Thursday 28 March 2013

సంజయ్ దత్ క్షమబిక్ష డిమాండ్ సరైనదైనా?


1993 బొంబాయి బాంబు పేలుళ్ళు ఘటనకి సంబందించి ఉగ్రవాదుల నుండి అక్రమంగా అందుకున్న అయుధాలును తన యింట దాచియుంచిన కేసులో జైలు శిక్ష పడిన సంజయ్ దత్ కి ఇప్పుడు పలువురు ప్రముఖ్యులు నుండి సానుభూతి వ్యక్తమవడం మరియు దత్ కి క్షమబిక్ష కోసం డిమాండ్ చేయడం సరైనదైనా?

చట్టం అందరికీ సమానమేనా.. లేక కొద్దిగా ఎక్కువ తక్కువ సమానమా?

నేను సంజయ్ దత్ అభిమానిని. అతనికి శిక్ష విధించడం ఎందుకో గాని నాకు వ్యక్తిగతంగా మనస్కరించలేదు. ఎందుకంటే చేసిన తప్పుకి ఇప్పటికే కావల్సినంత మానసిక క్షోభ అనుభవించియుంటాడని నా అభిప్రాయం. పైగా అతను తాను చేసిన తప్పుకి పశ్చాతాపపడి దైనందిన జీవితంలో సినిమాలు తీసుకుంటూ కొనసాగుతున్నాడు. పైగా తర్వాత కాలంలో అతని మారిన ప్రవర్తన విమర్శించే విధంగా లేదు. కాబట్టి అతనికి శిక్ష విధించడం కొద్దిగా బాధ కలిగించింది.. ఇది ఒక వైపు...

ఇదే విషయం మా రూమ్మేట్ దగ్గర అన్నాను.... అప్పుడు మావాడు ఈ క్రింది విధంగా అడిగాడు.

కానీ రెండో వైపు.... ఇలాంటి న్యాయం ఒక్క సంజయ్ దత్ కి మాత్రమేనా? మరి మిగతా వారి మాటేమిటి? తప్పు చేసిన మిగతా వారి విషయములో కూడా సానుభూతి పేరు లేక ఇంకేదో కారణం చూపి క్షమబిక్షకి డిమాండ్ చేస్తారా? మరి వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు. సంజయ్ దత్ సినిమా స్టార్ అనేనా? చట్టం ఒక్కొక్కొరికి ఒక్కొక్కొ విధంగా ఎలా పనిచేస్తుంది? ఈ రోజు సంజయ్ దత్ కి క్షమబిక్ష ఇవ్వదలిస్తే, రేపు ఈ కేసును ఉదహరణగా చూపి మిగతావారు అదే విధంగా కోర్టులకు ఆప్పీల్ చేసుకుంటే ఏమవుతుంది? ఈ రోజు దత్ కి క్షమబిక్ష కోసం డిమాండ్ చేస్తున్న ప్రముఖ్యులందరూ దత్ కి సపోర్ట్ చేస్తున్నట్టే మిగతా సామాన్య జనాల విషయంలో కూడా సపోర్ట్ చేస్తారా? అని అడిగాడు.

మావాడు అన్నదాంట్లో వంద శాతం నిజముంది. ఇంక మనమేమంటాం....

మరి మీరేమంటారు???


5 comments:

  1. నేను మీ రూమ్మేట్ అభిప్రాయాన్నే సమర్ధిస్తాను. సంజయ్ నిజజీవితంలో నటుడు. పైగా సమాజంలో సామాన్యమానవుడికంటె ఎక్కువ బాధ్యత కలిగినవాడు. ఇప్పుడు పశ్చాత్తాపపడ్డట్టు నటిస్తున్నాడేమో ఎవడికి తెలుసు?. పైగా అతనికి శిక్షనుండి మినహాయింపునివ్వాలని కోరుతున్నవాళ్ళంతా అంత కేరెక్టర్ ఉన్నవాళ్ళేం కాదు( జయప్రద , మార్కండేయ కట్జూ తదితరులు) ఇప్పటికే రెండు ప్రధాన వ్యవస్తలు మట్తిగొట్తుకు పోయాయొ కనీసం న్యాయవ్యవస్తనైనా తన పనిని తాను చేసుకోనిద్దాం. నా దృష్టిలో సంజయ్ కి ఆ సీక్ష చాల చిన్నది. ఓ పదేళ్ళు వేసుంటే సల్మాన్ ఖాన్ లాణ్టి బేడ్ బాయిస్ కి బుద్దొస్తుంది

    ReplyDelete
    Replies
    1. "ఇప్పటికే రెండు ప్రధాన వ్యవస్తలు మట్తిగొట్తుకు పోయాయొ కనీసం న్యాయవ్యవస్తనైనా తన పనిని తాను చేసుకోనిద్దాం. నా దృష్టిలో సంజయ్ కి ఆ సీక్ష చాల చిన్నది. ఓ పదేళ్ళు వేసుంటే సల్మాన్ ఖాన్ లాణ్టి బేడ్ బాయిస్ కి బుద్దొస్తుంది"

      వంద శాతం ఏకీభవీస్తున్నాను దీనితో....వ్యక్తిగత అభిప్రాయాలు ఎప్పుడూ ఒక పైపు కోణం నుండే ఆలోచిస్తాయి. కానీ న్యాయవ్యవస్ద చట్ట పరిధిలో ఆలోచిస్తుంది.... దానికి చిన్న, పెద్ద, మంచి, చెడ్డ తారతమ్యం ఉండకూడదు.....

      Delete
  2. it is wrong .. Sanjadutt need to get punishment .
    tanu oka vip kanaka tanu maradu ani chebutunnamu . ide vishaym ga andariki chance vachhi unte andaru mari unde vallu ga . punishment late ayendhi adi tappu.

    ReplyDelete
    Replies
    1. సాయి కృష్ణ గారు....
      మీరన్నది వాస్తవం... ఇలాంటి విషయాలను చట్టపరిధిలో మాత్రమే చూడాలి....
      వ్యక్తిగత పరిధిలో చూసినప్పుడు మాత్రమే నాకలా అనిపించింది. కానీ మీరన్నట్టు VIP కాబట్టి నేను మారాను అని చెప్పుకోవచ్చు... ఈ కోణంను నేను ఆలోచించలేదు.

      Delete
  3. సంజయ్ దత్ ఒక సినీ నటుడు .మరియు ఒక ఎం.పీ కి అన్న అని చూడకుండా ఒక పౌరుడిగా చూడాలి ...అంతే కాని..అతను మారాడు...అతడికి క్షమించండి అంటే ఎలా ఒప్పుకోవడం.అదీ కాకుండా ఒక బాధ్యతా యుతమైన పదవిలో ఉన్న,ప్రభుత్వం లో ఉన్న పలువురు ప్రముకులు ఇలా మాట్లాడటం సరికాదు.ఇదే తప్పు ఒక సామాన్యుడు చేస్తే ఒక ప్రజాప్రతినిధి కూడా మాట్లాడుతాడా?చట్టం ,,,,న్యాయం అందరికి సమానమే..ఇలాంటి..తీవ్రవాద సంబంధ నేరాలు...చట్టపరిధి లోనే ఆలోచించాలి.వ్యక్తిగతమైన ఆలోచనలు కూడదు...

    ReplyDelete