Saturday 25 January 2014

కేటిఆర్ ప్రసంగం-అజ్ఞాన గని

Written by Anigalla A Anigalla



కేటిఆర్ ప్రసంగం ఒక అబద్దాల పుట్ట, అజ్ఞాన గని - వీడి పరమ చెత్త ప్రసంగానికి మా సమాధానాలు ఇవిగో... 
1] "కలిసి వుండటం అసాధ్యం" సొల్లు ఎందుకు, భిన్న మతాలే, కులాలే, దొరల వర్గాలే కలిసి ఉంటున్నప్పుడు, ఒకే భాష వాళ్ళు వుండలేరా? రాష్ట్రాలు గొడవలు పడుతూ ఒకే దేశం లో వుండటం లేదా? వేరు పడతానన్నది మీరే, అదే హైదరాబాద్ మీకు రాకపోతే మూసుకొని కూర్చొంటారు, ఆదిలాబాద్ రాజధానిగా తెలంగాణా ఏర్పాటు చేసుకునే దమ్ము ఉందా? ఎంఐఎం - ముస్లిమ్స్, హైదరాబాద్ వాసులు కలిసి మేము తెలంగాణా తో కలిసివుండలేము, మా హైదరాబాద్ మాగ్గావాలె అంటే ఏమంటావ్? నువ్వు నీ సిరిసిల్ల కి పోతావా?
2] "ఉమ్మడి రాజధాని గా మూడేళ్లు చాలు" ఉమ్మడి రాజధాని అనేది రాజ్యాంగం లోనే లేదు అని నువ్వే అంటావ్, మళ్ళీ మూడేళ్లు చాలు అంటావ్, నీకేమైనా మెంటలా!
3] "ఆంధ్ర ప్రదేశ్ ప్రయోగం విఫలం అయ్యింది" ప్రయోగం అనే పదమే రాజ్యాంగం లో లేదు, ఎవరికి చెప్తావ్ నీ కట్టు కధలు. 1956 లోని బాషప్రయుక్త రాష్ట్రాలు అనేవి శాశ్వత ఏర్పాటు కాని, ప్రయోగం కాదు. ఒక్క హిందీ తప్ప, భాష ప్రయుక్త రాష్ట్రాన్ని ఇప్పటిదాకా విభజించలేదు. ప్రపంచం లో ఎక్కడా కూడా "ప్రయోగాన్ని" 60 ఏళ్ళు చెయ్యరు. ప్రయోగం విషయం 1972 లో గుర్తుకు రాలేదా. హైదరాబాద్ మీకే కావాలి కావున విఫలం అంటావ్, హైదరాబాద్ యు.టి అంటే ఏమనేవాడివో (సఫలం అంటావు)! లెక్కన భారతదేశం కూడా విఫలమేనా, హైదరాబాద్ సంస్థానం విలీనం కూడా విఫలమేనా? చెప్పరా సన్నాసి. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్, రంగారెడ్డి వాసులు, ఎంఐఎం, ముస్లిమ్స్ కూడా తెలంగాణా ప్రయోగం విఫలం అయ్యింది, మా (హైదరాబాద్) నిధులు, ఉద్యోగాలు మిగతా 8 జిల్లాలు దోచుకుపోతున్నాయి అంటారు, మాకు హైదరాబాద్ ప్రత్యెక రాష్ట్రం కావాలి అంటారు, దీనికి సిద్దమా?
4] "తెలంగాణా 4 కోట్ల మిగులు బడ్జెట్, ఆంధ్ర 2 కోట్ల లోటు బడ్జెట్" ప్రజల సంక్షేమం, ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టకపోతేనే మిగులు బడ్జెట్ ఉంటుంది, ఖర్చు పెడితే లోటు ఉంటుంది. తెలంగాణ మిగులు అంతా మద్యం మీద ఆదాయమే, తెలంగాణా లో మధ్య నిషేధం పెడితే 4.5 కోట్ల లోటు ఉంటుంది అని మీ ముఖ్యమంత్రే ఒప్పుకున్నాడు. అప్పుడు ఆంధ్ర లో మధ్య నిషేధం వుంది, అదైనా తెలుసా? అప్పట్లో మీ నుండి వచ్చిన 41 కోట్ల అప్పుల మాటేమిటి? వీటిని తీర్చింది ఎవరు?
 5] "తెలంగాణా నిధులు మళ్ళించారు" ఇప్పుడు కూడా తెలంగాణా 8 జిల్లాలలో రెవిన్యూ అనేదే పెద్దగా లేదు, అంతా ఖర్చే. హైదరాబాద్ లేకుండా మిగతా 8 జిల్లాల మిగులు నిధులు ఎన్నిరా శుంఠ. తెలంగాణా లో అంతా హైదరాబాద్ రెవిన్యూ నే, అది కూడా ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర పరిశ్రమలు, కేంద్ర కార్యాలయాలు వుండటం వల్లనే, రాష్ట్రం లో పరిశ్రమలకు సంబందించిన అన్ని పన్నులు, చమురు కంపెనీల పన్నులు ఇక్కడే కడతారు కాబట్టి, అంతే గాని అదీ హైదరాబాద్ ఆదాయం కాదు, తెలంగాణా ఆదాయం అంతా కన్నా కాదు. కారణం చేతే రాజధాని రెవిన్యూ అన్ని జిల్లాలు కు ఖర్చు పెడతారు, దేశం లో ఎక్కడైనా ఇలాగే చేస్తారు, ఇలా రాష్ట్రం లో చెయ్యరో నువ్వే చెప్పు. రాజధాని నిధుల మీద జిల్లాలకు హక్కు లేకపోతే అసలు రాజధాని ఎందుకు, దానిని దున్నపోతు లాగా 60 ఏళ్ళు గా మేపడం ఎందుకు? అంతా దాకా ఎందుకు, హైదరాబాద్ తో తెలంగాణా ఏర్పడితే, హైదరాబాద్ నిధులు మిగతా 8 జిల్లాలకు మళ్ళిస్థారా లేదా? "హైదరాబాద్ రెవిన్యూ హైదరాబాద్ కి మాత్రమే" అని రాజ్యాంగం లో సవరణ కి సిద్ధమా?
6] "తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తెలంగాణాలో 'మళ్ళీ' మిగులు నిధులు ఉంటాయి అని ఒక ఐఎఎస్ చెప్పాడు" లోక్ సత్తా విడుదల చేసిన రాష్ట్ర ఆదాయం - ప్రాంతాల వారీ లెక్కల ప్రకారం హైదరాబాద్ కు 12.8 వేల కోట్ల మిగులు, తెలంగాణా కి రూ 8.5 వేల కోట్లు లోటు ఉంటుంది, మొత్తం గా హైదరాబాద్ తో కూడిన తెలంగాణా కి రూ 4 వేల కోట్లు మిగులు ఉంటుంది అని తన కాకి లెక్కల ద్వారా తేల్చింది. రూ 1-1.5 లక్షల కోట్ల పెండింగ్ లిఫ్ట్ ప్రాజెక్ట్స్, 5.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ పే స్కేల్- స్పెషల్ ఇంక్రిమెంట్, 3 లక్షల కాంట్రాక్టు కార్మికుల ను రెగ్యులర్ చెయ్యడం, సింగరేణి కార్మికులకు 50% బోనస్ - కేంద్ర ప్రభుత్వ పే స్కేల్, విద్యుత్ ఉద్యోగులకి - ఎన్.టి.పి.సి పే స్కేల్, కొత్తగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు - వాటి ఖర్చు, ఆర్.టి.సి ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా వేతనం, తెలంగాణా కి వచ్చే 90 వేల కోట్ల అప్పు- అసలు చెల్లింపు, వీటిపై ఏటా వడ్డీ, ఏటా 2000-3000 మెగా వాట్ల అదనపు విద్యుత్ కొనుగోలు, బోరు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, లిఫ్ట్ ఇరిగేషన్ కి 8000 మెగా వాట్ల అదనపు విద్యుత్, విద్యుత్ ప్రాజెక్ట్ కోసం 50,000 కోట్ల పెట్టుబడి, కొత్త సంక్షేమ పధకాలు, సంవత్సరానికి రూ 5,000 కోట్లు పెన్షన్లు, ఎస్.సి/ఎస్.టి/బి.సి/మైనారిటీ సబ్ ప్లాన్, పాత బస్తీ కి 5000 కోట్ల పేకేజీ, కొత్తగా భారీ పోలీసు నియామకాలు, భారీ ఎత్తున తెలంగాణా పునర్నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా తగ్గడం వల్ల కలిగే లోటు,నీ కుటుంబ కమీషన్, కాంగ్రెస్ కమీషన్ లాంటివి అన్నీ కూడా రూ 4000 కోట్ల మిగులు బడ్జెట్ లోనే పూర్తి చేసేస్తావా? అంతే కాకుండా, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని బిల్లులో అంటే హైదరాబాద్ మిగులు (12.8 వేల కోట్ల) లో 60% వాటా (8 వేల కోట్లు) ఆంధ్ర కే ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడు తెలంగాణా లో రూ 4000 కోట్లు లోటు ఉంటుంది, కనీసం ఇదైనా తెలుసా? ఇదే సమయం లో తెలంగాణా లో మధ్య నిషేధం పెడితే రూ 8000 వేల కోట్లు లోటు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో భూములు అమ్ముకొని రెవిన్యూ తెచ్చుకుందాం అనుకుంటే, కొనే వాడు ఎవడు? అప్పటికే ధరలు బాగా పడిపోయి వుంటాయి.
7] "క్రికెట్ లో ఆంధ్ర - తెలంగాణా సంఘాలు ఉండవచ్చు కాని 9 కోట్ల మందికి రెండు రాష్ట్రాలు ఉండకూడదా" క్రికెట్ లో తెలంగాణా సంఘం లేదు, హైదరాబాద్ సంఘం మాత్రమే వుంది, అవి గవర్నమెంట్ సంఘాలు కావు, ప్రైవేటు అసోసియేషన్లు, అది కూడా తెలవదు వీడికి. పోనీ వీడు చెప్పిన క్రికెట్ సంఘాల లెక్క ప్రకారం రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే మహారాష్ట్ర లో 3 ( మహారాష్ట్ర, ముంబై, విదర్భ), గుజరాత్ లో 3 (బరోడా, గుజరాత్, సౌరాష్ట్ర) క్రికెట్ అసోసియేషన్లు ఉన్నాయి, దీనేకేమంటావ్? 19 కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ కి ఒకటే క్రికెట్ అసోసియేషన్ , ఒకటే రాష్ట్రం, మరి దీనికి ఏమంటావ్? మరీ ముఖ్యం గా, మరో 8 రాష్ట్రాలకి క్రికెట్ అసోసియేషన్లే లేవు అనే విషయం అయినా తెలుసా రా నీకు! దేన్ని దేనితో పోల్చాలో తెలవదు శుంఠ కి. 8] "హైదరాబాద్ ను ఆంధ్ర వాళ్ళు కుంభకోణాల రాజధాని గా చేసారు" కుంభకోణాల వల్ల రాష్ట్రాలు ఏర్పడవు. ముంబై, ఢిల్లీ లో జరిగే వాటిలో ఇవి 1% కూడా ఉండవు, కాంగ్రెస్ 70 ఏళ్ల కుంభకోణాలు లెక్కన విడిపోతే దేశం కనీసం 600 ముక్కలు కావాలి. కుంభ కోణాలు జరిగింది మీ మిత్ర పక్షం కాంగ్రెస్ హయం లోనే, మీరు కూడా ప్రభుత్వం లో వున్నారు కదా, గుర్తు లేదా, నెలకి 100 కోట్లు నీ ఇంటికే వచ్చేవి కదా? పోనీ వీటిని నువ్వే మైనా బయట పెట్టావా? కనీసం కోర్ట్ లో కేసు వేసావా? దర్యాప్తు సంస్థలను, రాష్ట్రపతి, ప్రధానిని కలిసావా అంటే అదీ లేదు. అప్పుడు నువ్వు సోదించి ఎందుకు బయట పెట్టలేదు? నీ కమీషన్ కోసమే కదా! ఇవన్నీ పత్రికలూ, ప్రతిపక్షాలు బయటపెట్టినవే కదా! వెంకట్రామి రెడ్డి - డెక్కన్ క్రానికాల్ , సత్యం - రామలింగ రాజు లాంటివి కార్పొరేట్ స్కామ్స్ , నిమ్మగడ్డ - వాన్ పిక్ స్కాం ( ఒంగోలు) వీటివల్ల తెలంగాణా కు, హైదరాబాద్ కు నష్టమేమిటో నీకైనా తెలుసా? జగన్ - నిమ్మగడ్డ లవి రాజకీయ కుంభకోణాలు, అనే విషయం కూడా తెలీదా? ఐతే, నిమ్మగడ్డ మీ నమస్తే తెలంగాణా పత్రిక లో పెట్టుబడి ఎందుకు పెట్టాడు? నువ్వు జగన్ బంధువులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు చేస్తున్నావు? ఇంకా నయం, హైదరాబాద్ ని " అక్రమ వసూళ్ళ రాజధాని" చేసారు అనలేదు!!!! గత 13 ఏళ్ల లో నువ్వు సంపాదించిన వేల కోట్లు కుంభకోణాలు కావా? నీ కష్టార్జితమా? నువ్వు అమెరికా నుండి తెచ్చావా? నీ ఫాం హౌస్ లో వ్యవసాయం చేసి సంపాదించావా? నీ సోది మేము నమ్మాలా? మీ ఆస్తుల మీద సిబిఐ విచారణకి సిద్దమా?
 9] "9 కోట్ల జనాభాకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటో" ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ , పుదిచేరి (యానాం) ఉన్నాయి తెలియదా. రెండు మాత్రమే ఎందుకు, 3 రాష్ట్రాలు (హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణా ) చేసుకుందాం, స్వయం పాలన సాధిద్దాం. హైదరాబాద్ కి కూడా స్వయం పాలనా కావాలి కదా? ఇందులో తప్పేమిటో?
10] "తమిళ నాడు నుండి వేరు పడ్డారు - అది వేర్పాటు వాదం కాదా?" ఆంధ్ర విడి పోయింది తమిళ నాడు నుండి కాదు మద్రాస్ స్టేట్ నుండి, అదీ బాషా ప్రయుక్త రాష్ట్రం కోసం. మద్రాస్ చరిత్ర ముందు తెలుసుకో. 1956 ముందటి తెలంగాణా నే కావాలంటే గుల్బర్గా డివిజన్, ఔరంగాబాద్ ని కలుపుకుంటాము అని ఎందుకు అనరు? అక్కడి నుండి రెవిన్యూ రాదనే కదా, కరువు ప్రాంతాలు అనే కదా, మీకెంత హక్కు ఉందో వాళ్ళకీ అంతే వుంది కదా హైదరాబాద్ మీద! మరి వాళ్ళని రాజకీయ కుట్ర చేసి కర్ణాటక లో, మహారాష్ట్ర లో కలిపారు కదా, అందుకు పరిహారం గా హైదరాబాద్ రెవిన్యూ లో 50% వాళ్ళకు ఇస్తారా? ఎందుకంటే హైదరాబాద్ ని నిజాం మే అభివృద్ధి చేసాడు కదా! అప్పుడు ప్రాంతాలు కూడా హైదరాబాద్ సంస్థానం లో ఉన్నాయి కదా! 11] "ఇందిరా గాంధీ హయం లోనే అత్యధికం గా 5 రాష్ట్రాలు ఏర్పడ్డాయి" మణిపూర్, మేఘాలయ, త్రిపుర , సిక్కిం, హిమాచల్ కు రాష్ట్ర హోదా లాంటివి, హర్యానా - పంజాబ్, ఇందిరా గాంధీ హయం లో (1960-70 మధ్య) ఏర్పడ్డాయి, వీటికి తెలంగాణా కి పోలికా? నీకేమైనా మెదడు చితికిందా? లేదా అరికాలులోకి జారిందా? మరి వీటి తరువాత 1969, 1972 లో వచ్చిన తెలంగాణా - ఆంధ్ర రాష్ట్రాల డిమాండ్ ని ఇందిరా గాంధీ ఎందుకు పట్టించుకోలేదు? 1972 తరువాత ఇందిరాగాంధీ కొత్త రాష్ట్రాలను ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు? ఒక్కసారి ఆవిడని లేదా సొనియమ్మ ని అడిగి చెప్తావా? మరి తెలంగాణా వాడు అయిన పి.వి. నరసింహారావు ప్రధాని గా వున్నప్పుడు తెలంగాణా ఏర్పాటు ఎందుకు కాలేదు? కనీసం తెలంగాణా కోసం ఎందుకు డిమాండ్ చెయ్యలేదు. మీ నాయన ఎక్కడ తొంగున్నాడు? హైదరాబాద్ అప్పటికి ఇంకా అభివృద్ధి కాలేదనా, ఐటి పరిశ్రమ ఇంకా ఎదగలేదనా?
12] " సిఎం లు మాట వినకపోతే రాష్ట్రపతి పాలన పెట్టి అయినా రాష్ట్రం ఏర్పాటు చేస్తారు" కాంగ్రెస్ కి దమ్ముంటే ఇప్పుడు అలాగే చెయ్యమను. అసెంబ్లీ దాకా బిల్లు ఎందుకు. హర్యానా - పంజాబ్ రాష్ట్రాలు మతం, బాషా ప్రాతిపదిక ఏర్పడ్డాయి అది కూడా చండీగఢ్ ఉమ్మడి రాజధాని (యు. టి) గా, దీనిని ఉదాహరణ గా చెప్తున్నావ్, మరి ఇప్పుడు కూడా అలానే చేద్దామా, చెప్పరా శుంఠ !
13] "గోదావరి లో 79% పరివాహక ప్రాంతం తెలంగాణా లో వుంది కానీ కేటాయింపులు 65%, వినియోగం తక్కువ" ఇవన్నీ దొంగ లెక్కలు, భద్రాచలం తీసేస్తే ఇది 40% మాత్రమే, 60% ఆంధ్ర ప్రాంతం లోనే గోదావరి ప్రవాహం వుంది, లెక్కన 25% అదనపు కేటాయింపు తెలంగాణా కే వుంది, ఇదంతా పచ్చి మోసం. వరద సమయంలో తప్ప ఇతర సమయాలలో తెలంగాణా ప్రాంతం నుండి గోదావరిలోనికి వచ్చే నీరు చాలా స్వల్పం. తెలంగాణా ప్రాంతంలో ప్రతి చిన్న వాగుపైన కూడా ఆనకట్టలు నిర్మించి ఆంధ్ర కి వచ్చే గోదావరి లోనికి నీరు రాకుండా చేసి అడ్డుకుంటున్నారు. అయినా ఆంధ్ర కు భద్రాచలం డివిజన్ లోగల శభరి వంటి నదులనుండి నీరు ప్రస్తుతానికి లభిస్తున్నది. ఇప్పుడు ఆంధ్ర కి వచ్చే నీరు అంతా ఓడిశా, చత్తిస్ గడ్ నుండే వస్తుంది కాని తెలంగాణా ప్రాంతం నుండి కాదు,వీటి మీద దొడ్డి దారి హక్కు సాధించడం కోసమే భద్రాచలం కొరకు దొంగ ఉద్యమం. వీడు చెప్పినట్టు తెలంగాణా కి కేటాయించిన గోదావరి నీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వినియోగం లోకి తేవాలంటే రూ1.5 లక్షల కోట్లు నిధులు, రోజుకు 8000 మెగా వాట్స్ విద్యుత్ అవసరం అవుతాయి, అంటే ఎకరాకి ఒక పంటకి వీటి ఖర్చు 25 వేలు, వచ్చే లాభం 15 వేలు అయితే, లెక్కన ఎకరా కి వచ్చే నికర నష్టం 10 వేలు, ఇదైనా తెలుసా తెరాస సన్నాసికి?
14] " కృష్ణ లో 65% పరివాహక ప్రాంతం తెలంగాణా లో వుంది కానీ కేటాయింపులు 35%, 1956 కు ముందే 1365 టిఎంసి వినియోగం కోసం ప్రతిపాదనలు ఉన్నాయి" ప్రపంచం లో ఎక్కడా, ఎవ్వరూ పరివాహక ప్రాంతం ప్రకారం మాత్రమే నీటి ని పంచరు, ఇది ప్రస్తుత వినియోగం, ప్రస్తుత ఆయకట్టు, కాలువలు, జనాభా, కాచి మెంట్ ఏరియా ప్రకారం మాత్రమే ఉంటుంది. బ్రజేష్ - బచావత్ ట్రిబ్యునల్స్ మొదటి ప్రాధాన్యత ప్రస్తుత వినియోగానికే, అనికూడా తెల్వదా? ఎవరికి చెప్తావ్ రా దొంగ లెక్కలు. తెలంగాణా లో పల్లం లేకుండా మొత్తం కృష్ణ నీరు ఎలా వస్తుంది రా శుంఠ, ఖమ్మం లో కృష్ణ నది పారకపోయినా సాగర్ నీరు ఎట్లా వస్తుందో తెలుసా? మీ నుండి పారేది మీదే అంటే పై రాష్ట్రం కర్ణాటక, మహారాష్ట్ర ఏమనాలి రా కృష్ణ నీటి గురించి? 1956 కు ముందే తెలంగాణా లో1365 టిఎంసి వినియోగం కోసం ప్రణాళికలు ఉన్నాయి, అనే సొల్లు కబుర్లు ఎవరికీ చెప్తావు. అప్పుడు అంతా డబ్బు ఎక్కడిది? నీరు ఎక్కడిది? మీకు కేటాయింపులు ఎవడు చేశాడు? తెలంగాణా లో పల్లం లేదు, మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ కావున, వీటికి సరిపడే 8000 మెగావాట్స్ కరెంటు ఎక్కడిది? గత 30-40 ఏళ్ళు గా తెలంగాణా వాళ్ళే కదా నీటి పారుదల మంత్రులు, అప్పుడు ఎందుకు "రహస్యాలని" బయట పెట్టలేదు? లెక్కన బ్రిటిష్ వాళ్ళు కూడా సీమాంద్ర లో 2000 టిఎంసి వినియోగం కోసం ప్రణాళికలు వేసారు, అంతలోనే మాకు స్వతంత్రం వచ్చి దాపురించింది అని ఆంధ్ర వాళ్ళు కూడా అనగలరు రా బేవకూఫ్. ఒరేయ్ శుంఠ, హైదరాబాద్ కే సాగర్ నుండి కృష్ణ నీటిని మోటార్ లతో పంప్ చేసి , పైప్ లైన్ ద్వారా 140 కిమీ పైకి అతికష్టం మీద తీసుకొస్తారు, కనీసం ఇదైనా తెలుసా? "నీరు పల్ల మెరుగు - నిజం దేవుడెరుగు" అనే సామెత మీ వల్లే పుట్టింది నిజం కాదా!
15] "రాష్ట్రం లో 18 విశ్వ విద్యాలయాలు ఉంటే - 7 మాత్రమే తెలంగాణా లో ఉన్నాయి, 11 సీమాంధ్ర లో ఉన్నాయి, ఇది వివక్ష కాదా?" ఇది కూడా వివక్షేనా, వీడి లెక్క ప్రకారం మొత్తం అన్నీ తెలంగాణా లోనే ఉండాలా? తెలంగాణా జనాభా ప్రకారం ఇది 40% కదా? ఇది కూడా అర్ధం కాదా బడుద్దాయి కి. ఇంకా చెప్పాలంటే, 100 కేంద్ర ప్రభుత్వ విద్య సంస్థలలో - 95 తెలంగాణా లోనే ఉన్నాయి, దీని వివక్ష అనరా? 50 రాష్ట్ర ప్రభుత్వ విద్య సంస్థలలో 45 తెలంగాణా లోనే ఉన్నాయి, ఇది వివక్ష కాదా? మరి దీన్నేమంటారో? రాష్ట్రంలోని 100 ప్రముఖ ప్రైవేటు విద్య సంస్థల లో, యూనివర్సిటీ లలో 95 తెలంగాణా లోనే ఉన్నాయి కదా! ఇది మరచిపోయావా?
 16] "గుంటూరు లో 34 ఎయిడెడ్ డిగ్రీ కాలేజిలు ఉంటే, తెలంగాణా లో 22 ఉన్నాయి" గుంటూరు లో ఉన్నవి అన్నీ భూస్వాములు, జమీందార్లు, ప్రవాసాంధ్రులు భూములు, నిధులు ఇచ్చి కట్టించినవి, ప్రభుత్వ సొమ్ము తో కట్టినవి కాదు అందుకే "ఎయిడెడ్" అంటారు. మీ ప్రాంతం లో దొరలూ - దొరసానులు కూడా ఇలానే నిధులు సమకూర్చి కట్టుకోండి, ఎవడు ఆపాడు? "మీకు లేకపోయినా మాదే తప్పు, మాకు ఉన్నా మాదే తప్పంటే ఎలా?" డిగ్రీ కాలేజీ గురించి మాత్రమే చెప్పావేమి, మిగతా కాలేజి గురించి కూడా చెప్పడు, ఇంజనీరింగ్, ఎం.బి., ఎం.సి., మెడిసిన్, లా, ఫార్మసి, పి.జి లాంటి వాటి గురించి కూడా లెక్కలతో చెప్పు చూద్దాం. అనుకూలమైన వాటిని దాచేసి, హైదరాబాద్ ను అవసరమైనప్పుడు తీసేసి నువ్వు చెప్పే దొంగ లెక్కలు మాకు తెలియవా సన్నాసి.
17] " రాత పరీక్ష లో ఎక్కువ మార్కులు వచ్చినా, ఇంటర్వ్యూ లో మాకు మార్కులు తక్కువ వేసారు, ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ వేసారు" ఇది కూడా ఒక సమస్యా? రాత పరీక్ష వేరు, మౌఖిక పరీక్ష వేరు. ఎక్కడా కూడా రాత పరీక్షే కొలబద్ద కాదు. ఇది నీ లాంటి సన్నాసులకి అర్ధం కాదు. ఐఐటి లో రాంక్ వచ్చి ఇంటర్ లో ఫెయిల్ అయిన వాళ్ళు వుంటారు, ఇంటర్ లో రాంక్ వచ్చి ఐఐటి లో ఫెయిల్ అయినా వాళ్ళు కూడా వుంటారు, అంతమాత్రం చేత రాష్ట్రాన్ని, దేశాన్ని విభజిస్తామా పనికిమాలిన వెధవా!
18] "పోచం పాడు లో 400 టిఎంసి లతో ప్రతిపాదించారు,120 టిఎంసి లతో పూర్తి చేసారు" ప్రాంతం లో 400 టిఎంసి నీటి లభ్యత గానీ, పైన ఉన్న మహారాష్ట్ర నుండి ప్రవాహం గానీ, ఉపనదుల నుండి లభ్యత గానీ, మేరకు వర్షపాతం గానీ లేవు, మరి మిగతా 300 టిఎంసి లు ఎక్కడనుండి వస్తాయి రా భడవా? నీ కాకమ్మ కధలు చదువు లేని వాళ్ళకి చెప్పుకో పోయి. ఇంకా నయం 300 టిఎంసి లు ఆంధ్ర వాళ్ళు దోచుకు/తోడుకు పోయారు అనలేదు!
19] "పెద్ద మనుషుల ఒప్పందానికి పార్లిమెంట్ ఆమోద ముద్ర వేసింది" ఒరేయ్ వెధవ, పెద్ద మనుషుల ఒప్పందం కాంగ్రెస్ పార్టీ లో జరిగిన ఒప్పందం, దానికి పార్లిమెంట్ ఆమోదించడం ఏమిటిరా, పార్లిమెంట్ ఆమోదిస్తే భారత రాజ్యాంగం లో వుండాలి. వుంటే చూపెట్టు, మేము కూడా చూస్తాం నీ ప్రతిభ.
 20] "తెలుగు ప్రజలకి 3000 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ 500 సంవత్సరాలు మాత్రమే కలిసి వున్నారు" 500 సంవత్సరాలలోనే హైదరాబాద్ అభివృద్ధి అయ్యింది, 3000 సంవత్సరాల నుండి ఆంధ్ర సొమ్ము తోనే ప్రాంతం బ్రతికింది, కాదని నిరూపించు చూద్దాం. ఒరేయ్ వెధవ, లెక్కన రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే, దేశం లో ముస్లిం మైనారిటీ లు గల్ఫ్ కి పోవాలి. 3000 వేల సంవత్సరాలలో భారత దేశం కూడా ఎప్పుడూ కలిసిలేదు రా! 1947-48 లో మాత్రమే భారత దేశం ఒక్కటిగా కలిసింది, కాశ్మీర్ సమస్య వల్ల ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు, ఇప్పటికి 67 ఏళ్లే అయింది రా సన్నాసి.

21] "బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ని నెహ్రు వ్యతిరేకించారు" సరే..ఐతే, ఇప్పుడేమి చేద్దాం, వాడు ఒక వెధవ ని అందరికీ తెలుసు, మోడీ ని అడుగు వాడి గురించి చాలా బాగా చెప్తాడు. బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒపుకున్నాడు కదా, పార్లిమెంట్ ఒప్పుకుంది కదా, అంబేద్కర్ ఒప్పుకున్నాడు కదా, ఫజల్ అలీ కమీషన్ ఒప్పుకుంది కదా, అప్పుడు ఏర్పాటు అయిన 15 బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒప్పుకున్నాయి కదా, నీకు - నెహ్రు కి వచ్చిన దురద ఏంటి. ఇప్పటికే 60 ఏళ్ళు అయిపోయాయి. నీకెందుకురా, అర్ధం కాని విషయాలు. అయినా అంతా దురదగా వుంటే 15 బాషా ప్రయుక్త రాష్ట్రాలు దగ్గరికి పోయి అప్పుడు నెహ్రు ఒప్పుకోలేదు , కావున ఇప్పుడు మీరు విడి పొండి అని చెప్పు. ఇందిరా కూడా 1969,72 లో రాష్ట్ర విభజన ని వ్యతిరేకించింది కదా, ఇది గుర్తు లేదా? ఇవి చాలా ....ఇంకా కావాలా..

16 comments:

  1. ఇంతమంచి విశ్లేషణ నేనీమధ్యలో చూడలేదు.. ఈ టపా అసెంబ్లీకి చేరితే బాగుణ్ణు

    ReplyDelete
  2. ఈ టపా నిజంగానే అసెంబ్లీ కి పంపండి. వీడికి వీడి బాబు కి కూడా తెలియాలి.

    ReplyDelete
  3. మీరు ప్రస్తావించిన విషయాలు వార్తాపత్రికల్లో ప్రచురణకి ప్రయత్నించండి.

    ReplyDelete
  4. Chala Baagaa Raasu . Maadi lekka prakaram Telanagana lo ki vastadi anta ( Maadi Khammam dist ) :) Kaani meerane boduddayi , laphanigala valana oka vela Telanagana Vidipothe , next udyamam vacchhedi " Jai Khammam " , " Maa Khammam maaku seperate state Kaavaali " , " Khammam Ramudu Khammam Jilla ku maatrame kaavaali " , " Maa bayyaram iron mariyu kottagudem boggu migathaa telanagnaa vallu dochukuntunnaru kabatti maa khammam maaku kaavaali "

    ReplyDelete
  5. మా వాళ్ళ 25000 బలి దానాల కంటే, మీ కివన్నీ ముఖ్యమైనాయా??

    ReplyDelete
  6. కిరణ్ కుమార్ రెడ్డి ఎంత బాగా... ఆంధ్ర వాళ్ళ చెవుల్లో పువ్వులు పెడుతున్నాడో .... మీ నాయకులు (వెధవ నాయకులు ) చెప్పిన తప్పులు కూడా వివరిస్తే బాగుండేది... ఏదో formality కి అసెంబ్లీ కి పంపించారు... ఆ విషయం కూడా తెలుసుకోలేకపోయవా.... ఓ రాసిన పిచ్చి వెధవ! ఆంధ్ర ని డెవలప్ చేసుకొనే అవకాశం వచ్చింది.... చేసుకోండి... మీ నాయకుల స్వార్థం కు బలికావద్దు. ఇంత జరిగిన ఎలా కలిసి ఉంటారో... ఓ రాసిన పనికి మాలిన వెధవ...ఒ ఇదు నిముషాలు అలో చించు.. సీమంధ్ర వాళ్ళు మాట్లాడిన వక్ర మాటలు కుడా మీరు రాసినట్లైతే అభినందించే వాడిని.... వన్ సైడ్ వెధవవి నువ్వు.

    ReplyDelete
    Replies
    1. nayakula swartham ki bali aindhi meeru ra pichi vedhavallara. telangana lo anni aathma hathyalu jarigindhi kuda aa TRS ane dongala party swartham kosam. meeru kallu theravaru.. mee bathukulu bagupadavu. malli meeru vere vallaki neethulu cheppatam okati.. konchem brain veliginchuko ra areyy please. ekkuva vadhdhu.. konchem vaadu.

      Delete
    2. సంస్కారము ,సంస్కృతీ లేని ఈ రాజకీయ నాయకుల్ని ఇంకా నమ్ముతున్నారా . దయాచేసి వారి
      ప్రభావంతో మనం కోట్లడుకోగూడదు .ఇంగితమ్ మరచి ఆ దొంగలను సపోర్టు చేయకూడదు .

      Delete
  7. Written by Anigalla?

    Great Post anDi. Idantaa KTR Chadivaaru anukoanDi. aayana oke okka samaadhaanamtho mee noaru muuyinchagalaru. adento telsaa telangaana drohi :D:P

    ReplyDelete
  8. T vaallaki manchi rojulu ipothunnayy. malli nee baanchen anadaanike chachchi maree techukuntunnaaru telangaana.

    ReplyDelete
  9. NEELAGA CHETTA RAYADAM AND VAGADAM VALLANE TELANGAANA VIDIPOVALANI KORUKUNTUNDI .............. MEERU MADRAS NUNDI ENDUKU VIDIPOYARU......MEMU ANDUKE VIDIPOVALANI KORUKUNTUNNAM..... MEERU CHESTE PORATAM MEMU CHESTE VERPATU VADAMA............ IDENA MEERU MAKICHE GAOURAVAM... NEE BLOG LO TELANGAANA GURINCI ENTA CHETTAGA RASARO CHUSUKUNNAVA..............ILANTO RATALU RASINA KUDA MEMU MEETO KALISI VUNDALA...............

    NEENU MEE ADHRA VALLA LAGA ANONYMOUS GA TITTANU TELANGANA VADILAGA NAA PERU PETTI RASTUNNANU.........DHAIRYAM VUNTE MEERU RAYADANIKI TRI CHEYANDI....................

    ReplyDelete
    Replies
    1. వాసు గారు,
      తెలంగాణాని మీరు కోరుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.... అయితే రాష్ట్ర విభజన అంశాన్ని అన్ని రాజకీయపార్టిలు తమ స్వలాభం కోసం వాడుకుంటున్నయని ఇరుప్రాంతాలా ప్రజలు భావిస్తున్నారన్న విషయం మీకు తెలీదనుకోవాలా? చంద్రబాబు తన పార్టిని ఇరుప్రాంతాల్లో కాపాడుకోవడానికి, కాంగ్రెసు తన ఎం.పి.స్దానాలను కాపాడుకోవడానికి, కిరణ్ తన కొత్తపార్టికి ఇమేజ్ కోసం, టి.ఆర్.ఎస్. సెటిల్ మెంట్లు, భూదందాలు కోసం, జగన్ తన పార్టి మునుగడ కోసం ప్రస్తుత రాష్ట్ర విభజన అంశాన్ని రాజకీయం చేస్తున్నయన్న నిజం మీకు తెలీదనుకోవాల?
      పై వ్యాసంలో టి.ఆర్.ఎస్. అనే పార్టిలో కే.టి.ఆర్. అనే ఒక నాయకుడు చేసిన ప్రసంగంలో గల తప్పులని అంశాలవారీగా ఎండగట్టడం జరిగింది. అంతే కాని తెలంగాణా ప్రజలకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఉందా?
      తెలంగాణా రాష్ట్రం రావడం వలన కల్గే లాభాలు, అక్కడ ప్రజల జీవన విధానాలు మెరుగయ్యే అవకాశములను వివరించి ఎందుకు రాష్ట్రంని విడిపోవాలని కోరుకుంటున్నామో సోదహరణగా రాజకీయపార్టిలు చెప్పడం మానేసి, అవాస్తవాలతో, అభాండాలతో, విద్వేషంతో వేరే ప్రాంతాల మీద పడడం ద్వారా రాష్ట్రం విడగొట్టడానికి రాజకీయనాయకులు ప్రయత్నిస్తున్నారన్న విషయం మీకు తట్టలేదా?
      రాజకీయ నాయకులు విద్వేషాలు రేకెత్తించినంత మాత్రానా ఇరు ప్రాంతాల ప్రజలు కొట్టుకోవాలా?

      “ఇదేనా మాకిచ్చే గౌరవం” అని అన్నారు. మీ ప్రాంత టి.ఆర్.ఎస్. నాయకులు సీమాంధ్ర ప్రాంత ప్రజలను ఉద్దేశించి పలు సందర్బాల్లో ఎంత అగౌరవంగా మాట్లాడారో మీకు తెలీదనుకోవలా? అప్పుడు ఇక్కడ వారికి కూడా గౌరవమనేది ఉంటుందని మీకనిపించలేదా?

      కే.టి.ఆర్ అనే కాదు, ఇక్కడ నేతలు కూడా అవాస్తవాలతో ప్రజల మధ్య దూరంని పెంచుతున్నారన్న విషయం మీకు తట్టలేదా? పై వ్యాసంలో కే.టి.ఆర్ చేసిన ప్రసంగంలో గల అవాస్తవాలు పై ఉన్న వివరణ తప్పు అని మీరు భావిస్తే వాటిని మీరు వివరణ యిచ్చి ఖండించండి.. అంతే కాని అగౌరవపర్చుతున్నారు లాంటి మాటలు ఎందుకండి?
      నేనేవరో మీకు తెలీదు, అలాగే మీరెవరో నాకు తెలీదు.. ఆయినప్పటికీ మీరు నన్ను ఏకవచనంలో సంభోదించారు. గౌరవం ఇవ్వకుండానే, తిరిగి మమ్మల్ని అగౌరవపర్చుతున్నారు అనడం ఏ విధంగా భావ్యమో చెప్పండి..
      టి.ఆర్.ఎస్. నాయకులు పలు సందర్బాల్లో సీమాంధ్రప్రజలను అగౌరవపర్చుచూ మాట్లాడినప్పుడు, మేము ఎందుకు వారికి గౌరవం ఇవ్వాలి. అందుకే పై వ్యాసంలో ఏకవచన ప్రయెగం జరిగింది.
      స్పందనకు ధన్యవాదములు..

      Delete
  10. అదర గొట్టారుగా!విశ్లేషణ మరియు తొండి కామెంట్లకి ఇచ్చిన జవాబులు అన్నీ బాగున్నాయి. కానీ చెవిటి వాడి ముందు శంఖం యెంత గట్టిగా వూదినా యేమి లాభం?

    ReplyDelete
  11. chala baga rasaru..manchi vishleshana

    ReplyDelete
  12. chaalaa baagaa vishlesincharu....antha ipoindi

    ReplyDelete
  13. Raghava Nuv keka. sampinav po. e latkorgadu maku kaboye mukya mantri ata. makem poye rojulochinayo?

    ReplyDelete