారికి మనలాగా కుటుంబంలతో కలసియుండరు...... అందుకని ప్రత్యేకముగా దినోత్సవములు ఏర్పరచుకొని ఆ రోజున తల్లిదండ్రులతో కలసి ఆనందిస్తారు..... అదే విధముగా ఏర్పడినదే స్నేహితుల దినోత్సవం... ఈ దినోత్సవానికి మూలకారణం....1935 సం.లో ఆగష్టు నెలలో మొదటి శనివారం నాడు ఆమోరికా ప్రభుత్వం ఒక వ్యక్తిని కాల్చి చంపింది. అది జరిగిన మరునాడు మరణించిన ఆ వ్యక్తి యొక్క స్నేహితుడు దానికి నిరసనగా అత్మహత్య చేసుకొన్నాడు. అతని సంస్మరణార్దం ఆగష్టు నెల మొదటి ఆదివారమును స్నేహితుల దినోత్సవంగా పరిగణించి వేడుకలు చేసుకుంటున్నారు..... కాని దానిని మన వాళ్ళు పక్క వ్యాపార అంశంగా మార్చివేసి సొమ్ము చేసుకుంటున్నారు... యువతలో ఉన్న పిచ్చిని చాలా దారుణంగా క్యాష్ చేసుకుంటున్నాయి.... దానికి మనవాళ్ళు ఎప్పుడొ అలవాటు పడిపోయారు.... పాశ్చాతులు ఏమి చేస్తే అదే ఫ్యాషన్ అనే భ్రమలో ఉన్నంతకాలము బహుళ జాతి కంపెనీలు ఇలా ఏదో ఒక దినోత్సవమును క్రియేట్ చేసి ప్రజల జేబులు గుల్లకొడుతునే ఉంటాయి......

Friday, 5 August 2011

రాహుల్ పర్యటనల నుంచి స్పూర్తి పొందవచ్చునేమో....

కాంగ్రెసు పార్టి యువరాజు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో పార్టికి తిరిగి పునరవైభవం తేవడానికి చేస్తున్న విసృత్త పర్యటనలు ఈ మధ్య న్యూస్ లో అడపాదడపా వస్తున్నాయి... ముఖ్యంగా తన పర్యటనల్లో హంగులు ఏమి లేకుండా సాదాసీదాగా, పైగా అధికార వర్గాలకు ఎవరికి తెలియకుండా ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన మంచిదే.. ఎందుకంటే అధికారముకముగా వెళ్ళే పర్యటనల వలన సామాన్య జనాల మనస్సుల లోతుల్లోకి వెళ్ళలేమనే భావనతో సాదాసీదగా వెళ్ళడం అభినందనీయమే...  ముఖ్యంగా దేశప్రధాని కాబోయో వ్యక్తి ఈ విధముగా క్షేత్రస్దాయి విషయాలలో అవగాహన పెంపొందించుకోవడం, తదనంతర కాలములో అ పర్యటనల అనుభవాలు ఉపయెగపడవచ్చు... ఈ పర్యటనలను మిగతా రాజకీయ పార్టిలు రాజకీయ లాభాలు కోసం చేసే జిమ్మికులుగా వర్ణించడం జరిగింది.. అందులో కొంత వరకు నిజము ఉండోచ్చు.. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ లో పార్టి బలోపతం కోసమే ఈ పర్యటనలు చేస్తున్నారని అనుకోవచ్చు.... స్వలాభము కోసము చూసుకొనే సమయములో ప్రజల అవసరములు తెలుసుకోవడంలో తప్పు లేదు కదా..... దీని వలన అటు ప్రజలు సమస్యలు తెలుసుకోవచ్చు, అటు తన పార్టి ప్రతిష్టను పెంచుకోవచ్చు.... ఈ రోజు ఉన్న చాలా మంది రాజకీయనాయకులు చాలా అరుదుగా మాత్రమే ప్రజల్లోకి వెళ్ళుతున్నారు... పైగా ఏ రాజకీయ నాయకుడు కూడా తమ ప్రాంత ప్రజల అంక్షాకలను కనీస స్దాయిలో కూడా తీర్చలేకపోతున్నారని మోజారిటి ప్రజల అభిప్రాయం. కాని రాహుల్ గాంధీ మాత్రం డైరెక్టుగా ప్రధాని పీఠం అధిరోహించే అవకాశము ఉన్నప్పటికి, దాని కోసము ఆరాటపడకుండా, పూర్తి స్ధాయి అనుభవం కోసము కష్టపడడం నాకు చాలా నచ్చింది... పైగా తనకు తాను పెద్ద రాజకీయ సెలబ్రిటి అని ఊహించికోకుండా, పార్టికి సాధారణ కార్యకర్తగా మెలగడం అతని పట్ల నేటి యువతలో చాలా మందికి గౌరవ భావం ఉంది.... అతని జీవన విధానము కూడా చాలా సాదాసీదగా ఉంటుంది.... అతని పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నప్పటికి మనకు అనవసరం.. కాని అతను ప్రజల్లో ఉన్నప్పుడు తన బిహేవియర్ విషయములో తగు శ్రద్ద తీసుకొంటాడు... అతని నుండి దేశములో ఉన్న యువ రాజకీయనాయకులు స్పూర్తి పొంది, వారందరూ ప్రజల్లోకి వెళ్ళగలిగితే అంత కన్నా దేశానికి కావలసినదేమున్నది.... రాహుల్ గాంధిని పొగుడుతున్ననని మీరు నన్నేదో కాంగ్రెస్ వాదినని అనుకొవద్దు.. నేను కేవలం అతని రాజకీయ మరియు జీవన శైలి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను..... కాని రాహుల్ గాంధీ ఈ పర్యటనలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా జరిపితే ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకోవచ్చు.... కేవలం ప్రతిపక్ష పార్టి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే పర్యటనలు చేయడం వలన దేశ యువత మనసుల్లో పూర్తి స్దాయి స్దానము సంపాదించుకోలేకపోతున్నారు.... ఏది ఏమైనప్పటికి నేటి పార్లమెంటియన్లలో రాహుల్ గాందితో పాటు చాలా మంది యువ రాజకీయ నాయకులున్నారు... వారందరిని కలుపుకొని రాహుల్ గాంధి తన పర్యటనలను విస్త్రతపరచగలగితే, ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యలకు ఎంతో కొంత పరిష్కారము కనుగొన్నట్టే....

Wednesday, 3 August 2011

భృష్టుపట్టిన రాజకీయాలు(తయారి: భారతీయ ప్రజల ద్వారా)...



కర్ణాటకలో తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగ స్పూర్తిని మంటగలిపేలా ఉన్నాయి. ప్రజాపాలకులు రాష్ట్ర అవసరములు, ప్రజల అవసరముల కోసము కాకుండా స్వంత అవసరములు కోసము రాజకీయక్రీడల్లో మునిగిపోవడం బహుశా మన దేశములోనే ఉంటుందేమో... లోకాయుక్త అభిశంసనతో బలవంతంగా పదవి త్యాగము చేయవలసి వచ్చిన యడ్యురప్ప, తదనంతరం జరిగిన సంఘటనలతో దేశములో తన రాష్ట్ర పరువు నవ్వులపాలవుతుందన్న ఇంగీత సృహ కూడా లేకుండా ఆడిన రాజకీయ క్రీడను జాతి జనులందరూ అస్యహించుకొనేలా చేసారు. కర్ణాటకలో భారతీయ జనతాపార్టి అధికారములోకి తీసుకురావడానికి యడ్యూరప్ప కృషిని మర్చిపోలేకపోవచ్చు.. అవకాశవాద రాజకీయాలతో విసిగిపోయిన కర్ణాటక వాసులు గత ఎలక్షన్ ల్లో నిబద్దత కల్గిన యడ్యూరప్పను గద్దెనెక్కించారు.. కాని ఆయన కూడా అవకాశవాద రాజకీయాలకు అతితుడుని కానని నిరూపించుకొన్నారు.. లోకాయుక్త అభిశంసన తర్వాత కూడా అధిష్టానం కోరితేనే కాని తనంతాట తాను రాజీనామాకు అంగీకరించని యడ్యూరప్ప భవిష్యత్తు రాజకీయ నాయకులకు ఎటువంటి సందేశం ఇవ్వదలచారు?? ఆ రాజీనామా చేయడానికి తనకు అమోద యెగ్యమైన డిమాండ్లును పెట్టడం ఏ విధముగా సహేతుకం.. కర్ణాటక పౌరుడిగా తన రాష్ట్రానికి ఎవరైతే తన తదనంతరం ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలో ఆలోచించడం మాని, తన స్వంత ప్రయోజనాలకు ఇబ్బంది కలగని రీతిలో నడిపిన రాజకీయ జూదం ఏ విధముగా సమర్దనీయము....ఈయన గారిది ఒకెత్తు అయితే గాలి సోదరులది ఇంకొకెత్తు... ఇప్పటి వరకు యడ్యూరప్ప వర్గంలో ఉన్న గాలి సోదరులు, ఆగ్రనేత అద్వాని జగదీష్ షెట్లర్ కి అనుకూలముగా ఉన్నారని తెలియగానే రాత్రికి రాత్రే అవతలి పక్షంలోకి ప్లేటు ఫిరాయించడం అవకాశరాజకీయాలలో పరాకాష్ఠకి అర్దం పడుతుంది... ఇలాంటి రాజకీయ నాయకులను ప్రజలు ఆదరించిన కాలము ఇలాంటి నీచరాజకీయాలను మనము భరించవలసియుంటుంది... ఏనాడైతే మనము మారాగలమో ఆ రోజే మన వ్యవస్దలో మార్పు రాగలదని ఖరాఖండిగా చెప్పగలను... ఈ అర్టికల్ చదివిన వారందరూ ఒక్కసారి ఆలోచించండి.... మీరు మీ రాజకీయ నాయకులను ఎన్నుకొనే ముందు భవిష్యతుని ఆలోచించండి... అంతేకాని పార్టి మీద అభిమానంతోనో, లేక ఆ వ్యక్తికి గల వ్యక్తిగత చరిష్మాతోనో ఓటు వేయవద్దు... ఏ పార్టి ఆయిన అతని నిజాయితిని అంచనా వేయండి..... మనము ఏ రోజయితే సరయిన నేతను ఎన్నుకోవాలని అనుకున్నామో, అటోమేటిక్ గా మిగతా ప్రాంతాలలో ఆ మార్పు తప్పక కనబడుతుంది.... ముందుగా మీ ప్రాంతంలో సరయిన నాయకుడ్ని ఎన్నుకొండి..... మీరు నిజాయితిగా ఉంటే, మిగతావారందరూ నిజాయితిగానే ఉంటారు..... ఆలోచించండి.... మనము నిజాయితిగా ఉండకుండా అవతలి వాడు నిజాయితిగా ఉండాలంటే అది మూర్ఖత్వమవుతుంది..... నాకు తెలిసి ఓటర్లలో చాలా మంది మనలాంటి యువకులే ఉంటారు..... మనలాంటి యువకులందరూ కలిస్తే ఈ దేశ భవిష్యతునే మార్చగలము.... దాని కోసము మనము మన వ్యక్తిగత త్యాగాలను బలిపెట్టవలసిన అవసరము లేదు..... సరయిన నాయకుడిని ఎన్నుకుంటే చాలు...... ప్రతి ఎలక్షన్ లోను ప్రధాన రాజకీయ పక్షాలతో బాటుగా ఎంతో కొంత మంది స్వతంత్రులు కూడా పోటి చేస్తారు.... ప్రదాన పక్షాలలో పోటి చేసే ఆభ్యర్దులు చాలా మంది అవినీతిపరులే ఆయి ఉంటారు.... అటువంటప్పుడు మిగతా స్వతంత్రులలో నిజాయితిపరుడ్ని ఎంచుకోవచ్చు.... ఉదహారణకు గత ఎలక్షన్ లో పోటి చేసిన లోక్ సత్తా పార్టి అభ్యర్దులను సమర్దించవచ్చు...... మిగతా వారితో పోల్చితే లోక్ సత్తాలో చదువుకొన్న మనలాంటి యువకులుండడం దానికి గల సానుకూలంశం...... ఏది ఏమైనా ఓటు వేసే ముందు మీ స్వలాభాల గురించి ఆలోచించడం మాని,  మీ ప్రాంత అభివృద్ధి గురించి అలోచించడం ఉత్తమ పౌరుడి లక్షణం.... మీరందరూ ఉత్తమ పౌరులనే నేను ఖచ్చితముగా నముతున్నాను.... అవినీతి లేని భారతదేశాన్ని నిర్మించండి.

ఆలోచించండి....... మీ కోసము కాదు.... మీ దేశ భవిష్యత్తు కోసము......


Tuesday, 2 August 2011

మనశ్శాంతి లేక....


చాలా
రోజులయింది మరల బ్లాగు ప్రపంచంలోకి వచ్చి.... పని భారము వలన మరియు నా మనసు బాగాలేకపోవడం వలన ఈ మధ్య బ్లాగులోకి రావడానికి కుదరలేదు... ఆయిన నా ఆర్టికల్స్ కోసము వెయిట్ చేసేంతటి ఫాలోయింగ్ నాకు లేదు... ఈ అర్టికల్ వ్రాసేనాటికి కూడా నాకు సరయిన మనశ్శాంతి లేదు.... దేనిమీద శ్రద్ద పెట్టలేకపోతున్నాను.. కేవలం మనసు నిండా ఉన్న అనిజి భావన కారణముగా సతమవుతున్నాను.... అందుకనే సడెన్ గా నాకు అనిపించింది.... అది ఏంటంటే మనశ్శాంతి కావాలంటే దానికి కొలమానం ఏమిటి అని?? ఎంత ఆలోచించిన దానికి సరయిన కొలమానాలు ఉండవని అనుకుంటున్నాను.... ఎందుకంటే అది ఆ వ్యక్తి యొక్క మానసిక స్దితి మీద ఆధారపడి యుంటుందని నా అభిప్రాయము...నాకు బ్యాంకు బాలెన్స్ కి ఇబ్బంది లేదు... గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాను... స్నేహితులున్నారు.. ఆయినప్పటికి నాకు మానసిక ప్రశాంతత సాధించలేకపోతున్నాను. అసలు ఈ మానసిక ప్రశాంతత అనేది ఎలా సాధించాలో తెలియక సతమవుతున్నాను... ఆ మధ్య చాలా పుస్తకాల్లో చదివాను నేటి యువత ఎక్కువగా డిప్రెషన్ తో భాదపడుతున్నరని.... అది చదివినప్పుడు అనుకున్నాను... ప్రాబ్లెమ్స్ ఉన్నప్పుడు ఎవరైనా డిప్రెషన్ కి లోనవుతారు కదా... దానికి యింతంత అర్టికల్స్ వ్రాయడం అవసరమా అని... కాని ఆ ప్రాబ్లెమ్ ఏంటొ నాకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది... నాకైతే ఇప్పటికప్పుడు ఎటువంటి ప్రాబ్లెమ్స్ లేవు.... కాని డిప్రెషన్ లో ఉన్నాననిపిస్తుంది.... ఈ నా డిప్రెషన్ నన్ను ఎక్కడికి తీసుకుపోతుందో చూడాలి...
ఇలాంటి
చెత్త పోస్ట్ వ్రాసి మీ అముల్యమైన టైమ్ ని వేస్ట్ చేశానని భావిస్తే క్షమాపణలు కోరుకుంటూ........