Thursday 16 October 2014

వ్యవస్దగత లోపాలు



హుదుద్ తుఫాన్ కారణంగా వినాశనమునకు గురైన విశాఖపట్నం పరిస్దితి చూస్తే చాలా బాధనిపించింది. అంతే కాదు దానితో పాటుగా నష్టానికి గురైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిస్దితి కూడా ఇంచుమించుగా అలానే ఉంది.

ఆయితే వైజాగ్ పరిస్దితి వీటికి పూర్తిగా భిన్నంగా ఉంది. విద్యుత్ లేక సకల సౌకర్యాలు మొత్తం బంద్ ఆయ్యాయి. ఈ రోజుల్లో ప్రతిదీ విద్యుత్ తో ముడిపడియున్నాయని వేరే చెప్పక్కర్లేదు. ఒక్క విద్యుత్ ఉంటే చాలు సామాన్యుల రోజూవారీ అవసరాల్లో ఒక ఎనబై శాతం పనులు చక్కబట్టుకోవచ్చు అని నా అభిప్రాయం. అదే విధంగా విద్యుత్ పై ఆధారపడి పనిచేసే పరిశ్రమలు,  ఏ.టి.ఎం.లు, పెట్రోలు బంకులు, వాటర్ సప్లై లాంటి వాటికి కొరత లేకుండా చేసుకోగలిగితే సగం సమస్యలు జయించినట్లే....

ధ్వంసం ఆయినా అనేక సర్వీసులు కాదు కానీ ముఖ్యమైన విద్యుత్ సర్వీసు గురించి మాట్లాడుకుంటే,

ఆహర పదార్దలు, కూరగాయలు ముఖ్యమైన జాబితాలో ఉన్నప్పట్టికీ, తుపానుకి వారం రోజుల నుండే హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలు ముందుగానే కావల్సిన సరుకులు ఇంట్లోకి తెచ్చుపెట్టుకున్నప్పట్టికీ, విద్యుత్ లేకపోవడం అనే కారణంగా వంట చేసుకోవడానికి మరియు త్రాగడానికి అవసరమైన మంచి నీరు మరియు కూరగాయలు నిల్వ ఉంచుకొనే సదుపాయం లేకపోవడం మూలాన రెండు రోజుల్లోపే ఇబ్బందులు గురయ్యారు.

ఆయితే ప్రకృతి విలయాన్ని ఏ సాంకేతికత అపలేదు కాబట్టి, సాధ్యమైనంత వరకు నష్టాన్ని తగ్గించడానికి మరియు ప్రజలను అప్రమత్తం చేయుటలో గతముతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వం బాగానే పనిచేసింది. ఆయితే వచ్చిన సమస్యంతా తుఫాను భీబత్సం తదనంతరం అవసరమైన సేవలను పునరుద్దరించడంలో జరుగుతున్న జాప్యమే. ఇంత జాప్యం  చూస్తుంటే అసలు మనకున్న సమర్దత ఏపాటిది అన్న అనుమానం కల్గుతుంది.

తుఫాన్ కారణంగా వైజాగ్ లో గత  శనివారం అర్ద్రరాత్రి 11.00 గంటలకు పోయిన విద్యుత్ ని ఇప్పటికీ కూడా పునరుద్దరించలేకపోవడం మన వ్యవస్దల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుంది. తుఫానుకి గురైన రోజే సహయక చర్యలను దగ్గరుండి పర్యవేక్శించడానికి అఘమేఘాల మీద వెంటనే వైజాగ్ బయలుదేరి వెళ్ళిన ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు ఎవరినీ చూడలేదు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రధాన కార్యాలయం నుండి పర్యవేక్షిస్తూ క్రింది స్దాయి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం వేరు, స్వయంగా రంగంలోకి దిగి అవసరమైన చర్యలను తీసుకోవడం వేరు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే సచివాలయము నుండే పరిస్దితులను చక్కబెట్టే విధంగా వ్యవహరములను నడపచ్చు. కానీ ఆ విధంగా చేయకపోవడంలో పరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం గమనించవచ్చు. ఆయితే నేను ఇక్కడ చెప్పదలచుకున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి స్దాయి వ్యక్తి స్వయంగా వైజాగ్ లోనే మకాం వేసి, పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని వైజాగ్ కి రప్పించినప్పటికీ, పునరావస చర్యల్లో అత్యవసరమైన విద్యుత్ ని పునరుద్దరించడానికి సుమారు ఐదు రోజులుకు పైగా పట్టడానికి గల కారణాలు ఏమిటి అన్న ప్రశ్న నన్ను తొలిచింది.  ఇదే ప్రశ్న నా స్నేహితుడిని అడిగాను.

కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించినంత వేగంగా ఇక ఎవరూ స్పందించగలరు్? ఇంత ఇదిగా వారం రోజుల నుండి వైజాగ్ లోనే మకాం వేసి పనుల్లో అంతగా నిమగ్నమైనప్పట్టికీ కూడా నువ్ అలా అనడం బాగోలేదు అన్నాడు.

ఆయితే నేను ఇక్కడ ముఖ్యమంత్రిని బ్లేమ్ చేయడం లేదు. ముఖ్యమంత్రి స్దాయి వ్యక్తే అంత వేగంగా స్పందించినప్పటికీ కూడా విద్యుత్ పునరుద్దరణకి ఇంత సమయం పట్టిందంటే సమస్య ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. అంటే అత్యున్నత స్దాయిలో ప్రయత్నించినప్పటికీ కూడా విద్యుత్ పునరుద్దరణకి ఐదు రోజులకి పైగా పట్టే స్దాయి వ్యవస్ద మాత్రమే మనకు ఉందా? అంతకు మించి మెరుగైన వ్యవస్ద మనకి లేదా? అన్నది నా డౌట్... ఇదొక్కటే కాదు సమాచారం చేరవేయడంలో అత్యంత ముఖ్యమైన సెల్ ఫోన్ సిగ్నల్ సర్వీసును కూడా ఇప్పటి వరకు సరిదిద్దలేకపోయారు. ఆయితే ఇది ప్రెవేటు సంస్దల పరిధిలోని అంశం. ఆయితే సహయక చర్యల్లో ముఖ్యమైన అంశం కమ్యూనికేషన్ కాబట్టి సెల్ ఫోన్ సర్వీసు పునరుద్దరణ కూడా ముఖ్యమైన అంశమే....

ఇదే ఫీలింగును నిన్న మన ముఖ్యమంత్రి గారు ఈ క్రింద విధంగా వ్యక్తీకరించారు.

ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలదని అంటూ, ప్రస్తుత పరిస్దితులు తనకు సంతృప్తికరంగా లేవని, ప్రభుత్వం అనుకున్న తర్వాత కూడా పనుల్లో ఇంత అలస్యం జరగకూడదు”


సేమ్ నాకొచ్చిన ఫీలింగునే ముఖ్యమంత్రి గారు వ్యక్తీకరించడం చూసి నేననుకొన్నది నిజమే అనిపించింది. ప్రకృతి వైపరీత్యాలను మనం ఎలాగూ అదుపు చేయలేము. ఆయితే వాటి కారణంగా పాడయిన సర్వీసులను త్వరితగతిన చక్కదిద్దడానికి  అవసరమైన వ్యవస్దలను తయారుచేయడం ఎంత అవసరమో ప్రస్తుత పరిస్దితులు తెలియజేస్తున్నాయి. దీంట్లో భాగంగానే భూగర్బ విద్యుత్ లైన్ల వ్యవస్దను పరిశీలించడం చాలా ఉత్తమం. ఇప్పటికే దేశంలో ఉన్న కొన్ని ప్రధాన నగరాల్లో ఈ వ్యవస్ద అందుబాటులో ఉంది.  

ప్రకృతి వైపరీత్యాలు మనకు మాత్రమే కాదు కదా. మన కన్నా జపాన్, ఆమెరికా లాంటి దేశాల్లో ఇంత కన్నా భయంకరమైన వినాశానికి గురయిన సందర్బాలు ఉన్నాయి. ఆయితే అత్యంత ముఖ్యమైన సర్వీసులను గంటల్లోనే పునరుద్దరించగలిగే వ్యవస్దలు ఉండడం వలన వారు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను అధిగమించగల్గుతున్నారు.


కాబట్టి ఇప్పటికైనా మనం గుర్తించవలసినదేమంటే, వేగంగా స్పందించగలిగిన ప్రభుత్వాలు ఉన్నప్పట్టికీ అవసరమైనటువంటి సమర్ద వ్యవస్దలను కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా ముఖ్యమే. 

No comments:

Post a Comment