అవినీతికి
వ్యతిరేకంగా భారత్ లోని యువతని ఏకం చేయడానికి మరియు బలమైన లోక్ పాల్ బిల్లు కొరకు
పోరాడిన అన్నాహజరే బృందంలోని సభ్యుడిగా బయట ప్రపంచానికి పరిచయమైన అరవింద్
కేజ్రివాల్ తదుపరి కాలములో అన్నా బృందం నుండి బయటకి వచ్చి స్వంతంగా "అమ్
అద్మి పార్టి" ని స్దాపించి పాల్గోన్న మొదటి ఎన్నికలలోనే అధికార పార్టి
మరియు ప్రధాన విపక్ష పార్టిలను తలదన్నే విధంగా అత్యధిక స్దానాల్లో గెలుపొందడం
ద్వారా
ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో అరవింద్ కేజ్రివాల్ పేరు మార్మోగిపోయిందన్న సంగతి
మనందరికి విదితమే....
ఆయితే ఇప్పుడు
ఢిల్లీలో పాగా వేయగలిగిన అమ్ అద్మీ పార్టి చూపు వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటి
చేయడమ్మీద దృష్టి పెడుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఎంత వరకు నిజమో తెలియదు కాని, ఢిల్లీ అసెంబ్లీ
ఎలక్షన్స్ లో చేసిన మేజిక్ సాధారణ ఎన్నికల్లో పునరావృతం కాగలదా అన్న విషయం మీద చాలా
మందికి సంశయాలున్నాయి.అమ్ అద్మీ పార్టి
ప్రస్తుతమున్న మురికి రాజకీయాలకు భిన్నంగా నూతన విధానాలతో దూసుకువచ్చిన ఘనత మొత్తం
అరవింద్ క్రేజివాల్ కే చెందుతుంది. ఆయితే మొదట్లో కేవలం అవినీతికి వ్యతిరేకంగా
భారత్ అన్న నివాదంతో బలమైన లోక్ పాల్ బిల్లు తేవడం కోసమే పరిమితమైన అరవింద్ పోరాటం
తదనంతరం అధికారగర్వంతో వీరవ్రీగిన కాంగ్రెసు అనాటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చేసిన
సూచనతో న్యూడిల్లీ రాజకీయాల్లోకి వచ్చి అమ్ అద్మీ పార్టి స్దాపనకు దారితీసింది..
ఆయితే న్యూడిల్లీ రాష్ట్రం దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ
విస్తీర్ణం కల్గిన రాష్ట్ర్రం.. మొత్తంగా 76 అసెంబ్లీ స్దానాలు మాత్రమే కల్గియున్నది. దాని
వలన అరవింద్ కేజ్రివాల్ తన తొలి పరీక్షకు ఢిల్లీ ఆయితే బాగుంటుందని బావించారు.
ఆయితే ఈ విషయంలో కూడా ఆయన చాలా జాగర్తగా వ్యవహరించి ఢిల్లీ మొత్తమ్మీద ఎటువంటి
వివాదాలు లేని వివిధ రంగాల వ్యక్తులను తన సహయకులుగా తీసుకొని పార్టిని నెమ్మది
నెమ్మదిగా సామాన్య జనాలకు చేరువయ్యేటట్టుగా కృషి చేసారు. ఆ విధంగా ఢిల్లీలో మొత్తం
అసెంబ్లీ స్దానాలన్నింటికి నిజాయితీపరులనదగ్గవారిని ఎంచుకొని ఆయా నియెజకవర్గలకు
చెందిన సమస్యలతో ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా ఒక్కొక్క మేనిపోస్టొ తయారుచేసి
ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ప్రజలకు త్వరగా చేరువ కాగలిగారు. ముఖ్యంగా ఢిల్లీ
వాసుల్లో మెజారిటి ప్రజలు చదువుకున్నవారే కావడం ఆమ్ అద్మీ పార్టికి కలిసివచ్చింది.
మరియు యువతలో
వచ్చిన మార్పు కారణంగా మెజారిటి యువత సామాజిక మరియు యితర వ్యవహరముల్లో చురుగ్గా
పాల్గోంటున్నారు. దీనికి ఉదహరణగా నిర్బయ ఉదంతం తర్వాత దేశవ్యాప్తంగా యువతరం
గళమెత్తిన ఉదంతంను చెప్పుకోవచ్చు. నిజానికి ఈ ఘటన మీద ఢిల్లీ యువత నుంచి వచ్చిన
ప్రతిస్పందన చూసి దేశములో ఉన్న మిగిలిన యువతలో చైతన్యం ఎగిసిపడింది. అప్పటికీ కూడా
దేశములో పెరుగుతున్న యువత ప్రాబల్యంను మరియు వారికి ఇవ్వవలసిన ప్రాధాన్యత గురించి
ప్రభుత్వాలు సరయిన అంచనాకి రాలేకపోయాయి. గతముతో పోలిస్తే పలు ప్రాంతాల్లో యువతకు
ఉపాధి అవకాశములు అందుబాటులో ఉండడంతో వారు స్వచ్చంధ మరియు సామాజిక కార్యక్రమాల్లో
విరివిగా పాల్గోనడం జరుగుతుంది. నిర్భయ ఘటన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ
ప్రభుత్వ పనితీరులో మార్పు కనబడకపోవడంతో యువతలో అసహనం పెరుగుతున్న విషయాన్ని అధికారి
పార్టి నాయకులు కనిపెట్టలేకపోయారు. సరిగ్గా ఈ విషయాన్నే పసిగట్టి అమ్ అద్మీ పార్టి
నేటి యువత ఏ విధంగా కోరుకుంటుందో ఆ విధంగా తన పార్టి విధానాలను ప్రకటించడంతో
సహజంగానే పలువురు యువత ఆమ్ అద్మీ పార్టికి అకర్షితులయ్యారు. అరవింద్ కేజ్రివాల్
బృందంలో ఏ ఒక్కరూ కూడా అనుభవజ్ణులు లేరు. ప్రభుత్వం నడపడంలో గాని లేక ఏదైనా
ప్రాంతం నుండి ఎన్నికవ్వడం కానీ, ప్రభుత్వ
అధికారులుగా పనిచేసిన అనుభవం కానీ లేదు. ఒక్క కేజ్రివాల్ మాత్రమే ప్రభుత్వ
అధికారిగా పనిచేసారు. మిగిలిన వారందరూ ప్రభుత్వ పనితీరు మీద అవగాహన లేనివారే.
ఆయినా ఢిల్లీ వాసులకు ఆవేవి అభ్యంతరం అనిపించలేదు. కేవలం ప్రస్తుతమున్న వ్యవస్దలో
మార్పును మాత్రమే కోరుకున్నారు. అందుకే ప్రజల మనిషిగా ప్రజలే పరిపాలించుకొనే
విధంగా పరిపాలన చేస్తానని, మరియు వి.ఐ.పి.కల్చర్ ని రద్దు చేస్తానని చెప్పిన
అరవింద్ కేజ్రివాల్ ను నమ్మగలిగి అందలమెక్కించారు. అరవింద్ కేజ్రివాల్ విజయం
సాధించారంటే దానికి కారణం కేవలం ఢిల్లీల్లో జనాభాలో ఉన్న అత్యధిక యువత మాత్రమే...
వీరికి వ్యవస్దలో మార్పు రావాలంతే.. అదే వారు కోరుకున్నారు... అంతే కాని అమ్ అద్మీ
పార్టికి పాలనానుభవం ఉందా? వారు ప్రభుత్వంను నడపగలరా?లాంటి సాంకేతిక అంశాలను
ఆలోచించలేదు.
ఆయితే
ప్రభుత్వమును ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ అందుకోలేకపోవడంతో గవర్నర్
పాలన తప్పదేమో అనుకున్నారు అందరూ. కానీ ఏ పార్టికి వ్యతిరేకంగా ఆమ్ అద్మీ పార్టిని
స్దాపించారో అదే పార్టి ఆయిన కాంగ్రెసు మద్దతుతో ప్రభుత్వము ఏర్పాటు చేయడం చాలా
మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రజల నుండి
అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకి ముందుకు వచ్చామని తర్వాత
వివరణ యిచ్చుకున్నారు.
ఈ విధంగా అమ్
అద్మీ పార్టి ఢిల్లీ అసెంబ్లీలో అనూహ్య ఫలితాలు సాధించిన తరుణంలో ప్రస్తుత
పరిస్దితిని ఉపయెగించుకోవడం ద్వారా సాధారణ ఎన్నికల్లో కూడా అదృష్టాన్ని
పరిక్షించుకోవలని నిర్ణయించుకుంది. ఢిల్లీలో ఉన్న వాతావరణం మిగతా చోట్ల
ఉండకపోవచ్చునన్న వాస్తవం అరవింద్ కేజ్రివాల్ తెలుసుకోలేకపోతున్నారని
భావిస్తున్నాను.
ఇప్పటికే ఎటువంటి
పాలనానుభవము లేకుండా ఢిల్లీ గద్దెనెక్కిన ఆమ్ అద్మీ పార్టి రాబోయే రోజుల్లో
పనితీరు ఏ విధంగా ఉంటుందన్న విషయమై దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆయితే ఆమ్ అద్మీ
పార్టి తమకు పాలనానుభవము లేకపోయినప్పటికీ పరిపాలనను ఎటువంటి ఆటంకం లేకుండా
నిర్వహించగలమన్న ధీమాను ఢిల్లీలో తమ పనితీరు ద్వారా దేశ ప్రజలకు కల్పించవలసిన
అవసరం ఉంది. అది ఇవ్వకుండానే సాధారణ ఎన్నికలకు వెళ్ళడం మంచిది కాదు.
పైగా ఇప్పటి వరకు
ఆమ్ అద్మీ పార్టి చదువుకున్న యువతలోకి మరియు మెట్రో సిటిల్లోకి మాత్రమే
చొచ్చుకువెళ్ళగలిగింది. ఆ పార్టి ఇంకా మెట్రో సిటికి అవల ఉన్న ప్రజల్లోకి కూడా
వెళ్ళవలసిన అవసరం ఉంది. దానికి తమ ప్రభుత్వ పనితీరు ద్వారా కొన్ని విజయాలు
సాధించవలసియున్నది.. నరేంద్రమోడి చేసిందీ అదే... గుజరాత్ నుండి వరుసగా మూడు సార్లు
ఎన్నికవడం మరియు గుజరాత్ యొక్క అభివృద్ధిని నమూనాను ఉదాహరణగా చూపించి ప్రధాని అభ్యర్దిగా
పార్టిలోని యితర సీనియర్లను కాదని నిలబెడగలిగారు. దానికి ఏకైక కారణం అప్పటికే
గుజరాత్ లో నిరూపించుకున్న తన పనితీరే... మోడీ నేతృత్వంలో గుజరాత్ సాధించిన వృద్ధి
మీడియాలో రావడం ద్వారానే మోడి పేరు దేశవ్యాప్తంగా పెరగడం ప్రారంభించింది.
ప్రస్తుతం ఆమ్
అద్మీ పార్టి చేయవల్సినది కూడా ఇదే... ముందుగా తమ ప్రభుత్వ పనితీరునకు ఉదహారణగా
ఢిల్లీని తీర్చిదిద్దవలసిన అవసరమును ప్రధమ ప్రాధాన్యతగా తీసుకోవాలి.ఇకపోతే ఆమ్ అద్మీ
పార్టి ప్రభావం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే
ఫార్ములా దేశములో మిగతా ప్రాంతాల్లో సక్సెస్ కాకపోయి ఉండోచ్చని నా అభిప్రాయం.
ఉదహరణకి మన రాష్ట్రంనే తీసుకుంటే అమ్ అద్మీ పార్టి ప్రభావం చూపగలదని అనుకోగలమా?
అనుకోలేము.. ఎందుకంటే మన రాష్ట్రంలో రాజకీయం ఎక్కువగా కుల, మత వంటి అంశాలతో
మమైకమయియుంటాయి. ఇక్కడ పార్టిలతో సంబంధం లేకుండానే కులం, మతం ఆధారంగా ఓట్లు పడే
ప్రాంతాలు మన రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఆమ్ అద్మీ సూత్రం
పనిచేయకపోవచ్చు. దానికి ఉదహారణగా లోక్ సత్తా పార్టిని చెప్పుకోవచ్చు. ఐదేళ్ళ
క్రితమే నీతివంతమైన రాజకీయాలు అంటూ ఎన్నికలకు వెళ్ళిన లోక్ సత్తా పార్టి నుండి
జయప్రకాశ్ నారాయణ తప్ప వేరే ఎవరూ కూడా గెలవలేకపోయారు. ఇలాంటి పరిస్దితి మన
రాష్ట్రంతో పాటు చాలా రాష్ట్రాల్లో ఉంది. అందువలన సాధారణ ఎలక్షన్స్ లో కూడా మేజిక్
ఫిగర్ సాధించగలమని భావిస్తున్న ఆమ్ అద్మీ పార్టి అంచనాలు తలక్రిందులు కావచ్చు.
మరియు ఢిల్లీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి నేరచరిత లేని అభ్యర్దులను మాత్రమే పార్టి తరపున
నిలబెట్టడం ద్వారా ప్రజల మన్ననను పొందగలిగింది. అదే సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి
అటువంటి అభ్యర్దులు దొరుకుతారా అన్నది కూడా అనుమానమే... పోటి చేయడమే ప్రధమ ధ్యేయం
అనుకుంటే గనుక ఎక్కడో చోట తప్పులు దొర్లకుండా ఉండకపోవు. ఎందుకంటే అమ్ అద్మీ
పార్టికి మిగతా ప్రాంతాల్లో సరయిన నెట్
వర్క్ లేదు కాబట్టి.
tt
ReplyDeleteHi
ReplyDeletegood one
just a suggestion
the background of your blog makes it very difficult to read, would you mind changing it to light background? you write very interestingly, but its a bit difficult to read from dark background. and I dont want to miss reading your opinions :-)
thanks
Krishna
కృష్ణ గారు, చదవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి పాత బ్యాక్ గ్రౌండ్ మార్చమని మా ప్రెండ్స్ చాలా రోజుల నుండే అడుగుతున్నారు సార్... కాని నేనే బద్దకించేసాను.. ఇప్పటికే చాలా లేటు ఆయింది. మార్చేయాలి.. మార్చేయాలి అనుకుంటునే ఉన్నాను సార్... ఇదిగో ఇప్పటికి కుదిరింది సార్... స్పందించినందుకు ధన్యవాదములు
Deleteకాంగ్రెస్ తో చేతులు కలపకుందా, మళ్ళీ ఎన్నికలకే మొగ్గు చూపించి ఉంటె బాగుండేది. దేశం మొత్తం మీద కాంగ్రెస్ వ్యతిరేక వోటు బి జె పి, ఆప్ పంచుకునే అవకాశాలు ఇప్పుడు లేవు. ఢిల్లీ ఉదంతం చూసినాక, భారత ప్రజలు కేజ్రీ వాల్ ను ముఖ్యంగా అతని పక్కన చేరి "పిడివాదాలు" చేస్తున్న అతని అనుచరులను నమ్మే అవకాశం చాలా చాలా తక్కువ. Holier than thou attitude only dragged the Communists into obscurity and Aap is following that route with uncalled for enthusiasm.
ReplyDeleteYes, change the background and facilitate easy reading.
శివరామప్రసాద్ గారు,
Deleteనిజానికి అత్యధిక స్దానాలు గెలుచుకున్న బి.జె.పి.కూడా మళ్ళి ఎన్నికలకు వెళ్ళడానికే మొగ్గు చూపించింది. "అప్" కూడా ఎన్నికలకే మెగ్గు చూపినప్పటికీ చివరికి ప్రభుత్వంను ఏర్పాటుకే నిర్ణయం తీసుకుంది. నా ఉద్దేశం ప్రకారం తిరిగి ఎన్నికలు నిర్వహిస్తే బి.జె.పి.కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సీట్లు పొందగలుగుతుందిమో సార్.... అది ఊహించే కాంగ్రెసు బి.జె.పి. అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చేయడానికే ఆప్ కి మద్దతు ఇవ్వడానికి సిద్దపడి ఉండోచ్చు సార్...
బ్యాక్ గ్రౌండ్ ని మార్పునకు మీరు సూచించిన సూచనను పరిగణనలోకి తీసుకున్నాను సార్..
స్పందించినందుకు ధన్యవాదములతో...
"అప్" సామర్ద్యం ఎంత..
ReplyDeleteభా జా పా కి అధికారం దూరం చేసేంత, కాంగి కి సహాయం చేసేంత!
Narsimha K.
నర్సింహ గారు,
Deleteరెండే రెండు ముక్కల్లో తేల్చేసారు అప్ సామర్ద్యంని ... నిజమే దాని వలన చివరకి కాంగికే లాభం కల్గేలా ఉంది..
అలా జరిగితే కేజ్రివాల్ ని క్షమీంచలేని పరిస్దితి వస్తుంది..
స్పందనకు ధన్యవాదములతో...
IF HE CAN WTHTAND TILL MARCH OF 2015..then we think about aap..till then no comments on this party..
ReplyDeleteastrojoyd garu,
Deleteమీరన్నట్టుగా ఆప్ ముందుగా తన మనుగడ మరియు పనితీరు గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే దాని మీద ఏదైనా అభిప్రాయం ఏర్పరచుకోవచ్చును.
స్పందనకు ధన్యవాదములతో..
మొదటి ఎన్నికలలోనే అధికార పార్టి మరియు ప్రధాన విపక్ష పార్టిలను తలదన్నే విధంగా అత్యధిక స్దానాల్లో గెలుపొందడం
ReplyDeleteద్వారా .... its wrong BJP won more seats than Congi + AAP ...... but could not reach Magic figure...
Astrojoyd gaaru ...... I think you mean 2014 March......... as you said He could not stand for more days..... great estimation.
Narsimha K.