Thursday 31 January 2013

అంబేద్కర్ ని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి?


ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యపరంగా ఎంతో ఉన్నతంగా విరజిల్లితున్న మన దేశానికి రాజ్యంగాన్ని రచించిన అపర మేధావి గానా? లేక భారత దేశ నాయకుడి గానా? లేక ఒక వర్గానికి చెందిన ప్రతినిధి గానా?

దురుదృష్టశావత్తూ చాలా మంది దృష్టిలో అంబేద్కర్ దేశంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగానే వార్తల్లో నిలవడం చాలా బాధకారం. మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందుటకు ఎంతో శ్రమకొర్చిన నాయకులను, తదనంతర భారత దేశ అభివృద్ధికి దోహదం చేసిన నిర్మాణకర్తలను మన దేశ ప్రజలు దేవుళ్ళుగా భావిస్తున్నారు. మహత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అజాద్, అంబేద్కర్, లాల్ బహుదుర్ శాస్త్రి వంటి నిస్వార్ద నాయకులను దేశ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. వీరికి కుల, మత, ప్రాంతంలతో సంబందం లేదు. అన్ని రకాల మతాలు, కులాలు, ప్రాంతాలు వీరిని తమ వారిగానే భావిస్తాయి.  వీరందరినీ భారతదేశానికి ప్రతినిధులగానే భావిస్తారు. భావించాలి. కానీ ఏ నాయకుడికి లేని విధంగా అంబేద్కర్ ని ఒక వర్గంనకు చెందిన వ్యక్తిగా హైలెట్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే దేశానికి సేవ చేయడానికి మతాలు, కులాలు అక్కర్లేదు. కేవలం సంకల్పం ఉంటే చాలు. అలాంటి సంకల్పం ఉంది కాబట్టే వారందరూ పూజనీయులయ్యారు. అంతే కాని ఫలానా వర్గానికి చెందినందుకు కాదు. మనిషనేవాడు ఏదొక వర్గానికి చెందడం సహజం. అదీ మన దేశంలో మరీనూ. దానినే పట్టుకొని వేలాడడం తగదు.

ఆ మధ్య అంబేద్కర్ విగ్రహలపై దాడులు చేయడం వంటి హీనమయిన చర్యలు జరిగాయి. దానికి ఆయన వర్గానికి చెందిన వారు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. వారు తమ వర్గానికి చెందిన అంబేద్కర్ కి అవమానం జరిగిందని రాద్దాంతం చేసారా లేక దేశ నాయకుడికి అవమానం జరిగిందని చేసారా? సమాధానం చాలా ఈజీగా చెప్పోచ్చు.  మరి అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగినపుడు మిగతా వారు ఎందుకు స్పందించలేదు అని అడగవచ్చు. నిజమే.. మనలో చాలా మంది అలాంటి విషయాల్లో ఉదాసీనంగా ఉంటారు. ఒక అంబేద్కర్ అనే కాదు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉన్న గాంధీ, అల్లూరి సీతరామరాజు విగ్రహాలకు మరియు  యితర దేశ నాయకుల విగ్రహానికి చెదలు, ధూళి పట్టినా మనం పట్టించుకోం. అది మనలో ఉన్న లోపం. ఆ లోపం ఆ వర్గాల్లో లేదని మనం సంతోషించాలా లేక కేవలం అంబేద్కర్ కి మాత్రమే పరిమితం చేసారని బాధపడాలా?  ఈ రోజు చాలా మంది దేశ నాయకుల వర్గం ఏమిటనేది నాకు తెలియదు. నాలాగే చాలా మంది తెలియదనుకుంటున్నాను. కాని అంబేద్కర్ వర్గమేమిటనేది చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు. ఎందుకు? ఆయన దేశ నాయకుడిగా కన్నా వర్గనాయకుడిగానే ఎందుకు చెలామణిలోకి వచ్చారు? ఆయన రచించిన రాజ్యాంగం వలనే తమ బ్రతుకులు మారాయని నమ్మి, ఆయనను ఆరాధిస్తున్నారా? ఒక వేళ రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు అనుకూలమైనవి పెట్టియుండకపోతే దేవుడు కాక పోయిండేవారా?

ఆయన రాజ్యాంగం రచించేటప్పుడు, తన వర్గానికి ప్రాధ్యానత్య కల్పించాలని తలంచలేదు. ఆనాటి పరిస్దితుల ఆధారంగా ఏదయితే మంచి అనుకున్నాడో అదే రాజ్యాంగంలో పొందుపరిచారు తప్ప, తన వర్గానికి అనాచిత ప్రయెజనాలు పొందడానికి కాదని మిగతా వర్గాలు తెలుసుకోవాలి. ఈనాడు చాలా మంది అంబేద్కర్ ని ఒక వర్గానికే మేలు చేసిన నాయకుడిగా పరిగణిస్తున్నారు. కానీ ఆనాటి పరిస్దితుల ఆధారంగానే రాజ్యాంగం తయారుచేసారన్న వాస్తవం గమనించాలి. ముఖ్యంగా ఆయనను విమర్శించే యితర వర్గాల వారికి. ఇకపోతే తమకు మేలు చేసినందుకు మరియు తమ వర్గానికి చెందినవాడవడం వలన అంబేద్కర్ మీద పేటేంట్స్ అన్నీ మావే అన్న అలోచనను ఆ వర్గం వారు ప్రక్కన పెడితే చాలా బాగుంటుంది. మనం భావితరాలకి అంబేద్కర్ ని పరిచయం చేయవలసినది దేశ నాయకుడి గానే తప్ప ఫలానా వర్గానికి చెందినవాడని కాదు.

ఇకపోతే ఆయన లేకపోతే మా బ్రతుకులు ఇంకా అలానే ఉండిపోదును. ఆయన రావడం వలనే మా బ్రతుకులు బాగుపడ్డాయి అనుకొనేంతవరకు పర్లేదు.  దురభిమానం పెచ్చరిల్లకూడదు. ఒకప్పుడు ఆయితే వర్గ పట్టింపులు ఎక్కువగా ఉండేవేమో కానీ.. ఇప్పుడు చాలా చోట్ల అలాంటి పట్టింపులు లేనే లేవని చెప్పగలను.  కానీ ఆ వర్గం వారు తమ ఉనికిని తామే బయటకు తెలిసేలా వ్యవహరశైలి ఉంటుంది. నేను ప్రభుత్వ సర్వీసులో ఇప్పటి వరకు నాతో పని చేసిన వారిలో కాని, పై అధికారుల్లో కాని ఒక్కరిది కూడా ఏ వర్గమో తెలుసుకోలేదు. నాకు అంత ఇంట్రెస్టు లేదు కూడా. దానికి తగ్గట్టుగానే వారి వర్గం గురించి కూడా నాకు తెలిసేది కాదు. కానీ ఈ వర్గం వారు మాత్రం హైలెట్ అయ్యేవారు. అది ప్రక్క వాడికి తెలిసేలా వారి వ్యవహరశైలి ఉండడమే ప్రధాన కారణమనుకుంటా.... పైగా మిగతా అధికారులతో పనిచేసేటపుడు కన్నా వీరితో పనిచేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడవలసివచ్చేది. ఎందుకంటే వారు అక్కడ అధికారులమనే భావం కన్నా తాము ఫలానా వర్గానికి చెందినవారిమి అన్న భావన వారిలో ఎక్కువగా ఉండడమే అనుకుంటా..

నాకు తెలుసు, నా ఈ వ్యాఖ్యల మీద వారికి కోపమెచ్చుందని.. కానీ నేను చూసింది చెపుతున్నాను. ఈ రోజు నిర్లక్ష్య పూరిత ప్రవర్తనను, తాము ప్రత్యేకము అనే భావనను కేవలం వారి వద్దనే చూసాను. ఏ వర్గం వారి వద్ద ఆ స్దాయి ధోరణిని నేను ఫేస్ చేయలేదు. ప్రపంచంలో మారుతున్న పరిస్దితులకు అనుగుణంగా ఆయా వర్గాలకు ప్రాధాన్యత లభిస్తుంది. అది సహజం. బ్రాహ్మణులు, రాజులు, జమీందారులు ఇలాంటి వారు ఒకప్పుడు వెలుగు వెలిగారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో పాటుగా ఒక్కొక్క వర్గం వారు వెలుగు వెలిగారు. తర్వాత క్రిందకి దిగజారారు.  కొన్ని వర్గాలు తొక్కివేయబడ్డాయి. అది ఇక్కడే ప్రపంచం మంతటా ఉంది. కానీ స్వాతంత్రానికి పూర్వం తమకు అన్యాయం జరిగిందని ఇప్పుడికి రాద్దాంతం చేయడం మంచిది కాదు. ఈనాడు తమకు తాము క్రింది వర్గానికి చెందినవారిమని భావిస్తున్న సదరు వర్గం వారు ఈ నాడు చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్నారు. సమాజంలో వారు చాలా గౌరవప్రదమైన వృత్తిలోనే కొనసాగుతున్నారు. అలాంటప్పుడు ఇంకా గోల ఎందుకు? మమ్మల్లి తొక్కొస్తున్నారంటు వీధికెక్కడం ఎంత వరకు సబబు. ఎక్కడో ఒకటీ ఆరా సంఘటనకు జరిగియుండొచ్చు. వాటినే పట్టుకొని మొత్తానికి అన్వయించడం సరయిన విధానం కాదు. దాడులు అన్ని వర్గాల మీద జరుగుతున్నాయి. అలాగే చితికిపోయిన వారిలో అన్ని వర్గాల వారున్నారు. అలాగే బలిసిన వారిలో అన్ని వర్గాలున్నాయి. ఈ రోజులో ఫలానా వర్గం వారే అణగారి పోయి ఉన్నారని భావించక్కర్లేదు. ముందుగా వీరంతా మనం కామన్ మ్యాన్స్ అన్నట్టుగా ఫీలయితే ఏ గొడవ ఉండదు.

మొన్న ఆఫీసుకి వెళుతుంటే కొంత మంది రోడ్డుకు అడ్డంగా వెహికల్స్ పెట్టి ధర్నా చేస్తున్నారు. ఇంత పోద్దున్నే ధర్నా ఏమిటా అని అక్కడ ఉన్న ఒకతన్ని అడిగా. ఆయన ఎవరో నాకు తెలియదు కాబట్టి గౌరవంగానే అడిగాను. అటు నుండి చాలా రెక్లస్ గా వచ్చింది సమాధానం. ఏమనంటే, అటు చూడు అక్కడ అంబేద్కర్ బొమ్మ మీద ఎవరో స్టడీ స్కరిల్ వాడు పోస్టర్ అంటించాడు. అందుకే చేస్తున్నాము అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. నిజానికి అతనికి నేను ఎవరో తెలియదు. కానీ అతను మాట్లాడిన విధానం, అక్కడ జరుగుతున్న సంఘటన చూసి వాళ్ళ వర్గం ఏమిటో తెలిసిపోయింది.  అ ప్రక్కన ఇంకొక పెద్దాయన ఖరీదైన ఖద్దరు బట్టలతో, ఒంటి నిండా బంగారంతో ఉన్నాడు. ఆయన స్లోగన్ ఏమిటంటే, అగ్రకుల దురంహకారం నశించాలి అని. అసలు అక్కడ జరిగిన సంఘటనకి, దానికి ఏమన్న సంబంధం ఉందా? ఆగ్ర కులాలు కుట్ర పన్ని ఆ పోస్టర్ అంబేద్కర్ బొమ్మ మీద అంటించాయని భావించాలా? పైగా అంటించిన పోస్టర్ మీద స్టడీ సర్కిల్ వివరములన్నీ ఉన్నాయి. నిజంగా అంబేద్కర్ మీద్ గౌరవముంటే ఆ పోస్టర్ చింపివేసి, ఆ స్టడీ స్కరిల్ యజమాన్యంను నిలదీయాలి. అలా చేయడం మానేసి రోడ్డమ్మట పోయే ప్రతివాడు చూడాలన్నట్టు, మీడియాలోకి తమ ధర్నా ఎక్కాలన్నట్టు ఉన్న వారి ప్రవర్తన చూసి నాకు ఎలాఉందో కాదు కాని మీకు ఎలా ఉందో చెప్పండి? అగ్రకులం వాడు పొగరుగా చెబితే అది దౌర్జన్యం అవుతుంది. అదే వారు పొగరుగా చెబితే దాన్ని అత్మగౌరవం అనుకోవాలా? ముందుగా మనం గౌరవించుకోవడం మొదలెట్టాలి. వారు అలా మాట్లాడుతుంటే మిగతా వారికి ఎలా ఉంటుంది. ఒక వేళ అగ్రకులం వాడు వారితో అలా మాట్లాడితే లాగిపెట్టి కొట్టామనండి. వారు ఒకప్పుడు అలాచేసారు కాబట్టి, ఇప్పుడు మేము అలా చేస్తున్నాము అనుకుంటే అది మన.....??

వారికి ఎంత అత్మాభిమానం ఉంటుందో, మిగతా వారికి అంతే అత్మాభిమానం ఉంటుందని అన్ని వర్గాలు తెలుసుకుంటే చాలా ఉత్తమం. అలాగే అంబేద్కర్ ని కేవలం తమకి మాత్రమే చెందినవాడు గానే భావితరాలకు పరిచయం చేసేకన్నా, గాంధీజీ, నేతాజీ, సర్దార్ లతో పాటుగా దేశనాయకుడిగా పరిచయం చేస్తే అంబేద్కర్ కి చిరస్దాయి గౌరవం యిచ్చిన వారిమి ఆవుతాము....

క్రిస్టియన్ మిషనరీస్... నాడు-నేడు


కొత్త సంవత్సరంలో ఇదే నా తొలి పోస్ట్. కాబట్టి మొదటగా బ్లాగర్లందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మధ్య బ్లాగింగ్ చేయడానికి బొత్తిగా సమయం కుదరడం లేదు. సమయం కుదిరితే ఆలోచనలు నిల్. బొత్తిగా నాలో క్రియేటివిటి తగ్గిపోయిందనిపిస్తుంది. అందుకే ఏమీ రాయలేకపోతున్నాను ఈ మధ్య...  దేని మీద రాయాలన్నా వేళ్ళు కదలడం లేదు(కీ బోర్డు మీద). ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది రాసి. ఇంకా ఎంత కాలం పడుతుందో తెలియడం లేదు, మరల ఇది వరకులా రాయడానికి.  అందుకే ఎలాగయినా ఏదో ఒక పోస్ట్ రాసేయాలన్న ఊపుతో ఇదిగో ఇలా రాసిపడేస్తున్నాను.....

టి.వి.లో చానల్స్ మార్చుకుంటూ కూర్చున్నా...  ఏ చానెల్ నిలకడగా ఓ ఐదు నిమిషాలు పాటు చూద్దామనుకొనే ప్రొగ్రాం రావడం లేదు. ఏ మాటకా మాట. ఎప్పుడూ అంతే కదా....

అలాగని టి.వి. కట్టేద్దామంటే టైమ్ పాస్ కాదు. రూమ్ లో నేను ఒక్కడినే ఉన్నా మరి....

ఈ లోపులో నాయుడు వచ్చాడు. ఏ చూస్తున్నావని అడిగాడు. నాకే తెలియడం లేదు, ఇక నీకేమి చెప్పను అన్నాను...
సరే ఆయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెబుతాను వింటావా? అని అడిగాడు. అంత కంటే భాగ్యమా అన్నట్టుగా ఫేస్ పెట్టి వినడానికి ఉద్రుక్తుడనయ్యా.....

మనోడు ఆ రోజు చదువుకొచ్చిన భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీస్ రాక మరియు వాటి తీరుతెన్నులు గురించి టాపిక్ మొదలెట్టాడు. (నాకు తెలిసినంత వరకు మరియు మనోడు చెప్పినంతవరకు రాస్తున్నాను. ఇందులో నిజనిజాలకు గ్యారంటీ లేదు).

బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని వీర లెవెల్లో ఏలుతున్న రోజులవి. ఆ రోజుల్లో బ్రిటన్ ప్రపంచ దేశాల్లో సౌభాగ్య దేశం. తిండికి, బట్టకు కొదవ లేదు. అలాగే బ్రతుకు పోరాటాలు లాంటివేవి వాళ్ళకు తెలియవు. ఎందుకంటే అప్పటికే మన లాంటి కొన్ని దేశాల్లో దోచుకున్న సంపద బ్రిటన్ కి నిర్విరామంగా సరాఫరా ఆవుతుండేది కాబట్టి. అలాంటి దేశంలో కొన్ని క్రైసవ మిషనరీ సంఘాలు ప్రజల సేవలో తరించేవి. వారు సేవా దృక్పదం మచ్చలేనిది. ప్రపంచంలో అస్దిరత మరియు ఆశాంతి, దౌర్బలంతో ఏలుతున్న ప్రాంతాల్లో వీరు తమ అమూల్యమైన సేవలు అందించేవారు. ఉచిత చదువు ద్వారా చైతన్యంను, వైద్యం ద్వారా రోగాల నుండి ప్రజలను విముక్తి  చేయడం మొ.గు సేవలందించేవారు. వీరు తమ సేవలను భారతదేశానికి అందించలన్న ఉద్దేశంతో బ్రిటిష్ రాణి గారి అనుమతిని పొంది భారత్ లోకి ప్రవేశించాయి.  అప్పటికి భారతదేశంలో విద్య  కొంత మంది వద్ద మాత్రమే పోగిపడియుండేది. వారు తమకు వచ్చిన విద్యను, వాళ్ళ వద్దనే ఉంచుకొని, తమ కులస్దులైన వారికే భోదించేవారు. అందువలన మిగతా వర్గాలకు విద్య అందుబాటులో ఉండేది కాదు. తద్వారా సంఘంలో తమ అధిపత్యంనకు గండి పడకుండా చూసుకోనేవారు. అలాంటి సమయంలో భారత దేశంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో మొదటగా ప్రవేశం చేసాయి క్రైస్తవ మిషనరీలు. వచ్చిన తర్వాత తమ సేవలను అక్కడ ప్రజలకు అందించారు. అందులో భాగంగా చదువును, నాణ్యమైన వైద్యంను అందించారు.  అప్పటికి కొంత మంది వద్ద మాత్రమే పోగుపడియున్న విద్య, క్రైస్తవ మిషనరీల రాకతో అన్ని వర్గాల వారికి అందుబాటులోకి వచ్చింది.  తద్వారా ఆ ప్రాంతంలో విద్య చైతన్యం వెల్లువెత్తింది. అందులో భాగంగానే రవీంద్రనాధ్ టాగుర్ లాంటి ప్రముఖ కవులు అక్కడ నుండే ఉద్బవించారు. మరియు విద్య ద్వారా ప్రపంచ విషయాలు మీద అవగహన పెంచుకొన్నారు. కొంత మంది విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్ళగలిగారు. అక్కడ వారు ప్రపంచ వాస్తవ స్దితిగతులు తెలుసుకోగలిగారు. తదనంతర కాలములో అది దేశ స్వాతంత్ర సముపార్జనకు దోహదం చేసింది. విద్య సముపార్జన ద్వారా అప్పటికి అమలులో ఉన్న అనేక మూడ నమ్మకాల నిర్మూలనకు కంకణం కట్టుకున్నారు.    సతీ సహగమనం మీద పోరాటం ఈ ప్రాంతం నుండే మెదలయింది. మదర్ ధెరిస్సా కలకత్తా కేంద్రంగా ఉన్న మిషనరీస్ నుండే తన సేవాజీవితంను ప్రారంభించింది. మదర్ ధెరిస్సా లాంటి దేవత మన భారతదేశానికి లభించడానికి కారణం క్రైస్తవ మిషనరీసే అనడంలో సందేహం లేదు. క్రైస్తవ మిషనరీస్ యొక్క సాయంతోనే మదర్ ధెరిస్సా అనేక మంది ఆభాగ్యులను అక్కున చేర్చుకోగలిగింది. మదర్ సేవ క్రైస్తవ మిషనరీస్ కు ఇంకా వన్నె తెచ్చింది. ముఖ్యంగా అనాడు దేశములో  వేళ్ళునుకుపోయిన అసమానత్వంను లెక్కచేయకుండా అందరికి ప్రేమగా సేవ చేసాయి. అందుకే చాలా మంది క్రైస్తవానికి దగ్గరయి, సేవారంగంలో పాలుపంచుకున్నారు.  . నిస్వార్ద సేవ సేయడం, అభాగ్యులను అరాధనతో అదరించడం అన్నది మిషనరీస్ లో నన్స్ చేసినంత ప్రేమగా మరెవరూ చేయలేరు. ఉదహరణకి ఏదైనా హస్పటల్ లో పనిచేస్తున్న నర్స్ లను గమనించండి. క్రైస్తవ మిషనరీ నర్స్ లు ఏ మాత్రం విసుగు కనబడకుండా సహనంతో రోగులకి సేవ చేస్తారు. మిగతా వారికి అంత సహనం ఉండదు. ఈ తేడాని నేను చాలా సార్లు గమనించాను.

ఆ తర్వాత దక్షిణ భారతంలోని కేరళ రాష్ట్రంలో తమ సేవలు విస్తరించారు. నేడు కేరళ 100 శాతం అక్షరాక్షత సాదించడానికి కారణం ఇదేనని చెప్పోచ్చు. ఇంకా చాలా కారాణాలుండోచ్చు. కాని మెజారిటి వాటా మిషనరిస్ కే ఇవ్వాలి.  మన రాష్ట్రంలో ఆయితే మొదటిగా కృష్ణా, గుంటురు జిల్లాలో సేవలు ప్రారంభించారు. అందుకే తొలితరం కవులందరూ ఆ ప్రాంతానికే చెందినవారే ఉంటారు. మరియు విద్య పరంగా అ రెండు జిల్లాలు ముందంజలో ఉంటాయి. ఈ విధంగా భారతదేశంలో క్రైస్తవ మిషనరీస్ ల రాక ఎంతో ప్రభావం చూపించింది.

స్వాతంత్రం తర్వాత భారతదేశం అభివృధి చెందడం మరియు ప్రజల్లో విద్య మరియు వైద్యం పట్ల చైతన్యం పెరగడంతో క్రైస్తవ మిషనరీల రాక మరియు పరిధి చాలా వరకు తగ్గిపోయాయని చెప్పోచ్చు. దాని స్దానంలో స్వచ్చంధ సేవా సంస్దలు పుట్టుకొచ్చాయి.  క్రైస్తవ మిషనరీల ప్రభావంతో భారత్ లో వ్యాప్తి చెందిన ఈనాటి క్రిస్టియానిటికి, అనాటి క్రిస్టియానిటి ఏ మాత్రం పొంతన ఉండదు. ఇక్కడ క్రిస్టియానిటికి మూలకారణమయిన క్రైస్తవ మిషనరీల అసలు లక్ష్యంను వీరు ఏ మాత్రం ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. (కొంత మందిని మినహయించవచ్చు ఈ విషయంలో). సేవే ప్రధాన అంశంగా పనిచేసిన అనాటి క్రైస్తవ మిషనరీస్ కి, ఈ నాటి క్రిస్టియానిటికి ఎక్కడా పోలికే లేదు. విదేశాల నుండి విరాళాల కోసం మత గురువుల అవతరం ఎత్తడం, స్వచ్చంద సేవా సంస్దల ముసుగులో నిధులు పోగేసుకోవడం తప్పితే, క్రైస్తవ మిషనరీస్ యొక్క అసలైన లక్ష్యం మాత్రం ఎక్కడా కనబడడం లేదు. మతవ్యాప్తికి విపరీత ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ క్రిస్టియానిటి అభివృద్ధి చెందడానికి మూలకారణమైన క్రైస్తవ మిషనరీల అత్మ పిసరంతయినా కనిపించడం లేదు.  బ్రిటన్ నుండి ఇక్కడికి దిగుమతి ఆయిన నేటి క్రిస్టియానిటికి, ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న క్రిస్టియానిటికి సంబంధమే ఉండదని అక్కడ ఉన్న కొంత మంది మిత్రులు చెప్పారు. ఇక్కడ క్రిస్టియానిటికి కొత్త అంశాలు జోడించారు తప్పితే, క్రిస్టియానిటి యొక్క ఒరిజినల్ అత్మను పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం సగం మంది మాత్రమే క్రిస్టియానిటిని అర్ద్రం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. మిగతా వారందరూ కమర్షియల్ అంశాలకు లోనై వెళ్తున్నారు. అనాడు క్రైస్తవ మిషనరీస్ చేసిన సేవని, ఈ రోజు ఏ స్వచ్చంధ సంస్ద కాని, క్రైస్తవ సంఘాలు గాని చేయడం లేదు.  వీరు స్వంతంగా కొన్ని అంశాలు జోడించి క్రిస్టియానిటిని మెయిన్ టెయిన్ చేస్తునట్టుగా భావిస్తున్నారు. ఆ రోజు వారు అందరిలోను సమానత్వంను చూసారు. కాని నేడు వీరు తమకంటూ ఒక  చట్రం తయారుచేసుకొని అందులోనే ఉండిపోతున్నారు. యితర మతాలను నమ్మకపోవడం, యితర దేవుళ్ళ ప్రసాదాలు ముట్టకపోవడం మొదలగు పనులు చేయడం ద్వారా క్రైస్తవ మిషనరీస్ భోధించిన సమానత్వంకు దూరంగా జరుగుతున్నారు.

అని చెప్పి ముగించాడు నాయుడు......

చాలా బాగుందయ్యా, నువ్వు చెప్పింది అన్నాను నేను.  టి.వి. చూసి బోర్ కొడుతున్న సమయంలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పావు. ఇక భోజనానికి టైమ్ ఆయిందని లేచా.....