Wednesday, 26 August 2015

టెడ్డీ…


ఇది పూర్తిగా చదివితే మీ గుండె లోతులలో ఉన్న తడి బయటకు వస్తుంది 
.
.
జీన్ థామ్సన్ ఆ రోజు ఐదవ తరగతి క్లాసులోకి వెళ్ళింది . పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని . అబద్ధం ఎందుకు అంటే మూడో వరసలో ఉన్న Teddy Stoddard ఆమెకు నచ్చలేదు . క్రిందటి సంవత్సరం అతడిని చూసింది . అతడు మిగిలిన పిల్లల్లా ఆటల్లో ఉండకపోవడం , సరిగా డ్రెస్ చేసుకుని రాకపోవడం గమనించింది . అయితే అప్పుడు అతడు తన క్లాస్ కాదు . అయినా ఆమెకు అతడంటే సదభిప్రాయం లేదు . 
.
నెలలు గడుస్తున్నాయి . అతడి పేపర్స్ లో ఆమె రెడ్ మార్కులూ , తక్కువ మార్కులూ వేస్తోంది . అతడు మిగిలిన పిల్లలతో కలవలేక పోవడమూ గమనించింది . 
.
ఆమె పని చేసే స్కూల్ లో పిల్లలను గురించి టీచర్ రికార్డు రాయాలి . అందరి రికార్డు లూ రాసేసినా ఎందుకో ఆమెకు టెడ్డీ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది . క్రిస్మస్ వచ్చేస్తోంది . రికార్డు రాసి అప్పగించాలి . 
.
ఒక రోజు అతడి పాత రికార్డు తిరగేసింది . 
.
అతడు ఒకటవ తరగతి లో టీచర్ ఇలా రాసింది " టెడ్డీ చాలా సరదా కుర్రాడు . అతడితో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు . హోం వర్క్ నీట గా చేస్తాడు . బ్రిలియంట్ బాయ్ " 
.
రెండో తరగతి టీచర్ రిపోర్ట్ " టెడ్డీ ఎక్సలెంట్ కుర్రాడు . కానీ అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కొంత కుటుంబం లో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు " 
.
మూడో తరగతి టీచర్ రిపోర్ట్ " టెడ్డీ చాలా కష్ట పడుతున్నాడు .. చదువులో బాగానే ఉన్నాడు కానీ అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు " 
.
నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్ " టెడ్డీ చదువులో వెనుకబడి పోయాడు . అతడు ఫ్రెండ్స్ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక ప్రోబ్లం చైల్డ్ కాబోతున్నాడు " 
.
.
థామ్సన్ కి ప్రాబ్లం అర్ధం అయ్యింది . ఇన్నాళ్ళూ తను తెడ్డె గురించి తెలుసుకోనందుకు బాధ పడింది ఆమె . అయితే ఆమె క్రిస్మస్ వేడుకలకు పిల్లలను తయారు చెయ్యడం లో తలమునకలు ఐపోయింది . టెడ్డీ ని సానుభూతితో చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు . 
.
.
క్రిస్మస్ కు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు ఇవ్వడం ఆచారం 
.
పిల్లలు ఆమెకు విలువైన కానుకలు ఇస్తున్నారు అందమైన రేపర్లు చుట్టిన కాగితాలలో విలువైన గిఫ్ట్స్ . 
.
ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బాగ్ లో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు టెడ్డీ . ఆ బేగ్ సగం చిరిగి ఉంది . అందులో ఒక ఇమిటేషన్ రాళ్ళ నెక్లెస్ ఉంది అందులో సగం ఊడిపోయాయి . ఒక ఉడుకులాం బాటిల్ ఉంది అందులో సగం ఉడుకులాం ఉంది . 
.
అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు . థామ్సన్ వారిని కసిరి ఆ నెక్లెస్ మెడలో వేసుకుంది . ఆ ఉడుకులాం చేతి మీద వేసుకుంది .
.
"
చాలా బావుంది " అని అంది .
.
ఆమె వెనుకగా నించున్న టెడ్డీ " మీరు ఈ రోజు మా అమ్మలా వాసన వేస్తున్నారు " అన్నాడు .
.
.
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా క్లాసును వదల లేక పోయింది థామ్సన్ . క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది . 
ఆ రోజు నుండి ఆమె వాడి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . టెడ్డీ లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు . 
.
.
ఇక్కడితో అయిపోలేదు . 
.
.
నెక్స్ట్ సంవత్సరం ఆమెకు వచ్చిన ఉత్తరం లో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " అది ఆ ఉత్తరం సారాంశం . 
.
6
సంవత్సరాల తర్వాత వచ్చిన ఇంకో ఉత్తరం " నేను సెకండరీ విద్య క్లాస్ లో థర్డ్ గా కంప్లీట్ చేశాను . అయినా మీరే నా ఫేవరెట్ టీచర్ " 
.
నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకో ఉత్తరం " నేను ఇపుడు చదువు విషయం లో కష్టపడుతున్నాను . ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ "
.
ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను . సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి సంతకం లో Theodore F. Stoddard, M.D. అని సంతకం చేశాడు . 
.
.
ఇంతటితో ఈ కధ అయిపోలేదు . 
.
ఇంకో ఉత్తరం వచ్చింది .
"
నేను ఒక అమ్మాయిని చూశాను చర్చిలో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా నాన్న రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు . చర్చిలో పెళ్ళికొడుకు తల్లి కూర్చునే బెంచి మీద మీరు కూర్చోవాలని నా కోరిక " 
.
.
.
.
థామ్సన్ పెళ్ళికి వెళ్ళేటపుడు టెడ్డీ ఇచ్చిన నెక్లెస్ పెట్టుకుంది . అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి . ఉడుకులాం రాసుకుంది . 
.
.
.
.
ఆ రోజు టెడ్డీ కి వాళ్ళ అమ్మ కనిపించి ఉంటుంది . 
.
.
.
.
.
(
మనం మన ప్రభావం ఎవరి మీద అయినా ఎలా పడుతుందో ఊహించలేము . అందుకని మిత్రులారా ! ఎదుటి వ్యక్తి తో ప్రేమగా ఉండండి . ప్రేమను పంచండి ------ ----- శోభన్ రాయ్ గారి పోస్టుకు అనువాదం )Stories like this, always have a way of putting the right perspective on life.

సేకరణ : ముఖపుస్తకం నుండి


Tuesday, 19 May 2015

మా అమ్మ - 8 అబద్ధాలూ !

Written by Raghavanand Mudumba

 


మేము ఒక పేద కుటుంబలో పుట్టాము . నేను అమ్మ నాన్న !

ఇది నా చిన్నప్పటి సంగతి . తినడానికి సరిగా ఉండేది కాదు . అమ్మ తన అన్నం నా కంచం లో పెడుతూ " ఈ అన్నం కూడా తినరా ! నాకు ఆకలిగా లేదు "
అది మొదటి అబద్ధం
-----------------------------------------------------------------------------------------------------------
కూర వండడం కోసం అమ్మ పక్కనే ఉన్న నదిలో చేపలు పట్టేది . ఒక రోజు రెండే చేపలు పడ్డాయి . వాటితో పులుసు చేసింది . నాకు వడ్డించింది . నేను చేపను తింటూ ముళ్ళు వదిలేస్తుంటే ఆ ముల్లుకు ఉన్న కొంచెం చీకుతోంది . నేను రెండో చేపను అమ్మ కంచం లో వేశాను .
"
వద్దురా ! నాకు చేపలు ఇష్టం కాదు " అంది
అది రెండో అబద్ధం
-----------------------------------------------------------------------------------------------------------------
అమ్మ అప్పుడు అగ్గ్గిపెట్టేల ఫ్యాక్టరీ లో పని చేసేది . అక్కడ పని చెయ్యడమే కాక ఇంటికి తెచ్చుకుని రాత్రి పుల్లలు పెట్టెల్లో పెడుతూ ఉండేది . ఒక రోజు రాత్రి 1 గంటకి నేను లేచి చాలా లేట్ అయ్యింది . పొద్దున్న చేసుకోవచ్చులే పడుకోమ్మా అన్నాను
అమ్మ నవ్వుతూ " నువ్వు పడుకోరా ! నాకు ఇంకా నిద్ర రావడం లేదు " అంది
అది అమ్మ మూడో అబద్ధం
----------------------------------------------------------------------------------------------------------------
నేను టెన్త్ పరీక్షలకి రాయడానికి అమ్మ కూడా వచ్చింది . పరీక్ష హాలు ఎదురుగా ఒక చెట్టుకింద కూర్చుంది 12 గంటలకి పరీక్ష అవ్వగానే అమ్మ దగ్గ్గరకి వెళ్లాను . అమ్మని కౌగలించుకున్నాను . పరీక్ష బాగా రాశానని చెప్పాను . అమ్మ నన్ను ముద్దు పెట్టుకుంది . చేతిలో చెరుకు రసం గ్లాసు పెట్టింది . నేను తాగుతూ అమ్మకేసి చూశాను . చెమటలు పట్టి తడిసిపోయిన జాకెట్టు . నా చేతిలో గ్లాసు ముందుకు చాపి తాగ మన్నాను .
"
లేదురా ! నాకు దాహంగా లేదు " అంది
అది అమ్మ నాలుగో అబద్ధం
-----------------------------------------------------------------------------------------------------------------
నాన్న చచ్చిపోయాడు . అమ్మ ఒక్కత్తే ఇంటి బాధ్యత అంతా మోసేది . పక్కింటి ఆయన అప్పుడప్పుడు సహాయం చేసే వాడు . ఇరుగు పొరుగు వారు అమ్మతో ఆయన్ని పెళ్లి చేసుకోమని చెప్పడం నేను విన్నాను . వాళ్ళతో ఆమె అన్నది
"
నాకు ప్రేమలు అవుసరం లేదు " అని
అది అమ్మ చెప్పిన ఐదో అబద్ధం
---------------------------------------------------------------------------------------------------------------
నా చదువు పూర్తి అయ్యింది . అమ్మ రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చింది అని చెప్పాను . అలా కాదురా నాకు తోచదు . నేను మార్కెట్ లో కూరగాయలు అమ్ముతాను అంది . నేను ప్రతీ నెలా అమ్మకు డబ్బు పంపుతున్నాను
"
నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయిరా " అంటూ డబ్బులు వెనక్కు పంపింది
అది అమ్మ చెప్పిన ఆరో అబద్ధం
-------------------------------------------------------------------------------------------------------------
అమెరికన్ కార్పోరేషన్ ఆర్ధిక సహాయం తో ఎం ఎ పార్ట్ టైం కోర్స్ చేశాను . నా ఉద్యోగం లో పెద్ద అభివృద్ది . అమెరికా వెడుతూ అమ్మను రమ్మన్నాను . కొడుకును ఇబ్బంది పెట్టడం అమ్మకు ఇష్టం లేదు
"
నేను అంత ఉన్నత జీవితానికి అలవాటు పడలేనురా " అంది
అది అమ్మ చెప్పిన ఏడో అబద్ధం
----------------------------------------------------------------------------------------------------------------
అమ్మ వృద్ధాప్యం లోకి వచ్చేసింది . ఆమెకు కేన్సర్ . హాస్పిటల్ లో ఎడ్మిట్ అయ్యింది . ఆపరేషన్ చేశారు . సముద్రాలు దాటి అమ్మను చూడడానికి వచ్చిన నాకు అమ్మను బక్క పలచటి అమ్మను చూస్తే గుండె బద్దలయ్యింది . నాకు ఏడుపు ఆగటం లేదు . అమ్మ నన్ను చూసి లేవడానికి ప్రయత్నం చేస్తూ నవ్వ బోయింది .
"
లేదురా నొప్పి ఏమీ లేదు " అంది
అది అమ్మ చెప్పిన ఎనిమిదో అబద్ధం
ఎనిమిదో అబద్ధం చెబుతూ అమ్మ చచ్చిపోయింది నా చేతుల్లో

.
YES, MOTHER IS ALWAYS AN ANGEL!
M - O - T - H - E - R


Courtesy: Face Book

 
 

Friday, 17 April 2015

పుస్తకాలయందు కల్తీ పుస్తకాలు వేరయా....



ఈనాడు వార్తపత్రిక ఎలా రాస్తుందంటే ఆంధ్ర ప్రదేశ్ ని ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలడనీ, అతను మాత్రమే రాష్ట్రాన్ని ఉన్నపళంగా సింగపూర్ లా చేసేస్తాడనిపించేలా వార్తలు రాస్తుంది.. ఎందుకంటే రామెజీరావుకి టి.డి.పి. విజన్ ఇంపొర్టట్ కాబట్టి.

అదే సాక్షి వార్తపత్రిక విషయానికి వచ్చేసరికి జగన్ ఒక దైవ దూతగా, రాష్టాన్ని, ప్రజలను కాపాడడానికి ఆ యేసు పంపిన ప్రత్యేక దూత అని ఇంకా ఏవోయో రాస్తుంది. దానికి కర్మ, కర్త, క్రియ అన్ని జగనే కాబట్టి.

ఇక టి.వి.9 వాడైతే రవిప్రకాశ్ కి ఏది రైటు అనిపిస్తే అది ఒప్పు గాను, ఏది రాంగు అనిపిస్తే అది రాంగుగాను అనిపిస్తుంది. అదే పద్దతి వారి దగ్గరకి వచ్చేసరికి వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే వారికి టి.ఆర్.పి.రేటింగు మాత్రమే ముఖ్యం కాబట్టి.

మంచి వక్త లేక అనుభవజ్ణుడ్ని ఎవరైనా మీ విజయరహస్యం ఏమిటని అడిగితే పుస్తకాలు చదవడం అని చాలా మంది చెపుతారు. అదీ నిజమే.  మనం పురాణాలైన, చరిత్రైనా, సైన్సు ఐనా మరేదైనా పుస్తకాలు చదవడం ద్వారానే తెలుసుకుంటున్నాము. ఆ చదివినదాన్నే గుర్తుపెట్టుకొని విజ్ణానం పెంచుకుంటున్నాము.  రాముడికి సీత ఏమవుతుంది అని అడిగితే బార్య అవుతుంది అని మనకి ఎలా తెలుసు? రామాయణం చదవడం వల్లనే కదా.. అలాగే మార్కిజం, కమ్యూనిజం ఇలా నానారకాల యిజాలు కూడా పుస్తకాలు చదవడం ద్వారానే తెలుసుకుంటున్నాము. మనకి ఏదైనా కొత్త విషయం తెలుసుకోగలుగుతున్నామంటే ఏదోక పుస్తకం చదవడం ద్వారానే.

ఆయితే పుస్తకాల్లో చదివినదంతా నిజమేనా అని అడిగితే అవునని, కాదని చెప్పే పరిస్దితిలో ప్రస్తుతం ఉన్నామనిపిస్తుంది నాకు. ఈ మధ్య వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు చూస్తుంటే మెరిసేదంతా బంగారం కాదన్నట్టు, మనం చదివేదంతా నిజం కాదని అనిపిస్తుంది.  చరిత్రని వక్రీకరించి రాసిన చెత్తనే చదువుకొని అదే నిజమని అనుకొనే భ్రమల్లో ఉన్నాం.

స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెసు  ప్రభుత్వాలు ప్రాధమిక, మాధ్యమిక మరియు ఉన్నత విద్యా పాఠ్యంశాల్లో వాళ్ళ నాయకుల సోది తప్ప ఏదయినా విషయాన్ని చెప్పగలిగాయా.. డిగ్రీ పూర్తయిన తర్వాత వివిధ పుస్తకాలు , బయోగ్రఫి చదివిన తర్వాత, తూస్.. వీళ్ళ గురించా ఇంత గొప్పగా ఊహించుకున్నది అని ప్రతి ఒక్కడికి అనిపించకమానదు.  స్వాతంత్రం సిద్దించడంలో ఒక్క గాంధీ, నెహ్రూలకు మాత్రమే స్దానం ఉందన్నట్టుగా మన పిల్లల పాఠ్యపుస్తకాలు రూపొందించారు. చరిత్ర చెప్పినప్పుడు మంచి పనులు,చెడ్డ పనులు రెండూ మిళితం చేసి చెప్పాలి గానీ, మంచి పనులు మాత్రమే ముద్రించి మిగతావి ముద్రించకుండా ఉంటే తప్పులు దాచేయవచ్చు అనుకోవడమంతా తెలివితక్కువ పని ఇంకొకటి లేదని వీళ్ళకి అప్పుడు తెలియలేదా?

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మరణం గురించి తదనంతర పరిణామాల గురించి ఇప్పటికీ సరయిన సృష్టత లేదు.  సృష్టత ఇవ్వలేనంత దౌర్బగ్య పరిస్దితిలో ఉన్నాయనుకోవాలా మన ప్రభుత్వాలు? అలాగే లాల్ బహుదుర్ శాస్త్రి గారి అకస్మిక మరణం కూడా సృష్టత లేనిదే. నెహ్రూ గారు చేసిన మంచి పనులు చిన్నప్పుడే మా బుర్రల్లోకి ఎక్కించడానికి ప్రయత్నం చేసారు గానీ, ఆయన గారు చేసిన నిర్వాకాలు గురించి తెలిసినపుడు వాడంతా సన్నాసి ఇంకొకడు ఎవడైనా మన భారత దేశ చరిత్ర అంతా తిరగేసినా ఉంటాడని నేను అనుకోవడం లేదు.
పాలు యందు కల్తీ పాలు వేరయా అన్నట్టు పుస్తకాలయందు కల్తీ పుస్తకాలు వేరయా అని చెప్పాలి. చరిత్రని తమకు అనుకూలంగా మార్పులు చేసి, లేదా పూర్తిగా  మార్చివేసి సమాజంను తప్పుదోవ పట్టించడం అనేది ఈ నాటిది కాదు. క్రీస్తు మరణాంతరం నుండే అది మొదలయింది. క్రీస్తు మరణించిన 150 సం.రాల తర్వాత ఆయన జీవితంను పుస్తకరూపంలోకి తీసుకువస్తే, అది ఇన్నేళ్ళల్లో ఎన్ని వక్రీకరణలకు గురయిందో చరిత్రని అపౌహన పట్టిన వారికి అర్ద్రమవుతుంది. ఇప్పుడు కొత్తగా రామాయణం, భారతం లను కూడా వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చుకొనే పనిలో కొన్ని హిందూ ధార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలు కలవరం కలిగిస్తున్నాయి.

క్రీస్తు పూర్వానికి ముందే నాగరికతతో అంగరంగ వైభవంగా వెలుగులు వెలిగిన పలు ప్రాంతాలు చరిత్రలో ఉన్నప్పట్టికీ, మేము పుట్టిన తర్వాతే నాగరికత అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిందని సొల్లు కబుర్లు చెప్పే సన్నాసులు రాసే పుస్తకాలు ఇబ్బడిముబ్బడిగా విపణిలో ఉండడం మన దురదృష్టం అనుకోవాలి.

 ఒక పుస్తకం చదవాలి అని నిశ్చయించుకొన్నప్పుడు అందులో ఉన్న అంశాలు  నిజమైనవా, కాదా అని తెలుసుకోవడానికి వేరోక పుస్తకం మీద ఆధారపడవల్సిన ఖర్మ ఏర్పడింది. 

చంద్రబాబు నాయుడు గురించి రామోజీ రావు రాసే సొల్లు, జగన్ గురించి సాక్షి చెప్పే సొల్లు, రామాయణం గురించి రంగనాయకమ్మ రాసిన సొల్లు, నెహ్రూ గురించి మన పాఠ్యాంశాల్లో రాసిన సొల్లు చదువుతూ పోతే ఏది అసలో, ఏది చెత్తో తెలియని అయోమయంలో నాలాంటి వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు. నిజనిజాలతో వీళ్ళు ఎవరికీ పని లేదు. జస్ట్ వీళ్ళ పైత్యంను అంతా జనాల మీదకి వదలడమే తప్ప వేరే ఏమి లేదు.

ఇప్పుడంతా ఎలా ఉందంటే ఒక అబద్దాన్ని వంద సార్లు నిజమని చెపితే అదే నిజమని భావిస్తారట. అలా ఉంది ఇప్పుడు... అలా వంద అబద్దాల్ని వంద సార్లు కాదు కదా లక్ష సార్లు ఇల్లెక్కి మరీ అరుస్తున్నారు. 

 ఇందులో చెప్పింది చాలా తక్కువ.  ఇది మాత్రం అక్షరాలా సత్యం./.

చిత్ర సౌజన్యం: గూగుల్


Friday, 5 December 2014

59, 66, 38, 28..


ఈ కొలతలేంటి! దేనికీ సెట్ కాకుండా వింతగా ఉన్నాయి అనుకుంటున్నారా?

మనం బ్లాగోపాఖ్యానం ప్రారంభించిన తర్వాత సం.రాల వారీగా నా మెదడులోంచి బయటపడిన పనికిమాలిన రాతల దొంతరలు సంఖ్య...

2011 లో మొదలుపెట్టిన నా రొద 59 పోస్టులు నుండి మొదలయి 2012లో ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్ళూరులో భూముల ధరల పెరిగినట్టు 66 కి పెరిగి ఆ తర్వాత 2013, 2014 ల నాటికి పెట్రోలు ధరలు క్రిందకి దిగుతున్నట్టుగా 38 అక్కడ నుండి 28కి పడిపోవడం చూస్తుంటే....

పెరుగుట విరుగుట కొరకే అని పెద్దలు ఏనాడో చెప్పిన సామెత గుర్తుకి వచ్చిందా మీకు!!

కానీ అది నిజ్జం కాదు సుమీ!!

నేర్చుకోవడం అనే ప్రక్రియ కొద్దిగా మందగించింది.. ఎందుకంటే స్వేచ్చగా బ్రతుకుతున్న నన్ను చూసి కొంత మంది కుళ్ళుకొని పెళ్ళి అనే చక్రబంధంలో బంధించేసారు కాబట్టి...  నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త విషయాలు తెలుస్తూ ఉంటేనే ఏదైనా రాయగలము..  అంతే కదండీ!!!

ఇక చెప్పేదేముంది... ఆ తర్వాత నేను నేర్చుకుంటున్నదల్లా ప్రపంచంలో పెళ్ళయిన తర్వాత ప్రతి జీవి పడే జీవిత విన్యాసాలే..... పోనీ అవయినా రాయచ్చుగా అనుకుంటే అలాంటివి చూడడానికే తప్ప రాతలకి అందనివి అని అర్ద్రం చేసుకోవడానికి పెద్దగా సమయం కూడా పట్టలేదు మరి నాకు...