Sunday 9 December 2012

భారతీయ “ఇడియట్స్”..


భారతీయుల్లో తొంభై శాతం మంది ఇడియట్స్ అని వ్యాఖ్యానించిన మార్కండేయ కట్టూ వ్యాఖ్యలు వింటే నాకు కరెక్టే అనిపించింది. అంతే కాకుండా వీరిని మతం లేదా కులం ప్రతిపాదికన చాలా ఈజీగా ప్రభావితం చేయవచ్చునని  అన్న మాటల్లో యదార్దం ఉంది. వీరిలో ఉన్నత వర్గాలు, విద్యావంతులు కూడా ఉండడం చాలా విచారకరం. చాలా మంది ప్రజలు లేదా విద్యావంతులుకు పార్లమెంటు చేసే చట్టాలు గురించి కనీస అవగాహన లేక సమాచారం లేనప్పటికీ, ప్రభుత్వాలు లేదా పార్టీలు చేసే మతపరమైన ప్రకటనలకు మాత్రం చాలా తొందరగా ప్రభావితం కావడం మన వ్యవస్దలో ఉన్న లోపం. అంతే కాకుండా తాము ఎన్నుకునే నాయకులను కూడా మత, కుల ప్రతిపాదకన ఎన్నుకోవడం ఏ విధముగా అనుకోవాలి. పైగా సదరు మత, కుల ప్రతిపాదకన ఎన్నిక కాబడిన నాయకులు దేశానికి ఏమి చేసారన్న దాని కన్నా, తమకు ఏమి చేసారన్న దానిమీదే దృష్టి ఉండడం ఇడియట్స్ లక్షణాలు కాకపోతే ఏమనాలి? న్యూడిల్లీలో మత ఘర్షణలు రేకేత్తించడానికి ఒక రెండు వేలు రూపాయలు చాలు. దానితో ప్రజల మధ్య ఉద్రికత్తలు సృష్టించవచ్చు. దానికి చేయవలసినదల్లా ఏదైన ఒక మత స్దలంను అపవిత్రం చేయడం అన్న ఖట్టూ వ్యాఖ్యలు చూస్తే అందులో వంద శాతం నిజముందని చెప్పవచ్చు. ముందుగా ప్రజలు వివేకంతో ఆలోచించగలగాలి. ఆ రోజే వాస్తవానికి ఏమి జరుగుతుందన్నది గమనించగలరు. ఆ వివేకం నేటి విద్యావంతుల్లో కూడా కొరవడడం చాలా విచారకరం.

4 comments:

  1. Well, What about his comments on Kashmir? Do you agree, the only solution for Kashmir problem is reunification? If Indians are Idiots, Pakistanis are much more than that? How this so-called visionary can't see this fact?

    ReplyDelete
    Replies
    1. శ్రీకాంత్ గారు,
      కట్టూ గారు మాట్లాడిన పూర్తి వ్యాసంలో కేవలం ఒక దాని గురించే నేను మాట్లాడాను. మీరన్నట్టు కట్టూ గారి అభిప్రాయాలు అన్ని విషయాల్లో ఎక్సెప్ట్ చేయలేము. మీరన్నట్టుగా కాశ్మీర్ విషయములో. ఇకపోతే మనల్ని పాకిస్దానీలతో పోల్చుకోలేము. ఆ విధముగా చెప్పుకుంటే పాకిస్తానీలు బెటర్ అనవచ్చు, తాలిబాన్లు మొ.గు వారితో పోల్చుకుంటే....నేను భారతీయ ప్రజలను వేరే ఎవరితో పోల్చి కామెంట్ చేయలేదు. కేవలం మన దేశంలో ఉన్న పరిస్దితి గురించి మాత్రమే భాదపడ్డాను.

      Delete
  2. మన ప్రజలకు అజ్ణానంతో కూడుకున్న ఆవేశం తప్ప, ఆలోచనా శక్తి లేదు అనే చెప్పాలి, నశించింది అంటే ఇంకా బాగుంటుంది. ఇక నాయకులకి వారి అధికారం, డబ్బు తప్ప ప్రజలు ఎలా ఉన్నా వారికి అక్కల్లేదు. Elections అప్పుడు జనం ముందుకు వస్తారు, అది ఓట్ల కోసం, పదవులు వచాకా, దేశం మీద పడి ఎంత దోచుకోగలిగితే అంత దోచుకుంటారు. ఇక జనాన్ని పిచ్చి వాళ్ళని చేచి ఆడుకుంటారు. మన దేశం మొత్తం scam లు, అవినీతి....
    కాంగ్రస్ ప్రభుత్వం : మొన్న పార్లమెంటులో FDI బిల్లు పెట్టి ఓటింగ్ వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు..........

    ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి.,.........

    మన తరవాత తరాలవారికి, మంచి భారతీయ వాతావరణం ఇవ్వగలమా???

    ReplyDelete
    Replies
    1. "అజ్ణానంతో కూడుకున్న ఆవేశం తప్ప, ఆలోచన శక్తి లేదు"
      "మన తరవాత తరాల వార్కి, మంచి భారతీయ వాతావరణం ఇవ్వగలమా"
      కరెక్టుగా చెప్పారు... ధన్యవాదములు

      Delete