కొత్త సంవత్సరంలో
ఇదే నా తొలి పోస్ట్. కాబట్టి మొదటగా బ్లాగర్లందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి
శుభాకాంక్షలు. ఈ మధ్య బ్లాగింగ్ చేయడానికి బొత్తిగా సమయం కుదరడం లేదు. సమయం
కుదిరితే ఆలోచనలు నిల్. బొత్తిగా నాలో క్రియేటివిటి తగ్గిపోయిందనిపిస్తుంది.
అందుకే ఏమీ రాయలేకపోతున్నాను ఈ మధ్య...
దేని మీద రాయాలన్నా వేళ్ళు కదలడం లేదు(కీ బోర్డు మీద). ఇప్పటికే నెల రోజులు
దాటిపోయింది రాసి. ఇంకా ఎంత కాలం పడుతుందో తెలియడం లేదు, మరల ఇది వరకులా
రాయడానికి. అందుకే ఎలాగయినా ఏదో ఒక పోస్ట్
రాసేయాలన్న ఊపుతో ఇదిగో ఇలా రాసిపడేస్తున్నాను.....
టి.వి.లో చానల్స్
మార్చుకుంటూ కూర్చున్నా... ఏ చానెల్
నిలకడగా ఓ ఐదు నిమిషాలు పాటు చూద్దామనుకొనే ప్రొగ్రాం రావడం లేదు. ఏ మాటకా మాట.
ఎప్పుడూ అంతే కదా....
అలాగని టి.వి.
కట్టేద్దామంటే టైమ్ పాస్ కాదు. రూమ్ లో నేను ఒక్కడినే ఉన్నా మరి....
ఈ లోపులో నాయుడు
వచ్చాడు. ఏ చూస్తున్నావని అడిగాడు. నాకే తెలియడం లేదు, ఇక నీకేమి చెప్పను అన్నాను...
సరే ఆయితే ఒక
మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెబుతాను వింటావా? అని అడిగాడు. అంత కంటే భాగ్యమా
అన్నట్టుగా ఫేస్ పెట్టి వినడానికి ఉద్రుక్తుడనయ్యా.....
మనోడు ఆ రోజు
చదువుకొచ్చిన భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీస్ రాక మరియు వాటి తీరుతెన్నులు
గురించి టాపిక్ మొదలెట్టాడు. (నాకు తెలిసినంత వరకు మరియు మనోడు చెప్పినంతవరకు
రాస్తున్నాను. ఇందులో నిజనిజాలకు గ్యారంటీ లేదు).
బ్రిటీష్ వాళ్ళు
మన దేశాన్ని వీర లెవెల్లో ఏలుతున్న రోజులవి. ఆ రోజుల్లో బ్రిటన్ ప్రపంచ దేశాల్లో
సౌభాగ్య దేశం. తిండికి, బట్టకు కొదవ లేదు. అలాగే బ్రతుకు పోరాటాలు లాంటివేవి
వాళ్ళకు తెలియవు. ఎందుకంటే అప్పటికే మన లాంటి కొన్ని దేశాల్లో దోచుకున్న సంపద
బ్రిటన్ కి నిర్విరామంగా సరాఫరా ఆవుతుండేది కాబట్టి. అలాంటి దేశంలో కొన్ని క్రైసవ
మిషనరీ సంఘాలు ప్రజల సేవలో తరించేవి. వారు సేవా దృక్పదం మచ్చలేనిది. ప్రపంచంలో
అస్దిరత మరియు ఆశాంతి, దౌర్బలంతో ఏలుతున్న ప్రాంతాల్లో వీరు తమ అమూల్యమైన సేవలు
అందించేవారు. ఉచిత చదువు ద్వారా చైతన్యంను, వైద్యం ద్వారా రోగాల నుండి ప్రజలను
విముక్తి చేయడం మొ.గు సేవలందించేవారు.
వీరు తమ సేవలను భారతదేశానికి అందించలన్న ఉద్దేశంతో బ్రిటిష్ రాణి గారి అనుమతిని
పొంది భారత్ లోకి ప్రవేశించాయి. అప్పటికి
భారతదేశంలో విద్య కొంత మంది వద్ద మాత్రమే
పోగిపడియుండేది. వారు తమకు వచ్చిన విద్యను, వాళ్ళ వద్దనే ఉంచుకొని, తమ కులస్దులైన
వారికే భోదించేవారు. అందువలన మిగతా వర్గాలకు విద్య అందుబాటులో ఉండేది కాదు.
తద్వారా సంఘంలో తమ అధిపత్యంనకు గండి పడకుండా చూసుకోనేవారు. అలాంటి సమయంలో భారత
దేశంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో మొదటగా ప్రవేశం చేసాయి క్రైస్తవ మిషనరీలు. వచ్చిన
తర్వాత తమ సేవలను అక్కడ ప్రజలకు అందించారు. అందులో భాగంగా చదువును, నాణ్యమైన
వైద్యంను అందించారు. అప్పటికి కొంత మంది
వద్ద మాత్రమే పోగుపడియున్న విద్య, క్రైస్తవ మిషనరీల రాకతో అన్ని వర్గాల వారికి
అందుబాటులోకి వచ్చింది. తద్వారా ఆ
ప్రాంతంలో విద్య చైతన్యం వెల్లువెత్తింది. అందులో భాగంగానే రవీంద్రనాధ్ టాగుర్
లాంటి ప్రముఖ కవులు అక్కడ నుండే ఉద్బవించారు. మరియు విద్య ద్వారా ప్రపంచ విషయాలు
మీద అవగహన పెంచుకొన్నారు. కొంత మంది విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్ళగలిగారు.
అక్కడ వారు ప్రపంచ వాస్తవ స్దితిగతులు తెలుసుకోగలిగారు. తదనంతర కాలములో అది దేశ
స్వాతంత్ర సముపార్జనకు దోహదం చేసింది. విద్య సముపార్జన ద్వారా అప్పటికి అమలులో
ఉన్న అనేక మూడ నమ్మకాల నిర్మూలనకు కంకణం కట్టుకున్నారు. సతీ సహగమనం మీద పోరాటం ఈ ప్రాంతం నుండే
మెదలయింది. మదర్ ధెరిస్సా కలకత్తా కేంద్రంగా ఉన్న మిషనరీస్ నుండే తన సేవాజీవితంను
ప్రారంభించింది. మదర్ ధెరిస్సా లాంటి దేవత మన భారతదేశానికి లభించడానికి కారణం
క్రైస్తవ మిషనరీసే అనడంలో సందేహం లేదు. క్రైస్తవ మిషనరీస్ యొక్క సాయంతోనే మదర్
ధెరిస్సా అనేక మంది ఆభాగ్యులను అక్కున చేర్చుకోగలిగింది. మదర్ సేవ క్రైస్తవ
మిషనరీస్ కు ఇంకా వన్నె తెచ్చింది. ముఖ్యంగా అనాడు దేశములో వేళ్ళునుకుపోయిన అసమానత్వంను లెక్కచేయకుండా
అందరికి ప్రేమగా సేవ చేసాయి. అందుకే చాలా మంది క్రైస్తవానికి దగ్గరయి, సేవారంగంలో
పాలుపంచుకున్నారు. . నిస్వార్ద సేవ సేయడం,
అభాగ్యులను అరాధనతో అదరించడం అన్నది మిషనరీస్ లో నన్స్ చేసినంత ప్రేమగా మరెవరూ
చేయలేరు. ఉదహరణకి ఏదైనా హస్పటల్ లో పనిచేస్తున్న నర్స్ లను గమనించండి. క్రైస్తవ
మిషనరీ నర్స్ లు ఏ మాత్రం విసుగు కనబడకుండా సహనంతో రోగులకి సేవ చేస్తారు. మిగతా
వారికి అంత సహనం ఉండదు. ఈ తేడాని నేను చాలా సార్లు గమనించాను.
ఆ తర్వాత దక్షిణ
భారతంలోని కేరళ రాష్ట్రంలో తమ సేవలు విస్తరించారు. నేడు కేరళ 100 శాతం అక్షరాక్షత
సాదించడానికి కారణం ఇదేనని చెప్పోచ్చు. ఇంకా చాలా కారాణాలుండోచ్చు. కాని మెజారిటి
వాటా మిషనరిస్ కే ఇవ్వాలి. మన రాష్ట్రంలో
ఆయితే మొదటిగా కృష్ణా, గుంటురు జిల్లాలో సేవలు ప్రారంభించారు. అందుకే తొలితరం
కవులందరూ ఆ ప్రాంతానికే చెందినవారే ఉంటారు. మరియు విద్య పరంగా అ రెండు జిల్లాలు
ముందంజలో ఉంటాయి. ఈ విధంగా భారతదేశంలో క్రైస్తవ మిషనరీస్ ల రాక ఎంతో ప్రభావం
చూపించింది.
స్వాతంత్రం
తర్వాత భారతదేశం అభివృధి చెందడం మరియు ప్రజల్లో విద్య
మరియు వైద్యం పట్ల చైతన్యం పెరగడంతో క్రైస్తవ మిషనరీల రాక మరియు పరిధి చాలా వరకు
తగ్గిపోయాయని చెప్పోచ్చు. దాని స్దానంలో స్వచ్చంధ సేవా సంస్దలు పుట్టుకొచ్చాయి. క్రైస్తవ
మిషనరీల ప్రభావంతో భారత్ లో వ్యాప్తి చెందిన ఈనాటి క్రిస్టియానిటికి, అనాటి
క్రిస్టియానిటి ఏ మాత్రం పొంతన ఉండదు. ఇక్కడ క్రిస్టియానిటికి మూలకారణమయిన
క్రైస్తవ మిషనరీల అసలు లక్ష్యంను వీరు ఏ మాత్రం ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు.
(కొంత మందిని మినహయించవచ్చు ఈ విషయంలో). సేవే ప్రధాన అంశంగా పనిచేసిన అనాటి
క్రైస్తవ మిషనరీస్ కి, ఈ నాటి క్రిస్టియానిటికి ఎక్కడా పోలికే లేదు. విదేశాల నుండి
విరాళాల కోసం మత గురువుల అవతరం ఎత్తడం, స్వచ్చంద సేవా సంస్దల ముసుగులో నిధులు
పోగేసుకోవడం తప్పితే, క్రైస్తవ మిషనరీస్ యొక్క అసలైన లక్ష్యం మాత్రం ఎక్కడా కనబడడం
లేదు. మతవ్యాప్తికి విపరీత ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ
క్రిస్టియానిటి అభివృద్ధి చెందడానికి మూలకారణమైన క్రైస్తవ మిషనరీల అత్మ పిసరంతయినా
కనిపించడం లేదు. బ్రిటన్ నుండి ఇక్కడికి
దిగుమతి ఆయిన నేటి క్రిస్టియానిటికి, ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న క్రిస్టియానిటికి
సంబంధమే ఉండదని అక్కడ ఉన్న కొంత మంది మిత్రులు చెప్పారు. ఇక్కడ క్రిస్టియానిటికి
కొత్త అంశాలు జోడించారు తప్పితే, క్రిస్టియానిటి యొక్క ఒరిజినల్ అత్మను పెద్దగా
పట్టించుకోవడం లేదు. కేవలం సగం మంది మాత్రమే క్రిస్టియానిటిని అర్ద్రం చేసుకొని
ముందుకు వెళ్తున్నారు. మిగతా వారందరూ కమర్షియల్ అంశాలకు లోనై వెళ్తున్నారు. అనాడు
క్రైస్తవ మిషనరీస్ చేసిన సేవని, ఈ రోజు ఏ స్వచ్చంధ సంస్ద కాని, క్రైస్తవ సంఘాలు
గాని చేయడం లేదు. వీరు స్వంతంగా కొన్ని
అంశాలు జోడించి క్రిస్టియానిటిని మెయిన్ టెయిన్ చేస్తునట్టుగా భావిస్తున్నారు. ఆ
రోజు వారు అందరిలోను సమానత్వంను చూసారు. కాని నేడు వీరు తమకంటూ ఒక చట్రం తయారుచేసుకొని అందులోనే ఉండిపోతున్నారు.
యితర మతాలను నమ్మకపోవడం, యితర దేవుళ్ళ ప్రసాదాలు ముట్టకపోవడం మొదలగు పనులు చేయడం
ద్వారా క్రైస్తవ మిషనరీస్ భోధించిన సమానత్వంకు దూరంగా జరుగుతున్నారు.
అని చెప్పి
ముగించాడు నాయుడు......
చాలా బాగుందయ్యా,
నువ్వు చెప్పింది అన్నాను నేను. టి.వి.
చూసి బోర్ కొడుతున్న సమయంలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పావు. ఇక భోజనానికి
టైమ్ ఆయిందని లేచా.....
correct ga undi sir
ReplyDeleteధ్యాంక్స్ మరియు స్పందించినందుకు ధన్యవాదములండీ....
Deletecorrect ga chepparu sir
ReplyDeleteDon't Salute. She is shame of humanity. If you don't believe, see the article at : http://pramaadavanam.blogspot.in/2013/01/blog-post_11.html
ReplyDeleteమీరు యిచ్చిన లింక్ ని చదివాను..
Deleteఎంతో విశ్లేషణాత్మకముగా, వివరముగా చాలా చక్కగా ప్రెజెంట్ చేసారు. అందులో పావు వంతు సరుకు కూడా లేని నా ఆర్టికల్ ను మీరు చదవగలిగారంటే చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను. మీరు చెప్పేంతవరకు మదర్ ధెరిస్సా అవతలి మరో కోణం గురించి నాకు తెలియనే తెలియదు. ఎందుకంటే మాకు తెలిసే అవకాశం రాలేదు కాబట్టి. ఇప్పుడు మీరు చెపుతుంటే మాకు కొత్తగా ఉంది. అదే విధంగా కొంత గందరగోళంగాను ఉంది(అది మా తప్పు కాదనుకుంటా, మమ్మల్ని ఇలా తయారు చేసిన విద్యావ్యవస్దది) పుస్తకాలలో ఏది రాస్తే దానిని గుడ్డిగా అనుసరించడమే మాకు నేర్పారు. ఇకపోతే మీరు రాసిన దానితో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా పలు రకాల కోణాలుంటాయి. ఆ విధంగా మదర్ ధెరిస్సా యొక్క ఒక కోణం గురించి అందరికి తెలిసిందే. తెలియని మరో కోణంను మీరు సృశించారని నేను అనుకుంటున్నాను. దీనితో పాటు మరికొన్ని కోణాలుండోచ్చు. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు మాకు మహా భారతం కధలు చెప్పేది. దాని ఆధారంగా కర్ణుడుని దుష్టుడుగా, చెడ్డ గుణాలున్నవాడుగా భావించేవాళ్ళం. కొంత కాలం గడిచేసరికి కర్ణుడు పరాక్రమం మరియు అతని యుద్దప్రావీణ్యము గురించి తెలిసింది. కర్ణుడు మహపరాక్రమవంతుడు అన్నమాట అనుకున్నాం. ఇంకోసారి కర్ణుడు దానగుణం గురించి తెలిసింది. అహా.. దయగలిగిన వాడన్న మాట అనుకున్నాం. ఇంకొక సారి కర్ణుడు మునిలను మోసం చేసి యుద్దప్రావీణ్యం సంపాదించాడదని, అది తెలిసి శాపానికి గురయ్యాడు అని తెలిసింది. కర్ణుడు మోసగాడు కూడా అన్న మాట అనుకున్నాం. మా అమ్మమ్మ గారు చెప్పిన దగ్గరకు నుండి ఇప్పటి వరకు విన్నది కర్ణుడు గురించే. కాని మూడూ వేర్వేరు కధలు. అలాగని అందులో ఏది అబద్దం కాదు. మరి ఇప్పుడు కర్ణుడుని ఒక దుష్టుడుగా భావించాలా, లేక మహపరాక్రమవంతుడుగా భావించాలా, లేక దానశీలిగా భావించాలా? లేక మోసగాడిగా భావించాలా? అనుకుంటే సమాధానం ఎలా చెప్పగలము? దానశీలి, మహపరాక్రమవంతుడు ఆయిన దుష్టుడుగా కర్ణుడుని అభివర్ణించవచ్చు. కర్ణుడు వేర్వేరు కోణాల్లో చూసినపుడు ఒక్కొక్క విధంగా కనబడతాడు. అదే విధంగా మదర్ ధెరిస్సా గురించి మేము విన్నది మరియు మీరు చెప్పింది నిజమని నమ్మొచ్చు. ఏకవిధ అలోచనలు కల్గిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఉండరు. ఎంతటి వారికైనా మనసు పలురకముల ఆలోచనలతో నిండియుంటుంది. ఎదుటివారి అలోచనలు మనకి తెలియవు కాబట్టి అంచనా వేయలేము. వారు చేసే చేతలు మాత్రమే మనకి కనబడతాయి. దానిని బట్టే మనము అంచనాకి రాగలుగుతాము. ఉదహరణకి మనము రోడ్డు మీద వెళుతుండగా ఒక అందమైన అమ్మాయి ఎదురయిందనుకొండి! ఆ అమ్మాయి మీద మనకి పలురకములు ఆలోచనలు వస్తాయి. అందులో అత్యంత హీనమైన ఆలోచనలు కూడా రావచ్చు. అది మన తప్పు కాదు. ఎందుకంటే మనసుకి ఉన్న ఆలోచన శక్తి అనంతం కాబట్టి. దానికి అంతు ఉండదు. ఆ ఆలోచనలను చేతల్లోకి రాకుండా ఆ వ్యక్తికున్న సంస్కారం ఆపుతుంది. సంస్కారం అపడం వలన అతడు బయటకు సాధారణంగా కనబడతాడు. ఆ కనబడ్డ సాధారణంను, ఆ వ్యక్తిని మనం మంచోడు రా అంటాము. అదే విధంగా మదర్ ధెరిస్సా కూడా అలానే కావచ్చు. ఎందుకంటే ఆవిడ కూడా మనలాగే మనిషే కదా... ఆవిడ చేసిన పనుల్లో మంచివి, చెడ్డవి పరిశీలనలోకి తీసుకొని దేవుడే సరయిన జడ్జిమెంటు ఇస్తాడు.
ధన్యవాదములతో...
ప్రస్తుతం మన దేశానికి కావాల్సిన ఆలోచనా విథానం ఇలానే ఉండాలి.నేను చెప్పిందే వేదం అనే వాదన పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకి పోకుండా నిజం కోసం స్వేచ్ఛగా చర్చ జరగాలి.
Deletemother gurunchi meru rasina comment bavundi, kani antha devede chstadu , judgment istadu ani devudike vadiliveyalemu.
ReplyDeleteఎస్. మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను. అది మనలో ఉండాలి.. తప్పు జరిగితే ప్రశ్నించగలగాలి మనం. అలా ఎప్పుడు జరుగుతుందండీ? భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దానికి టైమ్ పడుతుంది. మొన్న డిల్లీ ఉదంతంను ఉదహరణగా తీసుకోవచ్చు. ప్రశ్నించే తరం వచ్చినపుడు ఇలాంటి వాటిని అపగలము. అంత వరకు ఇంతే... స్పందించినందుకు ధన్యవాదములు
Deleteఈ మధ్య బ్లాగింగ్ చేయడానికి బొత్తిగా సమయం కుదరడం లేదు. సమయం కుదిరితే ఆలోచనలు నిల్. బొత్తిగా నాలో క్రియేటివిటి తగ్గిపోయిందనిపిస్తుంది. అందుకే ఏమీ రాయలేకపోతున్నాను ఈ మధ్య... దేని మీద రాయాలన్నా వేళ్ళు కదలడం లేదు(కీ బోర్డు మీద). ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది రాసి. ఇంకా ఎంత కాలం పడుతుందో తెలియడం లేదు, మరల ఇది వరకులా రాయడానికి. అందుకే ఎలాగయినా ఏదో ఒక పోస్ట్ రాసేయాలన్న ఊపుతో ఇదిగో ఇలా రాసిపడేస్తున్నాను.....//
ReplyDeleteoffcourse u r correct..
with out think we can not write any thing..
way of ur writing is good..
keep it up.
tnks mahesh garu
Delete