Saturday 2 February 2013

పోరాడే వాళ్ళంతా ఉగ్రవాదులేనా?


విశ్వరూపం సినిమా వివాదస్పదం కావడానికి అసలు కారణమేంటి?

తన సినిమాను అఫ్ఘనిస్తాన్ మరియు కాబూల్ నేపధ్యంలో తీయడమే......

ఆ నేపధ్యంలో సినిమా తీసిన ప్రతి ఒక్కడూ, అక్కడ ప్రతి వాడు విలన్ అన్నట్టుగానే చూపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అక్కడి వారందరూ ఉగ్రవాదులే అన్న కోణంలోనే ఆలోచిస్తున్నారు........ ఏం... ఆయుధాలు పట్టుకొని సంచరిస్తే ఉగ్రవాదులేనా? అలా అయితే మిగతా దేశాల సైనికుల వద్ద అయుధాలు ఉన్నందున వారిని కూడా ఉగ్రవాదులనవచ్చా?  ఎవరి రక్షణ కోసం వారు ఆయుధాలు ధరించడంలో తప్పేమి ఉంది?
అఫ్ఘనిస్తాన్ మరియు కాబూల్ తలంపుకి వచ్చినప్పుడల్లా మనకి గుర్తుకు వచ్చేది అక్కడ స్దానికులైన ముస్లిం వర్గానికి చెందినవారే... మిగతా దేశాల్లో ఉన్నట్టుగానే అక్కడ కూడా వారు సాధారణ వ్యక్తులే... మిగతా అన్ని దేశాలకు రక్షణ దళాలు ఎలా ఉంటాయో, వాళ్ళకు కూడా రక్షక దళాలుంటాయి. ఆయితే మిగతా దేశాల్లో వ్యవస్ద ఒక క్రమపద్దతిలో పటిష్టంగా ఉండడం వలన తప్పుగా కనబడవు. కాని అఫ్ఘనిస్గాన్ లో అలాకాదే. అక్కడ దేశం మొత్తానికి ఒక పటిష్టమైన సరయిన వ్యవస్ద లేదు. అందు వలన ఎక్కడి కక్కడే ఆయా ప్రాంత తెగలు రక్షక దళాలను ఏర్పాటు చేసుకుంటాయి. మిగతా దేశాలు తమ దేశ రక్షణ కోసము ఎలా రక్షక దళాలు ఏర్పాటు చేసుకుంటాయో, అదే విధంగా వారు కూడా ఏర్పాటు చేసుకుంటారు.  తమ దేశరక్షణ కోసం వారి దళాలు ఎలా పోరాడతాయో,  వారు కూడా వారి రక్షణ కోసం పోరాడతారు. ఇందులో తప్పేమి ఉంది....

కాకపోతే మిగతా చోట్ల పటిష్టమైన రాజ్యనిర్మాణం ఉంది, ఇక్కడ లేదు అంతే తేడా. మిగతా దేశాల మీదకు వేరొకరు వస్తే ఎలా తిరగబడతారో, వీరు కూడా అంతే......

పక్క ఇంటోడి పర్మిషన్ లేకుండా వాడింట్లోకి వెళితే, లాగి పెట్టి కొడతాడు. అలాగే అక్కడ వాళ్ళకు నచ్చకుండా ఎవడైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తే లాగి పెట్టి కొట్టడానికే ప్రయత్నిస్తాడు.

భారతదేశ సైనికులను, వారి వద్దనున్న ఆయుధాలను చూపించి, భారత దేశంలో ప్రజలందరూ ఇలానే ఉంటారని ఎలా భావించలేమో, ఆయుధాలు ధరించి తిరిగుతున్న అక్కడ స్దానికులను చూసి అక్కడ వారందరూ అలానే ఉంటారని భావించలేము...

సినిమా పేరు నాకు గుర్తు లేదు, ఒక హాలీవుడ్ సినిమాలో అఫ్ఘనిస్తాన్ లో ప్రజల కష్టాల గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ సినిమా చూస్తే ఎలాంటి వాడికైనా కన్నీళ్ళు రావడం ఖాయం. ఆ సినిమా చూసిన వారెవరూ వారిని విలన్స్ గా భావించరు. అసలు అఫ్ఘనిస్తాన్ రావణకాష్టంలా మారడానికి కారణం అమోరికా, రష్యాలే. ప్రచ్చన్న యుద్ద కాలములో రెండు దేశాలు అఫ్ఘనిస్తాన్ ని తమ స్వార్దం కోసం సర్వనాశనం చేసేశాయి. వారు చేసిన నష్టానికి ఇప్పటికి పటిష్ట రాజ్య నిర్మాణం చేసుకోలేని స్దాయికి దిగజారిపోయింది.

అఫ్ఘనిస్తాన్ అంటే అయుధాలు ధరించి తిరుగుతున్న వ్యక్తులే కాదు. అంతకు మించి అవతల చాలా ఉంది. దాని గురించి ఎవరూ సృశించరు.. ఎవడో ఒక తలతిక్కవెధవ తిన్నదరక్క ఉగ్రవాదం దారి పట్టాడు. వాడే బిన్ లాడెన్.. వీడు తన ఉగ్రవాదంలోకి ముస్లింలందరినీ కలిపేసాడు. అసలు వాడెంత? ముస్లిం వర్గం మొత్తానికి వాడేమైనా ప్రతినిధా?   ముస్లింలకు అల్లా తప్ప, వేరేవరు ప్రతినిధులు కారు. ఇలాంటి తలతిక్క వెధవలు అన్ని మతాల్లొను ఉన్నారు. మతం పేరు చెప్పి తమ ఉగ్రవాదం పిచ్చిని తలకెక్కించుకొన్న వెధవలు అన్ని మతాల్లోని ఉన్నారు. మరేం వారందరినీ ఒదిలేసి ముస్లింల మీద పడుతున్నారు అందరూ...... బిన్ లాడెన్ ఒక మూర్ఖుడు. వీడు తానున్న ప్రాంతంలో అధిపత్యం కోసం ప్రయత్నించేవాడు. అసలు వీడిని పెంచి పోషించిందే అమెరికా. అమెరికా తన అవసరాల కోసం తయారు చేసిన సంస్దే అల్ ఖైదా.. ప్రచ్చన్న యుద్దం ముగిసిన తర్వాత అమెరికాకు దానితో పనేమి లేక పట్టించుకోవడం మానేసింది. అప్పటి వరకు అమెరికా కోసం కార్యాక్రమాలు నడిపిన అల్ ఖైదా, తన ఉనికిని కాపాడుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలు కొనసాగించింది. ఆయితే దానికి ఒక దిశ ఉండాలి కాబట్టి, పైగా దానికి జనామోదం ఉండాలి కాబట్టి, పవిత్ర జిహద్ అని పేరు పెట్టి ముస్లింలందరినీ అందులో భాగస్వామ్యం ఉన్నట్టుగా క్రియెట్ చేసింది. తాను చేసే పనికిమాలిన పనులకు ముస్లింలు అందరూ భాధ్యత వహించాలా? అతనుకతను తాను ముస్లింలందరి కోసం పోరాడుతున్నానని ప్రకటించుకుంటే సరిపోతుందా? వాడు ఉగ్రవాది కాబట్టి, మిగతా ముస్లింలందరూ అలానే  ఉంటారని భావించాలా? ఉదహారణకు మావోయిస్టులను తీసుకుందాం. వీరు ఇండియాలో ఉంటారు కాబట్టి,  మరియు ఇండియాలో మెజారిటీ భాగం హిందువులే కాబట్టి, వారు కూడా హిందువులే ఆయి ఉంటారు అనుకుంటే, హిందువులందరూ ఉగ్రవాదులే అంటే ఒప్పుకుంటామా? అలాగే మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల్లో మాదకద్రవ్య ముఠాలు క్రిస్టియన్ వర్గానికి చెందిన వారిగా భావిస్తే, వారు చేసే సంఘ విద్రోహ కార్యక్రమాలకు క్రిస్టియన్స్ అందరూ భాధ్యత వహించాలంటే ఒప్పుకుంటామా?  ఇది కూడా అంతే...

బిన్ లాడెన్ లాగే, మూర్ఖత్వ భావాలున్న తాలిబాన్స్ చేతుల్లోకి అఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవడం, ఆ దేశం ఇంకా అనిశ్చితిలోకి కూరుకుపోవడానికి కారణమయింది. తాలిబాన్స్ చేసిన అకృత్యాలకు అనేక మంది ప్రాంతీయ ముస్లింలు పడరాని పాట్లు పడ్డారు. మంచి రోజులోస్తాయని ఎదురు చూసారు. బిన్ లాడెన్ చర్యల ద్వారా అమెరికా తాలిబాన్స్ పై దండయాత్ర చేసి తరిమికొట్టడంతో, తమ కష్టాలు తీరిపోయాయని ఎంతో సంతోసించారు. మనం ఎవరం పడని కష్టాలు అక్కడి ప్రజలు పడ్డారు. కానీ ప్రపంచం మాత్రం బిన్ లాడెన్ తో పాటుగా తమందరీని అనుమానంగా చూడడం వారికి ఇబ్బందిగా ఉంది. కొంత మంది చేసిన వెధవ పనులకు మొత్తం మతస్దులను ఎలా భాద్యుల్ని చేస్తారు.  అఫ్ఘనిస్తాన్ గురించి చెప్పినప్పుడు అక్కడంతా ఉగ్రవాదమే అని భావించడం తప్పు కాదా?

ఆ లెక్కన అన్ని మతాల్లోనూ ఇలాంటి వెధవలున్నారు. అంత మాత్రాన అయా మతస్దులందరూ వెధవలుగా భావించరాదు. అఫ్ఘనిస్తాన్ అంటే బిన్ లాడెన్ మాత్రమే కాదు. అలాగే తాలిబాన్స్ మాత్రమే కాదు. అలాగే మత మౌడ్యం తలకెక్కిన ముష్కరులు మాత్రమే కాదు. అంతకి మించి చాలానే ఉంది. దానిని చూడండి ముందు... ప్రతి దేశానికి మంచి, చెడు ఉంటుంది.  రెండు కోణాల్లోను చూస్తే ఎలాంటి సమస్యలు ఉండవు....

విశ్వరూపం సినిమాలో కమల్ హసన్ అఫ్ఘనిస్గానీయుల జీవితంలో ఉన్న రెండో పార్శంను కొద్దిగా సృశించాడు. కానీ మెజారిటి భాగం ఒక వైపే చూపించాడు. అది వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడంలో తప్పులేదు. అలాగే సినిమాలో చూపించిన ముస్లింలందరికీ ఉగ్రవాద సంబంద లింక్స్ ఉన్నట్టుగా చూపించాడు. ఉగ్రవాదులనేవారు అన్ని మతాల్లో ఉన్నట్టుగానే ముస్లిం మతంలో కూడా ఉంది. అలాగే ముస్లిమ్స్ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలి. దానికి మతంతో పని లేదు. ఉగ్రవాదం ఒక ముస్లిం చేసినా, హిందూ చేసిన, క్రిస్టియన్ చేసిన లేక వేరే ఎవరూ చేసిన దానిని ఖండించాలి.

విశ్వరూపం సినిమా అఫ్ఘనిస్తాన్ నేపధ్యంలో తీసారు, అక్కడ ఉండేది ముస్లిం వర్గాలే కాబట్టి వారినే చూపిస్తారు. అంతే కాని హిందువులో, క్రిస్టియన్స్ లేక వేరే మతం వారో అక్కడ ఉంటున్నట్టుగా చిత్రికరించలేరు కదా...  సినిమాలో ముస్లిం యువకుడుని ఉగ్రవాదిగా చూపించినంత మాత్రనా మొత్తం ముస్లిం వర్గాన్ని కించపరిచినట్టుగా ఎలా ఆవుతుంది? ఆ మాటకు వస్తే అదే సినిమాలో న్యూయర్క్ నేపధ్యంలో కొంత భాగం ఉంటుంది. అక్కడ రాహుల్ బోస్ బృందానికి చాలా మంది అమెరికా సంతతి వారు సాయం చేస్తారు. అంత మాత్రం చేత వారు తమను ఉగ్రవాదులుగా చూపించడం జరిగిందని రాద్దాంతం చేయలేదు కదా? అలాగే రిచర్డ్ హెడ్లీ జన్మత అమెరికన్. వాడు ముంబాయి బాంబు పేలుళ్ళ కేసులో నిందితుడు. మరి దానికి అమెరికా జాతి మొత్తం బాధ్యత వహిస్తుందా? వాడు తప్పు చేసాడు కాబట్టి జైలు శిక్ష పడింది. ఎవరైనా అంతే ఆ విషయంలో...

మతం వేరు, ఉగ్రవాదం వేరు.....

రెండింటీ పేరు చెప్పుకొని ప్రజల ఎమోషన్స్ తో అడుకోనే రాజకీయనాయకులుతోనే వస్తుంది చిక్కు అంతా....

ఆ మధ్య ఒక శాసనసభ్యుడు కసబ్ ముస్లిమ్ కాబట్టే ఉరితీసారని సెలవిచ్చారు. కానీ కసబ్ ని ఉరితీసింది ఎందుకో మనకందరికి తెలుసు.... మరి ఆయనకు తెలియదనుకోవాలా?

ఆ మధ్యనే ఇంకో పెద్దాయన దేశములో జరిగిన కొన్ని బాంబు దాడుల్లో హిందూ సంస్దల ప్రమేయముంది అని సెలవిచ్చారు. స్టేజీ మీద కూర్చుని స్టేటుమెంట్సు ఇవ్వడానికి కాదు కదా ఆయనకు పదవి నిచ్చింది. వెంటనే దానిని నివారించే చర్యలు చేపట్టవలసింది పోయీ, మత విషయమును ప్రస్తావనలోకి తెచ్చారు. దీనిని ఏమనాలి? ఓట్ల రాజకీయం అంటే బాగుంటుందా?

ముందుగా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగానే చూడాలి. అప్పుడే సమస్యలు ఉండవు.. ఎక్కడైనా ఆధారాలతో ఉగ్రవాదులు దొరికినపుడు వాడి మతం గురించి ఇటు హిందువులు, అటు ముస్లింలు గగ్గోలు పెట్టడం మాని ప్రభుత్వాలకు సహకరిస్తే బాగుంటుంది. అప్పుడే ఏ వర్గం మీద ప్రతికూల అభిప్రాయాలు కలగకుండా ఉంటాయి. 

6 comments:

  1. మీ బ్లాగ్ చాలా బాగుంది...ఒక విషయం మీదే కాకుండా ..అన్ని సమకాలీక విషయాలను టచ్ చేసారు...చాలా బాగుంది...మీ వాక్యాలు,వ్యాసాలూ అన్నీ బాగున్నై...ఒకా రోజులోనే మీ బ్లాగ్ అంతా చదివాసాను ....ఇలాగే మీ బ్లాగ్ కొనసాగాలని కోరుకుంటున్నాను..
    . చైతన్య

    ReplyDelete
  2. ధ్యాంక్యూ సార్....

    ReplyDelete
  3. Such a nice criticism with beautiful sense of humor. I am seeing you since my childhood but I don't know that you have tremendous analogy. In these busy days got some time to read your blogs accidentally & love those. Awesome please continue...

    ReplyDelete
    Replies
    1. అంత లేదు బావ ఇక్కడ... ఏదో సరదాకి రాస్తున్నాను అంతే... నీకు నచ్చినందుకు ధన్యవాదములు...

      Delete
  4. రాజీవ్‌గారు...
    మీరు సరదాకి రాసుకోవాలనుకుంటే సరదా విషయాలనే ఎంచుకోండి... సీరియస్‌ విషయాల జోలికి వెళ్లకండి.. ఎందుకంటే మీరు రాసిన దాంట్లో కొన్ని తప్పులున్నాయి.. మొదటిది మావోయిస్టులు ఉగ్రవాదులు కాదు.. వారికో లక్ష్యం ఉంది. సిద్దాంతమూ ఉంది. మరోటి అఫ్ఘనిస్తాన్‌ను సర్వనాశనం చేసింది అమెరికానే కానీ రష్యా కాదు.. రష్యా చేతిలో ఉన్నదనే దుగ్ధతోనేగా లాడెన్‌ను అమెరికా పెంచి పోషించింది.. తాలిబన్లను తయారు చేసింది. ఇవీ వాస్తవాలు..

    ReplyDelete
    Replies
    1. బాల గారు..
      మీరన్నట్టు సీరియస్ విషయాలు రాసేటప్పుడు నేను ఇంకా ఎక్కువగా స్టడీ చేయవలసియుంది...
      అలాగే మావోయిస్టులు ఉగ్రవాదులన్నట్టుగా ఎక్కడ పేర్కొనలేదు.. వారి లక్ష్యాల మీద, సిద్దాంతాల మీద నాకు గౌరవముంది. అంతకు మించి వ్యాఖ్యానించడానికి నా నాలెడ్జ్ సరిపోదు....
      ఇకపోతే అప్ఘనిస్తాన్ నాశనం కావడానికి కారణం అమోరికా, రష్యాలే.. ఎందుకంటే రష్యా అప్ఘనిస్తాన్ లో కల్గజేసుకొని ఉండకపోతే అమోరికా దాని జోలికి వెళ్ళకపోదును.. అధిపత్యం కోసం రష్యా వెళ్ళడం మూలంగానే అమోరికా కూడా కలగజేసుకోవలసివచ్చిందన్నది నేను న్యూస్ పేపర్లు లేదా ఇతర మ్యాగజేన్లు చదవడం ద్వారా తెలుసుకొన్నాను....
      హెడ్లీ అమోరికన్ అని పేర్కొనడం తప్పు అని ఆ తర్వాత తెలిసింది....

      Delete