Tuesday, 26 August 2014

మట్టి గణపతికి జై..



భూలోకానికి వచ్చి పూజలు అందుకొనే శ్రీ గణపతుడు తిరిగి తన స్వస్దలంనకు వెళ్ళాలంటే గణపతిని సంప్రదాయపద్దతిలో నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేయడమంటే చెరువులోనో, నదిలోనో, సముద్రంలోనే పడేయడం కాదు.. ఆ గణపతి స్వరూపం పూర్తిగా నీటిలో కరిగిపోవాలి. అప్పుడే ఆ గణపతి సంపూర్ణముగా తన స్వస్దలంనకు చేరుకున్నట్టుగా భావించాలి.. 

అంటే నీటిలో సంపూర్ణంగా కరిగిపోయే గుణం గల మట్టి గణపతి విగ్రహలనే పూజించాలి. అంతే కాదు మట్టి గణపతి విగ్రహాలు పూర్తిగా కరిగిపోవడం వలన పర్యావరణ సమతుల్యత స్దిరంగా ఉంటుంది...

కాబట్టి మట్టితో చేసిన గణపతి విగ్రహాలనే పూజించండి...

1 comment:

  1. అసలు మొదట యెవడు ఆ ప్లాస్తర్ ఆఫ్ పారిస్ తో చెయ్యడం మొదలు పెట్టాడో గానీ అప్పట్నించీ వేలం వెర్రి అయిపోయింది - ఆగుతుందో లేదో మరి!

    ReplyDelete