Tuesday 12 July 2011

భారత ప్రజాస్వామ్య ప్రభుత్వ ప్రెవేటు కంపెనీ.లిమిటెడ్....

ఇది ఏదో ప్రభుత్వరంగ సంస్ద అనుకొనేరు...
మన కేంద్రప్రభుత్వమే ప్రత్యేకంగా కంపెనీ అవతారము ఎత్తినట్టుంది ఈ మధ్యన వరుస చూస్తుంటే..
ఇన్పోసిస్ లో శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్న నందన్ నీలేకనిని తీసుకొని నెత్తిన పెట్టుకుంది తన అమూల్యమైన సేవలు దేశానికి అవసరమని.....
అబ్బో అనుకున్నారు ప్రజలందరూ..... ఇక ఈయన గారు దేశానికి ఏ అమూల్యమైన సేవలు అందిస్తారో అని....
ప్రెవేటు కంపెనీలో పనిచేసి వచ్చారు కదా ఆయన, మరి అయన అలోచనలు ఎలా ఉంటాయి..... లాభాలు ఎలా గడించాలి అని....
గ్యాస్ బండలు ప్రతి ఒక్క కుటుంబానికి సం.రానికి రమారమి ఒక ఆరు లేదా ఏడు సరిపోతాయంట.....
వాటికి ప్రభుత్వ రాయితి కల్పించి, ఆ పై అదనంగా తీసుకొనే ప్రతి బండకు రాయితిలు లేని అసలు ధర వసూలు చేస్తారట.....
ఎందుకు సార్ అంటే, చాలా మంది సం.రానికి ఇరవైకి పైగా బండలు తీసుకొంటున్నారని, వాస్తవానికి కుటుంబానికి ఆరు బండలు సరిపోతాయని, అదనంగా తీసుకుంటున్న బండలు ప్రక్కదారి పడుతున్నయని నివేదన........
చేతికి దెబ్బకి తగిలితే మందు వేయాలి కాని, చేతిని నరికివేయాలని అంటాడా ఎవడైనా.....
అలాగే ప్రక్కదారి పడుతున్న బండలను కనిపెట్టి వాటిని నివారించవలసినది పోయి, రేటు తీసుకెళ్ళి చంద్రమండలంలో పెడతారా ఎవరైనా......
కాని మన ప్రభుత్వం పెడదామనే అలోచనలో ఉందంటే, అది మనతో వ్యాపారం చేద్దామని చూస్తునట్టే కదా.......
అంతర్జాతియ విపణిలో ఇంధన ధరలు పెరగడంతో ఇక్కడ కూడా పెంచక తప్పడం లేదంటూ సామాన్య జనానికి గల బ్రతికే హక్కును డైలామలో ఉంచిన ప్రభుత్వం,........ ప్రజా సంక్షేమం కోసం కాకుండా కొంతమందికి లబ్ది చేకూర్చడానికి దేశవాళి ఇంధన వనరులను ప్రెవేటు సంస్ధలకు అప్పనంగా కట్టబెట్టి, వారి అడిన అటే అడుతున్న కేంద్ర ప్రభుత్వం పనితీరు ఒక కార్పోరేటు సంస్ధ పనితీరుకు ఏ మాత్రం తీసిపోదు......
లాభాల సంస్కరణ బాట పట్టిన కేంద్ర ప్రభుత్వం మున్ముందు ఇంకెన్ని జిమ్మిక్కులు చేసి ప్రజలతో వ్యాపారం చేస్తుందో చూడాలి.....

No comments:

Post a Comment