యస్. ఇప్పటి వరకు నేను ద్వేషిస్తున్న సంవత్సరముల్లో 2011 సంవత్సరము కూడా ఉంది. నాకు మాత్రమే కాకుండా, చాలా మందికి కూడా ఈ సంవత్సరము కలసి రాక ద్వేషిస్తూ ఉండొచ్చు. నాకు మాత్రము ఈ సంవత్సరము మానసికంగా చాలా ఇబ్బందికర పరిస్దితులు కల్గించింది. నాకు ఎంతో ఇష్టమైన కుటుంబ సభ్యులను కొంత మందిని దూరము చేసింది ఈ సంవత్సరమే. నేను మొదటి నుండి కూడా కుటుంబంతో ఉన్న క్షణాలను పూర్తి స్దాయిలో అస్వాదించేవాడిని. సరిగ్గా రెండేళ్ళ ముందునాటికి ఉన్న పరిస్దితికి, నేటికి ఎంతో మార్పు వచ్చేసింది. మార్పు ఎప్పుడైనా సహజమే అనుకొండి. కాని ఆ మార్పు నన్ను ఇబ్బంది పెట్టే స్దాయిలో ఉండడమే సమస్య. అదీ కుటుంబ సమస్య కావడమే అన్నింటికన్నా బాధాకరం. అందరికి ఉన్న సామాజిక సమస్యలు నాకూ వచ్చాయి. కాని వాటిని ఎప్పుడూ సమస్యలుగా భావించలేదు. కాని నా కుటుంబ సభ్యులలో వచ్చిన కొన్ని మార్పులు మానసికంగా ఇబ్బంది కల్గించాయి. రెండేళ్ళ క్రితం వరకు మానసికంగా నేను చాలా హ్యాపిగా ఉండేవాణ్ణి. ఎందుకంటే నా సోదరి మధుమతి, కజిన్ బ్రదర్స్ వేణు, ఆశోక్, మధు మరియు మా అత్తయ్య గారి పిల్లలుతో కలసి మొత్తముగా ఒక గ్రూప్ గా ఉండి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందులో బాగా తమ్ముడు మధుబాబు గాడితో అనుబంధం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే మాలో ఎపరికన్నా కమ్యూనికేషన్ గ్యాప్ లేక చిన్నచిన్న మనస్పర్దలు ఏమైనా వస్తే వాటిని దగ్గరుండి పరిష్కరించి కలిపేవాడు. పైగా వాడు మాకు దగ్గరలోనే ఉన్న యానాం రీజెన్సీ కాలేజిలో ఇంజనీరింగ్ చదివేవాడు. దానితో ప్రతి అదివారము కాకినాడలో ఉంటున్న మా ఇంటికి వచ్చేసేవాడు. ఇక ఆ అదివారమంతా ఇక్కడే ఉండేవాడు. తర్వాత మా చెల్లితో కూడా ఎంతో అప్యాయతతో ఉండేది. ఇకపోతే తర్వాత చెప్పవలసినది ఆశోక్ గురించి. తాను కూడా నేనంటే చాలా అభిమానము చూపించేవాడు. అంత హ్యాపిగా ఉన్న మా అనుబంధం చాలా వేగముగా విచ్చిన్నమయిపోయిందంటే నమ్మలేకున్నా. చెల్లి పెళ్ళి జరగడంతో తనతో ఉన్న ఎటాచ్ మెంట్ కొద్దిగా తెగిపోయింది. తర్వాత సంవత్సరమే మధుబాబు ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. దానితో నా ఎంజాయ్ మెంట్ లైఫ్ లో శూన్యత ప్రవేశించింది. మా బ్యాచ్ కుదించుకుపోవడంతో ఇక మిగిలిన ఆశోక్ తో ఎటాచ్ మెంట్ బాగా పెరిగింది. ఎంతగా అంటే చాలా ఎక్కువగా, ప్రతి విషయము తనతో పంచుకోనిదే పడుకోకపోవడమంతగా....
