సత్తిరాజు లక్ష్మినారాయణ అంటే అందరికి తెలియకపోవచ్చు గానీ,
బాపు అంటే తెలియని తెలుగువాడు ఉంటాడా?? ఒక వేళ తెలియదంటే ఆడు తెలుగోడే
కాదంటాన్నేను...
ఆయినా మీరేమిటండీ బాపు గారు..... ఇలా తెలుగుబాషను, తెలుగువారిని ఆనాధలను
చేసిఎల్లిపోవడం ఏ మాత్రం బాలేదు..
మొన్ననేగా రమణ గారిని కోల్పోయి బోలేడు బాధలో ఉన్నాము. పోనిలే మీరయినా
ఉన్నారన్న భరోసా ఉండేది మాకు.. కానీ ఇప్పుడు రమణ గారి దగ్గరకి మీరు కూడా
ఎల్లిపోవడం ఏమి బాలేదండి...
పదహరణాల తెలుగమ్మాయి ఎలా ఉంటుంది అని అడిగితే మీ కధానాయికని చూపిత్తే
సరిపోతుంది కదా...
కధానాయిక స్నేహ అన్నా, చార్మి అన్నా పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదండీ నాకు..
కానీ రాధాగోపాలం, సుందరకాండ చూసిన తర్వాత అహా..ఏమందం అనిపించకుండా ఉండలేకపోయా...
దానికి కారణమేమిటంటారండీ... కేవలం మీ బొమ్మ కాబట్టేగా.....
“మడిసన్నాక కాసింత కలాపోసనుండాల” అని మీరు చెప్పించిన డవిలాగు ఇప్పటికీ అల్
టైమ్ ఫేమస్... ఆ డవిలాగుతోటే విలక్షణ నటుడైన రావుగోపాలరావు గారిని పరిచయం చేసిన ఘనత
మీదే కదా!!
రేఖమాత్రముగానే గీసే మీ కుంచె చిత్రాలు ఒకటా, రెండా ఎన్నెన్ని విషయాలు
చెప్పలేదు మాలోటివారికి... ఒక చిన్ని కార్టూన్ బొమ్మతో ఎన్నెన్ని కితకితలు
పెట్టేవారండీ మీరు.... స్వాతి వారపత్రిక కానీ లేదా ఏ వారపత్రికలోనైనా మీ కార్టూన్
చూడగానే కింద పేరు చూడకుండానే మీ కుంచె నుండి జాలువారిన బొమ్మలను బట్టే
చెప్పేసుకొనేవారము అది బాపూ గీసిన బొమ్మ అని.... ఒక మాట మాటడకుండానే బొమ్మతో
కితకితలు పెట్టడం ఎవరికీ చేతనయింది బాపూ గారు... మీకు తప్ప....
ఎన్నెన్ని బొమ్మలండీ..మీ కుంచె నుండి రాలినవి... అన్నింటిలోనూ మాదుర్యమే....
దేవుళ్ళు, దేవతలు దగర నుండి అందాల నెరజాన వరకు.. ఒకటా, రెండా
లెక్కేట్టుకోడానికి... వీటికి తోడు బుడుగు ఒకడు... ఏమి చెప్పమంటారు వాడు చేసే
అల్లరి అంతా..ఇంతనా.......
ఇన్నిన్ని చేసి తెలుగువారిని కితకితలు పెట్టించి, నవ్వించి, ఇప్పుడు ఇలా
ఏడిపించడం మీకు ఏ మాత్రం తగదండీ...
మీ రమణ గారు పోయినపుడు మీరేమన్నారు!! “నను గోడలేని చిత్తరును చేసి వెళిపోవాయా”
అని..
మీరు ఇపుడు మీరు చేసిన పని ఏమిటండీ బాపుగారు... “తెలుగువారిని గోడలేని
చిత్తరువును చేసి వెళ్ళిపోయార కదా”
శ్రీశ్రీ, అరుద్ర లాంటి లబ్దప్రతిష్టుల కాలములో నేను పుట్టలేదు కానీ, మీరున్న
కాలములోనే నేను పుట్టానని నా తర్వాత తరం వారికి గర్వంగా చెపుకోవచ్చుగా బాపూ గారు.... శ్రీశ్రీ,
అరుద్ర గార్లు రాసిన రచనలు అందరికీ అర్ద్రం కాలేదెమో కానీ, మీరు పెట్టిన కితకితలు
చిన్నపిల్లాడి దగ్గర నుండి పెద్దవయసు వారి వరకు అందరినీ నవ్వించడం చానా
గొప్పండీ....
మీరు మీ రమణ గారితో కల్సి స్వర్గాన్ని కూడా కితకితలు పెట్టగలరు.. మీరు
ఎలిపోయారంటే నమ్మబుద్దేయట్లేదండీ...
Good one Rajeev.
ReplyDeleteBapu sir, first Telugu comic designer..in ur movies hero is always an ideal human.. Love u sir.. So much respect..
నాకు బాపు సినిమా లన్నింటి లోనూ స్రీనాధ కవి సార్వభౌముడు చాలా ఇష్టం.రామారావు చాలా సహజంగా నటించిన గొప్ప సినిమాల్లో ఇది నెంబర్ వన్. ముఖ్యంగా చివర్లో రాజు గారి దగ్గిర్నించి మళ్ళీ ఆహ్వానం వస్తుందని తెలిసి పాత శాలువా దులిపి వేసుకునే సన్నివేశంలో రామారావు అద్భుతంగా జీవించాడు. ఒక మహాకవి ప్రాభవాన్ని పోగొట్తుకుని బతికి చెడ్ద స్థితిలో మళ్ళీ పాతరోజులు వస్తాయేమోనని సంబర పడే సన్నివేశాన్ని దర్సకుడూ నటుదూ చాలా గొప్పగా చూపించారు.ఇద్దరూ ఇద్దరే!
ReplyDelete