Tuesday 9 October 2012

జిల్లా కలెక్టరు, కాకినాడ వార్కి ధ్యాంక్స్

తూర్పుగోదావరి జిల్లా రాజధాని కాకినాడ అంటే ఒక రకమైన బ్రాండ్..

కాకినాడకి సెకండ్ మద్రాస్ మరియు పెన్షనర్స్ ప్యారడేజ్ అనే పేరు ఉండడం కూడా మీకు తెలుసు..

రాష్ట్రంలో ఏ నగరానికి లేని విధంగా ప్రణాళికబద్దమైన రహదారులు, మరియు రూపురేఖలు కాకినాడకి సొంతం

ఇంకొక విషయము... కాకినాడ మొత్తం చెట్లతో నిండి పచ్చదనంతో ఉంటుంది.. ఇప్పుడు కాదు ఒకప్పుడు..

నేను కాకినాడకి చదువుకోవడానికి వచ్చిన కొత్తలో రోడ్డుకిరుపైపులా ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లతో పచ్చదనంతో కలకలలాడేది.

రాను రాను పనికిమాలిన రాజకీయనాయకులు, అధికారులు కాకినాడకు తగులుకోవడంతో గత కొన్ని సం.రాలు గా పాత కళ కోల్పోయింది.


ప్రణాళికబద్దంగా నిర్మించబడ్డ నగరం క్రమేణా రాజకీయ నాయకులు నిర్లక్ష్యం మరియు అపరిపక్వ నిర్ణయాల మూలంగా గందరగోళం ఆయిపోయింది.

ఎప్పటి నుండో నగరవాసులకు చల్లదనాన్ని ఇచ్చిన చెట్లను రోడ్ల విస్తరణా పేరుతో నరికేశారు. వాస్తవానికి కొన్ని చోట్ల తప్ప మిగతా చోట్ల రోడ్ల విస్తరణకు చెట్లు అడ్డంకి కానే కాదు.

కాని తాము అనుకున్నది తప్ప ఇంకొకటి చేయడానికి ఇష్టపడని అధికారులు మొత్తం చెట్లను నరికేసారు. ఫలితంగా నిండుగా ఉన్న కాకినాడ బోడిగా అయిపోయింది.

పోని రోడ్లు వేసిన తర్వాత, మొక్కలు వేసారా? అంటే లేనే లేదు...

ఈ లోపులో కాకినాడ జనాభా పోలోమని పెరిగిపోయింది.

వేసవిలో కూడా చల్లగా ఉండే కాకినాడలో ఉండలేక మొన్న వేసవికి వెస్టిండీస్ పోవలనిపించింది....

ముఖ్యంగా జిల్లా కలెక్ట్రరు కార్యాలయం నుండి, జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం మీదుగా జనరల్ హస్పటల్ దాటి బాలాజి చెర్వు వరకు ఉండే పెద్ద పెద్ద చెట్లు చూస్తే ఆకాశానికి పందిరి వేసినట్టుగా ఉండి సూర్య కిరణాలను నేల మీదకి రానిచ్చేవికావు.

అవన్నీ కనీస కనీకరమన్నదే లేకుండా తీసిపారేశారు ఐదు సం.ల క్రిందట.....

 
మొన్న ఆ రోడ్డు మీద నుండి వెళ్తుంటే కొత్తగా నాటిన చెట్లు నన్ను అకర్షించాయి. జిల్లా కలెక్టరు కార్యాలయం నుండి జిల్లాప్రజాపరిషత్ కార్యాలయం వరకు రోడ్డుకిరువైపులా ఉన్నాయి. చాలా ఆనందం అనిపించింది. కనుక్కొంటే జిల్లా కలెక్టరు శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ గారు సదరు మొక్కలను నాటించారని తెలిసింది. అంతే కాకుండా సిటి మొత్తం నాటించారు.

నిజంగా ఎంత మంచి పని చేసారండీ ఆవిడ.... నాకు చాలా ఆనందం వేసింది.....
అందుకే పదే పదే కృతజ్ణతలు తెలుపుకుంటున్నాను...

ఇప్పుడు కాకపోయినా, ఇంకో నాల్గు సం.లో  ఆ చెట్లు పెద్దవి ఆవుతాయి. అప్పుడు మరల పాత కాకినాడని చూడోచ్చు.

నగరానికి ఎంతో మంది కలెక్టర్సు వచ్చారు. కాని ఎవరూ చేయలేని పనిని చేసారు..

పి.ఎస్: ఎవరో వస్తారని చూసే బదులు నువ్వు కూడా ఎంతో కొంత చేయెచ్చు కదా అని అడుగుదామనుకుంటున్నారా? నేను మా ఊరిలో ఎక్కడ చిన్న స్దలం కనబడిన మొక్కలు నాటడమే పనిగా పెట్టుకున్నాను. అక్కడ నాది కాబట్టి చెల్లుతుంది. కాని కాకినాడ సిటిలో అలా చేయాలంటే కుదరదు కదా..... ఇలాంటివి పవర్ ఉన్న పెద్ద అధికారులు చేస్తే వర్కవుట్ ఆవుతుందని నా అభిప్రాయం
 

5 comments:

  1. Very good post... keep it up

    ReplyDelete
  2. చెట్లు కొట్టేసినప్పుడు ఆ డీప్ పెయిన్ అందరం ఫీల్ అయ్యాం. మళ్ళీ మొక్కలు నాటడం గొప్ప రిలీఫ్. మీ పోస్ట్ బాగుంది. నా `మన కాకినాడలో...` బ్లాగ్ చూడండి. మీకు నచ్చుతుందని అనుకొంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. ప్రకృతిని అస్వాదించగలగడం దేవుడిచ్చిన వరం... ఆ వరం కాకినాడ ప్రజలకు కొద్దిగా ఎక్కువగా ఇచ్చాడు..
      అందుకనే ఫీల్ అయ్యాము. మీ మన కాకినాడలో బ్లాగ్ చూసానండీ.. చాలా బాగుంది.. ఇప్పటి వరకు నేను మీ బ్లాగును చూడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగా రాసారు.

      Delete
  3. nice blog
    thought provoking musings

    ReplyDelete