Tuesday, 21 January 2014

హయ్యర్ స్టడీస్ విద్యార్దులు చేసే పని సరైనదేనా?



రాక..రాక...క్రింది స్దాయి ప్రభుత్వ కొలువుల కోసం ప్రకటన వెలువడింది. వి.ఆర్.ఓ., వి.అర్.ఎ., పంచాయితీ సెక్రటరీ లాంటి పలు పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నద్దమయింది. ఇంటర్, డిగ్రి వరకు చదువుకున్న వారు, ఈనాటి పోటీ ప్రపంచంను తట్టుకోలేక వెనుకబడిన పలువురు నిరుద్యోగులు పై కొలువులుపై కోటి ఆశలు పెట్టుకొని సన్నద్దమవుతున్నారు. 

వాస్తవానికి ఈ కొలువులు క్రింది స్దాయి వరకు చదువుకున్న వారికి ఉద్దేశించినవి. వీరికి ఈ కొలువులు కొట్టడమే పరమావధి... డిగ్రి చదివిన వారందరూ గ్రూప్స్, సివిల్స్ లాంటి కాంపిటీషన్స్ లో పోటీ పడలేరు. ఐ.క్యూ ఎక్కువగా ఉన్నవారే గ్రూప్స్, సివిల్ వైపు అడుగులు వేస్తారు. 

కానీ గ్రూప్స్, సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నవారు మరియు సాంకేతిక కోర్సులు చేసిన పలువురు విద్యార్దులు చాలా మంది సరదా కోసమో లేక అనుభవం కోసమో తెలియదు కానీ తెలివైన హయ్యర్ స్టడీస్ విద్యార్దులు కూడా వి.ఆర్.ఓ., వి.అర్.ఎ., పంచాయితీ కార్యదర్శి లాంటి పోటీలకు అటెండ్ అవుతుండడంతో క్రింది స్దాయి విద్యార్దుల అవకాశములకు గండి కొడుతున్నారు.

సహజంగానే పోటీ పరీక్షలో ఈ కేటగిరి విద్యార్దులే అత్యధిక మార్కులతో ముందు వరుసలో ఉంటున్నారు. తద్వారా ఉద్యోగాలు వారి సొంతం చేసుకుంటున్నారు. కానీ సదరు కొలువుల్లో జాయినయ్యే వారు చాలా తక్కువగా ఉంటున్నారు. జాయిన్ కాకుండా ఖాళీగా ఉన్న పోస్టుని తర్వాత క్రమంలో ఉన్న అభ్యర్దికి కేటాయించకుండా ప్రభుత్వం అలానే ఉంచుతుంది. దాని వలన తర్వాత స్దానంలో ఉన్న అభ్యర్దులు అర్హత పొందలేకున్నారు.. తెలివైన విద్యార్దులు సరాదకి రాసే పరీక్ష ఇంకొకరి లైఫ్ ని పాడుచేస్తుందని ఆలోచించడం లేదు.  

ఈ విషయంను హయ్యర్ స్టడీస్ విద్యార్దులు సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది...

మీరు సరదా కోసమో లేక అనుభవం కోసమో పోటీ పరీక్ష రాసి వేరొకరి అవకాశంను పొగొట్టకండి...
ఖచ్చితంగా జాయినయ్యే ఉద్దేశం ఉంటేనే పోటీ పరీక్షనకు అప్లయి చేయండి...

No comments:

Post a Comment