ఆకలిగొన్నవాడికి కడుపు నిండా భోజనం పెట్టే వాడు దేవుడు
కాదా?
ఆపదలో ఉన్నవాడికి నేనున్నానంటూ చేయూత యిచ్చి అదుకోనేవాడు
దేవుడు కాదా?
వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా
కాపాడుకొనే కొడుకు/కూతురు దేవుడు కాదా?
ప్రతిఫలం ఆశించకుండా సమాజంలో పది మందికి చేతనైనా సాయం
చేసేవాడు దేవుడు కాదా?
దేశానికి అన్నం పెట్టే రైతు దేవుడు కాదా?
ఎవరు కాదు దేవుడు??
దేవుడు అనేదాన్ని ఏ ఒక్కదానికే పరిమితం చేయలేము!!
అది అనంతం... అన్నింటిలోను ఉంది. మనం పీల్చే గాలిలో, మన
ఉండే నేలలో, ఆకాశంలో, నీటిలో, అగ్నిలో ఇలా అన్నింటిలోను దైవం ఉంది.
దైవం అక్కడ, ఇక్కడ అన్న తేడా ఏమి లేకుండా అన్నింటిలోనూ
ఉందని భగవధ్గీత చెప్పలేదా?
దేవుడు ఎక్కడున్నాడు అని హూంకరించిన హిరణ్యకశివుడుకి
ప్రహ్లదుడు ఏమని సమాధానం ఇచ్చాడు!
అక్కడ, ఇక్కడ అని కాదు.. అంతటా దేవుడున్నాడు అని ఎంత
నింపాదిగా చెప్పాడు...
దానిని నిజం చేస్తూ స్దంబం మధ్యలో నుండి దూసుకురాలేదా
నరశింహ అవతారంలో ఉన్న శ్రీ మహ విష్ణువు!!!
దేవుడు ఎక్కడో లేడు.. మనలోనే ఉన్నాడు... మన ప్రపంచంలోనే
ఉన్నాడు... ఒక రూపంలో కాదు. మంచి ఉన్న చోట ప్రతిచోట దేవుడున్నాడు...
అది శ్రీ మహవిష్ణువు కావచ్చు, క్రీస్తు కావచ్చు, ప్రవక్త
కావచ్చు లేక సాయిబాబా కావచ్చు...
పుట్టుకతో ఎవరూ దేవుళ్ళు కాలేదు... వారి యొక్క ప్రవర్తనతో,
సేవాభావంతో, ప్రజలను ప్రేమించగలిగిన గుణంతో సంపూర్ణవ్యక్తిత్తులు కాగలిగారు.
జీవితంలో మనం పాటించవలసిన విలువలను, దార్శనికతను వారు పాటించి భావితరాలకు ఆదర్శంగా
నిలిచారు.
రాముడైనా, కృష్ణుడైనా, యేసు అయినా, ప్రవక్త ఆయినా, సాయిబాబా
ఆయినా, రమణ మహర్శి ఆయినా, బుద్దుడు ఆయినా ఎవరైనా సరే వారి జీవన విధానమును మనకు
మార్గదర్శకంగా ఉంచారు...
వారి జీవితాలను, ఆశయాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి గానీ,
వారు దేవుడా కాదా అన్న విషయాలను కాదు.
"దేవుడు ఎక్కడో లేడు.. మనలోనే ఉన్నాడు... మన ప్రపంచంలోనే ఉన్నాడు... ఒక రూపంలో కాదు. మంచి ఉన్న చోట ప్రతిచోట దేవుడున్నాడు..."
ReplyDeleteనిజమండీ దేవుడి గురించి మంచి మాట చెప్పారు ..
beautiful
ReplyDeleteraji & Anonymous garu,
ReplyDeletetnxs andi.....