కేంద్ర ప్రభుత్వంలో గల కొంత మంది మంత్రుల పనితీరు చూస్తుంటే, వారు మొత్తం దేశానికి ప్రాతినిద్యం వహిస్తున్నరా లేక స్వంత రాష్ట్రానికి ప్రాతినిద్యం వహిస్తున్నరా అనే సందేహం కలుగుతుంది. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ వ్యవహర శైలి ఆ విధముగానే ఉంది. తాను అవిభక్త భారతదేశానికి కాకుండా కేవలం బెంగాల్ కి మాత్రమే మంత్రిగా పనిచేస్తునట్టున్నారు. ఇందులో ఇంకా బాధపడవలసినది ఏమంటే, సదరు పదవిని స్వంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావలన్న ఏకైక ఆశయంతో దుర్వినియెగం చేయడం. ఎవరికైనా తన స్వంత రాష్ట్రం మీద కొద్దిగా అబిమానం ఉంటుంది. దీనిని నేను కాదనను. కాని వారు మొదట తాము భారతదేశానికి ప్రాతినిద్యం వహిస్తున్నము అనే విషయమును గ్రహించాలి. పైగా దానిని తమ స్వార్దరాజకీయ ప్రయెజనాల కోసం ఉపయెగించరాదు. ఇలా సాగితే ఏదొక రోజు ప్రాంతియ ద్వేషాలు తలెత్తి, తమకు ప్రత్యేక సౌత్ భారత దేశము కావలనే డిమాండ్ రావచ్చు. దాని వలన దేశములో అస్దిరత తప్ప ఇంకేమి రాదు.
No comments:
Post a Comment