Wednesday 19 June 2013

నితీశ్ ఉద్దేశమేమిటో....


 
జేడియూ నేత, బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భారతీయ జనతా పార్టితో గల 17 ఏళ్ళ బంధాన్ని తెంచుకున్నందుకు ఆయన చెప్పిన కారణం చాలా హస్యాస్పద్యంగా అనిపిస్తుంది....

హిందుత్వ వాదిగా ముద్రపడిన నరేంద్ర మోడీని కాబోయే ప్రధాని అభ్యర్దిగా ప్రకటించినందున తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఆయన వాదన.. అయన మీద అభ్యంతరాలు ఎందుకంటే ఆయన లౌకిక వాద నాయకుడు కాదు హిందుత్వంను పాటిస్తున్న వ్యక్తి అందుకే ఆయన మీద మా అభ్యంతరాలు అని సెలవిస్తున్నా నితీశ్ కుమార్ వాస్తవానికి చేసేదేమిటి???

మోడిని హిందుత్వవాది అని ఆరోపిస్తున్న నితీశ్ కేవలం ముస్లిం ఓట్లు కోసమేగా నరేంద్రమోడిని వ్యతిరేకిస్తున్నది!! మోడీ హిందుత్వం పాటిస్తే తప్పు ఆవుతుంది... తాను మాత్రం ముస్లిం ఓట్లు కోసం తెంపర్లాడడం తప్పు అనిపించుకోదా? ముస్లిం ఓట్లు కాపాడుకోవడం కోసం తాను బిజెపిని వీడడం మత రాజకీయం కారాదా? అలాంటపుడు తాను ఎలా లౌకిక వాద నాయకుడు  అవుతాడు? ముస్లింల ఓట్లు పేరు చెప్పి తాను మతపరమైన రాజకీయ సమీకరణాలు చేస్తున్నప్పుడు, నరేంద్ర మెడీ హిందుత్వంను పాటిస్తే తప్పేమిటి?

 ఆయినా నరేంద్ర మోడీ  ఎప్పుడూ హిందుత్వం పేరు చెప్పి హిందు ఓటు బ్యాంకు కోసం తెంప్లరాడడం లేదు కదా???

నరేంద్ర మోడీ కేవలం తాను గుజరాత్ లో చేసిన అభివృద్ధిని నమూనాగా చూపించి ప్రజల్లోకి వెళ్తున్న విషయం అందరికి తెలిదని ఆయన అనుకుంటున్నారా????

బీహర్ లో ముస్లింలు ఓట్లు కీలకంగా ఉన్న నియెజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో తమ పార్టి అభ్యర్ది పరాజయం పాలవ్వడానికి నరేంద్ర మోడిని కారణంగా చెబుతున్న నితీశ్, గుజరాత్ లో ముస్లిం అభ్యర్దులను పోటీలో నిలబెట్టి అఖండ విజయం సాధించిన ఉదంతం గురించి ఏమంటారు?

ఏ నరేంద్ర మోడి ని చూపించి తన రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు పోయిందో అని ఆరోపిస్తున్నా నితీశ్, గుజరాత్ లో బిజెపి ముస్లిం అభ్యర్దుల అందరి విజయానికి కారణం ఏమని చెప్తారు???

స్వాతంత్రం వచ్చిన నేటి వరకు మన దేశ రాజకీయాలు మతపరమైన ఓట్ల రాజకీయాల చుట్టునే తిరిగాయి.... అందుకే దేశం వృద్ది ఎక్కడివేసిన గొంగళిలా అక్కడే ఉంది.....

ఈ సారైనా మత రాజకీయాలు ప్రక్కన పెట్టి అభివృద్ధి మంత్రం జపిస్తే భావి తరాల వారైనా సుఖపడతారు....

No comments:

Post a Comment