Wednesday, 11 April 2012

కలచివేసిన అఫ్రీన్ మరణం..


నేహ అఫ్రీన్..

మీకెవరికి పెద్దగా తెలియదనుకుంటా ఈ పేరు...

తెలియకపోవడమే మేలు లెండి... పేరే కాదు తన గురించి తెలియకపోతేనే మంచిదిలెండి...

అభం శుభం తెలియని మూడు నెలల చిన్నారిని చిత్రహింసలు పెట్టడానికి వాళ్ళ నాన్నకి చేతులు ఎలా వచ్చాయో తెలియడం లేదు.

బెంగుళూరులో మూడు నెలల చిన్నారి నేహ అఫ్రీన్ మూడో కాన్పులో జన్మించింది. మూడో కాన్పులో కూడా అమ్మాయే పుట్టడంతో ఆ పాప మీద అసూయ పెంచుకొని సిగరెట్టుతో వాతలు పెట్టి, చిత్రహింసలు గురి చేసాడంట ఆ ప్రబద్దుడు...

ఆయిన నాకు తెలియక అడుగుతాను.. అంత లేలేత చర్మం కల్గిన చిన్నారిని హింసించడానికి అతనికి చేతులెలా వచ్చాయండి??

అసలు వాడు ఈ కాలంలోనే ఉన్నాడా? లేక మధ్యయుగాల కాలంలో ఉన్నాడా?? పుట్టబోయే బిడ్డ తన క్రోమెజమ్స్ లో ఏది కలవడం ద్వారా మగ లేక అడ సంతానం కల్గుతుందన్న కనీస ఇంగీత జ్ణానం కూడా లేదా?
ప్రాణపాయస్దితిలో ఉన్న ఆ చిన్నారిని హస్పటల్ లో జాయిన్ చేసిన మూడు రోజుల తర్వాత మృత్యువుతో పోరాడి ఈ రోజు కన్నుమూసింది..

మృత్యువుతో పోరాడి అనే కంటే, అహ్హనించింది అంటే సబబుగా ఉంటుందేమో..... ఇలాంటి కీచక ప్రపంచంలో బ్రతికి పోరాడే కంటే స్వచ్చమైన మృత్యువు ఒడిలో ఉండడమే మేలు అనుకుందేమో.... నన్ను కాదనుకున్న ప్రపంచం నాకు అక్కర్లేదనుకుంది....

నిజంగా నన్ను చాలా బాధపెట్టిందీ ఈ విషయము... చిన్నపిల్లలు దేవుడుతో సమానం అంటారు.... ఆయిన ఆ చిన్నారి అంతంత పెద్ద దెబ్బలను ఎలా తట్టుకోగలిగిందా అన్న విషయము నన్ను చాలా కలచివేసింది. చేతికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే మనం గిలగిలాడిపోతాము. అలాంటింది మూణ్ణెళ్ళ చిన్నారి??>>

నాకు దేవుడు కనిపిస్తే ఒక్కటే కోరుకుంటున్నాను.... హే భగవాన్..... ఆడపిల్లలను ప్రేమించగలిగే కుటుంబాల్లోనే అమ్మాయిలను పుట్టేలా చేయి..లేకపోతే మానేయి.....




2 comments:

  1. అబ్బ దారుణం. అసలు మనిషేనా వాడు. చీ అలాంటి వాడికి కూతురిగా పెరగడం ఎందుకు అనుకుందేమో ఈ చిన్నారి..విడిచిపెట్టి వెళ్ళిపోయింది....ఎప్పటికి మారుతాయో ఈ పరిస్థితులు! :(

    ReplyDelete
  2. last line,i too agree with u

    ReplyDelete