Tuesday 18 December 2012

మరి మిగతా ఆటగాళ్ల మాటేంటి?

సచిన్ కి ఆడాలని  ఉన్నప్పుడు అతనిని
రిటైర్ ఆవమని అడగడం ఉత్తమం కాదు.
తనకి ఆడాలని కోరిక ఉన్నప్పుడు మనం
అడ్డుకోవడం భావ్యం కాదు అని విశ్వనాధన్
ఆనంద్ పాటుగా చాలా మంది కామెంటిచ్చారు...

మరి ఇప్పటికీ కూడా ఆడగలిగే సత్తా మాత్రమే కాదు,
నిలబడి గెలిపించే సత్తా ఉన్న రాహుల్ ద్రావిడ్,
వి.వి.ఎస్.లక్ష్మణ్ విషయములో ఎందుకు చెప్పలేదు...

ఆడాలన్న కోరిక ఉండడానికి, తన వల్ల దేశానికి
గల ఉపయోగానికి  మధ్య ఉన్నతేడాని తెలుసుకోవాలి.
ఆడాలన్న కోరిక ఉన్నంతకాలం ఆటగాళ్ళను ఆడిస్తే
ఇక ఎవరూ రిటైర్ కానవసరం లేదు...

సచిన్ లెజెండర్ ప్లేయర్... ఇది ఎవరూ కాదనలేని
వాస్తవం.. కాని అది టీమిండియాకి ఉపయెగపడినంత
వరకే.... ఆటగాడు తన వ్యక్తిగత ప్రదర్శన దేశ క్రికెట్ కి
ఉపయెగపడినంత వరకే విలువుంటుంది.....

అందుకే రికి పాంటింగ్ కూడా సచిన్ కన్నా లారానే ఉత్తమ
క్రికెటర్ అని కితాబిచ్చాడు. ఎందుకంటే లారా ఆట
టీమ్ యొక్క లక్ష్యాలను బట్టి సాగుతుంది. క్రికెట్ అడడం
టీమ్ యొక్క లక్ష్యాలను బట్టి సాగాలే కాని తమ లక్ష్యాల బట్టి
సాగకూడదు.....


2 comments:

  1. Babai .. Lara form lo lenappudu kuda 5 yrs team lone unnadu. Comparison is not good

    ReplyDelete
  2. సచిన్ రిటైరు అవ్వాలని అడగడం సబబు కాదు. అయితే ఎంత చెత్తగా ఆడినా తనకు స్థానం ఇవ్వాలని అడిగే హక్కు ఎవరికీ లేదు. సచిన్ గౌరవంగా రిటైరు అయితే టీము నుండి వేటు వేయించుకునే అగత్యం తప్పుతుంది

    ReplyDelete