ఇండియా అగైనెస్ట్ కరప్షన్ పేరిట ప్రముఖ సంఘసేవకులు శ్రీ అన్నా హాజరే దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరహరదీక్ష అన్ని రాజకీయపక్షాల గుండెల్లో గుబులు పట్టుకుంది. దేశములో అంతు బొంతు లేకుండా పెరుగుపోతున్న అవినీతి మరియు రోజుకొక్కటిగా బయటపడుతున్న కుంభకోణాలు చూసి ప్రతి ఒక్క భారతీయుడి గుండె రగులుతుంది. కాని పాలకపక్షాలు మాత్రం ఎటువంటి ఉలుకూపలుకూ లేకుండా యున్నాయి. సదరు మితిమీరిపోయిన పరిస్దితిని గమనించి అవినీతి నిర్మూలనకు పటిష్టమైన లోక్ పాల్ బిల్లును ఆమోదించడమే లక్ష్యముగా అన్నా హజరే డిల్లీలో నిరాహరదీక్ష మొదలుపెట్టారు. సదరు దీక్షను పనికిమాలినిదిగా కొట్టిపారేసిన పాలకపక్షం నేడు ప్రజల్లో దానికి వస్తున్న ప్రతిస్పందన చూసి, అన్నా హజరే చర్యను తొందరుబాటుగా చర్యగా అభివర్ణించింది. అంతేకాని అవినీతికి వ్యతిరేకంగా తాము ఏ చర్యలు తీసుకుంటున్నది మాత్రం తెలియజేయలేదు.
ఈ విషయములో దేశములో అన్ని రాజకీయ పక్షాలు ధోరణి ఒక్కటేనని, అందుకని ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయపార్టిలను బహిష్కరించడం శుభపరిణామం. అన్నాహజరే డిమాండ్ చేస్తున్నట్టుగా పటిష్టమైన లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టాలి. కాని యెడల ప్రజల్లోనే ఏదో ఒకరోజు మార్పు వస్తుంది. ఒకసారి ప్రజల్లో మార్పు వచ్చిన తర్వాత, ఇకపై ఎటువంటి రాజకీయ పక్షాలు ఈ గడ్డ మీద మునుగడ సాధించలేవు అన్న సత్యాన్ని గమనించాలి. ఈ విషయములో ముందుగా దేశ రాజకీయలలో ప్రక్షాళన జరగాలి. అప్పుడు మాత్రమే పటిష్టమైన అవినీతి నిరోధక వ్యవస్దను ఏర్పాటుచేసుకొనగలము. అవినీతి, కుంభకోణాల కన్న ముందు దేశ రాజకీయాలలో కంపు త్రీవ అందోళన కలిగిస్తుంది. కాబట్టి ముందుగా మురికి రాజకీయాల ప్రక్షాళన జరగవలసియున్నది.