Tuesday, 19 May 2015

మా అమ్మ - 8 అబద్ధాలూ !

Written by Raghavanand Mudumba

 


మేము ఒక పేద కుటుంబలో పుట్టాము . నేను అమ్మ నాన్న !

ఇది నా చిన్నప్పటి సంగతి . తినడానికి సరిగా ఉండేది కాదు . అమ్మ తన అన్నం నా కంచం లో పెడుతూ " అన్నం కూడా తినరా ! నాకు ఆకలిగా లేదు "
అది మొదటి అబద్ధం
-----------------------------------------------------------------------------------------------------------
కూర వండడం కోసం అమ్మ పక్కనే ఉన్న నదిలో చేపలు పట్టేది . ఒక రోజు రెండే చేపలు పడ్డాయి . వాటితో పులుసు చేసింది . నాకు వడ్డించింది . నేను చేపను తింటూ ముళ్ళు వదిలేస్తుంటే ముల్లుకు ఉన్న కొంచెం చీకుతోంది . నేను రెండో చేపను అమ్మ కంచం లో వేశాను .
"
వద్దురా ! నాకు చేపలు ఇష్టం కాదు " అంది
అది రెండో అబద్ధం
-----------------------------------------------------------------------------------------------------------------
అమ్మ అప్పుడు అగ్గ్గిపెట్టేల ఫ్యాక్టరీ లో పని చేసేది . అక్కడ పని చెయ్యడమే కాక ఇంటికి తెచ్చుకుని రాత్రి పుల్లలు పెట్టెల్లో పెడుతూ ఉండేది . ఒక రోజు రాత్రి 1 గంటకి నేను లేచి చాలా లేట్ అయ్యింది . పొద్దున్న చేసుకోవచ్చులే పడుకోమ్మా అన్నాను
అమ్మ నవ్వుతూ " నువ్వు పడుకోరా ! నాకు ఇంకా నిద్ర రావడం లేదు " అంది
అది అమ్మ మూడో అబద్ధం
----------------------------------------------------------------------------------------------------------------
నేను టెన్త్ పరీక్షలకి రాయడానికి అమ్మ కూడా వచ్చింది . పరీక్ష హాలు ఎదురుగా ఒక చెట్టుకింద కూర్చుంది 12 గంటలకి పరీక్ష అవ్వగానే అమ్మ దగ్గ్గరకి వెళ్లాను . అమ్మని కౌగలించుకున్నాను . పరీక్ష బాగా రాశానని చెప్పాను . అమ్మ నన్ను ముద్దు పెట్టుకుంది . చేతిలో చెరుకు రసం గ్లాసు పెట్టింది . నేను తాగుతూ అమ్మకేసి చూశాను . చెమటలు పట్టి తడిసిపోయిన జాకెట్టు . నా చేతిలో గ్లాసు ముందుకు చాపి తాగ మన్నాను .
"
లేదురా ! నాకు దాహంగా లేదు " అంది
అది అమ్మ నాలుగో అబద్ధం
-----------------------------------------------------------------------------------------------------------------
నాన్న చచ్చిపోయాడు . అమ్మ ఒక్కత్తే ఇంటి బాధ్యత అంతా మోసేది . పక్కింటి ఆయన అప్పుడప్పుడు సహాయం చేసే వాడు . ఇరుగు పొరుగు వారు అమ్మతో ఆయన్ని పెళ్లి చేసుకోమని చెప్పడం నేను విన్నాను . వాళ్ళతో ఆమె అన్నది
"
నాకు ప్రేమలు అవుసరం లేదు " అని
అది అమ్మ చెప్పిన ఐదో అబద్ధం
---------------------------------------------------------------------------------------------------------------
నా చదువు పూర్తి అయ్యింది . అమ్మ రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చింది అని చెప్పాను . అలా కాదురా నాకు తోచదు . నేను మార్కెట్ లో కూరగాయలు అమ్ముతాను అంది . నేను ప్రతీ నెలా అమ్మకు డబ్బు పంపుతున్నాను
"
నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయిరా " అంటూ డబ్బులు వెనక్కు పంపింది
అది అమ్మ చెప్పిన ఆరో అబద్ధం
-------------------------------------------------------------------------------------------------------------
అమెరికన్ కార్పోరేషన్ ఆర్ధిక సహాయం తో ఎం పార్ట్ టైం కోర్స్ చేశాను . నా ఉద్యోగం లో పెద్ద అభివృద్ది . అమెరికా వెడుతూ అమ్మను రమ్మన్నాను . కొడుకును ఇబ్బంది పెట్టడం అమ్మకు ఇష్టం లేదు
"
నేను అంత ఉన్నత జీవితానికి అలవాటు పడలేనురా " అంది
అది అమ్మ చెప్పిన ఏడో అబద్ధం
----------------------------------------------------------------------------------------------------------------
అమ్మ వృద్ధాప్యం లోకి వచ్చేసింది . ఆమెకు కేన్సర్ . హాస్పిటల్ లో ఎడ్మిట్ అయ్యింది . ఆపరేషన్ చేశారు . సముద్రాలు దాటి అమ్మను చూడడానికి వచ్చిన నాకు అమ్మను బక్క పలచటి అమ్మను చూస్తే గుండె బద్దలయ్యింది . నాకు ఏడుపు ఆగటం లేదు . అమ్మ నన్ను చూసి లేవడానికి ప్రయత్నం చేస్తూ నవ్వ బోయింది .
"
లేదురా నొప్పి ఏమీ లేదు " అంది
అది అమ్మ చెప్పిన ఎనిమిదో అబద్ధం
ఎనిమిదో అబద్ధం చెబుతూ అమ్మ చచ్చిపోయింది నా చేతుల్లో

.
YES, MOTHER IS ALWAYS AN ANGEL!
M - O - T - H - E - R


Courtesy: Face Book

 
 

6 comments:

  1. ఔను,
    కొన్ని అబధ్ధాలు కూడా నిజం కన్నా గొప్పగా ఉంటాయి!
    కానీ
    నిజాలుగా నమ్మించే అబధ్ధాలు మాత్రం ప్రానాలు తీస్తాయి?

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Heart touching.... nicely expressed

    ReplyDelete