Monday, 11 July 2011

అద్వితియం శ్రీశైల మల్లన్న దర్శనం....

మొన్న శుక్రవారం నేను, నా కొలీగ్స్ మురళి గారు, సతీష్ గార్లతో కలసి శ్రీశైలం వెళ్ళాను....
ఇంత సడెన్ గా వెళ్ళడానికి కారణం నా మేనల్లుడు.....
వాడు పుట్టినప్పుడు ఉండవలసిన బరువు కంటే కొద్దిగా తక్కువగా ఉండడం. మరియు అదే సమయములో వాడికి జాండిస్ సోకడంతో
రోజంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి, ప్రతి నాల్గు గంటలకు బ్లడ్ రిపోర్టులు తీసేవారు.....
రోజుల పసివాడికి బలం మరియు బి.పి.రిపోర్టు పేరు చెప్పి ఒంటి నిండా పైపులు పెట్టడంతో, నేను తట్టుకోలేకపోయా......
దానితో అనుకోకుండా వాడికి శనివారము కల్లా నయమయి ఉదయం ఏడు గంటల కల్లా మా ఇంటికి తీసుకువస్తే నిన్ను దర్శించుకొంటానని గురువారం రాత్రి మల్లిఖార్జున్ని కోరుకున్నా......
అశ్చర్యం... శనివారము ఉదయం ఎనిమిది గంటలకు మా అమ్మగారు పోన్ చేసి నా మేనల్లుడిని తెల్లవారిజాము ఐదు గంటలకు ఇంటికి తీసుకువచ్చేసామని చెప్పారు...
ఆ కారణంగా వెంటనే మల్లిఖార్జున్ని దర్శించుకోవడానికి వెళ్ళడానికి కుదరకపోయిన, చివరకు మొన్న శుక్రవారం వెళ్ళాను....
అంతకు ముందు మార్నింగ్ వాకింగ్ లో మురళి గారితో అంటే ఆయన కూడా వస్తానని అన్నారు. ఆయనతో పాటు సతీష్ కూడా రెడి అయ్యాడు.
గురువారం సాయంత్రం కాకినాడ నుండి డైరెక్ట్ శ్రీశైలం బస్సుకు రిజర్వేషన్ చేసుకొని బయలుదేరాము...
శ్రీశైలంనకు ఉదయము ఏడు గంటలకల్లా చేరుకొని, పాతాళగంగలో స్నానాలకు బయలుదేరాము.....
వర్షాలు లేకపోవడం వల్లనేమో పాతాళగంగలోని నీరు చాలా లోపలికి పోయింది....
తిరిగి వచ్చేటప్పుడు మెట్లు మధ్యలో కొద్దిగా అస్వస్దత గురయ్యాను...... దాంతో కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని మల్లన్న దర్శనానికి వెళ్ళాము...
అన్ సీజనేమో జనము చాలా పల్చగా ఉన్నారు.. పైగా మా ఊరుకే చెందిన ఒక పోలిసు తారసపడడంతో దగ్గరుండి దర్శనం చేయించాడు......
మల్లన్న సన్నిధిలో ఉన్నంతసేపు మనసంతా ఒక రకమైన అలౌకికమైన స్దితిలోకి వెళ్ళిపోయింది.....
భక్తిపారవశ్యంతో మల్లన్న ముందు మోకారిల్లి నా శిరస్సును ఆయన లింగంను తాకించాను. అలా తాకించాలని పెద్దలు చెప్పారు.
దర్శనం ఆయిన తర్వాత తిరిగి అదే రోజు సాయంత్రం బయలుదేరి వచ్చేసాము....
కాని వచ్చిన తర్వాత శ్రీశైల చరిత్ర తెలుసుకోవాలని బలంగా అనిపించింది... కాని ఆ సమాచారము ఎక్కడ దొరుకుతుందో తెలియదు...
మీకు ఏమైనా తెలిస్తే కొద్దిగా నాకు చెప్పగలరా.....

No comments:

Post a Comment