Monday 25 July 2011

తెలంగాణా, సమైక్య రాజకీయనాయకులకు అభ్యర్జన.....

అన్నదమ్ముల్లా కలసి ఉండే మా మధ్య మాటల యుద్దం పెట్టడము మీకు భావ్యమా?
రాష్ట్రంలో చాలా మందికి ఇరుప్రాంతాల పట్ల ఎటువంటి బేదాబిప్రాయాలు లేవు....
ఉన్నదల్లా పనిలేని రాజకీయ నాయకులకు మాత్రమే.....
రాజకీయ నాయకుల సభ్యత లేని విమర్శల మూలంగా ఇరుప్రాంతాల ప్రజలు చాలా నామోషిగా ఫీలవుతున్నారు....
దాని పర్యవసానంగా తెలుగు బ్లాగర్లులు కూడా కొంచెం దూషణపరమైన అర్టికల్స్ ను ప్రచురిస్తున్నారు...
అది సరయిన పద్దతి కాదు....
ఇందుమూలముగా మొత్తము తెలుగు సోదరులకు తెలియజేసుకొనునది ఏమనగా....
దయచేసి ఇరుప్రాంతాల రాజకీయ నాయకులు చేసే దూషణలను ప్రామాణికంగా తీసుకొని ఎవరు ఉద్వేగాలకు లోను కావద్దని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా తెలంగాణా వారు కోరుకుంటున్న ప్రత్యేక రాష్ట్రం కోరదగినదే.....
కాని దాని కోసము వారు ఎన్నుకొన్న కొన్ని పద్దతులు మిగతా ప్రాంతం వార్కి ఇబ్బందికరముగా ఉన్నాయి.....
తెలంగాణా వాదులకు:అందులో మొదటిది సీమాంద్రులు తెలంగాణాని దోచుకున్నారనడం...........
రాష్ట్ర రాజధాని హైదరబాద్ ప్రత్యేకముగా తెలంగాణాలో ప్రాంతమని దానిని కొల్లగొట్టి పట్టుకుపోదామని ఎవరు రాలేదు....
రాష్ట్రరాజధాని ఏ ఊరు ఉంటే దానికే మెజారిటి ప్రజలు జీవనోపాధి కోసము వెళతారు. అది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంది.....
ఎక్కడివారైనా రాజధానిని తమ స్వంత ప్రాంతంగానే భావిస్తారు... ఆ ఉద్దేశంతోనే రాష్ట్రప్రజలందరూ రాజధాని బాట పట్టారు.....
దానిని తెలంగాణాను దోచేయడం అంటే ఎలా??
ఒకవేళ రాజధానిగా విజయవాడో లేక వైజాగో పెడితే మీరందరు ఇక్కడకు రారా?? ప్రభుత్వ కార్యాకలపాల కోసము మీ ప్రాంతియులు ఇక్కడకు రారా??
సినీపరిశ్రమ చైన్నై నుండి హైదరబాద్ కి పూర్తిస్దాయిలోకి రావడానికి ఎంత కాలము పట్టింది......
చైన్నై నుండి హైదరబాద్ కే రావడానికి కారణమేమిటి..... ఇది మా గడ్డ్ అనే ఫీలింగ్ వల్లే కదా...... ఇక్కడివారు అలా ఫీలవ్వడం మూలంగానే కదా అందరూ అక్కడ సెటిల్ అవ్వడానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు.....
సౌకర్యాలు బాగున్నాయని ఏ ముంబాయిలోనే, డిల్లిలోనే ఎందుకు పెట్టలేదు సినీ పరిశ్రమ మరియు యితర పరిశ్రమలను......
రెండోది. తెలంగాణా సాధన కోసం మిగతా ప్రాంతియుల మీద ద్వేషపూరిత వ్యాఖానాలు చేయడం.......
తెలంగాణా రాష్ట్రం కావాలనుకొంటే దానికి సవాలక్ష మార్గాలున్నాయి..... అంతే కాని మిగతా ప్రాంతాల వారిని దూషించడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఎలా వస్తుందో చెప్పండి......
ప్రతి ఒక్కరికి అత్మాభిమానం ఉంటుంది...... అది గుర్తుకు పెట్టుకోవాలి.... ఎవరి ప్రాంతియ చరిత్ర వారికి ఉంటుంది...
తెలంగాణా, రాయలసీమ, కోస్తా వారికి వేర్వేరు అద్బుత చరిత్రలున్నాయి. ప్రతి గడ్డ మీద దేశము గర్వించదగ్గ మహనుభావులు మనుగడ సాగించారు.
ప్రాంతియ దూషణలు సంస్కారము అనిపించుకోవు......
సమైక్యవాదులకు:మొదటిది.. తెలంగాణా యాసను విమర్శించడం............
యాస అనేది ప్రాంతాల ఆధారముగా ఉంటుందన్న ఇంగీత జ్నానం కూడా లేకపోతే ఎలా.... ఏ ఒక్క ప్రాంతం వారు కూడా పూర్తి స్దాయి తెలుగు మాట్లాడలేరన్న సంగతి తెల్సుకోవాలి.
రెండవది.... బలిదానాల విషయములో నిర్లక్ష్య కామెంట్లు...
తెలంగాణా రాష్ట్ర సాధన కోసము బలిదానము చేసుకొన్న విద్యార్దులను పట్టించుకోకపోవడం....... ఎంత ఫీల్ లేకపోతే అంత బలమైన నిర్ణయం తీసుకుంటారో ఆలోచించండి......
మూడవది... లాబియింగ్ ద్వారా తెలంగాణాను అడ్దుకోవాలనుకోవడం.....
ఇది చాలా తప్పు. ఎందుకంటే వారు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆంత బలముగా కోరుకుంటున్నప్పుడు మనము ఎందుకు అడ్డుకోవాలి...
ప్రతి సమైక్యరాజకీయనాయకుడికి ఉన్న ఏకైక అభ్యంతరం రాజధాని విషయములోనే ఆయినప్పుడు ఆ విధముగా చర్చలు జరపచ్చు కదా..,..
సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగించే దమ్ము ఒక్క మగాడికి కూడా లేదా.....
ప్రతి తెలుగు వాడు ఒకసారి అలోచించండి......... మీకు కావలసినదేమిటొ తెలుసుకొండి.... దాని కోసము పోరాడండి... అంతేకాని దూషణపర్వములతో రణరంగం చేయవద్దు..... తెలుగు వారి ఐక్యతను చెడగొట్టవద్దు....

Monday 18 July 2011

నువ్వే నా లోకమని.....

కుటుంబం అంటే నాకున్న ఎనలేని ఆపేక్ష...
ఆ అపేక్షతోనే నిన్ను కావాలని కోరుకున్నాను....
కన్నవాళ్ళకి నచ్చకపోయినా నా ఇష్టంను కాదనలేకపోయారు....
నువ్వే నా లోకం అనుకున్నా....
నువ్వే నా ప్రాణం అనుకున్నా....
నీ తోటే నా ప్రయాణమనుకొన్నా......
నీకు నచ్చితినే నీతో ప్రయాణం చేద్దామనుకొన్నా.......
నీ సమ్మతితో నా కలల లోకము నిజమని మనస్పూర్తిగా నమ్మాను....
నీ కోసము నేను చాలా వదులుకున్నాను
......కాలమ్ గడిచిన రోజులలో........
నువ్వు చూపిన నిర్లక్ష్యం నా గుండెల్లో ముల్లులా గుచ్చుకుంది......
ఆయినప్పటికి ఓర్చుకున్నా....
ఎందుకంటే నాకు కుటుంబం పట్ల ఆపేక్ష......
ఆ అపేక్షతోనే నీకు దూరము కాలేకపోయాను........
కాని కాలంతో పాటు నేను మారవలసివచ్చింది..................
నా అపేక్ష గాలిబుడగలా పేలిపోయింది.............
ఆలోచనలో ఒక రకమైన నిర్లక్ష్యమ్ వచ్చింది...........
మరల ఇంకో తప్పు చేయకూడదన్న సంకల్పం........
కాని నేను చేసింది తప్పు కాదే......

హృదయనికి తాకిన నాకు నచ్చిన కధ....

మొన్న ఆదివారము ఈనాడు సంచికలో వచ్చిన "సిగ్గు" కధ నాకు చాలా బాగా నచ్చింది.
ఒక పైలు పై ఒక అధికారి సంతకం చేయడానికి అశించిన లంచానికి, అతను ఏమి ఇచ్చాడనే విషయము మీద రాసిన కధ...
చాలా హృద్రంగా వ్రాసారు రచయిత......
మీ కోసము దాని యొక్క లింక్ ను ఇక్కడ ఇస్తున్నాను.
http://www.eenadu.net/htm/weekpanel2.asp

Wednesday 13 July 2011

మాటలు రావడం లేదు....

ఎలా స్పందించలో తెలియడం లేదు....
ఉదయమే పేపర్లో ముంబయి పేలుళ్ళు గురించి చూసినప్పుడు....
అంతులేని ఆవేదనను కల్గిస్తున్న ఈ ఘోరకలికి అంతులేదా??
ఆపదకాలములో అంతులేని మనో నిబ్బరమును పాటించిన ముంబయివాసులకు సలామ్.....
మరణించిన, గాయబడిన తోటి సోదరులకు ప్రగాడ సానుబూతిని తెలియజేయుచూ......
మేమంతా మీ వెంటే ఉంటాము..... ఏ ఉగ్రవాదము కూడా మనల్ని అంతం చేయలేదు....

ఎక్కడికెళ్ళెనో ప్రస్దానం.....

కోర్టు కొరడా గుళిపించింది.....
యువనేత గారి అనూహ్య సంపాదన నిగ్గు తేల్చమని.....
కోర్టు పలికిందో లేక అమ్మ పలికించిందో దేవుడికి ఎరుక.....
పైకి తేలిన యువనేత ఒక్కడే....
ఇ౦క తేలని మిగతా అయ్యల సంగతి ఏంటొ...
రిలయన్స్ వాడు ఎలా పైకి వచ్చాడో కోర్టులకు ఎరుక........
వాడి పాదాల చెంత ప్రభుత్వ మోకారిల్లడం దేశజనులందరికి ఎరుక.....
రాజకీయ కొట్లాటలో ఎవరిదో గెలుపు....
యువనేత విశ్వాసం చూపించియుంటే, అదంతా నిజాయితి సంపాదన అయ్యుండేదెమో...
అందుకే విశ్వాసం చూపిన మిగతా వారి కుండ చల్లన.....
నచ్చితే ఇంద్రభవన వైభోగం.....
నచ్చకపోతే చేతిలో ఉన్న కొరడా సి.బి.ఐ.......
ఎవరి ప్రస్ధానం ఎక్కడికెళ్ళునో అమ్మకి ఎరుక......
ఎటుపోవునో ఈ అంతులేని కధ............

Tuesday 12 July 2011

భారత ప్రజాస్వామ్య ప్రభుత్వ ప్రెవేటు కంపెనీ.లిమిటెడ్....

ఇది ఏదో ప్రభుత్వరంగ సంస్ద అనుకొనేరు...
మన కేంద్రప్రభుత్వమే ప్రత్యేకంగా కంపెనీ అవతారము ఎత్తినట్టుంది ఈ మధ్యన వరుస చూస్తుంటే..
ఇన్పోసిస్ లో శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్న నందన్ నీలేకనిని తీసుకొని నెత్తిన పెట్టుకుంది తన అమూల్యమైన సేవలు దేశానికి అవసరమని.....
అబ్బో అనుకున్నారు ప్రజలందరూ..... ఇక ఈయన గారు దేశానికి ఏ అమూల్యమైన సేవలు అందిస్తారో అని....
ప్రెవేటు కంపెనీలో పనిచేసి వచ్చారు కదా ఆయన, మరి అయన అలోచనలు ఎలా ఉంటాయి..... లాభాలు ఎలా గడించాలి అని....
గ్యాస్ బండలు ప్రతి ఒక్క కుటుంబానికి సం.రానికి రమారమి ఒక ఆరు లేదా ఏడు సరిపోతాయంట.....
వాటికి ప్రభుత్వ రాయితి కల్పించి, ఆ పై అదనంగా తీసుకొనే ప్రతి బండకు రాయితిలు లేని అసలు ధర వసూలు చేస్తారట.....
ఎందుకు సార్ అంటే, చాలా మంది సం.రానికి ఇరవైకి పైగా బండలు తీసుకొంటున్నారని, వాస్తవానికి కుటుంబానికి ఆరు బండలు సరిపోతాయని, అదనంగా తీసుకుంటున్న బండలు ప్రక్కదారి పడుతున్నయని నివేదన........
చేతికి దెబ్బకి తగిలితే మందు వేయాలి కాని, చేతిని నరికివేయాలని అంటాడా ఎవడైనా.....
అలాగే ప్రక్కదారి పడుతున్న బండలను కనిపెట్టి వాటిని నివారించవలసినది పోయి, రేటు తీసుకెళ్ళి చంద్రమండలంలో పెడతారా ఎవరైనా......
కాని మన ప్రభుత్వం పెడదామనే అలోచనలో ఉందంటే, అది మనతో వ్యాపారం చేద్దామని చూస్తునట్టే కదా.......
అంతర్జాతియ విపణిలో ఇంధన ధరలు పెరగడంతో ఇక్కడ కూడా పెంచక తప్పడం లేదంటూ సామాన్య జనానికి గల బ్రతికే హక్కును డైలామలో ఉంచిన ప్రభుత్వం,........ ప్రజా సంక్షేమం కోసం కాకుండా కొంతమందికి లబ్ది చేకూర్చడానికి దేశవాళి ఇంధన వనరులను ప్రెవేటు సంస్ధలకు అప్పనంగా కట్టబెట్టి, వారి అడిన అటే అడుతున్న కేంద్ర ప్రభుత్వం పనితీరు ఒక కార్పోరేటు సంస్ధ పనితీరుకు ఏ మాత్రం తీసిపోదు......
లాభాల సంస్కరణ బాట పట్టిన కేంద్ర ప్రభుత్వం మున్ముందు ఇంకెన్ని జిమ్మిక్కులు చేసి ప్రజలతో వ్యాపారం చేస్తుందో చూడాలి.....

Monday 11 July 2011

నా వైభోగాలకు కోత కోసిన మొనగాళ్ళు.......

వైభోగాలు అంటే ఎక్కడో రాజల కాలానికి వెళ్ళిపోయారు గనుక.....
నేను చెప్పేది నా వైభోగాలకు కోత గురించి....
ఏమి చెప్పమంటారండి నా బాధ.....
రెండు సంవత్సరాల క్రితం వరకు నాదంతా రాజవైభోగమే.... ఎక్కడో అనుకొనేరు మా ఇంట్లో.....
అప్పుడు నేను అంటే ఇంట్లో అందరికి హడల్.... అంటే రెస్పాక్ట్ అని అర్దం చేసుకోవాలి....
కాలు కదపకుండానే అన్ని నోటి దగ్గరకు వచ్చేవి.... నోటి దగ్గరకు వచ్చేవి అంటే తినేవని అర్దం చేసుకొండి....
అఖరికి మంచినీళ్ళు కావాలన్న చిటికె వేస్తే చేతిలోకి వచ్చేవి....
కాని రోజులన్ని ఒకేలా వుండవన్న సామెత నిజము చేస్తూ మా సోదరి పెళ్ళి ఆయిన తర్వాత తెలిసింది....
కొత్తగా మా బావ చేరాడు మా ఇంట్లో.... అప్పటి నుండి చూడండి మా వాళ్ళ వరుస....
నన్ను మరిచిపోయారు..... మర్యాదలన్ని బావగారికి షిప్ట్ ఆయిపోయాయి.....
ఎంత అవమానమండి..... సగం రాజ్యం కోల్పోయిన బాధ మనసులో......
టైము కోసము చూసాను..... ఆ టైము రానే వచ్చింది........
తాడిని తన్నేవాడు ఒకడైతే, దానిని తలదన్నేవాడు ఇంకోకడు ఉంటాడన్న నానుడి నిజమయింది.....
ఇప్పుడు మా ఇంట్లో కొత్తగా యువరాజా వారు తయారయ్యారు....
దాంతో మా బావగారి మర్యాదలలో కూడా కోటా తెగింది..... ప్రోటొకాల్ విషయములో బావగారు నేను ఒకటే....
కాని యువరాజా వారి మర్యాదలకు అంతుపొంతు ఉండడం లేదు........
ఇప్పుడు నా రాజ్యం మొత్తము పొగొట్టుకున్నట్టుగా ఉంది........
అశావాశ దృకధంతో చూస్తున్నా మరల నా గత కాలపు వైభోగాలు వస్తాయని.......
ఇంతకి నా వైభోగాలకు కోత వేసిన ఆ యువరాజా వారు ఎవరో తెలిసిందా మీకు......
ఇంకెవరండి నా మేనల్లుడు.... పేరు మోహిత్........ మూడు నెలల బుడతడు.... కాని మాకు దక్కే మర్యాదల్లో కోత కోసేశాడు.....
ఏం చేస్తాం...... హుచ్చ్......

అద్వితియం శ్రీశైల మల్లన్న దర్శనం....

మొన్న శుక్రవారం నేను, నా కొలీగ్స్ మురళి గారు, సతీష్ గార్లతో కలసి శ్రీశైలం వెళ్ళాను....
ఇంత సడెన్ గా వెళ్ళడానికి కారణం నా మేనల్లుడు.....
వాడు పుట్టినప్పుడు ఉండవలసిన బరువు కంటే కొద్దిగా తక్కువగా ఉండడం. మరియు అదే సమయములో వాడికి జాండిస్ సోకడంతో
రోజంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి, ప్రతి నాల్గు గంటలకు బ్లడ్ రిపోర్టులు తీసేవారు.....
రోజుల పసివాడికి బలం మరియు బి.పి.రిపోర్టు పేరు చెప్పి ఒంటి నిండా పైపులు పెట్టడంతో, నేను తట్టుకోలేకపోయా......
దానితో అనుకోకుండా వాడికి శనివారము కల్లా నయమయి ఉదయం ఏడు గంటల కల్లా మా ఇంటికి తీసుకువస్తే నిన్ను దర్శించుకొంటానని గురువారం రాత్రి మల్లిఖార్జున్ని కోరుకున్నా......
అశ్చర్యం... శనివారము ఉదయం ఎనిమిది గంటలకు మా అమ్మగారు పోన్ చేసి నా మేనల్లుడిని తెల్లవారిజాము ఐదు గంటలకు ఇంటికి తీసుకువచ్చేసామని చెప్పారు...
ఆ కారణంగా వెంటనే మల్లిఖార్జున్ని దర్శించుకోవడానికి వెళ్ళడానికి కుదరకపోయిన, చివరకు మొన్న శుక్రవారం వెళ్ళాను....
అంతకు ముందు మార్నింగ్ వాకింగ్ లో మురళి గారితో అంటే ఆయన కూడా వస్తానని అన్నారు. ఆయనతో పాటు సతీష్ కూడా రెడి అయ్యాడు.
గురువారం సాయంత్రం కాకినాడ నుండి డైరెక్ట్ శ్రీశైలం బస్సుకు రిజర్వేషన్ చేసుకొని బయలుదేరాము...
శ్రీశైలంనకు ఉదయము ఏడు గంటలకల్లా చేరుకొని, పాతాళగంగలో స్నానాలకు బయలుదేరాము.....
వర్షాలు లేకపోవడం వల్లనేమో పాతాళగంగలోని నీరు చాలా లోపలికి పోయింది....
తిరిగి వచ్చేటప్పుడు మెట్లు మధ్యలో కొద్దిగా అస్వస్దత గురయ్యాను...... దాంతో కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని మల్లన్న దర్శనానికి వెళ్ళాము...
అన్ సీజనేమో జనము చాలా పల్చగా ఉన్నారు.. పైగా మా ఊరుకే చెందిన ఒక పోలిసు తారసపడడంతో దగ్గరుండి దర్శనం చేయించాడు......
మల్లన్న సన్నిధిలో ఉన్నంతసేపు మనసంతా ఒక రకమైన అలౌకికమైన స్దితిలోకి వెళ్ళిపోయింది.....
భక్తిపారవశ్యంతో మల్లన్న ముందు మోకారిల్లి నా శిరస్సును ఆయన లింగంను తాకించాను. అలా తాకించాలని పెద్దలు చెప్పారు.
దర్శనం ఆయిన తర్వాత తిరిగి అదే రోజు సాయంత్రం బయలుదేరి వచ్చేసాము....
కాని వచ్చిన తర్వాత శ్రీశైల చరిత్ర తెలుసుకోవాలని బలంగా అనిపించింది... కాని ఆ సమాచారము ఎక్కడ దొరుకుతుందో తెలియదు...
మీకు ఏమైనా తెలిస్తే కొద్దిగా నాకు చెప్పగలరా.....

Wednesday 6 July 2011

ఎందుకొచ్చిన లొల్లి మనకి.... అవిభక్త భారతదేశములో మనము ఎక్కడైనా ఒక భారతీయుడుగా బ్రతకొచ్చు........

తెలుగు జాతి మనది..
తెలుగు గడ్డ మనది...... అని అనుకొనే రోజులు పోయాయి....
తెలుగు బాష మాట్లాడే వారి కోసము ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆలోచన నుండి ఆంధ్రప్రదేశ్ అవతరించింది..
కాని నేడు ప్రపంచీకరణ నేపధ్యంలో అన్ని రకాల బాషలు మాట్లాడే వాళ్ళు రాష్ట్రానికి వచ్చి స్దిరపడ్డారు..
ఇది ఇక్కడే కాదు... దేశమంతా అదే పరిస్దితి యుంది......
పేరుకి బాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చెలామణి ఆవుతున్నప్పట్టికి అన్ని రకములు బాషలకు ఆయా ప్రాంతాల బట్టి వాడుకలో ఉన్నాయి.....
ఆయినప్పటికి ఏ నాడు ఎటువంటి సమస్యలు రాలేదు.......
అన్ని మతాలు, అన్ని బాషలు, అన్ని వృత్తుల వారు కలిసే ఇప్పటివరకు విశాలంద్ర రాష్ట్రంలో ఉన్నారు......
ఎవరికి తమకు చెందిన ప్రత్యేక వాదం తలకెక్కలేదు......
కాని ఎవడొ ఒక ఖాళీగా ఉన్న వెదవ, తనకు ఏమితోచగా బ్రతుకు దెరువు కోసం ఎంచుకొన్న వాదమే ప్రత్యేక తెలంగాణావాదము....
వాస్తవానికి ఆ వెధవ ఆ వాదమును బ్రతుకు దెరువు కోసం ఎంచుకొన్నప్పుడు, ఆ వాదము ఇంతవరకు వెళ్ళుతుందని అనుకొనియుండడు.....
ఎవరికైనా అభివృద్ది విషయములో లేక సౌకర్యాల కల్పన విషయములో లేక పారిశ్రమక విస్తరణ విషయములో తమ ప్రాంతం
అభివృద్ది చెందాలని కోరుకుంటారు......
కాని కొంత మంది వెధవలు ఈ దారి ఎంచుకొన్నప్పటికి, అందరూ వాళ్ళను విమర్శించిన వారే.....
కాని ఆ వెధవ ఖాళిగా ఉండక, అదే పనిగా ఉదరగొడుతుంటే మిగతా వాళ్ళకు నెమ్మదిగా తలకెక్కింది.......
చివరకు కాలక్షేపంగా చేసిన పని నెత్తి మీదకు ఎక్కడంతో మిగతా వెధవలు కూడా దానికి గల విశ్లేషణాత్మకైనా కారణాలేమిటని తెలియకుండానే ఆ వాదానికి వంతపాడడం మొదలుపెట్టారు....
ప్రత్యేక వాదం దురద ఇంత వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాని గురించి ఏమి చేయాలని ఆలోచించడం ప్రభుత్వానికి సముచితం కాదు....
ఆ వాదానికి ప్రత్యేక ముసుగులు వేసినంతమాత్రానా అది సద్దుమణుగుతుందని గ్యారంటి లేదు.....
ఎందుకంటే ప్రస్తుతానికి తాయిలాలు ప్రకటించి, వాదమును మరుగున పెట్టినా....
లేదా ప్రస్తుత వెదవలను సంతృప్తి పెట్టినప్పటికి......
తర్వాత ఇంకొక వెధవ బయలుదేరి ఇంకో లొల్లి చేయడని నమ్మకమేమిటి........
ఈ లొల్లిల గోల మనకెందుకు గాని తెలుగు తల్లిని ముక్కలు చేయడమే బెటరు......
అవిభక్త భారతదేశములో మనము ఎక్కడైనా ఒక భారతీయుడుగా బ్రతకొచ్చు........
ఎందుకొచ్చిన మనకి ఈ లొల్లి....... ప్రత్యేక దేశ లొల్లి తేకుండా యుంటే అదే పదివేలు......
జై భారత మాతాకి జై..... జై భారత్........

Friday 1 July 2011

చిరు మాటలకు అర్దాలు వేరయా....


నిన్న కాక మొన్న ఒక తెలుగు చానెల్ ప్రారంభోత్సవంలో విలేకరుల అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా
తాను తిరిగి సినిమాలలో నటించే ప్రసక్తే లేదని చిరంజీవి గారు కుండ బద్దలుకొట్టారు...
ఎందుకంటే తాను ప్రజా సేవలో ఉన్నానని, అందుకని సినిమాలకు సమయం కేటాయించలేనని సెలవిచ్చారు......
విషయము ప్రముఖంగా వార్తల్లో రావడంతో.... అహా చిరంజీవి గారికి ప్రజాసేవ మీద ఏమి శ్రద్ద అనుకొనేరు అందరు.....
దానికి కంటిన్యూగా చాలా మంది, మరియు ఆయన కొడుకు గారు స్టేట్ మెంటు పట్ల తమ విచారాన్ని వెలిబుచ్చారు....
కాని స్టేట్ మెంట్ ఇచ్చిన పెద్దాయన రెండు రోజుల్లోనే తిరిగి మాట మార్చివేసారు........
అమితాబ్ బచ్చన్ నటించిన బుడ్డా సినిమా వేడుకలో తను సినిమాలో నటించబోతున్నానని అయ్యాగారు తిరిగి స్టేట్ మెంట్ ఇచ్చారు....
ఏందయ్యా ఇది అంటే, అమితాబ్ మరియు అభిమానులు అడిగారు అందుకనే అలా అని సెలవిచ్చారు......
మరి ముందు రోజు చెప్పిన ప్రజలు మరియు ప్రజాసేవ మాటేమిటి???
రెండు రోజుల్లోనే ప్రజాసేవ విషయములో మాట మార్చిన చిరంజీవి గారిని ప్రజలు సి.ఎమ్ గా ఎలా స్వీకరించగలరు......
ఆయన సి.ఎమ్. పీఠం కోరుకోవడం తప్పు కాదు..... కాని దానికి కావలసిన పటిష్ట వ్యక్తితం ఆయనకు లేదని ఆయన చేష్టల ద్వారా ఆయనే తెలియజేసుకొన్నారు............