Tuesday 20 March 2012

ప్రణాళిక సంఘం పరిహాసం...

ప్రపంచంలో కల్లా అత్యంత ధనిక దేశమేంటో తెలుసా మీకు....

స్విట్జర్లాండ్, కెనడా, అమెరికా తదితర దేశాలు మనసులో మొదులుతున్నాయా...

ఆయితే మీరు పప్పులో కాలేసినట్టే...

ప్రస్తుతం ప్రపంచంలో కల్లా అత్యధిక ధనిక దేశము మన భారత దేశమే....
మన దేశంలో ఉన్న పట్టణాల్లో మరియు నగరాల్లో అసలు పేదరికమే లేదు....
పల్లెల్లో మాత్రము తక్కువలో తక్కువగా ఐదు శాతము పేదరికము మాత్రమే ఉంది...
దానిని కూడా మన ప్రణాళిక సంఘం వారు కొద్ది రోజుల్లో రూపుమాపేయగలరు....

ఇదేమి వెటకారముగా చెప్పింది కాదు... మన పేరుగాంచిన ప్రణాళిక సంఘం అధ్యక్షులు మరియు
మన పాలకులు సగర్వంగా తెలియజేసిన నగ్నసత్యం....

ప్రపంచమంతా మన దేశాన్ని ధనిక దేశంగా గుర్తించకపోయినప్పటికి, దయార్ద్ర హృదయము గల
మన పాలకులు మాత్రం గుర్తించారు.... జయహో భారత్...

మన దేశములో పేదరికంనకు సంబందించి ప్రణాళిక సంఘం అధ్యక్షులైన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
(ఈయన పేరు ఎదుట శ్రీ అని చేర్చి గౌరవించదలచలేదు) చేసిన ప్రతిపాదన దేశములో అసలు పేదరికమే
లేదని తేల్చిచెప్పింది...

పట్టణాల్లో ఒక వ్యక్తి యొక్క సరాసరి ఖర్చు 28 రూపాయలకి మించితే అతడు సంపన్న వర్గానికి చెందినట్టే..పల్లెల్లో దానిని 22 రూపాయలకు కుదించారు...

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పట్టణాల్లో ప్రణాళిక సంఘం వారు సూచించిన ప్రకారం 28 రూపాయలకు తక్కువ ఖర్చు చేసేవారు ఒక్కరంటే ఒక్కరూ లేరు.. సో... పట్టణాల్లో పేదరికం శాతము నిల్..

అదే విధముగా పల్లెల్లో ప్రణాళిక సంఘం వారు సూచించిన ప్రకారం 22 రూపాయలకు ఖర్చు చేసేవారు ఐదు శాతము ఉన్నట్టుగా తెలిసింది... ఆయిన ఆ మాత్రం పేదరికము మన అహ్లువాలియా వార్కి పెద్ద సమస్య కాబోదని మన ప్రజలు విశ్వసిస్తున్నారు... కావలంటే పల్లెల్లో సరాసరి ఖర్చు విలువ ఇంకా తగ్గించడం ద్వారా ఆ మాత్రం మిగిలియున్న పేదరికంను కూడా రూపుమాపగలరు.

మొత్తానికి భారతదేశంను ధనిక దేశంగా తయారుచేయడం ద్వారా అహ్లువాలియా మన దేశ ప్రజల మనసులో
సుస్దిర స్దానము సంపాదించుకొన్నారు.....


జయహో భారత్,

జయహో అహ్లువాలియా,

జయహో కాంగ్రెస్...

No comments:

Post a Comment