ఏడు కొండల వాడా!! వెంకట రమణా...
గోవిందా..గోగోగోవిందాదా........
ఏడు కొండల వాడా!! వెంకట రమణా...
గోవిందా..గోగోగోవిందాదా........
ఏడు కొండల వాడా!! వెంకట రమణా...
గోవిందా..గోగోగోవిందాదా........
ఏంటి స్వామీ, అన్ని సార్లు పిలుస్తున్నా
పలకవేంటి?
“భక్తులను పలకరించడంలో మునిగిపోయి పలకలేదు
నాయనా! చెప్పు నాయనా ఎందుకు పిలిచావు”?
“నేను నిన్ను చూడడానికి కుటుంబంతో కల్సి
తిరుపతి వచ్చాను స్వామి!”
“ఆవును నాయనా నేను గమనించాను.. పైగా కాలినడకన
కూడా వచ్చావు కదా”
“ఆవును
స్వామి.. శ్రీ వారి మెట్టు దగ్గర నుండి కాలినడకన మీ దర్శన భాగ్యం కోసం
వచ్చాను”
"!!!!!!"
“కష్టంగా అనిపించినా మీ దర్శనం ఆవుతుందన్న
ఆనందంలో కష్టం తెలీలేదు స్వామి”
"!!!!!!"
“కొండ మీదకి రాగానే తిరుమలను చూడగానే అక్కడ నగర
సుందరీకరణ చూడగానే అద్బుతమనిపించింది స్వామి”
"!!!!!!"
“కానీ నీ కొండ మీద తన డబ్బులతో అతిధి గృహం
కట్టించిన ఒక పెద్దాయన యిచ్చిన రికమెండెషన్ లేఖతో రూమ్ కోసం ప్రయత్నం చేసినప్పుడు
అష్టకష్టాలు పడ్డాను స్వామీ”
"!!!!!!"
“స్వామీ.. వింటున్నావా నేను చెబుతున్నవి?”
“ఆ..ఆ.. వింటున్న నాయనా... నువ్వు చెప్పు””
మరి ఊ కొడుతూ ఉండు స్వామీ.. నువు వింటున్నావన్న
నమ్మకం కోసం”
సరే.. చెప్పు.. ఊ కొడుతు ఉంటాను నాయనా”
“కాలినడకన పైకి చేరుకున్న తర్వాత C.R.O.ఆఫీసులో డోనర్ యిచ్చిన లేఖ యిచ్చి రూమ్
తీసుకోవలని బయలుదేరితే ఎక్కడా అటోలు కానీ, జీపులు కానీ లేవు స్వామీ..ఎంత దూరమైన
నడిచి వెళ్ళవలచి వచ్చింది.. కాలినడకన వచ్చిన మాకు తిరిగి రూమ్ కోసం ఆఫీసులు
తిరగలేక ఇబ్బంది పడిపోయాను స్వామి”
అదేంటి నాయనా.. అక్కడ మీలాంటి యాత్రికులు కోసం
ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడింది కదా”
“మీరన్నట్టు ఉచిత బస్సు సౌకర్యం ఉన్నప్పట్టికి,
అనంతమైన మీ భక్తుల అవసరాలు తీర్చలేకపోతున్నాయి స్వామీ... బస్సు నిండా జనమే..
నిలబడడానికి కూడా జాగా లేదు స్వామీ... ఆడవాళ్ళతో ఎక్కితే ఇబ్బందని ఎక్కలేదు స్వామి”
“ఊ..”
మొత్తానికి ఎలాగో తంటాలు పడి రూమ్ తీసుకుని,
ఉదయమే మీ దర్శనానికి వద్దామని అనుకొన్నాను స్వామి”
“ఊ..”
తెల్లారి ఉదయమే నాల్గు గంటలకు రెడీ ఆయి బయటకు
వచ్చి చూద్దునూ... రూ.300/- దివ్య దర్శనం
లైను రోడ్డు మీద నాల్గు కిలోమిటర్లు మేర జనాలు లైనులో ఉన్నారు స్వామీ”
“ఊ..”
ఇలాగైతే మీ దర్శనం లేటు అవుతుందని అనుకొని,
నిన్న కాలినడకన వచ్చినపుడు యిచ్చిన దివ్యదర్శన ద్వారం ద్వారా వెళ్ళడం మంచిదనిపించి
ఆ విధంగా బయలుదేరాను స్వామి”
“ఊ..”
ఎంతో ఇష్టపడి, కష్టపడి నిను త్వరగా చూడాలని
ఊబలాటపడుతూ నీ దర్శనం కోసం బయలుదేరితే నీవు ఏమి చేసావు స్వామీ””
“నేను ఏమి చేసాను నాయనా”
“అన్ని తెలిసి, ఏమి తెలియనట్టు అలా ఎలా
మాట్లాడుతున్నావు స్వామీ”
“నీ నోటితో చెప్పు నాయనా, నా చెవులతో వింటా”
పొద్దుట అనగా నీ దర్శనం కోసం వస్తే
కంపార్టుమెంటులో గంటల గంటల పాటు కూర్చోబెట్టేసావు కదా స్వామీ”
!!!!!!
నీ దర్శనం చేసుకోవడానికి వచ్చే అనంత
కోటిభక్తులకు రద్దీ పేరు చెప్పుకొని ఇబ్బంది పెట్టడం భావ్యమా స్వామీ”
“ఊ...”
“ఎన్నో రోజుల నుండి నిన్ను దర్శించుకోవడానికి
ముందస్తుగా ప్లాన్ చేసుకొని నీ దర్శన భాగ్యం కోసం వచ్చే సామాన్య జనాలను గంటల తరబడి
లైనులో వేచియుంచేలా చేయడం ఎందుకు స్వామీ?”
“ భక్తా... అనంతంగా వచ్చే నా భక్తులకు
దర్శనమివ్వడానికి ఆ మాత్రం ఇబ్బందులు తప్పవు నాయనా”
“మీరు అన్నదాన్ని నేను తప్పు బట్టడం లేదు
స్వామీ... మీరు కూడా మాలాంటి వారి కోసం విశ్రాంతి అనేదే లేకుండా మాకు దర్శనం
ఇస్తున్నారు.. కాదనను! కానీ భక్తులలోనే ధనికులు, సామాన్యులు, పేదలు అన్న బేధం
చూపుతున్నావు స్వామీ నీవు! అది ఏ రకంగా భావ్యం స్వామీ?”
“అలాంటిది ఏమి లేదు నాయనా... నాకు భక్తులందరూ
సమానమే”
“అలా అయితే నీ దర్శన భాగ్యానికి ఆయ్యే సమయం
అందరికి ఒకేలా ఎందుకు ఉండడం లేదు స్వామీ?
నీ దర్శన భాగ్యానికి నాకయిన సమయంతో పోలిస్తే వి.ఐ.పి.దర్శనంకి వచ్చిన
భక్తులకు కనీసం పావువంతు సమయం కూడా పట్టలేదు స్వామీ”
“ఊ...”
చిరంజీవి అనో, మెహన్ బాబు అనో, ఇంకో పని లేని
వెధవ అనో, వాడనీ, వీడనీ ఎవడి దగ్గర డబ్బు ఉంటే వాడిని సకల లాంచనాలతో నీ దర్శన
భాగ్యం నిమిషాల్లో కల్పించడానికి కుదురుతుంది కానీ మాలాంటి సామాన్య భక్తులకు
వెంటనే దర్శనం ఇవ్వడానికి మీకు కుదరడం లేదా స్వామీ మీకు”
“!!!!!!”
నీకు భక్తులందరూ సమానమైనప్పుడు ఇన్నోటీ
మార్గాలు ఎందుకు స్వామీ. వచ్చే భక్తులందరికి ఒకే మార్గం పెడితే రోజు మెత్తం మీద
ఎంత మందికి దర్శనం ఇవ్వగలవో అలోచించావా స్వామీ???
“!!!!””
“పోనీ.. ఇంత సేపు వేచియుండడం వలన నీ దర్శన
భాగ్యం సెకనుకి మించి ఇస్తున్నావా? ఎంత సమయం లైనులో వేచియున్నప్పట్టికీ నువు మాకు
ఇచ్చే దర్శన సమయం క్షణాల్లోనే ఉంటుంది స్వామీ”
’!!!!”
శబరిమల అయ్యప్ప స్వామి తన భక్తులందరికి ఒకే
రకమైన దర్శనం యిచ్చినప్పుడు నీవు ఎందుకు అలా ఇవ్వలేవు స్వామీ””
“ నాయనా.. నువు నా దర్శనానికి వచ్చిన సందర్బంలో
నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసాను కదా... ఇకపోతే దర్శనానికి గంటల సమయం
తీసుకొన్నప్పట్టికీ, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంపర్టుమెంటులో కూర్చుండబెట్టి
ఫలహారాలు కూడా అందించాను కదా! అటువంటప్పుడు ఇబ్బంది ఎందుకు నాయనా నీకు”
స్వామీ నేను వచ్చింది మీ దర్శన భాగ్యం కోసం
తప్ప, వారు పెట్టే ఫలహారాలు తినడానికి కాదు స్వామీ.. పొద్దుటే తలరా స్నానం చేసి
పరకడుపుతో మీ దర్శనం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటాం స్వామీ మేము. అలాంటి వారికి
ఫలహారాలు యితర సౌకర్యాల అవసరమేంటి స్వామీ”
“ఊ...”
ఎన్నన్ని ఉన్నప్పట్టికీ, గంటలకు పైగా సమయం
వేచియుండవలసినప్పటికీ, మాకన్నా ముందుగా వి.ఐ.పి. మరియు ధనిక భక్తులకు నీ దర్శనం
కల్పించినప్పటికీ, నీ దరికి రాగానే అవన్నీ మర్చిపోయాను స్వామీ””
“!!!!!”
“ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ఆ ఆపూర్వ
క్షణాలు దగ్గరవగానే నా మది నుండే నువ్వే స్వామీ.. నిండైనా నీ విగ్రహరూపంను నా
కనులారా వీక్షించగానే.. నా మనసులో నీ దివ్యమైన రూపం ముద్రవేసుకుంటుండగానే ఎవరో
రెక్కపట్టుకొని ఒక్కసారే ప్రక్కకు లాగేసారు స్వామీ నన్ను”
“!!!!!!”
అంత సమయం పాటు మమ్మల్ని వేచియుంచేలా చేసి కనీస
సమయం కూడా నీ దర్శన భాగ్యం కల్పించలేకపోయవా స్వామీ”
“!!!!!”
కానీ స్వామీ క్షణకాలం పాటైనా నిను కనులారా
వీక్షించునందుకు ధన్యుడయ్యాను స్వామీ నేను””
“తధాస్తు నాయనా”
“ధన్యవాదములు స్వామీ”
“మరీ మరల ఎప్పుడు వస్తున్నావు నా దర్శనానికి”
“మరల ఇప్పుడిప్పుడే రాను స్వామీ.. ఒక వేళ వస్తే
వి.ఐ.పి. దర్శనానికి నా స్వంత వెహికల్ లోనే వస్తాను స్వామీ! ఒక సామాన్య భక్తుడుగా
మాత్రం రాను స్వామి!”
No comments:
Post a Comment