Monday 5 August 2013

విడగొట్టాల్సిందే... కానీ ఇప్పుడు కాదు..


ఇది చాలా ఘోరం మామా”...  మా ప్రెండ్ బాపూ గాడి వేదన!!!  వాడింతగా ఇదిగా ఫీలవ్వడం వాడితో స్నేహం చేసినన్నీ రోజుల్లో ఎప్పుడూ చూడలేదు.....

ఏమైందిరా నీకు ఈ రోజు.... ఆశ్చరం మేళవిస్తూ అడిగా....

హైదరబాద్ తో కూడిన తెలంగాణాని ఇచ్చేసి మనకి అన్యాయం చేసేసినారు రా... మనల్ని వెధవలు చేసినారు అన్నాడు బాధగా ముఖం పెట్టి.....

నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను.... ఇప్పటి వరకు మాట్లాడిందీ మా బాపూ గాడేనా?? భూకంపం వచ్చినా, సునామీ వచ్చి మొత్తం ఊడ్చికుపోయినా, ఆకాశం తలక్రిందులైనా దేనికీ స్పందించనీ మా బాపూగాడేంటి ఈ మాత్రం తెలంగాణా ఇచ్చేసినందుకే ఇలా ఫీలయ్యిపోతున్నాడీ అని బోలోడు సందేహలు నా బుర్రని తొలుస్తున్నాయి....

మా బాపూ గాడి గురించి క్లుప్తంగా చెప్పాలంటే....

ఆరో తరగతి నుండి వీడితో దోస్త్ నేటి వరకు నిర్విరామంగా కొనసాగుతుంది... ఊరందరూ ఒక దారైతే మనోడిది ఇంకోదారి.. న్యూస్ పేపర్లు చదవడు... న్యూస్ చానల్స్ ఫాలో ఆవడు... ఎప్పుడైనా ఏదైనా విషయము చెప్తే, ఆవునా నాకు తెలియదే అంటాడు తప్ప.. దాని మీద ఇంట్రెస్టు ఉండదు.... వాడి పనల్లా వాళ్ళ నాన్న పాల వ్యాపారంలో ఉదయం, సాయంకాలం సాయం చేయడం, మధ్యలో ఉన్న సమయంలో చిన్న ఉద్యోగం చేసుకోవడం అంతే... ఇక మిగతావేవి పట్టవు మనోడికి...... పక్కా పల్లెవాసనలు ఉన్న మనిషి.....

ఎన్నో సార్లు చెప్పాను వాడికి.. ఒరేయ్ మడిషన్నాకా కొద్దిగా లోక జ్ణానం ఉండాలిరా... కనీసం రోజూ న్యూస్ పేపరు ఆయిన చదవారా అని??? దానికి వాడో రమణ మహర్షి లా ఫోజు పెట్టి, మనకెందుకురా అయన్నీ అని చిదిల్వాసము చిందించేవాడు.....

అలాంటోడు ఈ రోజు తెలంగాణా గురించి భాదపడిపోతుంటే నాకు ఆశ్చర్యం వేసింది...

ఏంటి మామా!!! ఎప్పుడూ లేంది.. ఈ రోజెంటీ అనడిగా...
మామా!! ఇది చాలా అన్యాయం రా.... తమిళనాడు నుండి విడిపోయినా తర్వాత మనం సమ్యైకాంద్రప్రదేశ్ ఏర్పాటు చేసుకొని, దానికి హైదరబాద్ రాజధానిగా చేసుకొని, మొత్తమందరి డబ్బులతో రాజధానిని ఈ స్దితికి తీసుకువచ్చిన తర్వాత, హైదరబాద్ మనది కాదని చెప్పడానికి వారికి నోరెలవచ్చిందిరా అన్నాడు....

హైదరబాద్ ని అందరి డబ్బులతో అభివృద్ధి చేసారు కాబట్టి, ఇప్పుడూ కూడా అందరి డబ్బులతోనే సీమాంద్ర వారికి రాజధాని ఏర్పాటు చేసి, అప్పుడు విడిపొమ్మంటే అర్ద్రం ఉంటుంది. అంతే కానీ ఇలా మనది కాదని చెప్పడం నాకు నచ్చలేదు రా అన్నాడు......


దేనికీ స్పందించని మా బాపూ గాడికే ఈ విషయము ఆవేదన కల్గించిదంటే, కాంగీ నాయకులను ఏమనాలి???