Thursday, 9 October 2014

రెండు కళ్ళ బాబు..


అరె.. నాయుడు ఎన్నాల్లయింది నిన్ను చూసి..

రారా.. చాలా కాలానికి గుర్తొచ్చినాను నేను అన్నా...

అదేమి లేదు అన్నాడు చిరునవ్వుతో.....

అదేంటో తెలీదు కానీ మా నాయుడు వస్తే లోకాభిరామాయణం అంతా ముందేసుకొని చర్చించలనిపిస్తుంది. దానికి తగ్గట్టే మనోడు కూడా మంచి హూషారు కల్గిన మనిషయే.. చూడ్డానికి సన్నగా పీలగా ఉన్నా మెదడులో ఉన్న సరుకు మాత్రం సామాన్యం కాదు.  ఇక మనకంటరా! చూడ్డానికి బలంగా బండగా ఉన్నా మెదడులో ఉన్న సరుకు నామమాత్రమే... ఆయినప్పటికీ ఏదో ఒకటి అరువు తెచ్చుకొని డిస్కషన్స్ పెడుతూ ఉండడం అలవాటయి పోయింది.

రెండు కళ్ళ సిద్దాంతం అంటే నాకు మన బాబే గుర్తుస్తున్నారు భయ్యా  అన్నాన్నేను...

తప్పేముంది బ్రదరూ.. మైక్రోసాప్ట్ అంటే బిల్ గేట్స్, రిలయన్స్ అంటే ముకేష్, అనిల్ అంబానీ, 2జి అంటే రాజా, అగస్ట్రా వెస్ట్ లాండ్ అంటే మహమేత, క్విడ్ ప్రో కో అంటే జగన్ గుర్తొచ్చినట్టుగా రెండు కళ్ళ సిద్దాంతమంటే బాబు గుర్తు రావడం వింతేముంది అన్నాడు..

ఏంది భయ్యా.. తెలంగాణా ఉద్యమం తారాస్దాయిలో ఉన్న టైములో ఎటూ పోవాలో తేల్చుకోలేని స్దితిలో రెండు కళ్ళు సిద్దాంతం వెలుగులోకి తెచ్చాడు కదా ఆ చంద్రబాబు. నాకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు లాంటివి. ఏ కన్ను కావాలి అని అడిగితే నాకు రెండు ముఖ్యమే అన్నాడుగా....

.......hmmm..

అప్పుడు బాబు చెప్పిందాని మీద అందరూ విరుచుకుపడ్డారు గ్గానీ, అందులో తప్పేముంది బానే చెప్పాడుగా అనుకున్నా.  రాష్ట్రం విడిపోతుందో, లేదో తెలియని డైలామాలో ఏదో ఒక ప్రాంతానికి అనుకూలంగా ఎలా మాట్లాడగలరు. అందుకే అట్టా చెప్పినాడు అని నాకు అర్ద్రం ఆయినట్టుగా వీళ్ళేవరికి అర్ద్రం కాక కూతలు కూస్తున్నారేటిరా సామి అని పీక్కున్నాను కూడా... అన్నాన్నేను...

ఆయితే ఏమంటావు, ఇప్పుడు.... అన్నాడు నాయుడు..

ఆ.. చెప్పడానికేముంది. రెండు కళ్ళు ముఖ్యమే అన్నవాడే ముందుగా తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చినాడు. పోనిలే అక్కడ సెంటిమెంటు తారాస్దాయిలో ఉంది కాబట్టి అక్కడి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి అట్నా లేఖ ఇచ్చాడు అనుకుందాం.  సెంటిమెంటుని గౌరవించి ఎలాగైనా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాల్సినదేనని ప్రతి కమిటీ ముందు సమర్దవంతంగా మొదటి నుండి చివర వరకు ఒకే మాటకి కట్టుబడి ఉన్నాడు. మిగతా పార్టిలు ఎన్ని డింగిరాలు తిరిగినప్పట్టికీ ఒకే స్టాండ్ మీద ఉన్నోడిలో మన బాబునే ముందుగా చెప్పుకోవచ్చు కదా...

ఆవును. అది నిజమే కదా.. ప్రధాన ప్రతిపక్ష పార్టిగా తెలుగుదేశం ఇచ్చిన లేఖ ఆధారంగానే రాష్ట్రం విభజనకి ఒప్పుకున్నమని అనాటి ప్రభుత్వ పెద్దలు కూడా పలు సందర్బాల్లో చెప్పారు.. అన్నాడు నాయుడు నా మాటల ప్రవాహాన్ని కొనసాగిస్తూ....

కదా.. రాష్ట్రం విభజనకి శక్తికొలదీ సాయం చేసిన ఆ చంద్రబాబు ఇప్పుడు మరల తెలుగుప్రజలను ఏనాటికైనా ఐక్యం చేసేది నేనే అంటాడేంది భయ్యా....

ఓ.. అదగ్గదా నీ ఆవేదన... నాకు అర్ద్రం ఆయిందిలేవెవోయి.... అన్నాడు తాపీగా

ఏమి అర్ద్రమవడం నా పిండాకూడూ.. వీడు రెండు కళ్ళ సిద్దాంతమంటే ఏమిటో ఇప్పుడు నాకస్సలు అర్ద్రమయి చావడం లేదు. ఆ రోజుమో వీరలెవెల్లో సిన్సియార్ గా ప్రయత్నం చేసి రెండు ముక్కలు చేయడం ఎందుకు! మరల ఈ నాడు తెలుగు ప్రజలను ఐక్యం చేస్తాననడం ఎందుకు?

ఇందులో అర్ద్రం కావడానికేముంది బ్రదరూ... ఆయనకి ఇక్కడ అధికారం దక్కింది. అక్కడ అధికారం అందని మావి ఆయింది. అందుకని ఇప్పుడు గులకరాళ్ళు అటు వేసే పనిలో బిజీగా ఉన్నాడు...

కావాలని పట్టుబట్టి తెలంగాణాని సాధించుకొని ఆంధ్రులంటే నిలువెల్లా విషాన్ని నింపుకుని, తమకు జరిగిన ప్రతి అన్యాయానికి వేలుని ఆంధ్ర వైపు చూపిస్తున్నా ఈ రోజుల్లో తెలుగు జాతి ఐక్యత అంటే చెప్పుచ్చుకు కొడతారు అక్కడ అన్నాన్నేను ముఖం నిండా అదో రకమైన ఫీలింగు ఉండగా....

నిజమే.. అ సంగతి మన బాబు పట్టించుకోవడం లేదు గానీ, తెలుగు జాతి ఐక్యత అంటే ముందుగా ఆంధ్రులే కొత్త బాటా చెప్పుతో అటూ, ఇటూ వాయించేలా ఉన్నారు. అంత దాకా రానిచ్చుకోడనే అనుకుంటాన్నేను అన్నాడు నాయుడు....

రానిచ్చుకో పోవడమేంటీ!! అక్కడ తన్నించుకొన్నది సరిపోక, ఇప్పుడు ఇక్కడ కూడా తన్నించుకోవడానికి ఊబలాటపడుతున్నట్టుంది అన్నా....
ఆయినా ఏమాటకా ఆ మాట.. విడిపోయినందు వలన మనం మొదట్లో కొద్దిగా బాధపడ్డాము(కలిసుండాలనే సెంటిమెంటు ఎక్కువయి) కానీ ఇప్పుడు మాత్రం చాలా హాయిగా, ధీమగా ఉన్నాము.(కలిసుండడం దండగమారి అని అర్ద్రమయి). ఇప్పుడు ఈయన వలన తిరిగి ఐక్యత సాధిస్తే కరెంటు కష్టాలు వాళ్ళకి పోయి మనకి తగులుకుంటాయి కదా...

అంతేనంటరా!!







1 comment:

  1. మంచి మాట సెలవిచ్చారు! అయినా విడగొట్టటమే బాబు ఇష్ట ప్రకారం జరగలేదు, కలపటం మాత్రం బాబు ఇష్ట ప్రకారం జరుగుతుందా?వాళ్ళు తిట్టిన తిట్లు మర్చిపోగలమా?

    ReplyDelete