Friday 2 March 2012

చద్దన్నం...(కడుపు చల్లగా)

కొత్తగా చద్దన్నం గురించి మాట్లాడుతున్నానేంటా అని చూస్తున్నారా?ఏమి లేదండి నిన్నటి నుండి చద్దన్నం తినడం మొదలెట్టా... అంటే పెరుగన్నం అని అర్ద్రం చేసుకోవచ్చు...ఈ రోజుల్లో కూడా చద్దన్నం తినే దద్దమ్మలు ఉన్నారా? అని మీరు అనుకోవచ్చు..మీరే కాదు నేను కూడా అలానే అనుకున్నాను.. ఇప్పుడు కాదు.. మీ కంటే అడ్వాన్స్ గా...అంటే నా చిన్నప్పుడే
టిఫిన్ చేసి పెట్టోచుగా అని మా అమ్మ మీద విసుక్కొనని రోజు లేదు
... మరి పాతకాలంలో టైపులో రోజూ చద్దన్నం పెట్టే బదులు శుభ్రంగా... నేనే కాదు మా చెల్లి కూడా...తనకు చద్దన్నం తినడంమంటే పీకల దాకా కోపం వచ్చేస్తుంది... కాని తప్పదు కదా..తినకపోతే మా అమ్మగారు వీపు విమానం మోత మోగించేవారు. ఆకలికి భయపడి కాకపోయినా,మా అమ్మ కొట్టే దెబ్బలకు భయపడి చచ్చినట్టు తినే వాళ్ళం... అలాగని మా ఇంట్లో టిపిన్స్ అస్సలు చేసుకొరని కాదు... మా ఊరిలో పెద్ద కుటుంబం మాదే..
యాబది ఎకరాల మాగణి, రెండు జతల సంఖ్యలో గేదేలు, ఆవులు, ఎడ్లు ఉండేవి... దానితో
ముప్పాటలా పాలు, మజ్జిగ, పెరుగుకి కొరత ఉండేది కాదు..... ప్రొద్దున్నే తాతయ్యతో సహ అందరూ
చద్దన్నంలోకి గడ్డ కట్టిన పెరుగు వేసుకొని శుభ్రంగా భోంచేసేవారు. వారు కష్టపడే చేసే పనులకు ఆ
మాత్రం పుడ్ ఉండాలనుకొండి. అంతే కాదండోయ్ అంబళి అని ఏదో త్రాగేవారట..
(ధ్యాంక్స్ గాడ్... నా చేత కూడా త్రాగించలేదు).. అంబళి అరోగ్యానికి చాలా మంచిదట లెండి.. నాకు తెలియదు.
మా నాన్నగారొక్కరికి మాత్రం టిఫిన్ వండేవారు.. నాన్నగారితో పాటుగా కూర్చుంటే మాకు కూడా టిఫిన్ పెడుతుంది కదా అని
ఆయనతో బాటుగానే కూర్చునేవాళ్ళం.. ఆయినా అమ్మ దయతలచేది కాదు.. పైగా మా నాన్నగారు ఉదయము తొమ్మిది గంటలకు
కూర్చునేవారు టిఫిన్ చేయడానికి.. అప్పటికి మా స్కూల్ టైమ్ ఆయిపోయేది.
కొన్ని కొన్ని సార్లు మాత్రం అమ్మ దయతలచి టిఫిన్ చేసి పెట్టేది
లేవు
. ఆ రోజుల్లో ఇప్పుడున్నని రకములు టిఫిన్స్ . ఎక్కువగా ఉప్మా లేకపోతే ఊతప్పం... మా చద్దన్నం ముఖాలకు అదే చాలా గొప్పగా అనిపించేది..అప్పుడు కూడా అమ్మ కండిషన్ పెట్టేది.. అదేమిటంటే చద్దన్నం తింటేనే టిఫిన్ అని...మరల ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకొనేవాళ్ళం
తినేచేవాళ్ళం
శుభ్రంగా తినలేకపోయేవాళ్ళం
ఆయిన మా డిమాండ్స్ ని ఎవరూ పట్టించుకొనేవారు కాదు.. అమ్మమ్మ, తాతయ్యలు కూడా అమ్మకే వత్తాసు
పలికేవారు.
... ఆయిన టిఫిన్ పెడుతుందన్న ఆశతో ముందుగా చద్దన్నం ... ఆ చద్దన్నం తినగానే మాకున్న బుజ్జి బొజ్జ నిండిపోయేది... దానితో తర్వాత పెట్టే టిఫిన్ . దీనితో చద్దన్నం తినకుండానే టిఫిన్ చేస్తామని చాలాసార్లు మారాం చేసేవాళ్ళం.ఇకపోతే మా ఇంటికి చుట్టాలు ఎవరైనా బాగుణ్ణు అనుకొనేవాళ్ళం
అమ్మ టిఫిన్ చేస్తుంది కాబట్టి
ముఖ్యముగా చెప్పుకోవలసినది పెసరెట్టు ఉప్మా గురించి.. ఉంటాయండీ అవి మరి... మాటల ద్వారా చెప్పలేమండీ
వాటి రుచి... తింటేనే చెప్పోచ్చు వాటి రుచి... అంత బాగుండేయి...
పెసర పప్పు గ్లైండర్ లో కాకుండా స్వయంగా రుబ్బురోలు మీద రుబ్బి అట్లు వేసేవారు. అవే కాదు ఇడ్లీ పప్పు కూడా రుబ్బగా
వచ్చిన దానితో వేసేవారు. నిజముగా వాటి టేస్ట్ ఉంటుందండీ.. చాలా బాగుంటందండి......అందువల్ల వాటికి
అంత టేస్ట్ అని మా చెల్లి చెప్పింది..... కాని ఏమి లాభం... మా అమ్మగారు ఎప్పుడూ చేసేవారు కాదే... పైగా వాటిని
పెద్దవాళ్ళకే మాత్రమే పెట్టేవారు.. మాకు మాత్రం పెట్టేవారు కాదు...
ఎందుకు మాకు పెట్టరని గట్టిగా అడిగితే, అవన్నీ మీరు పెద్ద వాళ్ళు అయిన తర్వాతే... ఇప్పుడు ఇంకా మీరు చిన్నపిల్లలు..
ఇలాంటి వాటికి అలవాటు పడకూడదు అని కోప్పడేవారు... అప్పుడు అనుకోనేవాళ్ళం... ఆయితే మనం త్వరగా
పెద్దలమయిపోతే, మనకు రోజు టిఫిన్ పెడతారన్న మాట అనుకొని ఎప్పుడు పెద్దాళ్ళమయిపోతామా అని ఎదురు చూసేవాళ్ళం.
రోజూ తెల్లరగానే పెద్దళ్ళమయిపోయామని తెగ ఫీలయిపోయేవాళ్ళం... కాని రోజులెన్ని ఆయిపోతున్నప్పటికి మేము మాత్రం
ఇంటిలో చిన్నాళ్ళుగానే మిగిలిపోయాము. ఐదు తరగతి పూర్తయి, ఆరో తరగతి కోసము హైస్కూల్ వెళ్ళినప్పుడు
నిజంగా నేను పెద్దడయిపోయానని ఫీలయిపోయి, ఇక ఇప్పటి నుండి నేను టిఫిన్ తప్ప చద్దన్నం తిననని మొండికేశా...
అప్పటికి కుదరలేదు నేను పెద్దడయిపోయానన్న పాచిక... ఆ తర్వాత మా నాన్నగార్కి ఉద్యోగ రీత్యా కాకినాడకు రావడంతో
మమ్మల్లి కూడా కాకినాడ తీసుకువచ్చేసారు. పోనిలే పల్లెటూరు గొడవ వదిలింది. గేదెల గోల వదిలింది. పెరుగు గోల వదిలింది,
చద్దన్నం గోల వదిలింది అని మా చెల్లి, నేను బోలెడు సంబరపడిపోయాము... కాని అదీ ముణ్ణాల ముచ్చటే అని తెలియడానికి
ఎంతో కాలము పట్టలేదు. ఎందుకంటే వచ్చిన వారం రోజులకే విపరీతమైన దగ్గు మరియు జ్వరాలు మా మీదకి ఎక్కి
కూర్చున్నాయి. దానితో మా అమ్మగారు తిరిగి పాత రూట్లోకి వెళ్ళిపోయారు.
మా జ్వరానికి, టిఫిన్స్ కి ఎటువంటి సంబందం లేదని ఎంత మొత్తుకొన్న మా అమ్మగారు కనికరించలేదు.
అలా టెన్త్ క్లాస్ వరకు మా చద్దన్నం జైతయాత్ర దిగ్విజయముగా సాగిపోయింది. ఇక తర్వాత సం.రం.
ఇంటర్ లోకి రాగానే మనకు కొద్దిగా స్వేచ్చ వచ్చినట్టుగా భావించడంతో అమ్మకి తెలియకుండా బయట
హోటల్లో తినడం మెదలెట్టాను. మా చెల్లికి కూడా అమ్మకి తెలియకుండా అప్పుడప్పుడూ తెచ్చేవాడినిలెండి.
తర్వాతర్వాత కొంత కాలానికి మా చెల్లాయికి పెళ్ళి చేసేసిన తర్వాత, మా అమ్మగారు తిరిగి మా ఊరు వెళ్ళిపోయారు.
దానితో నేనొక్కడినే రూమ్ తీసుకొని ఉంటున్నాను ఉద్యోగరీత్యా.... భోజనానికి ఒక హోమ్ మెస్ ఉంటే అక్కడ జాయినయిపోయాను.
ఉదయం మాత్రం రోజూ హోటల్లోనే టిఫిన్ చేస్తున్నాను.. కాని ఆ తినడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసివచ్చింది..
ఎందుకంటే మా అమ్మగారు చేసే టిఫిన్స్ చాలా స్వచ్చంగా రుచికరముగా ఉండేవి. అవి తిన్నంతసేపు పెద్దగా
ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు. ఇపుడు బయట దొరికే టిఫిన్స్ ఒక వారం రోజులు కన్నా ఎక్కువగా తినలేకపోతున్నాము..
దానికి తోడు ఆరోగ్య సమస్యలు ఒకటి..... ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళ మంట... రాత్రిళ్ళు సరిగా నిద్ర
పట్టకపోవడం ఇత్యాది భాదలు ఎక్కువయిపోయాయి.
ఎలారా బాబు అనుకుంటుంటే... నేను రోజు భోజనం చేసే హోమ్ మెస్ లో అంటి గారిని అడిగా.... ఉదయము నాకు ఏమైనా
చద్దన్నం పెట్టగలరా అని?.. అయ్యో భలేవారే.. తప్పకుండా రండి అని అన్నారు.. నవ్వుతారేమో అనుకొన్నా... కాని
నవ్వలేదు ఆవిడ...
దానితో నిన్న ఉదయము యదావిధిగా రన్నింగ్ కి వెళ్ళిన తర్వాత హొమ్ మెస్ కి వెళ్ళి ఆంటీ గారు పెట్టిన చద్దన్నం తిన్నా..
అవకాయ వేసుకొని నంజుకొని తింటుంటే నా చిన్నప్పటి రోజులన్నీ వరసపెట్టి గుర్తుకు వచ్చాయి. తిన్న తర్వాత
కడుపులో చాలా హాయిగా అనిపించింది..... ఆఫీసులో ఉన్నంతసేపు కూడా కళ్ళల్లో ఐస్ గడ్డలు పెట్టుకున్నట్టు
చల్లగా అనిపించింది... ఇక రాత్రి బ్రహ్మండమైన నిద్ర పట్టింది....
వార్ని ఇంత తేడానా? అనుకొన్నా ఉదయము లేచిన తర్వాత... ఎంతయిన పాతపద్దతులు ఆఘోఘం అనిపించింది...
అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అర్ద్రమయింది... అమ్మ లాగే చద్దన్నం కూడా చల్లనిది అని తెలిసింది....
.

2 comments:

  1. చక్కగా చద్దన్నం పెట్టే హోంమెస్సులు ఉన్నాయా! ఏ ఊరు సార్!నేనొచ్చేస్తా చెప్పండి...
    ఇంతకీ చద్దన్నం అంటే, రాత్రి అన్నమా లేక పొద్దున్న వండిన అన్నంలో పెరుగా....

    వాఆఆఆఆ!వాఆఆఆఆఅ! నాక్కూడా చద్దన్నంలో పెరుగూ, ఆవకాయా కావాఆఆఆఆఅలీఈఈఈఈ...ఎలా? ఎలా? నాకు నోరూరించారు.ః(

    ReplyDelete
  2. కౌటిల్య గార్కి,
    కాకినాడ సార్... కుళాయి చెర్వు పార్కు దగ్గర....
    ప్రస్తుతానికి నేను తిన్నది ప్రొద్దున్న వండిన అన్నంలో పెరుగు వేసుకొని లెండి.... అదయినా మహభాగ్యమే కదండీ మాలాంటి బోడి బ్యాచిలర్స్ కి....
    నిజంగా చాలా బాగుందండీ.... చిన్నప్పుడు మాత్రం స్వచ్చమైన చద్దన్నమే తిన్నాములెండి(రాత్రి అన్నము).
    ధన్యవాదములు...

    ReplyDelete