Wednesday 21 March 2012

నరేంద్ర మోడి- మతతత్వం- న్యాయ, న్యాయాలు

నిన్న రాత్రి భోజనం చేసి రూమ్ కి వచ్చిన తర్వాత చానల్స్ అన్ని తిప్పుకుంటే వెళుతుంటే ఎన్.డి.టి.వి.లో ఒక ఇంట్రెస్టిగ్ డిబేట్ ప్రొగాం వస్తుంటే చూడడం మొదలెట్టాను..ఆ డిబేట్ ఏమిటంటే ప్రముఖ పత్రిక టైమ్స్ ముఖచిత్రంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బొమ్మని ప్రచురించడం...దానిపై నరేంద్ర మోడి పాలనపై విశ్లేషణత్మక వ్యాసం ప్రచురిస్తూ, దానికి మోడి means బిజినెస్ అని క్యాప్షన్ ఇచ్చింది... ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు గాంచిన టైమ్స్ ముఖచిత్రంపై ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసిన ఆయా రంగాలకు చెందిన ప్రముఖ్యులు యొక్క కధనంతో ముఖచిత్రంగా ప్రచురిస్తే, దానిని చాలా గొప్పగా భావిస్తుంటారు(అనుకుంటా).

ఆ విధంగా టైమ్స్ ముఖచిత్రంపై నరేంద్రమోడి బొమ్మ రావడంతో,ఆ అంశం మీద డిబేట్ పెట్టారు ఎన్.డి.టివి.వారు.. అందులో దాని గురించి విశ్లేషించేవారెవరో నాకు అంతగా తెలియదు. కాని వారు మాట్లాడిన మాటల ద్వారా నరేంద్ర మోడి పై విమర్శలు ఎక్కుపెట్టడానికే ఎక్కువ ప్రయారిటి ఇచ్చారు. మోడి గురించి చెప్తూ అతనొక మత ఉగ్రవాదని, అతని యొక్క మతోన్మోదం కారణంగా జరిగిన గోద్రా అల్లర్లలో అనేక మంది అమాయక ముస్లింలు ప్రాణాలు కోల్పోయరని, అలాంటి వాడిని ఏ విధంగా మొచ్చుకొనగలమని వాదించారు. ఒకప్పుడు సద్దాం హూస్సేన్, బిన్ లాడెన్ ల ముఖచిత్రాలు కూడా టైమ్స్ ముఖచిత్రంగా వచ్చాయని, అంత మాత్రాన నరేంద్ర మోడిని గొప్పవాడిని భావించలేమని చెప్పుకొచ్చారు.


నిజమే, ఈ విషయమై నేను గోద్రా అల్లర్ల విషయములో నరేంద్ర మోడి పాత్రను అనుమానిస్తాను. నేను కాదు... మొత్తం ప్రజలందరూ అనుమానిస్తున్నారు. వీరందరి కన్నా కాంగ్రెసు పార్టి ఇంకా ఘోరంగా దీనిపై నరేంద్ర మోడి పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే నరేంద్ర మోడి పై నానా గగ్గోలు పెడుతూ జాతీయ కాంగ్రెసు జాతీయంగా రచ్చ రచ్చ చేసేసింది. (వీళ్ళకు భారత్ లో ముస్లిములు తప్ప వేరే వారు ఎవరూ కనబడరు అనుకుంటా). నాకు తెలిసి ఆ డిబేట్ లో కాంగ్రెస్ పార్టికి చెందిన ఒకాయన ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ, గుజరాత్ లో నరేంద్ర మోడి పాలనలో ముస్లింలు స్వేచ్చయుతమైన జీవితంను కోల్పోయారని, చాలా మంది ముస్లింలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారని ఆరోపించారు.


నరేంద్ర మోడి పై ఈ విధమైన వ్యాఖ్య చేసినటు కాంగ్రెసు వాది ఒక విషయమును మాత్రం మర్చిపోయినట్టున్నారు. ఒకప్పుడు కాశ్మీర్ లో మోజారిటి సంఖ్యలో పండిట్లు ఉండేవారు. ఈ రోజు చూస్తే మచ్చుకు ఒక్కడు కనబడడు. ఎందుకని?? వారందరూ ఏమి ఆయిపోయారు? కాశ్మీర్ లో మోజారిటిగా ఉన్న పండిట్లులను మూకుమ్మడి ఊచకోతలు కోసినప్పుడు గాని, వారి కుటుంబాలను విచక్షణారహితంగా చంపినపుడు కాని ఈ జాతీయ కాంగ్రెసు వాదులు ఎక్కుడున్నారు? ఆ రోజు కాశ్మీర్ లో జరిగిన ఊచకోతల కారణంగా పండిట్లు అనే వారు ఎవరూ లేకుండా యితర ప్రాంతాలకు వలస పోయినపుడు, అక్కడ జరిగిన ఆరాచకం వీరి కంటికి కనబడలేదా? దానిపై రచ్చ రచ్చ చేయాలనిపించలేదా?


కాని ఇప్పుడు గుజరాత్ లో జరిగిన సంఘటనలతో ముస్లింలు అందరికీ అన్యాయం జరుగుపోతున్నట్టు తెగ ఫీలయిపోతున్నారు కాంగ్రెసువాదులు. ఆనాడు కాశ్మీర్ లో జరిగిన పండిట్లు ఊచకోతలు తప్పులేదు కాని, ఈ రోజు గుజరాత్ లో జరిగిన ఊచకోతలు తప్పు వచ్చాయా?


క్షమించండి.. నా ఉద్దేశం ఇక్కడ ఎవరినీ సమర్దించడం లేదు. నేరం ఎవరూ చేసిన అది సమర్దనీయం కాదు. జాతీయ పార్టి ఆయిన కాంగ్రెసు ఓట్ల లబ్ది కోసము ఇలాంటి మతతత్వ ట్రిక్కులు ఉపయెగించడం పైనే నా అవేదన అంతా... ఊచకోతలనేవి ఎక్కడ జరిగిన అందులో సమిధిలవ్వేవి సామాన్య జనం మాత్రమే... ఒక కాశ్మీర్ లో జరిగిన ఊచకోతలైన, గుజరాత్ లో జరిగిన ఊచకోతలైన, లేదా వేరే ఎక్కడ జరిగిన ఊచకోతలైన బలయ్యేది సామాన్య జనమే. ఆ నష్టానికి మతంను ఆపాదించలేము... ఆ సమయములో వారు పడే వేదన, భయము పగవాడికి కూడా రాకూడదని ఏ మతం వాడైనా కోరుకుంటాడు.


కాని నీచులైన పాలకులకు, రాజకీయ నాయకులకు ఇటువంటివేవి కనబడదు. వాళ్ళకు కనబడేది కేవలం ఓట్లు మాత్రమే. నిజానికి కాశ్మీరి పండిట్లు, గుజరాత్ ముస్లింల పై ఊచకోతల గురించి వింటే ఎలాంటి వాడికైనా గుండె ద్రవించుకుపోతుంది. మతాల వారీగా ప్రజలను విడగొట్టి ఎంతకాలం విషం చిమ్ముతారో తెలియడం లేదు మన దేశంలో కుహనా రాజకీయవాదులు....


నా మాటకు చెప్పాలంటే, ఇలాంటి విషయాల్లో కాంగ్రెసు వాదులు ఎక్కువగా పండిపోయారు. ఏ దురదృష్ట సంఘటననైనా వీరు తమ రాజకీయాలకు అనుగుణంగా మార్చుకుంటారు. కాని నరేంద్రమోడి అలా కాదు. గోద్రా అల్లర్లలో తన హస్తంను క్షమించలేకపోయిన, తదనంతర కాలములో అతను గుజరాత్ ని అభివృద్ది పధంలోకి తీసుకొళ్ళిన విధమును పరిశీలిస్తే అతనిని మెచ్చుకొనకుండా ఉండలేము. దేశ జి.డి.పి.రేటు కన్న, గుజరాత్ రాష్ట్ర జి.డి.పి. రేటు ఎక్కువగా ఉందంటే అర్ద్రం చేసుకోవచ్చు అతని పనితీరును. రాష్ట్రంలో సరయిన సహజ వనరులు లేకపోయినప్పటికి, వ్యాపారపరంగా గుజరాత్ ని ఎక్కడికో తీసుకెళ్ళగలిగిన మోడి యొక్క దూరదృష్టిని గమనించే టైమ్స్ పత్రిక తన ముఖచిత్రంపై మోడి బొమ్మను ప్రచురించగలిగింది.


ఒకప్పుడు గోద్రా అల్లర్ల దృష్ట్యా మోడికి తమ దేశ వీసా నిరాకరించిన అమోరికా, ఈ రోజు మోడి ని అమోరికా రావలసినదిగా అహ్హనం పంపిన విషయమును ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. గుజరాత్ ని అభివృద్ధి పధంలో తీసుకువెళ్ళడానికి నరేంద్ర మోడి చేసిన కృషిని గుర్తించే టైమ్స్ మేగజైన్ లో తమ బొమ్మను వేసింది తప్ప, అతని యొక్క దురాగతలను చూసి కాదని కాంగ్రెసు వాదులు తెలుసుకొంటే మేలు.


ఇప్పటికైనా కాంగ్రెసు మరియు విపక్షాలు నరేంద్ర మోడీ పై విమర్శలు మాని, అతని నెలకొల్పిన ప్రమాణాలు అందుకొని, వీలయితే దాటుకొని వెళ్ళి నిరూపించుకోవాలి. కాబోయే దేశ ప్రధాని రేసులో వేగంగా దూసుకుపోతున్న నరేంద్ర మోడి పై పనికిమాలిన విమర్శలు చేసే బదులు, దేశానికి నిజమైన అభివృద్ది ఎలా చేయాలో తెలుసుకుంటే మేలు... లేకుంటే ఇప్పటికే అందనంత ఎత్తులో ఉన్న నరేంద్ర మోడిని ఎప్పటికి అందుకోలేరు.

Tuesday 20 March 2012

ప్రణాళిక సంఘం పరిహాసం...

ప్రపంచంలో కల్లా అత్యంత ధనిక దేశమేంటో తెలుసా మీకు....

స్విట్జర్లాండ్, కెనడా, అమెరికా తదితర దేశాలు మనసులో మొదులుతున్నాయా...

ఆయితే మీరు పప్పులో కాలేసినట్టే...

ప్రస్తుతం ప్రపంచంలో కల్లా అత్యధిక ధనిక దేశము మన భారత దేశమే....
మన దేశంలో ఉన్న పట్టణాల్లో మరియు నగరాల్లో అసలు పేదరికమే లేదు....
పల్లెల్లో మాత్రము తక్కువలో తక్కువగా ఐదు శాతము పేదరికము మాత్రమే ఉంది...
దానిని కూడా మన ప్రణాళిక సంఘం వారు కొద్ది రోజుల్లో రూపుమాపేయగలరు....

ఇదేమి వెటకారముగా చెప్పింది కాదు... మన పేరుగాంచిన ప్రణాళిక సంఘం అధ్యక్షులు మరియు
మన పాలకులు సగర్వంగా తెలియజేసిన నగ్నసత్యం....

ప్రపంచమంతా మన దేశాన్ని ధనిక దేశంగా గుర్తించకపోయినప్పటికి, దయార్ద్ర హృదయము గల
మన పాలకులు మాత్రం గుర్తించారు.... జయహో భారత్...

మన దేశములో పేదరికంనకు సంబందించి ప్రణాళిక సంఘం అధ్యక్షులైన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
(ఈయన పేరు ఎదుట శ్రీ అని చేర్చి గౌరవించదలచలేదు) చేసిన ప్రతిపాదన దేశములో అసలు పేదరికమే
లేదని తేల్చిచెప్పింది...

పట్టణాల్లో ఒక వ్యక్తి యొక్క సరాసరి ఖర్చు 28 రూపాయలకి మించితే అతడు సంపన్న వర్గానికి చెందినట్టే..పల్లెల్లో దానిని 22 రూపాయలకు కుదించారు...

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పట్టణాల్లో ప్రణాళిక సంఘం వారు సూచించిన ప్రకారం 28 రూపాయలకు తక్కువ ఖర్చు చేసేవారు ఒక్కరంటే ఒక్కరూ లేరు.. సో... పట్టణాల్లో పేదరికం శాతము నిల్..

అదే విధముగా పల్లెల్లో ప్రణాళిక సంఘం వారు సూచించిన ప్రకారం 22 రూపాయలకు ఖర్చు చేసేవారు ఐదు శాతము ఉన్నట్టుగా తెలిసింది... ఆయిన ఆ మాత్రం పేదరికము మన అహ్లువాలియా వార్కి పెద్ద సమస్య కాబోదని మన ప్రజలు విశ్వసిస్తున్నారు... కావలంటే పల్లెల్లో సరాసరి ఖర్చు విలువ ఇంకా తగ్గించడం ద్వారా ఆ మాత్రం మిగిలియున్న పేదరికంను కూడా రూపుమాపగలరు.

మొత్తానికి భారతదేశంను ధనిక దేశంగా తయారుచేయడం ద్వారా అహ్లువాలియా మన దేశ ప్రజల మనసులో
సుస్దిర స్దానము సంపాదించుకొన్నారు.....


జయహో భారత్,

జయహో అహ్లువాలియా,

జయహో కాంగ్రెస్...

Wednesday 14 March 2012

అలోచించండి ఒక్కసారి...

అందరూ ఒక్కసారి ఆలోచించండి...
దేశములో అడుక్కొనే బాలలు మనకు ఎక్కడపెడితే అక్కడ కొకొల్లుగా కనబడతారు...
చాలా సార్లు మనము అయ్యె. .పాపం అనుకొని ఎంతో కొంత చిల్లర ఇవ్వడం సాధారణమే....
కాని వీటి వెనుక చాలా పెద్ద తతంగమే ఉంటుందని నిరూపణ అయింది కూడాను..
కొన్ని కొన్ని గ్యాంగులు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి భిక్షాటనలో దింపి సొమ్ము చేసుకుంటున్నారని తెలిసిన తర్వాత కూడా...
మనము అడుక్కొనే బాలలను ప్రోత్సాహించవద్దు... తద్వారా వారి వెనుక ఉన్న గ్యాంగులను నిర్మూలించండి.....ఈ విషయములో ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేకపోతున్నాయి......

సహృదయులైన పెద్దలు, యువకులు అర్ద్రం చేసుకుంటారన్న అశాభావముతో....

Monday 12 March 2012

భారత్ కి యువ నాయకులు కావాలి...

దేశ రాజకీయాలను గమనించేవారు ఈ మధ్యన జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో
యువనాయకత్వంను గురించి ఎక్కువగా చర్చించుకొనియుంటారు


మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినది ఇద్దరు యువకుల గురించి..

వారిద్దరు వేర్వేరు పార్టిలకు చెందిన యువ సారధులు
ఒకరెమో జాతీయ పార్టీ ఆయిన కాంగ్రెసు పార్టికి చెందిన యువ సారధి రాహుల్ గాంధీ కాగా
 ఇంకోకరెమో ఉత్తరప్రదేశ్ లో ప్రాంతియ పార్టి ఆయిన సమాద్ వాదీ పార్టికి చెందిన అఖిలేశ్ యాదవ్....


ఈ ఎలక్షన్స్ ద్వారా దేశ పరిశీలకుల దృష్టిని తమ మీదకు తీసుకురావడం ద్వారా
భారతదేశానికి ప్రస్తుతం యువ నాయకత్వం కావలసిన అవసరం పై చర్చ రేకేత్తించారు

 ఈ యువ నాయకులిద్దరూ తమ హుందాతనంతో నూతన ట్రెండ్ ని ప్రారంబించారని అనుకోవచ్చు
 గెలుపోటములు విషయాన్ని ప్రక్కన పెడితే ఇద్దరూ యువ సారధులు తమ తమ
శక్తి సామర్ద్యంలతో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో పోటిపడ్డారు



 నేటి రాజకీయాల్లో విలువల్లేని రాజకీయనాయకులతో సామాన్య ప్రజానీకంతో చీదరించుకోబడుతున్న
పరిస్దితుల్లో వ్యక్తిగత విమర్శలకు,  చవకబారు విమర్శలకు దూరంగా ఉండడం ద్వారా అఖిలేశ్ యాదవ్
 ప్రజల అభిమానంను చూరగొన్నారు. తాను చేసే ప్రసంగాల్లో ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేకుండా
జాగత్రపడి, సిద్దాంతపరమైన విమర్శలు మాత్రమే చేయడం ద్వారా రాజకీయాల్లో ఒక కొత్త
ఒరవడిని తీసుకువచ్చినట్టుగా భావించవచ్చును.

అదే విధంగా రాహుల్ గాంధీ కూడా తన శక్తి మేరకు కష్టపడినప్పటికి, పార్టిలో ఉన్న
యితర సీనియర్ నేతల విచ్చలవిడి వ్యాఖ్యానాల ద్వారాను, మరియు కుల రాజకీయాల
గురించి మాట్లాడడం ద్వారా ప్రజల్లో కాంగ్రెసు పట్ల ఉన్న మంచి అభిప్రాయము మట్టికొట్టుకుపోయింది.
ఈ విషయములొ రాహుల్ గాంధీని అని ఉపయెగం లేదు...
కాని తన చుట్టు అటువంటి నీచ నాయకులను ఉంచుకోవడం ద్వారా, ఆయన తన కష్టార్దితంను
బూడిదలో పోసుకున్నారు.

ఇటు సమాదివాదీ పార్టిలో తండ్రి ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ కి పూర్తి స్దాయి అధికారములు
ఇవ్వడంతో, అఖిలేశ్ ఈ విషయములో తను జాగత్తలు తీసుకోవడంతో పాటు, తన పార్టి నాయకులెవరూ
విచ్చలవిడి వ్యాఖ్యానలు చేయకుండా నివారించగలిగారు...
ఏది ఏమైనా ఈ ఎన్నికల ద్వారా యువ నాయకులు రాజకీయాల్లో కొత్త ఒరవడిని ప్రారంబించినట్టుగా
భావించవచ్చును.

ప్రపంచం అంతా జెట్ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, మనము కూడా అదే వేగముతో వెళ్ళవలసిన
అవసరం ఎంతైనా ఉంది.. ఆ విధముగా ఉండాలంటే పరిపాలనలో యువకులకు భాగస్వామ్యం
కల్పించవలసిన అవసరం ఎంతైనా యుంది...

దురదృష్టశావత్తూ అధికార వ్యామెహంలో పడి నాయకులు కాడికి వెళ్ళేవరకు పదవిలో ఉండడానికే
అతృత చూపుచున్నారు. దాని వలన పరిపాలన అనుభవము వృద్ద తరము నుండి యువ తరానికి
బదిలీ కావడానికి చాలా సమయము తీసుకుంటుంది....

ఇప్పటికి మన దేశ నాయకుల్లో ఆగ్రజ్ణులు అనదగ్గవాళ్ళలో చాలా మంది డెబ్బయి ఏళ్ళు పైబడి
యున్నవాళ్ళే యున్నారు....


ఈ విషయమును గుర్తించి ఉత్తరప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిగా అఖిలేశ్ ని నియమించడం

స్వాగతించదగిన పరిణామం. మరియు ఫలితాలు వెలవడిన తర్వాత ప్రజలకు కృతజ్ణతలు తెలపడం ద్వారా తాను ప్రజల మనిషిననే సందేశమును ఇవ్వగలిగారు. అంతే కాకుండా తన ప్రధమ ప్రాధాన్యత లా అండ్ అర్డర్ అని తెలియజేయడం ద్వారా తమ పార్టిలోని గుండాయిజంను అదుపులో పెట్టడం గురించి పరోక్షంగా తెలియజేసారు.

ఉత్తర ప్రదేశ్ లో తమ పార్టి పరాభవానికి భాద్యత వహిస్తున్నాని నిజాయితీగా ప్రకటించడమే కాకుండా, ప్రత్యర్ది ఆయిన అఖిలేశ్ కి అభినందనలు తెలపడం ద్వారా రాహుల్ తన హుందాతనంను నిలుపుకున్నారు.

ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెసు పార్టి పరాజయం జరిమిలా రాహుల్ గాంధీ సామర్ద్యంను తక్కువ చేయడం తగదు. ఒక పార్టి పరాజయం పాలవ్వడమనేది అనేక అంశాల మీద ఆధారపడీ యుంటుంది. అంతేకాని దాన్ని మొత్తం ఒక వ్యక్తి అసమర్దతగా జమకట్టడం సరికాదు..


అందుచేత రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడం ద్వారా దేశ రాజకీయాల్లో యువత ప్రవేశాన్ని స్వాగతించాలి. సచిన్ పైలట్, జ్యోతిరాధిత్య సింధియా లాంటి నాయకులను తెరపైకి తీసుకురావాలి..

కాని ఇందులో ఖండించవలసిన అంశామేమిటంటే.. .వీరంతా వారస్వత రాజకీయాల ద్వారానే రావడం..

ప్రస్తుత పరిస్దితుల్లో యువత స్వంతంగా రాజకీయాల్లోకి రావడం గగనమే. కాబట్టి ఉన్నంతలో
కొద్దిగా నిజాయితీ కల్గిన యువ రాజకీయాల నాయకులకు పగ్గాలు అప్పగించడం దేశ భవిష్యత్తుకు ఉపయెగపడుతుంది   

Sunday 11 March 2012

మగాడికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు ఏమిటి?

పై టైటిల్ చూసి తొందరపడి ఈ పోస్ట్ లోకి వచ్చినందుకు మొదటగా మీకు సారీ..
ఎందుకంటే మంచి మేటర్ చదువుతున్నమనుకొని ఇందులోకి వచ్చి మీ
అమూల్యమైన టైమ్ వేస్ట్ చేసినందుకు.
ఎందుకంటే నేను అడిగింది ప్రశ్న మాత్రమే.. అంతేకాని దానికి సమాధానం కాదు.
అనుభవజ్ణులైన బ్లాగర్లు ఈ నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరని ఆశిస్తున్నాను...
నేను ఆ మధ్యన మా బంధువర్గంలోని కొంత మంది అమ్మాయిలని అడిగాను ఈ ప్రశ్న..
దానికి ఒక్కొక్కొరు, ఒక్కొక్క విధముగా సమాధానం చెప్పారు...
మొదటిది: అల్కహల్ అలవాటు ఉండకూడదు...
అల్కహల్ అలవాటు లేని వాళ్ళందరూ మంచి లక్షణాలు కల్గి ఉంటారని సర్టిఫై చేయగలమా?
అలాగే అల్కహల్ అలవాటు ఉన్నవాళ్ళందరూ చెడు లక్షణాలు కల్గి ఉంటారని సర్టి ఫై చేయగలమా?
రెండవది: సిగరెట్టు అలవాటు ఉండకూడదు...
సిగరెట్టు త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని నేను ఒప్పుకొంటాను.. కాని సిగరెట్టు త్రాగకపోవడం అనేది
ఉత్తమ లక్షణం క్రిందకి వచ్చినప్పటికి, అతని వ్యక్తిత్వం మంచి లక్షణాలతో కూడి ఉంటుందని సర్టి ఫై చేయగలమా??
మూడవది: బట్ట తల ఉండకూడదు....
ఓ మై గాడ్.. ఇది కూడా ఉత్తమ లక్షణం కేటగిరిలోకి వస్తుందా.....
అంటే బట్టతల లేని వాళ్ళందరికి ఉత్తమ లక్షణాలు ఉన్నట్టేనా???
నాల్గవది: నన్ను చాగా చూసుకోవాలి..
తమను బాగా చూసుకుంటే, అది ఉత్తమ లక్షణం క్రింద జమ కట్టేయవచ్చా??
వాడు బయట బోలెడు వెధవ పనులు చేసి, ఇంట్లో తమను బాగా చూసుకుంటే.. దానిని ఉత్తమ లక్షణంగా జమకట్టవచ్చా??
ఇదండీ.. నేటి తరం అమ్మాయిల్లో మగాడి కి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు...
ఇక నా ఉద్దేశంలో చెప్పాలంటే ఉత్తమ లక్షణాలు వేరు, అలవాట్లు వేరు అని చెబుతాను.
అలవాట్లు అనేవి అతని యొక్క బాహ్య స్వరూపమును తెలుపుతాయి...
కాని లక్షణమనేది ఆ వ్యక్తి యొక్క నడవడికను తెలియజేస్తుంది...
ఒక వ్యక్తికి అల్కహల్ త్రాగడమనే చెడు అలవాటు ఉన్నప్పటికీ, అతనికి ఉత్తమ లక్షణాలు కల్గి ఉండోచ్చు..
దాని వలన ఇతరులకు హాని కల్గదు.. కాని చెడు లక్షణాలు కల్గి ఉంటే, అది ఇతరులకు హని కల్గిస్తుంది...
అలాగే త్రాగకపోవడమనే మంచి అలవాటు ఉ న్నప్పట్టికి, అతను చెడు లక్షణాలు కల్గి ఉండోచ్చు...
దాని వలన అతనికి హని లేకపోయినప్పటికి, ఇతరులకు హని కల్గుతుంది....
అదే విధముగా సిగరెట్టు అలవాటు, బట్టతల లేకపోవడం, బాగా చూసుకోవడం విషయాల్లో కూడా...
ఒక మగాడికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు చరిత్రలో వివరించినట్టుగా నాకు గుర్తు..
(క్షమించండి.. సదరు వివరములు ఇక్కడ ఇవ్వలేకపోయినందుకు).
(అని నాకు అందుబాటులో లేవు)
గమనిక: నాకు పైన తెల్పిన అల్కహల్, సిగరెట్టు అలవాటు లేదు. మరియు బట్టతల కూడా
లేదని మీ అందరికి మనవి చేసుకుంటున్నాను.
అంటే వాళ్ళ దృష్టిలో నేను ఉత్తమ మగాడినని ఫీల్ అయిపోయి చంకలు గుద్దేసుకుంటున్నానని అనుకోకుండేయి...
నేను అంత మంచోణ్ణి అని అనుకోవడం లేదు లెండి......
మీకైమనా నా ప్రశ్నకు సమాధానం తెలిస్తే, కొద్దిగా చెప్పండే.....

Tuesday 6 March 2012

సిరివెన్నెల... హృదయ స్పందనల సినిమా...

ఉదయము ఒక్కసారిగా మెలకువ వచ్చింది. దుప్పటి తొలగించి చూస్తే అప్పటికే తెలవారిపోయినట్టుగా
కిటికి నుండి సన్నటి వెలుగు..

ఉలిక్కిపడ్డాను... అప్పుడే తెల్లారిపోయిందా అని...

ప్రతిరోజూ ఉదయము రన్నింగ్ వెళ్ళడం అలవాటు నాకు. ఆయితే వేసవి కాలం మొదలు కావడంతో
కొద్దిగా ముందుగానే రన్నింగ్ కి వెళ్ళాలని అనుకొన్నాను.

వెంటనే గబుక్కున లేచి కూర్చుని టైమ్ చూస్తే ఆరు పావు ఆయింది. పర్వాలేదు పెద్దగా టైమ్
ఆయిపోలేదని త్వరగా రెడీ కావడం మొదలెట్టాను.. పైగా ఈ రోజు నుండి మా ప్రెండ్స్ షటిల్ గేమ్
స్టార్ట్ చేద్దామని అనుకొన్నారు. ఎందుకనే గాని ఆ ప్రోగాం క్యాన్సిల్ ఆయింది..
 
బ్రష్ చేసుకొని రన్నింగ్ డ్రెస్ వేసుకోసుంటగా, టి.వి. పెట్టాను. జెమిని మూవీస్ లో సిరివెన్నెల
సినిమా వస్తుంది ఆ టైమ్ లో...

అంతే, ఒక్కసారిగా ఆగిపోయాను రెడి ఆవుతున్నవాడిని.... ఎందుకంటే అక్కడ టి.వి.లో
వస్తుంది సాదాసీదా సినిమా కాదు.. లెజెండ్రి మూవీ సిరివెన్నెల....

విశ్వనాధ్ గారి చేతుల నుండి జాలువారిని మహద్బుమైన సినిమా......


అప్పుడెప్పుడొ ఇంటర్ చదివే టైములో చూసానీ సినిమాను. ఆ రోజుల్లోనే నా మదిలో

ఉండిపోయింది.. తర్వాత చాలాసార్లు చూద్దామనుకొన్నా ఆ సినిమాను. కాని టి.వి.లో
మిగతా అన్ని చెత్త సినిమాలు ఒకటికి పది సార్లు ఇచ్చేవారు కాని ఈ సినిమాను మాత్రం
ఇప్పటికీ ఒక్కసారి ఇవ్వలేదు. ఇచ్చినా నాకు చూడడానికి కుదరలేదు...

ఇదుగో మరల ఇన్నాళ్ళకు ఇచ్చాడు... అది ఉదయమే... ఇక రన్నింగ్ కి వెళ్ళాలనిపించలేదు...
సినిమా చూడడానికే డిసైడ్ ఆయిపోయాను. ఎందుకంటే ఆ సమయంలో దానిని మిస్
అవ్వాలనిపించలేదు....

సిరివెన్నెల సినిమా గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కేవలం చూసి తరించవలసినదే..
ముఖ్యంగా పాటలు... ఏమి పాటలండీ అవి.... ఎంత విన్నా.. ఇంకా వినాలనే.. వినాలనే ఉంటాయి...

నాకు తెలిసి ఈ పాటలన్నింటికి ఒకే ఒక్క ప్లూయిట్ అనే సంగీత వాయద్యం మీదే వచ్చాయనుకొంటాను...

ప్లూయిట్ మీద నుండి వచ్చే అద్బుత సంగీతానికి ఎవరైనా మైమరిచిపోవలసినదే... సినిమా మొత్తము
ప్లూయిట్ సంగీతం నేపధ్యంలోనే సాగుతుంది....

పాత్రలు, పాత్రధారులు, కధ, కధనం, పాటలు అన్ని అద్బుతంగా కుదిరి చూడడానికి ఎంతో బాగుంటుందీ సినిమా..
సర్వదామన్ బెనర్జీ (హిరో పేరు ఇంతవరకే గుర్తున్నది నాకు), సుహాసిని, మున్ మున్ సేన్, శుభలేఖ
సుధాకర్, మీనా మొదలగు అందరూ ఎంత గొప్పగా నటించారో చెప్పక్కలేదు.

ముఖ్యంగా హిరో పాత్రధారిని కళ్ళు లేని సంగీతాభిమానిగా మలచిన తీరు చూస్తే విశ్వనాధ్ గారి ప్రతిభను
మెచ్చుకోకుండా ఉండలేము. అదే విధముగా సుహాసిని అభినయంను కూడా.. మాటలు రాని యువతిగా
సుహాసిని చేసిన అభినయము నభూతో నభవిష్యత్...

ఆ తర్వాత చాలా సినిమాల్లో చాలా మంది నటులు గుడ్డి వారి గాను, మూగ వారిగాను నటించారు కానీ,
సిరివెన్నెల సినిమాలో పాత్రధారులు చేసినటు వంటి సహజసిద్దంగా ఎవరూ చేయలేకపోయారు...

గుడ్డివాడిగా సర్వాదామన్ బెనర్జీచే విశ్వనాధ్ గారు అద్బుతమైన నటనను రాబట్టుకొన్నారు. కొన్ని కొన్ని సీన్స్
చూస్తుంటే, ఆ దృశ్యాలు మన హృదయాన్ని తాకుతాయి. అదే విధముగ సుహాసిని పాత్ర కూడాను..

కాని ఎందుకో కాని, కొన్ని కొన్ని సన్నివేశాల్లో సుహసిని నటన కొద్దిగా అతిగా అనిపించింది. బహుశా
ప్రస్తుతం సినిమాలకు అలవాటు పడిపోవడం వల్లనేమో....



మిగిలినది.. మున్ మున్ సేన్ గురించి... అద్బుతమైన అందగత్తె అని చెప్పలేను కాని. చూస్తున్నంతసేపు
చాలా బాగుందనిపించేలా ఉంది. ముఖ్యముగా చెప్పుకోవలసినదేమిటంటే, శృంగార భరిత సన్నివేశాల్లో
ఎక్కడా అసభ్యత ఉన్నట్టుగా అనిపించలేదు. పైగా అవి చాలా సహజసిద్దంగా ఉన్నట్టుగా మలిచారు.

నాకొక డౌటు ఉండేది.. ఇప్పుడున్న సినిమాల్లో అసభ్యత ఎక్కువయిపోతుందని విమర్శలు వస్తుంటాయి కదా...
యాక్చువల్ గా శృంగారన్ని చూపించేటప్పుడు అసభ్యంగా అనిపించడం సహజమే కదా అనుకొనేవాడిని..
కాని అది తప్పని తెలిసింది ఈ రోజు.... శృంగారమనేది కధలో భాగమే కానీ, దానిని అసభ్యంగా కాకుండా
చూపించడం ఎలాగో విశ్వనాధ్ గారు సిరివెన్నెల సినిమాలో చూపించారు అనిపించింది....

మున్ మున్ సేన్ తో వచ్చే శృంగార సన్నివేశాలు ఎంత గొప్పగా చిత్రికరించారో మాటల్లో చెప్పలేను.
ఎక్కడా అసభ్యత లేకుండా, అలా అని శృతి మించకుండా తీయడం.... కేక......

సినిమా క్లైమాక్స్ లో మున్ మున్ సేన్ చనిపోతుందని నాకు గుర్తు. ఎందుకు చనిపోతుందో నాకంతగా
ఐడియా లేదు. ఇప్పుడు ఎలాగైనా చూడాలనుకొన్నాను. కాని ఆఫీసుకి టైమ్ ఆయిపోయింది..

ఆఫీసుకి లేటుగా వెళ్ళి ఆయిన సరే చూడాలనుకొన్నా.... కాని ఈ రోజు ఆఫీసులో కొత్త కలెక్టరు గారితో
మీటింగ్ యున్నందున తప్పని సరిగా వెళ్ళవలసివచ్చింది....

మొత్తానికి అలా సినిమా క్లైమాక్స్ మిస్సయ్యా...


కాని ఈ రోజు ఉదయమే ఒక మంచి సినిమా చాలా కాలము తర్వాత చూసిన అనుభూతి కల్గింది.
కె.విశ్వనాధ్ గార్కి ధన్యవాదములు... ఇంత గొప్ప సినిమాను మనకు ఇచ్చినందుకు....

Sunday 4 March 2012

జయహో భారత క్రికెట్

written by murthy nagavolu
బంగ్లాదేశ్ లో బాణా సంచా కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. బంగ్లా ప్రధాని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకో తెలుసుకునే ముందుగా కొంచెం వెనకకు వెళదాం.

          అది క్రికెట్ కు పుట్టినిల్లైన ఇంగ్లాండ్ లోని లార్డ్స్ క్రికెట్ మైదానం. ప్రపంచంలోని క్రికెట్ ఆడుతున్న జట్లన్నీ అక్కడే ఉన్నాయి. చాలా హడావిడిగా ఉంది. ప్రపంచ మీడియా అంతా అక్కడే కేంద్రీకృతమై ఉంది. అందరూ ఉద్వేగంగా, ఉత్సాహంగా ఉన్నారు. అన్ని దేశాల క్రికెట్ జట్ల కెప్టెన్ లు అక్కడే వివిధ స్ధానాలలో ఉన్నారు. అందరికంటే కొంచెం ఎత్తుగా సింహాసనం లాంటి సోఫాలో భారత కెప్టెన్ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు.
          భారత దేశంలోని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సభ్యులు, రాజకీయనాయకులు మరియు బుకీలు సందడి సందడిగా అటూ ఇటూ మొబైల్ ఫోన్ల ద్వారా ఇంగ్లాండులో ఏం జరుగుతున్నాదో తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో భారత ప్రధాని కార్యాలయం నుండి ఫోన్, ప్రధాని మాట్లాడారు. అమెరికా నుండి అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేసారని సాధ్యమైనంత వరకు అమెరికాకు అనుకూలంగా జరిగేలా చూడమని. ఇంతలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి ఫోన్ చేసి ఎలాగైనా ఇటలీ దేశానికి అనుకూలంగా జరగాలని.

                  ఇంతకూ ఇంగ్లాండ్ లో ఏం జరుగుతోంది? అందరిలో అంత టెన్షన్ ఎందుకు? ప్రపంచ మీడియాకు అక్కడ ఏం పని? తెలుసుకుందామనుకుంటున్నారా?

                   ప్రపంచంలోని క్రికెట్ ఆడే దేశాలన్ని వన్డే క్రికెట్, టేస్ట్ మరియు టి.ట్వంటీ లలో మొదటి స్ధానం పొందిన జట్టుకు ఏటా వెయ్యి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చేందుకు నిర్ణయించాయి. సంవత్సర కాలంలో అయాదేశాలు ఆడే స్ధాయిని బట్టి మొదటి స్ధానం దక్కుతుంది. ఇందులో అమెరికా మరియు ఇటలీ కూడా కొత్తగా వచ్చి చేరాయి. భారత దేశం ఇంట్లో పులి వీధిలో కాగితం పులలని అందరికి తెలుసు. అందుకే ప్రతీ దేశం భారత దేశంతో అయాదేశాలలో కనీసం ఐదు టెస్ట్లు, ఐదు వన్డేలు మరియు మూడు టి.ట్వంటీలు అడేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే భారత్ ఏదేశం వెళ్ళినా వైట్ వాష్ తో రావడమేకాని గెలుపనేది ఉండదు కాబట్టి.అలాంటి భారత్ తో ఆడితే ఎక్కువ పాయింట్స్ సంపాదించవచ్చని అయాదేశాల ఆలోచన. అయితే ఈ విషయంలో అయాదేశాల మధ్య యుద్ధం మొదలైంది. భారత్ మాదేశంలో ఆడాలంటే మా దేశంలో ఆడాలని అయాదేశాలు కొట్టుకొనే పరిస్ధితి వచ్చింది. దీంతో ఐసిసి కల్పించుకోక తప్పలేదు. అంతేకాకుండా భారత్ ముందుగా ఏ దేశంతో ఆడాలో తెలియని పరిస్ధితి. ఎందుకంటే ఒకరితో ఆడితే ఇంకో దేశం కోపగించుకుంటోంది. అందుకే ఐ.సి.సి  మరియు బి.సి.సి.ఐ కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయి.
                   ఆ ఒప్పందం ప్రాప్తికి ప్రతీ సంవత్సరం భారత దేశం టూర్ ప్రొగ్రాం ఒకటి తయారు చేసి ఆ ప్రకారం లాటరీ తీయడానికి, అలా లాటరీలో వచ్చిన దేశంతో భారత్ అ దేశంలో అడటం జరుగుతుంది. అలా లాటరీ ద్వారా నిర్ణయించడానికే లార్డ్స్ లో అన్నిదేశాలు రావడం జరిగింది. వరుస ఓటముల సారధి ధోని మరియు భారత తొట్టిగాంగ్ అంతా అక్కడకు రావడం జరిగింది. కొద్ది క్షణాలలో లాటరీ ద్వారా భారత్ విదేశాలలో ఆడే దేశాలను నిర్ణయించబోతున్నారు. అందుకే ప్రపంచ మంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నది.

                   మొదటి సంవత్సరం భారత్ ఎక్కువ సిరీస్ లు  ఆడేదేశంగా లాటరీ ద్వారా  బంగ్లాదేశ్  ఎన్నుకోబడింది. అంటే భారత్ తప్పకుండా తను ఆడే సిరీస్ లన్ని వైట్ వాషచేయించుకోకుండా రాదు. కాబట్టి బంగ్లాదేశ్ కొంచెం జాగ్రత్తగా ఆడితే ఆ సంవత్సరం మొదటి స్ధానం బంగ్లాదేశ్ గెల్చుకుంటుంది. అందుకే బంగ్లాదేశ్ లో ఆ సంబరాలు.

                             అందుకే జయహో భారత క్రికెట్
P.S.
(మా అన్నయ్య మూర్తి నాగవోలు గారు నాకు పంపిన మెయిల్ బాగున్నందున, దీనిని అందరూ చదువుటకు వీలుగా యధాతధముగా ఇక్కడ ఇవ్వడమైనది)

Friday 2 March 2012

చద్దన్నం...(కడుపు చల్లగా)

కొత్తగా చద్దన్నం గురించి మాట్లాడుతున్నానేంటా అని చూస్తున్నారా?ఏమి లేదండి నిన్నటి నుండి చద్దన్నం తినడం మొదలెట్టా... అంటే పెరుగన్నం అని అర్ద్రం చేసుకోవచ్చు...ఈ రోజుల్లో కూడా చద్దన్నం తినే దద్దమ్మలు ఉన్నారా? అని మీరు అనుకోవచ్చు..మీరే కాదు నేను కూడా అలానే అనుకున్నాను.. ఇప్పుడు కాదు.. మీ కంటే అడ్వాన్స్ గా...అంటే నా చిన్నప్పుడే
టిఫిన్ చేసి పెట్టోచుగా అని మా అమ్మ మీద విసుక్కొనని రోజు లేదు
... మరి పాతకాలంలో టైపులో రోజూ చద్దన్నం పెట్టే బదులు శుభ్రంగా... నేనే కాదు మా చెల్లి కూడా...తనకు చద్దన్నం తినడంమంటే పీకల దాకా కోపం వచ్చేస్తుంది... కాని తప్పదు కదా..తినకపోతే మా అమ్మగారు వీపు విమానం మోత మోగించేవారు. ఆకలికి భయపడి కాకపోయినా,మా అమ్మ కొట్టే దెబ్బలకు భయపడి చచ్చినట్టు తినే వాళ్ళం... అలాగని మా ఇంట్లో టిపిన్స్ అస్సలు చేసుకొరని కాదు... మా ఊరిలో పెద్ద కుటుంబం మాదే..
యాబది ఎకరాల మాగణి, రెండు జతల సంఖ్యలో గేదేలు, ఆవులు, ఎడ్లు ఉండేవి... దానితో
ముప్పాటలా పాలు, మజ్జిగ, పెరుగుకి కొరత ఉండేది కాదు..... ప్రొద్దున్నే తాతయ్యతో సహ అందరూ
చద్దన్నంలోకి గడ్డ కట్టిన పెరుగు వేసుకొని శుభ్రంగా భోంచేసేవారు. వారు కష్టపడే చేసే పనులకు ఆ
మాత్రం పుడ్ ఉండాలనుకొండి. అంతే కాదండోయ్ అంబళి అని ఏదో త్రాగేవారట..
(ధ్యాంక్స్ గాడ్... నా చేత కూడా త్రాగించలేదు).. అంబళి అరోగ్యానికి చాలా మంచిదట లెండి.. నాకు తెలియదు.
మా నాన్నగారొక్కరికి మాత్రం టిఫిన్ వండేవారు.. నాన్నగారితో పాటుగా కూర్చుంటే మాకు కూడా టిఫిన్ పెడుతుంది కదా అని
ఆయనతో బాటుగానే కూర్చునేవాళ్ళం.. ఆయినా అమ్మ దయతలచేది కాదు.. పైగా మా నాన్నగారు ఉదయము తొమ్మిది గంటలకు
కూర్చునేవారు టిఫిన్ చేయడానికి.. అప్పటికి మా స్కూల్ టైమ్ ఆయిపోయేది.
కొన్ని కొన్ని సార్లు మాత్రం అమ్మ దయతలచి టిఫిన్ చేసి పెట్టేది
లేవు
. ఆ రోజుల్లో ఇప్పుడున్నని రకములు టిఫిన్స్ . ఎక్కువగా ఉప్మా లేకపోతే ఊతప్పం... మా చద్దన్నం ముఖాలకు అదే చాలా గొప్పగా అనిపించేది..అప్పుడు కూడా అమ్మ కండిషన్ పెట్టేది.. అదేమిటంటే చద్దన్నం తింటేనే టిఫిన్ అని...మరల ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకొనేవాళ్ళం
తినేచేవాళ్ళం
శుభ్రంగా తినలేకపోయేవాళ్ళం
ఆయిన మా డిమాండ్స్ ని ఎవరూ పట్టించుకొనేవారు కాదు.. అమ్మమ్మ, తాతయ్యలు కూడా అమ్మకే వత్తాసు
పలికేవారు.
... ఆయిన టిఫిన్ పెడుతుందన్న ఆశతో ముందుగా చద్దన్నం ... ఆ చద్దన్నం తినగానే మాకున్న బుజ్జి బొజ్జ నిండిపోయేది... దానితో తర్వాత పెట్టే టిఫిన్ . దీనితో చద్దన్నం తినకుండానే టిఫిన్ చేస్తామని చాలాసార్లు మారాం చేసేవాళ్ళం.ఇకపోతే మా ఇంటికి చుట్టాలు ఎవరైనా బాగుణ్ణు అనుకొనేవాళ్ళం
అమ్మ టిఫిన్ చేస్తుంది కాబట్టి
ముఖ్యముగా చెప్పుకోవలసినది పెసరెట్టు ఉప్మా గురించి.. ఉంటాయండీ అవి మరి... మాటల ద్వారా చెప్పలేమండీ
వాటి రుచి... తింటేనే చెప్పోచ్చు వాటి రుచి... అంత బాగుండేయి...
పెసర పప్పు గ్లైండర్ లో కాకుండా స్వయంగా రుబ్బురోలు మీద రుబ్బి అట్లు వేసేవారు. అవే కాదు ఇడ్లీ పప్పు కూడా రుబ్బగా
వచ్చిన దానితో వేసేవారు. నిజముగా వాటి టేస్ట్ ఉంటుందండీ.. చాలా బాగుంటందండి......అందువల్ల వాటికి
అంత టేస్ట్ అని మా చెల్లి చెప్పింది..... కాని ఏమి లాభం... మా అమ్మగారు ఎప్పుడూ చేసేవారు కాదే... పైగా వాటిని
పెద్దవాళ్ళకే మాత్రమే పెట్టేవారు.. మాకు మాత్రం పెట్టేవారు కాదు...
ఎందుకు మాకు పెట్టరని గట్టిగా అడిగితే, అవన్నీ మీరు పెద్ద వాళ్ళు అయిన తర్వాతే... ఇప్పుడు ఇంకా మీరు చిన్నపిల్లలు..
ఇలాంటి వాటికి అలవాటు పడకూడదు అని కోప్పడేవారు... అప్పుడు అనుకోనేవాళ్ళం... ఆయితే మనం త్వరగా
పెద్దలమయిపోతే, మనకు రోజు టిఫిన్ పెడతారన్న మాట అనుకొని ఎప్పుడు పెద్దాళ్ళమయిపోతామా అని ఎదురు చూసేవాళ్ళం.
రోజూ తెల్లరగానే పెద్దళ్ళమయిపోయామని తెగ ఫీలయిపోయేవాళ్ళం... కాని రోజులెన్ని ఆయిపోతున్నప్పటికి మేము మాత్రం
ఇంటిలో చిన్నాళ్ళుగానే మిగిలిపోయాము. ఐదు తరగతి పూర్తయి, ఆరో తరగతి కోసము హైస్కూల్ వెళ్ళినప్పుడు
నిజంగా నేను పెద్దడయిపోయానని ఫీలయిపోయి, ఇక ఇప్పటి నుండి నేను టిఫిన్ తప్ప చద్దన్నం తిననని మొండికేశా...
అప్పటికి కుదరలేదు నేను పెద్దడయిపోయానన్న పాచిక... ఆ తర్వాత మా నాన్నగార్కి ఉద్యోగ రీత్యా కాకినాడకు రావడంతో
మమ్మల్లి కూడా కాకినాడ తీసుకువచ్చేసారు. పోనిలే పల్లెటూరు గొడవ వదిలింది. గేదెల గోల వదిలింది. పెరుగు గోల వదిలింది,
చద్దన్నం గోల వదిలింది అని మా చెల్లి, నేను బోలెడు సంబరపడిపోయాము... కాని అదీ ముణ్ణాల ముచ్చటే అని తెలియడానికి
ఎంతో కాలము పట్టలేదు. ఎందుకంటే వచ్చిన వారం రోజులకే విపరీతమైన దగ్గు మరియు జ్వరాలు మా మీదకి ఎక్కి
కూర్చున్నాయి. దానితో మా అమ్మగారు తిరిగి పాత రూట్లోకి వెళ్ళిపోయారు.
మా జ్వరానికి, టిఫిన్స్ కి ఎటువంటి సంబందం లేదని ఎంత మొత్తుకొన్న మా అమ్మగారు కనికరించలేదు.
అలా టెన్త్ క్లాస్ వరకు మా చద్దన్నం జైతయాత్ర దిగ్విజయముగా సాగిపోయింది. ఇక తర్వాత సం.రం.
ఇంటర్ లోకి రాగానే మనకు కొద్దిగా స్వేచ్చ వచ్చినట్టుగా భావించడంతో అమ్మకి తెలియకుండా బయట
హోటల్లో తినడం మెదలెట్టాను. మా చెల్లికి కూడా అమ్మకి తెలియకుండా అప్పుడప్పుడూ తెచ్చేవాడినిలెండి.
తర్వాతర్వాత కొంత కాలానికి మా చెల్లాయికి పెళ్ళి చేసేసిన తర్వాత, మా అమ్మగారు తిరిగి మా ఊరు వెళ్ళిపోయారు.
దానితో నేనొక్కడినే రూమ్ తీసుకొని ఉంటున్నాను ఉద్యోగరీత్యా.... భోజనానికి ఒక హోమ్ మెస్ ఉంటే అక్కడ జాయినయిపోయాను.
ఉదయం మాత్రం రోజూ హోటల్లోనే టిఫిన్ చేస్తున్నాను.. కాని ఆ తినడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసివచ్చింది..
ఎందుకంటే మా అమ్మగారు చేసే టిఫిన్స్ చాలా స్వచ్చంగా రుచికరముగా ఉండేవి. అవి తిన్నంతసేపు పెద్దగా
ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు. ఇపుడు బయట దొరికే టిఫిన్స్ ఒక వారం రోజులు కన్నా ఎక్కువగా తినలేకపోతున్నాము..
దానికి తోడు ఆరోగ్య సమస్యలు ఒకటి..... ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళ మంట... రాత్రిళ్ళు సరిగా నిద్ర
పట్టకపోవడం ఇత్యాది భాదలు ఎక్కువయిపోయాయి.
ఎలారా బాబు అనుకుంటుంటే... నేను రోజు భోజనం చేసే హోమ్ మెస్ లో అంటి గారిని అడిగా.... ఉదయము నాకు ఏమైనా
చద్దన్నం పెట్టగలరా అని?.. అయ్యో భలేవారే.. తప్పకుండా రండి అని అన్నారు.. నవ్వుతారేమో అనుకొన్నా... కాని
నవ్వలేదు ఆవిడ...
దానితో నిన్న ఉదయము యదావిధిగా రన్నింగ్ కి వెళ్ళిన తర్వాత హొమ్ మెస్ కి వెళ్ళి ఆంటీ గారు పెట్టిన చద్దన్నం తిన్నా..
అవకాయ వేసుకొని నంజుకొని తింటుంటే నా చిన్నప్పటి రోజులన్నీ వరసపెట్టి గుర్తుకు వచ్చాయి. తిన్న తర్వాత
కడుపులో చాలా హాయిగా అనిపించింది..... ఆఫీసులో ఉన్నంతసేపు కూడా కళ్ళల్లో ఐస్ గడ్డలు పెట్టుకున్నట్టు
చల్లగా అనిపించింది... ఇక రాత్రి బ్రహ్మండమైన నిద్ర పట్టింది....
వార్ని ఇంత తేడానా? అనుకొన్నా ఉదయము లేచిన తర్వాత... ఎంతయిన పాతపద్దతులు ఆఘోఘం అనిపించింది...
అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అర్ద్రమయింది... అమ్మ లాగే చద్దన్నం కూడా చల్లనిది అని తెలిసింది....
.