Friday 20 July 2012

"లంచం" ను తరిమికొట్టండి- పోటో వ్యాఖ్య

డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు...

కాని నిజాయితీగా సంపాదించడమే కష్టం...... అలా సంపాదించడంలోనే అసలైన సమర్దత ఉంటుంది...
అంతే కాని ఇంకొకడిని మోసం చేయడం ద్వారా, లేక ప్రలోభపెట్టడం ద్వారా సంపాదించింది అసలు సంపాదనే కాదు...

ప్రభుతోద్యోగులు, ప్రెవేటు సంస్దలు యజమాన్యాలు, డాక్టర్సు, కాంట్రాక్టర్లు, న్యాయవాదులు మొ.గు అందరూ ఆలోచించండి.

లంచం మరియు అవినీతిని మీ జీవితాల నుండి తరిమికొట్టండి..

Saturday 7 July 2012

అత్మ కధ అనబడే సుత్తి కధలు...

అత్మకధ- అంటే తమ జీవితంలో అనేక దశల్లో జరిగిన పరిణామలను, ఆయా సందర్బంలలో తమ ప్రవర్తన నెమరువేసుకొనుటకు లేదా సమర్దించుకొనుటకు గాను ఎవరికి వారే వ్రాసుకొనే ఒక డైరీ లాంటిది..

కాని ఇప్పుడది ప్రక్కవాడిని విమర్శించడానికి లేదా పొగడడానికి అవసరమైతే వ్యక్తిగత అంశాల్లోకి కూడా వెళ్ళగలిగి కామెంటు చేయడానికి పనికివచ్చే ఒక సాధనం...

అత్మకధలు రాయడం ఎప్పటి నుండి మొదలయిందో నాకంతగా తెలియదు.. బహుశా వంద సం.ల క్రితమే ప్రారంభమయి ఉండోచ్చని నా అంచనా...

ఇది వరకు ఎవరు అత్మకధలు రాసుకొన్నా,  అవి వివాదస్పదం కావడం లేక అత్యంత ప్రజాదరణ పొందడం అనేది జరగలేదు...

ఆ మధ్య గంగూలీ టైములో కోచ్ గా పనిచేసి వెళ్ళిపోయిన గ్రెగ్ చాపెల్ ఇండియన్ క్రికెట్ గురించి, అందులోని రాజకీయాల గురించి తన అత్మకధ లాంటి కధలో రాయడంతో, ఇక్కడ క్రికెట్ క్రీడాకారులు మరియు బోర్డు అధికారులు గ్రెగ్ రాసిన రాతలపై మండిపడ్డారు. ఈ వార్త మీడియాలో ప్రముఖంగా రావడంతో, అసలు అందులో ఏముందో తెలుసుకోవడం కోసం జనాలు సదరు పుస్తకం పై ఎగబడడంతో దాని అమ్మకాలు అమాంతం పెరగడం గ్రెగ్ చాఫెల్ కి కలిసివచ్చింది. అంతెందుకు మొన్నటికి మొన్న రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ గురించి, అతనికి సహకరించని టీమ్ గురించి వ్యాఖ్యలు చేసాడు. అతని చేసిన వ్యాఖ్యలకు వివరణ యివ్వడం ఇష్టం లేక హైదరబాద్ వచ్చిన రాహుల్ ద్రావిడ్ మీడియా వార్కి అందకుండా పోయాడు.

ఇక అక్కడ నుండి అత్మకధలు రాసేవారు, తమ పుస్తకానికి జనాల్లో పబ్లిసిటి పొందడం కోసం అనేక వివాదస్పద అంశాలు జోడించడం, తద్వారా అమ్మకాలు పెంచుకోవడం అనేది కామన్ ఆయిపోయింది.

ఇప్పుడు కొత్తగా ఆ మధ్యనే దివంగతులైన అర్జున్ సింగ్ రాసిన పుస్తకం A GRAIN OF SAND IN THE HOURGLASS OF TIME   ఈ కోవలోకే వస్తుంది.


మొత్తం పుస్తకంలో ఏమి రాసారో తెలియదు కాని, మన ఆంద్రుల నాయకుడు ఆనాటి ప్రధాని పి.వి.నరశింహరావు గారిపై కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అది నేషనల్ మీడియాలో పెద్ద వార్త ఆయి కూర్చుంది.

ఇంతకి విషయమేమిటంటే, రాజీవ్ గాంధీ హత్యానంతరం కాంగ్రెసు నాయకత్వం ఎవరికి అప్పజెప్పాలనే విషయములో తాను సదరు పదవిని సోనియా గాంధికి అప్పగించలని ప్రతిపాదించానని, దానిని పి.వి. వ్యతిరేకిస్తూ కాంగ్రెసు అనే రైలు బండికి ఆ కుటుంబ సభ్యులు తప్ప వేరేవరు లేరా అని మండిపడ్డారని, తద్వారా సోనియా రాక పి.వి.కి ఇష్టం లేదన్నట్టుగా తెలిపారు...

ఇప్పుడు పై దాని గురించి మనం మాట్లాడుకుందాం....  మన దేశం ప్రజాస్వామ్య దేశమని, ఇందులో రాచరికానికి, కుటుంబ పెత్తనానికి తావు లేదని స్వాతంత్రం వచ్చిననాడే కాంగ్రెసులో తీర్మానించిన విషయము అర్జున్ సింగ్ కి తెలియదు అనుకోవాలా? అలాగే తమ వారసులు ఎవరిని రాజకీయాల్లోకి తీసుకురాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పలువురు తొలితరం కాంగ్రెసు నాయకులు నిర్ణయించుకొన్న విషయము కూడా తెలియదనుకోవాలా?  రాజీవ్ హత్యానంతరం సోనియాజీనే నాయకత్వం  వహించాలని నెహ్రు కుటుంబానికి వీరవిధేయుడైన అర్జున్ సింగ్ కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దానిని ఎవరూ కాదనలేరు. ఆయనకు కావలసినది ఎంతసేపూ నెహ్రు కుటుంబానికి భజన చేయడమే తప్పితే దేశం కోసం ఆలోచించగలిగే విశాల మనసత్వం ఉందని మనం అనుకోలేం. అలాంటి స్దితిలో ఉన్న అర్జున్ సింగ్ కి ఆనాడు పి.వి. గారు సోనియాజీ నాయకత్వం అప్పగించే విషయములో అబ్జెక్షన్ పెట్టడం ఆయనకు తప్పుగా అనిపించడంలో అశ్చర్యం లేదు.

ఆనాడు దేశానికి కావలసిన సమర్ద నాయకత్వం గురించి ఆలోచించగలిగి ఉండగలిగితే ఈ విషయాన్ని యింత రాద్దాంతం చేసియుండేవారు కాదనుకుంటా.  అనాడు అర్దికంగా అత్యంత దీనస్దితిలో ఉన్న భారతదేశానికి ప్రణాళిక సంఘల ద్వారా అర్దిక పరిపుష్టి తీసుకువచ్చి ప్రపంచంలో తలెత్తుకొనేల చేసిన పి.వి యొక్క నాయకత్వం గురించి మాట్లాడకుండా, కేవలం సోనియాజీ పై వ్యతిరేకత గురించి మాత్రమే రాసారంటే, అయన రాతల్లో ఔచిత్యంను ఏమనుకోవాలి.

పి.వి.నరశింహారావు గారిని  దేశాన్ని అభివృద్ది పధంలో నడిపించగలిగిన ఒక సమర్ద నాయకుడుగా చూడకుండా, కేవలం సోనియాజీ నాయకత్వాన్ని ప్రశ్నించడం గురించి మాత్రమే చూడగలిగిన అర్జున్ సింగ్ అంతరంగాన్ని మనము ఎలా అర్ద్రం చేసుకోవాలి.

ఇక దీని తర్వాత చెప్పుకోవలసినది ప్రముఖ ప్రాతికేయుడు కులదీప్ నయ్యర్ వ్రాసిన అత్మకధ....

ఈయన కూడా పి.వి.నరశింహరావు గారినే టార్గెట్ చేయడం గమనార్హం. ఆయా పత్రికల్లో ఈయన వ్రాసే ఆర్టికల్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నాకు ఈయన వ్రాసే ఆర్టికల్స్ అంటే ఇష్టం కూడా....

అయెధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయములో ఆనాటి ప్రధాని పి.వి.నరశింహరావు గారి వ్యవహరశైలి పై ఈయన విమర్శలు ఎక్కుపెట్టారు. అర్జున్ సింగ్ కూడా ఈ విషయమై తన పుస్తకంలో వ్యాఖ్యానించారు కూడా.. బాబ్రీ మసీదు కూల్చివేయవచ్చునన్న విషయమును పి.వి. గార్కి తాను ముందుగానే చెప్పానని, ఆ విషయము విని విననట్టుగా వదిలివేసారని, ఆయన ప్రవర్తన తనకు చికాకు పెట్టించిదని అర్జున్ సింగ్ తన పుస్తకంలో వివరించారు. అంతే కాకుండా బాబ్రీ మసీదు కూల్చివేత సమయములో పి.వి.ఎవరికి అందుబాటులో లేకుండా గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకొన్నారని తద్వారా బాబ్రీ మసీదు కూల్చివేతను అడ్డుకోలేకపోయారని ఆరోపించారు. ఇంచుమించుగా ఇదే అరోపణను కులదీప్ నయ్యర్ కూడా చేసారు. కాకపోతే ఆ సమయములో పి.వి. పూజలో ఉన్నారని, కూల్చివేత పూర్తయినంత వరకు పూజలో నుండి బయటకు రాలేదని, అ తర్వాతనే పూజ ముగించారని ఆరోపించారు.

ఇక్కడ మనం ఒక విషయము మాట్లాడుకోవాలి.... మన దేశంలో మైనారిటిలుగా పేర్కోనే ముస్లింల కట్టడం బాబ్రీ మసీదు కూలగొట్టడం మీదేనా ఇంత రాద్దాంతం చేయడం.. అదే సమయంలో హిందూ మత కట్టడాలు కూల్చివేత పై వీరెవరికి నోరు పెగలదా.... వారు మానవతవాదులైనపుడు ఏ మతం వార్కి చెందిన కట్టడం కూల్చివేసిన ఒకే రకముగా స్పందించాలి.  హిందూ కట్టడముల కూల్చివేత సమయములో లేని అత్రుత ముస్లింల కట్టడం కూల్చివేత సమయములో ఉండడం అవసరమా?

హిందూ కట్టడములు కూల్చివేత ఎప్పుడు జరిగింది? అని మీరందరూ అడగొచ్చు....

అసలు బాబ్లీ మసీదు కట్టడానికి ఇక వేరే ప్లేస్ ఎక్కడ దొరకలేదా? అనాడు హిందువుల పుణ్యకేత్రమైన రామ మందిరంను కూలగొట్టే కదా బాబ్లీ మసీదును నిర్మించారు!! ముస్లింలకు వారి ప్రవిత స్దలమైన మక్కా మీద ఎంత దైవభక్తి ఉందో, హిందువులకు కూడా తమ పవిత్ర స్దలం మీద అంతే అభిమానం ఉంటుంది కదా!!

ఆనాడు ముస్లింలు పాలకుల కళ్ళు నెత్తికెక్కి హిందూ మందిరం కూలగొట్టి మసీదు కడితే,
ఈనాడు లౌకిక కాంగ్రెసు పాలకుల కళ్ళు నెత్తికెక్కి మసీదును కూలగొట్టారనుకుంటే సరిపోతుంది ఏమో కదా....

మీకు కోపం వచ్చి ఉంటుంది. ఈ విధంగా మాట్లాడుతున్నానని.... కాని ఒకసారి ఆలోచించండి... ఒకరు చేస్తే ఒప్పు, అదే పని ఇంకొకరు చేస్తే తప్పు కాజాలదు..

ఎంత సేపు ఒక వర్గంనకు సంబందించిన విషయాల మీదే రచ్చ చేయాలని చూస్తే, ఎటువంటి మతఫీలింగ్ లేని నాలాంటి వాడు కూడా రగిలిపోతున్నాడు.

గోద్రా అల్లర్లనే తీసుకుంటే, ఎంత సేపు గోద్రా ఘటన తదనంతరం జరిగిన సంఘటనల గురించే గుండెలు బాదుకుంటున్నారు కాని, దానికి కారణమయిన గోద్రా రైలుకి నిప్పు పెట్టిన ఘటన, అందులో హిందువులు చనిపోయిన సంఘటన లెక్కలోకి రాదా?

గోద్రా రైలుకి నిప్పు పెట్టిన విషయము అసలు వీరికి కనబడనే లేదా? రైలుకి నిప్పు పెట్టి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయిన వారిని అరెస్ట్ చేయాలని ఏ ఒక్కరైనా డిమాండ్ చేసారా? అవతలి వర్గం వారివి మాత్రమేనా ప్రాణాలు... మిగతా వారివి కావా?

ఆ రోజు గోద్రా రైలుకి నిప్పు ఘటన గురించి ఈ రోజు పలురకాలుగ గగ్గోలు పెడుతున్న వారు ఆనాడు మానవీయంగా స్పందించివుంటే, నేను ఈ విధమైన పక్షపూరిత వైఖరితో మాట్లాడకపోదును.

 ఆయిన కులదీప్ నయ్యర్ అనాటి తప్పు మొత్తంను పి.వి.నరశింహారావు గారి మీదే వేసే ముందు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నది భాజపా మనిషి కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయమును మర్చిపోతునట్టున్నారు. (నయ్యర్ భాజపా మనిషని మీకు తెలుసనుకుంటా)..

వాస్తవానికి ఆ సమయములో పి.వి. నరశింహరావు గారు ఏమి చేశారో, అ సమయానికి అక్కడే ఉన్న ఒక ఉన్నత అధికారి నిన్ననే వివరణ ఇచ్చారు. పై వారందరూ అరోపిస్తున్నట్టు పి.వి.గారు పూజలో కూర్చుని ఉండలేదని, హోం శాఖ కార్యదర్శితో జరుగుతున్న పరిణామలతో ఎప్పటికప్పుడు చర్చించారని తెలిపారు...

మరి ఇందులో మనం ఏది నిజమని నమ్మాలి? ఆరోపణ చేసిన వ్యక్తి తాను మరణించిన తర్వాతనే పుస్తకం ప్రచురించలని చెప్పాడు. ఆరోపణలు చేయబడ్డ పి.వి.నరశింహారావు గారు వివరణ ఇవ్వడానికి మన మధ్య లేరు. మరి ఎవరి వాదనను మనం నమ్మాలి?

చివరగా ఏ సంఘటననైనా మానవీయ కోణంతో చూడడం నేర్చుకోవాలి మన నాయకులు. ఆ తర్వాత అందులో తప్పుఒప్పులు గురించి గగ్గోలు పెట్టోచ్చు. ఒక్కొక్కొ వర్గానికి ఒక్కొక్కొ తరహ విధానంను అవలింబించడం వలన వైష్యమాలు పెరగడం మినహా వేరే ఉపయోగం లేదు...

చివరగా మన నాయకులు దేశానికి నిస్వార్ద సేవల అందించిన నాయకులును గుర్తించగలగాలి. అంతే కాని ఏ ఒక్క వర్గానికో కొమ్ము కాసిన నాయకులను కాదు..... నా దృష్టిలో పి.వి. నరశింహారావు గారు ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రధాని. ఆయన మన తెలుగు వాడని అనడం లేదు ఈ మాటని.

అత్మకధలు రాయడం తప్పు అనడం లేదు. కాని అందులో తమకు గిట్టని వారి మీద అభాండాలు వేయడం లోనే ఇబ్బంది అంతా... ఆనాడు సోనియాజీ కి నాయకత్వం అప్పగించే విషయములో పి.వి. వ్యవహరశైలి తప్పయితేనేమి, ఒప్పుయితేనేమి తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. దటీజ్ పి.వి.నరశింహరావు అంటాను నేను... లేదంటే మాట పెగలడానికి కూడా ధైర్యం చేయలేని సందర్బంలో తన వాయిస్ వినిపించిన తెలుగోడు అని గర్వంగా ఫీలవుతున్నాను నేను...

అర్జున్ సింగ్ కి పి.వి. గారి మీద ముందు నుండి వ్యతిరేకత ఉంది. అది పి.వి. చనిపోయేంత వరకు కొనసాగింది. ఒక వేళ అయనకు పి.వి. తో సఖ్యత ఉండి ఉంటే, ఇదే విషయాన్ని పి.వి. యొక్క ధైర్యసాహాసాలగా వర్ణించేవారేమో. తనకు గిట్టక పోతే ఒకలా, గిడితే ఒకలా రాసే ఇలాంటి రాతలకు మనమ్ ప్రాధాన్యత యివ్వడం అవసరమా అన్న విషయము మనం అలోచించికోవాలి.

కాంగ్రెసు కుటుంబ నాయకత్వానికి పి.వి. అంటే పడకపోవచ్చు..... అంత మాత్రాన పి.వి. దేశానికి ద్రోహం చేసినట్టుగా భావించక్కర్లేదు....

కొద్దిలో కొద్దిగా గొప్ప ఏమిటంటే, పి.వి. పై కులదీప్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలను కొంత మంది రాష్ట్రనాయకులు ఖండించడం.....


Friday 6 July 2012

100....

నా చిన్నప్పుడు మా అన్నయ్యలు మమ్మల్ని ఆటపట్టించడానికి పది(10) మధ్యలో సున్న పెడితే ఏమోస్తుందని అడిగేవారు...
తడుముకోకుండా నేను పంది అని చెప్పేవాడిని.... కాని మిగతా వాళ్ళు మాత్రం వంద అని చెప్పేవారు......

ఇద్దరది తప్పు అని చెప్పి, నా దగ్గర వంద కరెక్టని, వంద అని చెప్పిన వాళ్ళ దగ్గర పంది కరెక్టని చెప్పేవారు....

యింతకి ఉపోద్దాతమంతా ఎందుకంటే వంద గురించి....

వంద...

చాలా మందికి ఫిగర్ అంటే ఎనలేని మోజు.....  నాలాంటి వాడికి మాత్రం అదో రకం నిర్లిప్తత... ఎందుకంటే అది నాకు ఎప్పుడూ అందలేదు కాబట్టి...

సచిన్ టెండుల్కర్ కి వంద అంటే ఎంత మోజో ఎవరికి తెలియనిది కాదు...

వందో వంద కొట్టడానికి మన సచినుడు ఎన్ని మెలికలు తిరిగిపోయాడో మన భారతదేశంలో బుడతడుని అడిగినా చెప్తాడు.  సచిన్ ఇంకా బాగా చెపుతాడువందపవర్ ఏంటో....

ఇకపోతే చాలా మంది విద్యార్దులకు కంటి మీద కునుకు లేకుండా చేసేది కూడా వందే కదా.. ఎందుకంటే వాళ్ళకు పెట్టే పరీక్షలు వంద మార్కులకే కదా.... ఫిగర్ ని అందుకోవడానికి మన సచినుడు కన్నా అద్బుతమైన పల్టీలు కొట్టే అనేక మందిని చూడోచ్చు రోజుల్లో.... రోజుల్లోనేంటి.... రోజుల్లో కూడా.. విద్యార్దినడిగినా చెప్తాడువందపవరేంటో!

పైగా అది చాలదన్నట్టు, చివరలో పర్సంటేజిలు... ఇది కూడా వంద బేస్ చేసుకొనే తగలడేవారు... అసలే ఏదో మెస్తరూ మార్కులు తెచ్చుకొన్నాము కదానుకుంటే, చివరలో ఎంత పర్సంటేజి వచ్చిందో వివరించే కాలుక్యేషన్ ఒకటి..... ఇదంతా వంద వల్లె కదా....

ఇక సినిమా వాళ్ళు వందకి ఇచ్చే వాల్యు అంతా యింతా కాదు... ఒక సినిమాను నిలబెట్టేది వందే.. ఇప్పడు లేదు కాని, మొన్నటి వరకు సినిమా వంద రోజులు అడిందంటేనే విలువుండేది.... లేకపోతే ప్లాపుల లెక్కలోకే.... ఒక సినిమా వంద ఆడిందంటే సినిమాలో నటించిన హిరో, హిరోయిన, దర్శకుడి పంట పండినట్టే......  ప్రతి హిరో, దర్శకుడు తమ సినిమా వంద రోజులు ఆడాలని కోరుకుంటాడు. పైగా సినిమా వంద రోజులు ఆడడం అన్నదాని మీదే హీరో గారి ఇమేజి ఎలిమేట్ అవుతుంది జనాల్లో...... సో సినిమావోళ్ళకు తెలుసువందపవరేంటో!....

బాలీవుడ్ లో మధ్య ఎప్పుడూ చూసిన వంద కోట్లు కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు అంటూ కొద్దిగా హల్ చల్ చేస్తున్నాయి. అమీర్ ఖాన్ నటించిన 3ఇడియట్స్, రజనీరోబో, సల్మాన్ ఖాన్బాడీగార్డ్ఇలా ఇత్యాది సినిమాలన్నీ వంద కోట్లు కొల్లగొట్టిన డిజాస్టర్స్ అంటూ హిందీ సినిమా చానల్ చూసిన ఒకటే దొబ్బుడు..... ’వందకోట్లు కలెక్షన్లు అంటూ.....

ఇకపోతే బ్యాంకులు... వీళ్ళు కూడా వంద కి ఆతీతం కాదు... వీళ్ళు ఇచ్చే రుణాలు లేక వడ్డీలు కూడా వంద ని ప్రతిపాదిక చేసుకొనే ఇస్తారు. (నూటికి ఫలనా యింత వడ్డీ అని). పైగా వీళ్ళు తయారుచేసుకొనే వార్శిక నివేదికలు కూడావందచుట్టునే తిరుగుతాయి...

వంద కి యింతలా అన్ని రంగాల్లో యింత వాల్యూ ఉన్నప్పటికి నాకు మాత్రం ఫిగరంటే ఎనలేని చిరాకు.... ఎందుకంటే దానిని ఎప్పుడూ అందుకోలేకపోయాను కాబట్టి....

చిన్నప్పుడు పరీక్షల్లో క్వొశ్చన్ పేపర్ ఇవ్వగానే నాకు ముందుగా కనబడేది దాని పైన ఉండే వంద మార్కులు అనే ట్యాగ్.  పేపర్ లో క్వొశ్చన్స్ ఏమి ఇచ్చారో చూడకుండానే మన సచినుడు వందకి చేరువలో ఉన్నప్పుడు ఒక్కసారే తన ఆటతీరుని ఎలా మార్చుకుంటాడో విధంగా,  సెల్ప్ ఢిపెన్స్ లోకి వెళ్ళిపోయేవాడిని. జాగర్తలో ఇంకా తప్పులు ఎక్కువగా రాసేసి, ప్రీతిప్రాతమైన వందకి అమడ దూరంలోనే ఉండిపోయేవాడిని. వంద ఎప్పుడూ నాకు అందని ద్రాక్షలానే ఉండేది.... (అఖరికి లెక్కల్లో కూడా రాలేదండీ). అందుకే నాకు అందని వంద అంటే నాకు విద్యార్ది దశ నుండి చిరాకే....

కాని ముచ్చట నాకు ఇంటర్ లో తీరిందిలెండి...కాని అప్పుడు లెక్కలు పేపర్ 75 మార్కులకు ఇచ్చేవారు. వాటిల్లో 75కి 75 వచ్చినప్పటికి శాటిస్ ఫై కాలేకపోయా.... ఎందుకంటే ’100’ కి ఉన్న విలువ ’75’ కి లేదు కదా...

సచిన్ కి కూడా వంద అంటే ఎంత ఫోబియానో, అంతే ప్రీతి... ఎంత ప్రీతి అంటే సెంచరీకి  అమడ దూరంలో ఉండగా తన ఆట తీరుని హై అలర్డ్ లోకి మార్చుకోనేంతగా.... ఇక టైమ్ లో మన సచినుడికి దేశం, టీమ్ ఇలాంటివి ఏమి కనబడవు. కేవలం కనుచూపు మేరలో కనబడుతున్న వంద మీదే ఉంటుంది దృష్టి.... ఎందుకంటే ఇక్కడ వంద చేస్తేనే తనకు సంతృప్తి... సంతృప్తి కోసం ఎన్ని బాల్స్ వేస్ట్ చేయమన్నా చేస్తాడు.....

అన్ని వందలు కొట్టినప్పటికీ, సచినుడుకి వంద అంటే మోజు పోయిందా? అంటే లేదనే చెప్పాలి. మొన్న వందో వంద గురించి ఎన్ని గింగిరాలు తిరిగాడో క్రికెట్ చూడని వాడు కూడా చెప్తాడు.... కాని వంద చుట్టూ గింగిరాలు తిరగడం వల్లే కదా నా లాంటి వాళ్ళ దృష్టిలో పెద్ద స్వార్దపరుడుగా ముద్రపడిపోయాడు....

ఏంటి, రోజు మనోడు వంద మీద ఇలా దంచేస్తున్నాడు అని డౌటు వచ్చిందా మీకు ఇప్పుడు? ఇంకా రాలేదా!!! 

ఎందుకంటే, ఇది నా వందో పోస్ట్ కాబట్టి...... ఇప్పటికైనా అర్ద్రమయిందా నేను వంద మీద ఎందుకు దంచుతున్నానో......

ఏమి చెప్పామంటారండీ, సచినుడు లానే నాకు కూడా వంద దగ్గరకు వచ్చేసరికి దేని మీద పోస్ట్ రాయాలో ఒక పట్టనా బుర్రకి తట్టలేదు.... అందుకే వంద మీద దంచి, దంచి పోస్ట్ ఇలా వ్రాసి పడేశాను.....