Monday 26 December 2011

పల్లె పాడవుతుంది.....

ఈ రోజు వృత్తిరీత్యా పట్టణాల్లో ఉంటున్న వారందరికి తప్పకుండా ఏదో ఒక సమయములో పల్లెలో గడిపిన నేపధ్యముంటుంది. వారందరిని ఒకసారి కదిపి చూస్తే, వాళ్ళ అంతరంగాల్లో పల్లెతో మమేకమైన అనేక అనుభూతులు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ప్రతి ఒక్కరికి తమ, తమ ఊళ్ళలో గడిపిన విషయాలు తల్చుకోవడం ద్వారా రీచార్జి ఆవుతుంటారు. ఎందుకు వారందరికి తమ తమ ఊరు లేక పల్లె లంటే ఇష్టం? ఇలా అడిగితే సమాధానము చెప్పడము కష్టం కదా! అంటారు. ఎందుకంటే పల్లెతో ముడిపడిన మన బాల్యం యొక్క ప్రతి తీపి గురుతు ఇప్పటికీ మన మనసుల్లో మెదలుతూ ఉంటుందీ కాబట్టి. ఉదయాన్నే తాతయ్య, నాన్నలతో కలసి చేనుకి వెళ్తాని మారాం చేసి వెళ్ళడం, అక్కడ గేదేలు మరియు యితర పశుపక్షాదులను చూడడం, లేగ దూడని కట్టు వివ్పేసి తల్లి గేదే దగ్గర వదిలేయడం. అది చూసి పెద్దవాళ్ళు మందలించడం. బడికి వెళ్ళడానికి మారాం చేస్తే, అమ్మ మన జేబులు నిండా తినుబండారాలు నింపి పంపడం, బళ్ళో ఎక్కాలు సరిగా చెప్పలేదని పంతులు గారు గోడ కూర్చిలు వేయించడం, చింత బద్ద తో తొట్టు తేలేలా కొట్టడం, బడి ఆయిపోయాక పొలం గట్టులంటా పరిగెట్టి ఊరి చివరనున్న చెరువులో దూకడం. ఇలా చెప్పుకుంటే పోతే, వాటనన్నిటిని రాయడానికి ఈ పేజి సరిపోదు., ముఖ్యంగా చెప్పుకోవలసినది, ఆనాడు పల్లెల్లో ఉన్న అనుబంధాలు గురించి. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వలన వ్యక్తుల మధ్య అనురాగాలు ఏ విధముగా ఉండేవో చెప్పన్నక్కర్లేదు. అంతే కాదు.. కుటుంబం మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండేవారు. వారందరిని కూడా ఏదో ఒక వరుస కలపి అక్క, బావ, అత్త, పెద్దమ్మ, పిన్నమ్మ, చిన్నాన్న, మావయ్య అనే పేర్లుతోనే పలుకరించేవారు. భోజనాలు ఆయిపోయాక చుట్టుప్రక్కలా ఆడాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకొనే సందర్బాలు చూడడానికి చాలా బాగుండేవి. కష్టసుఖాలు అన్ని అందులోనే మాట్లాడుకొనేవారు. ఇక పోతే గురు శిష్య బంధముల గురించి. బళ్ళో మాస్టారంటే అందరికి ఉచ్చే.. అంత భయముండేది మాకు మా మాస్టార్లంటే... ఏ మాత్రము చిన్న తప్పు జరిగినా, దానికి తగిన శిక్ష ఖచ్చితముగా ఉండేది. పైగా ఆ విషయము ఇంట్లో తెలియకుండా జాగత్తపడేవాళ్ళం. ఎందుకంటే ఇంట్లో తెలిస్తే మమ్మల్లే తప్పుబడతారని భయపడేవాళ్ళం.
కాని ఇప్పుడు అదే పల్లెలకు వెళ్ళి చూడండి.. పైన చెప్పినవేవి ఇప్పుడు కనబడడం లేదు. ఉమ్మడి కుటుంబాలు పోయాయి. చుట్టుప్రక్కల వాళ్ళతో మాట్లాడాలంటే ప్రెస్టేజి. అందరితో బంధుత్వాలు కలుపుకొని మాట్లాడలంటే దాన్ని అతిచనువుగా భావించడం. ఆడాళ్ళందరూ ప్రక్కవాళ్ళ మీద చాడీలు చెప్పి గొడవలు పడడం. ఇలా చెప్పుకుంటే పోతే ఈ పేజి చాలాదేమో రాయడానికి. కాలముతో పాటు ఎన్ని మార్పులు వచ్చినప్పటికి మనకు మాత్రము మన పల్లెంటే ఉన్న మమకారము పోదు కాబట్టి, ఇంకా ఖాళి దొరికినప్పుడు, పల్లెకి వెళ్ళి కూసింత మనశ్శాంతి కోరుకుంటాము. కాని అక్కడ పరిస్దితులు పట్టాణాల కన్నా దారుణంగా తయారయ్యాయి. మొన్న ఆ మధ్య మా ఊరు వెళ్ళినప్పుడు, అక్కడ మా స్కూల్ లో జరుగుతున్న ఒక భాగోతం గురించి నా స్నేహితుడు చెప్పినప్పుడు ఒకింత షాక్ కి గురయ్యాను. అదేమిటంటే, మా ఊరి హైస్కూల్ లో తొమ్మిది మరియు పదవ తరగతి అమ్మాయిలను ఆ స్కూల్లో పని చేస్తున్న కొంత మంది మాస్టార్లు లొంగదీసుకొని వాడుకుంటున్నారని. ఎంత దౌర్బాగము ఈ పరిస్దితి. బంధాలన్నింటిల్లోను అత్యంత పవిత్రమైన గురుశిష్యుల బంధం ఈ స్దాయికి దిగజారుతుందని కలలో కూడా ఊహించలేదు. విద్యార్ది జీవితమును గాడిలో పెట్టి సరయిన దిశానిర్దేశము చూపించవలసిన గురువులు ఇటువంటి నీచపనులకు తెగబెడడం ఎంత దారుణమో తెలుస్తుంది. ఇంకా ఇంత కన్నా దుర్బరమేమిటంటే, విద్యార్దినులు కూడా ఈ రకమైన చర్యలకు ఉత్సాహము చూపించడం. విద్యార్దినిలకు తెలిసి, తెలియకో చేస్తున్న తప్పులను తల్లిదండ్రులు గుర్తీంచకపోవడం. ఈ విధమైన వాతావరణం వల్ల అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతుంది. ఈ విధముగా స్కూల్ స్దాయి నుండి బయటకు వచ్చిన విద్యార్దినిలు సదరు చర్యలను ఇంటర్ స్దాయిలో కూడా కొనసాగించడం చాలా దారుణం. ఇది మీకు నమ్మదగినదిగా కనబడకపోవచ్చు. కాని చాలా పల్లెల్లో ప్రస్తుతం ఇటువంటి పరిస్దితే రాజ్యమేలుతుంది. నిజానికి చెప్పాలంటే పల్లెటూర్ల అమ్మాయిల కన్నా, పట్టణాల అమ్మాయిలే కొంత నయము అనేపించేలా ఉన్నాయి ఈ సంఘటనలు. అలాగని పల్లెల్లో అందరూ అమ్మాయిలు అలాగే తయారయ్యరని చెప్పలేము. కొన్ని, కొన్ని పెద్ద కుటుంబాల్లోని పెద్దలు తమ పిల్లలను కనిపెట్టుకొని ఉండడం మరియు మంచి, చెడులు వివరించడం ద్వారా కొంత మంది పద్దతిగానే పెరుగుతున్నారు. మిగతా కుటుంబాలులోని తల్లిదండ్రులిరువురూ పని నిమిత్తము కూలి పనులకు వెళ్ళిపోవడం, మరియు తమ పిల్లలపై సరయిన దృష్టి పెట్టడం తదితర కారణాల వల్లన, కొంత మంది ఉపాధ్యాయులు ఇలాంటి విద్యార్దినులను ఎంచుకొని లొంగదీసుకుంటున్నారని తెలిసింది. ఇది ఎలాంటి నీచమైన సంసృతికి దారితీస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఈ విషయమై పిల్లల తల్లిదండ్రులు కూడా కలసికట్టుగా రావడం లేదు. మనది కానప్పుడు మనకెందుకొచ్చిన గొడవలే అని తప్పించుకుంటున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళ ఇంట్ళొ పిల్లకే ఆ ఘోరం జరిగినప్పుడు ఏంటి పరిస్దితి?? ఈ విధమైన పరిస్దితిని ఆ ఉపాధ్యాయులు గమనించి, తమ పనులను నిర్బయంగా కొనసాగించగలుగుతున్నారు. చివరికి విసిగివేసారి సీనియర్ స్టూడెంట్స్ కొంత మంది సదరు స్కూలుకి వెళ్ళి ప్రదానొపాధ్యాయలు వారిని నిలదీస్తే, ఆయన తనకు ఈ విషయము తెలియదని చెప్పారంట.. మీరే చెప్పండి ఇప్పుడు... పల్లె పాడవుతుందా... లేదా.........

2 comments:

  1. సమాజమే చెడు మార్గం లో పయనిస్తుంటే
    దానికి పట్నం , పల్లె అన్న తేడాయే లేదు బాస్
    విష సంస్కృతి పట్నాల నుండి పల్లెలకూ పాకింది.
    పల్లె అయినా పట్నం అయినా మనిషి డబ్బు వెనకాలే
    పరుగెడుతున్నాడు.
    ఆ డబ్బు సంపాదించాలనే తొందరలో
    కుటుంబంలో పిల్లలకు ఆత్మీయతను అందించడం
    మరచిపోతున్నాడు.
    మరి ఆ గౌరవాన్ని, ఆత్మీయతను మరిచిపోయి
    ఏవేవో ఆశలకు ఎగబడే పిల్లలు యుక్త వయసులో
    ఎన్ని దారుణాలకు బలి అయిపోతున్నారో ఆ దేవుడకే తెలియాలి.
    ఈ దారుణాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి.
    మీరు చెప్పిన పచ్చని సంస్కృతి గల పల్లెల్లు ఎప్పుడో అంతరించాయి.
    వ్యవసాయం చేయలేక లేబర్ కూలీలుగా ఎంత మంది పట్నాలకు వలస వెళ్ళడం లేదు
    పట్నాలలో ఎన్ని రుచులు మరగడం లేదు
    "పల్లె కన్నీరు పెట్టి చాలా కాలమే అయ్యింది"
    మీ టపా మాకు ఆలస్యంగా అందిందంతే..

    ReplyDelete
  2. చైతన్య గార్కి దన్యవాదములు,
    మీరు చెప్పినవన్ని అక్షర సత్యాలు... కాని అది నిజం కాకుంటే ఎంత బాగుణ్ణు అనిపిస్తుంది.
    పట్నం ఎలాగు కల్తీ ఆయిపోయింది.... కనీసము పల్లెలయిన కల్తీ లేకుండా ఉంటే బావుణ్ణననిపిస్తుంది....

    ReplyDelete