ప్రపంచ క్రికెట్ లో పాకిస్తాన్ క్రికెట్ కొంత ప్రత్యేకం. ఎందుకంటే అత్యుత్తమ స్దాయి ఆటగాళ్ళు పాకిస్తాన్ క్రికిట్ లో లెక్కకిమిక్కిలిగా కనబడతారు. ప్రతిభ పరంగా చూస్తే అద్బుతమైన ఆటగాళ్ళు ఎంతో మంది కలిగిన చరిత్ర పాకిస్తాన్ క్రికెట్ సొంతం. కాని పాకిస్తాని క్రికెట్ లో తలెత్తె అనిశ్చితి ఎప్పుడూ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్దితి. డ్రగ్స్ వాడకం, బెట్టింగ్ ముఠాతో ఆటగాళ్ళకి లింకులు, మ్యాచ్ ఫిక్షింగ్ ఆరోపణలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం పాకిస్తాని క్రికెట్ ని అంటిపెట్టుకొని యుండడం సాదారణమై పోయింది. దీనితో సాధారణ అభిమానులు వారి పై అనుమానంగా ఉంటుంటారు. కాని వాస్తవిక దృష్టితో చూస్తే, దానికి చాలా కారణాలు కనబడతాయి. పాకిస్తాన్ దేశములో పాలకుల నిర్లక్షము మరియు యితర కారణాలు మూలంగా ఆ దేశములో చాలా మంది చదువులు మరియు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉండడం వలన చట్టవ్యతిరేక కార్యకలాపాల వైపు మళ్ళుతున్నారు. మరియు వారు క్రికెట్ ను అమితంగా అభిమానిస్తారు. దీనినే బెట్టింగ్ మాఫియా ఆదాయ వనరుగా భావించడం వలనే పాకిస్తాన్ క్రికెట్ కి ఈ దుస్దితి దావురించింది.
ఈ బెట్టింగ్ మాఫియాను తక్కువ చేసి చూడడానికి లేదు. ఇక్కడ బెట్టింగ్ మాఫియా అంతర్జాతియ మాఫియాకు అనుసంధానంగా పనిచేస్తుంది. దీనిని నియంత్రించే బలం పాకిస్తాన్ ప్రభుత్వమునకు లేదు. ఎందుకంటే చీకటి సామ్రాజ్యం నుండి వచ్చే నిధులు ప్రభుత్వం చర్యలు తీసుకోలేని విధముగా చేస్తాయి. ఆ కారణంగా బెట్టింగ్ మాఫియా చాలా బలంగా ఉంటుంది. ఈ మాఫియా కొంత మంది క్రికెటర్లులను లొంగదీసుకొని మ్యాచ్ లను ఫిక్స్ చేస్తారు. వాస్తవానికి ఏ ఒక్క పాకిస్తాని క్రికెటర్ కూడా ఈ రొంపిలోకి దిగడానికి ఇష్టపడరు. కాని బెట్టింగ్ మాఫియా వారిని కాని లేక వారి కుటుంబానికి కాని హాని చేయడానికి వెనుకాడదు. అందువలన క్రికెటర్లు కూడా తప్పక ఈ రొంపిలోకి దిగవలసివస్తుంది. ఇన్ని అంతర్గత సమస్యలతో కుదేలవుతున్నప్పటికి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ని తక్కువ చేసి చూసే సాహసం ఏ దేశము కూడా చేయదు. వారిలో సహజసిద్దమైన తెగువ ఉంటుంది. ఆ తెగువే వారిని అజేయులుగా నిలుపుతుంది. ఇక వారి పని ఆయిపోయిందని అనుకొన్న ప్రతిసారి, తమ తడఖా ఏమిటొ చాలా సార్లు చూపించారు. ఈ మధ్య కాలములో పాకిస్తాన్ క్రికెట్ లో చోటుచేసుకొన్న సంఘటనలు వారి అత్మస్దైర్యన్ని దెబ్బతీసేవే ఆయినప్పటికి, తమలో చేవ తగ్గలేదని నిన్న కెన్యాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో నిరూపించారు. ఆ మ్యాచ్ లో వారు ప్రతి విభాగములోను తమ అధిపత్యంను చూపించారు. ఈ విజయం యితర దేశాల గుండెల్లో గుబులు పుట్టించవచ్చు.
No comments:
Post a Comment