అంతర్జాతియ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా ప్రత్యేక దళాలు పాకిస్తాన్ లో హతమార్చడంపై సర్వత్రా ఆనందం వెల్లువిరించింది. నిజానికి ఈ విషయములో అందరూ ఈ విధముగా స్పందించడానికి అతను గతములో పాల్పడిన పలు ఘతుకాలు కారణం కావచ్చు. నిజానికి ఒసామా బిన్ లాడెన్ లాంటి వారి వలన ఎంత నష్టమో స్వయంగా అమెరికాకు తెలియడం వలన, దాని యొక్క త్రీవత మిగతా ప్రపంచంనకు తాకింది.
తమ దేశములోని డబ్యూ.టి.ఓ. టవర్స్ ని పేల్చివేసిన తర్వాత మాత్రమే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ యొక్క ఆకృత్యాలు కనిపించాయి. అంతకు ముందే అతను పలు పేలుళ్ళు ద్వారా అనేక మంది చావుకు కారణమైనప్పటికి, తమ దేశం మీద దాడి జరిగిన తర్వాతకి గాని మెలకువలోకి రాలేదు. నిజానికి చెప్పాలంటే, లాడెన్ కు మరియు అల్ ఖైదాకి జవస్వతాలు కల్పించింది అమెరికాయే నన్న విషయము అందరికి తెలుసు. అమెరికా నీతి ఎలా ఉంటుందంటే, తనకు నష్టం జరగనంత వరకు ప్రపంచంమంతా బాగుగానే ఉంటుందనుకొంటుంది. నష్టం జరిగితే అది ప్రపంచం అంతటికి పెద్ద ప్రమాదం జరిగినట్టు చిత్రికరిస్తుంది.
ఉదహరణకు మన దేశము ఎప్పటినుండో ఉగ్రవాదానికి బలవుతూ వచ్చింది. దానికి ప్రధాన ఆయువుపట్టు పాకిస్తాన్ నుంచే అందుతుందని భారత్ పలుమార్లు మొత్తుకున్నప్పట్టికి అమెరికా పట్టించుకోలేదు. పోని మనము స్వయముగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద తండాల మీద దాడులు చేద్దామంటే, అమెరికా మధ్యలో కల్పించుకొని అంతర్జాతియ న్యాయ సూత్రాలు వల్లె వేసేంది. దానితో మనము ఏ నాటి నుండో అమెరికా యొక్క ద్వంద వైఖరికి అలవాటు పడిపోయాము. అదే అమెరికాకు ఉగ్రవాద సెగ తగలడంతో అల్ ఖైదా ను అంతం చేయడానికి ఆఫఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేయడానికి మాత్రం న్యాయ సూత్రాలు గుర్తుకురావు. ఉగ్రవాదము ఎక్కడున్న దానితో కూకటి వేళ్ళతో సహ పెకిలించవలసినదే. ఈ రోజు ఒసామా బిన్ లాడెన్ హత్య, మిగతా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవారికి హెచ్చరికే. అందుకే మన హిందూ సంప్రదాయములో ఒక సామెత ఉంటుంది. అదేమిటంటే "ఎవడి చేసిన కర్మ వాడు అనుభవించవలసినదే" అని. ఇది అటు అమెరికాకు, ఇటు ఒసామా బిన్ లాడెన్ కి వర్తిస్తుంది. అల్ ఖైదాను తన అవసరాల కోసం పెంచిపోషించినందుకు అమెరికా దక్కిన ప్రతిపలం, మరియు అనేక మంది ఉసురుకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ కు దక్కిన ప్రతిపలం ఎటువంటిదో గమనించవచ్చు.
No comments:
Post a Comment