వైభోగాలు అంటే ఎక్కడో రాజల కాలానికి వెళ్ళిపోయారు గనుక.....
నేను చెప్పేది నా వైభోగాలకు కోత గురించి....
ఏమి చెప్పమంటారండి నా బాధ.....
రెండు సంవత్సరాల క్రితం వరకు నాదంతా రాజవైభోగమే.... ఎక్కడో అనుకొనేరు మా ఇంట్లో.....
అప్పుడు నేను అంటే ఇంట్లో అందరికి హడల్.... అంటే రెస్పాక్ట్ అని అర్దం చేసుకోవాలి....
కాలు కదపకుండానే అన్ని నోటి దగ్గరకు వచ్చేవి.... నోటి దగ్గరకు వచ్చేవి అంటే తినేవని అర్దం చేసుకొండి....
అఖరికి మంచినీళ్ళు కావాలన్న చిటికె వేస్తే చేతిలోకి వచ్చేవి....
కాని రోజులన్ని ఒకేలా వుండవన్న సామెత నిజము చేస్తూ మా సోదరి పెళ్ళి ఆయిన తర్వాత తెలిసింది....
కొత్తగా మా బావ చేరాడు మా ఇంట్లో.... అప్పటి నుండి చూడండి మా వాళ్ళ వరుస....
నన్ను మరిచిపోయారు..... మర్యాదలన్ని బావగారికి షిప్ట్ ఆయిపోయాయి.....
ఎంత అవమానమండి..... సగం రాజ్యం కోల్పోయిన బాధ మనసులో......
టైము కోసము చూసాను..... ఆ టైము రానే వచ్చింది........
తాడిని తన్నేవాడు ఒకడైతే, దానిని తలదన్నేవాడు ఇంకోకడు ఉంటాడన్న నానుడి నిజమయింది.....
ఇప్పుడు మా ఇంట్లో కొత్తగా యువరాజా వారు తయారయ్యారు....
దాంతో మా బావగారి మర్యాదలలో కూడా కోటా తెగింది..... ప్రోటొకాల్ విషయములో బావగారు నేను ఒకటే....
కాని యువరాజా వారి మర్యాదలకు అంతుపొంతు ఉండడం లేదు........
ఇప్పుడు నా రాజ్యం మొత్తము పొగొట్టుకున్నట్టుగా ఉంది........
అశావాశ దృకధంతో చూస్తున్నా మరల నా గత కాలపు వైభోగాలు వస్తాయని.......
ఇంతకి నా వైభోగాలకు కోత వేసిన ఆ యువరాజా వారు ఎవరో తెలిసిందా మీకు......
ఇంకెవరండి నా మేనల్లుడు.... పేరు మోహిత్........ మూడు నెలల బుడతడు.... కాని మాకు దక్కే మర్యాదల్లో కోత కోసేశాడు.....
ఏం చేస్తాం...... హుచ్చ్......
No comments:
Post a Comment