Tuesday, 3 May 2011

ఉగ్రవాదం-ఆగ్రరాజ్యకుటిలనీతి

అంతర్జాతియ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా ప్రత్యేక దళాలు పాకిస్తాన్ లో హతమార్చడంపై సర్వత్రా ఆనందం వెల్లువిరించింది. నిజానికి ఈ విషయములో అందరూ ఈ విధముగా స్పందించడానికి అతను గతములో పాల్పడిన పలు ఘతుకాలు కారణం కావచ్చు. నిజానికి ఒసామా బిన్ లాడెన్ లాంటి వారి వలన ఎంత నష్టమో స్వయంగా అమెరికాకు తెలియడం వలన, దాని యొక్క త్రీవత మిగతా ప్రపంచంనకు తాకింది.

 తమ దేశములోని డబ్యూ.టి.ఓ. టవర్స్ ని పేల్చివేసిన తర్వాత మాత్రమే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ యొక్క ఆకృత్యాలు కనిపించాయి. అంతకు ముందే అతను పలు పేలుళ్ళు ద్వారా అనేక మంది చావుకు కారణమైనప్పటికి, తమ దేశం మీద దాడి జరిగిన తర్వాతకి గాని మెలకువలోకి రాలేదు. నిజానికి చెప్పాలంటే, లాడెన్ కు మరియు అల్ ఖైదాకి జవస్వతాలు కల్పించింది అమెరికాయే నన్న విషయము అందరికి తెలుసు. అమెరికా నీతి ఎలా ఉంటుందంటే, తనకు నష్టం జరగనంత వరకు ప్రపంచంమంతా బాగుగానే ఉంటుందనుకొంటుంది. నష్టం జరిగితే అది ప్రపంచం అంతటికి పెద్ద ప్రమాదం జరిగినట్టు చిత్రికరిస్తుంది.

 ఉదహరణకు మన దేశము ఎప్పటినుండో ఉగ్రవాదానికి బలవుతూ వచ్చింది. దానికి ప్రధాన ఆయువుపట్టు పాకిస్తాన్ నుంచే అందుతుందని భారత్ పలుమార్లు మొత్తుకున్నప్పట్టికి అమెరికా పట్టించుకోలేదు. పోని మనము స్వయముగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద తండాల మీద దాడులు చేద్దామంటే, అమెరికా  మధ్యలో కల్పించుకొని అంతర్జాతియ న్యాయ సూత్రాలు వల్లె వేసేంది. దానితో మనము ఏ నాటి నుండో అమెరికా యొక్క ద్వంద వైఖరికి అలవాటు పడిపోయాము. అదే అమెరికాకు ఉగ్రవాద సెగ తగలడంతో అల్ ఖైదా ను అంతం చేయడానికి ఆఫఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేయడానికి మాత్రం న్యాయ సూత్రాలు గుర్తుకురావు. ఉగ్రవాదము ఎక్కడున్న దానితో కూకటి వేళ్ళతో సహ పెకిలించవలసినదే. ఈ రోజు ఒసామా బిన్ లాడెన్ హత్య, మిగతా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవారికి హెచ్చరికే.  అందుకే మన హిందూ సంప్రదాయములో ఒక సామెత ఉంటుంది. అదేమిటంటే "ఎవడి చేసిన కర్మ వాడు అనుభవించవలసినదే" అని. ఇది అటు అమెరికాకు, ఇటు ఒసామా బిన్ లాడెన్ కి వర్తిస్తుంది. అల్ ఖైదాను తన అవసరాల కోసం పెంచిపోషించినందుకు అమెరికా దక్కిన ప్రతిపలం, మరియు అనేక మంది ఉసురుకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ కు దక్కిన ప్రతిపలం ఎటువంటిదో గమనించవచ్చు.

Thursday, 7 April 2011

అవినీతి రాజకీయం పై సమరం

ఇండియా అగైనెస్ట్ కరప్షన్ పేరిట ప్రముఖ సంఘసేవకులు శ్రీ అన్నా హాజరే దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరహరదీక్ష అన్ని రాజకీయపక్షాల గుండెల్లో గుబులు పట్టుకుంది. దేశములో అంతు బొంతు లేకుండా పెరుగుపోతున్న అవినీతి మరియు రోజుకొక్కటిగా బయటపడుతున్న కుంభకోణాలు చూసి ప్రతి ఒక్క భారతీయుడి గుండె రగులుతుంది. కాని పాలకపక్షాలు మాత్రం ఎటువంటి ఉలుకూపలుకూ లేకుండా యున్నాయి. సదరు  మితిమీరిపోయిన పరిస్దితిని గమనించి అవినీతి నిర్మూలనకు పటిష్టమైన లోక్ పాల్ బిల్లును ఆమోదించడమే లక్ష్యముగా అన్నా హజరే డిల్లీలో నిరాహరదీక్ష మొదలుపెట్టారు. సదరు దీక్షను పనికిమాలినిదిగా కొట్టిపారేసిన పాలకపక్షం నేడు ప్రజల్లో దానికి వస్తున్న ప్రతిస్పందన చూసి, అన్నా హజరే చర్యను తొందరుబాటుగా చర్యగా అభివర్ణించింది. అంతేకాని అవినీతికి వ్యతిరేకంగా తాము ఏ చర్యలు తీసుకుంటున్నది మాత్రం తెలియజేయలేదు.
 ఈ విషయములో దేశములో అన్ని రాజకీయ పక్షాలు ధోరణి ఒక్కటేనని, అందుకని ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయపార్టిలను బహిష్కరించడం శుభపరిణామం. అన్నాహజరే డిమాండ్ చేస్తున్నట్టుగా పటిష్టమైన లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టాలి. కాని యెడల ప్రజల్లోనే ఏదో ఒకరోజు మార్పు వస్తుంది.  ఒకసారి ప్రజల్లో మార్పు వచ్చిన తర్వాత, ఇకపై ఎటువంటి రాజకీయ పక్షాలు ఈ గడ్డ మీద మునుగడ సాధించలేవు అన్న సత్యాన్ని గమనించాలి. ఈ విషయములో ముందుగా దేశ రాజకీయలలో ప్రక్షాళన జరగాలి. అప్పుడు మాత్రమే పటిష్టమైన అవినీతి నిరోధక వ్యవస్దను ఏర్పాటుచేసుకొనగలము. అవినీతి, కుంభకోణాల కన్న ముందు దేశ రాజకీయాలలో కంపు త్రీవ అందోళన కలిగిస్తుంది. కాబట్టి ముందుగా మురికి రాజకీయాల ప్రక్షాళన జరగవలసియున్నది.

Friday, 1 April 2011

రాజా రవివర్మ అద్బుత కళాఖండాలు




జన సముద్రం

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జనాభా లెక్కల ప్రకారం, ప్రస్తుతం భారత దేశ జనాభా 121 కోట్లుకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో చైనా తర్వాత రెండో స్దానములో కొనసాగుతున్న భారత్, వచ్చే ఇరవై ఏళ్ళలో చైనాను అధిగమించనుందనే అంచనాలు అందోళన కలిగించేవే. ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న భారత్ వంటి దేశాలకు అధిక జనాభా చేటు కలిగించేదే. ఇప్పటి కైనా సరయిన ప్రణాలికబద్దంగా జనాభా అదుపులో తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవలసియున్నది. అధిక జనాభా ఏ దేశానికైనా ఇబ్బందికరమే. కాబట్టి చైనా తరహాలో మన దేశములో కఠిన జనాభా నియంత్రణ చట్టం తేవలసిన అవసరముంది. కానియెడల మరికొంత కాలానికి జనాభాకి సరిపడ మౌళిక వసతులు మరియు ఆహరం లభ్యతకు లోటు ఏర్పడి వినాశనమునకు దారితీసే అవకాశాలు కలవు. కావున ప్రజలకు ఇబ్బందికరమైనప్పటికి, దేశ హితము దృష్ట్యా కఠిన జనాభా నియంత్రణ చట్టమును అమలుచేయవలసియున్నది.