ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ
ఎన్నికల్లో దేశంలో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న అంశం ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ
ఎన్నికలే...
దానికి కారణం క్రేజివాల్ స్దాపించిన ఆమ్ అద్మీ
పార్టీ..
ఢిల్లీ
అసెంబ్లీలో పాగా వేసేందుకు కాంగ్రెసు మరియు భారతీయ జనతా పార్టీలతో సమానంగా ముందుకు
దూసుకువస్తున్న నూతన పార్టీ.... దేశంలో చాలా మంది యువత చూపు ప్రస్తుతం ఆమ్ అద్మీ
సాధించబోయే స్కోరు మీదే ఉంది...
ఏ రాజకీయ పార్టీలో చూసినా అవినీతిపరులే, ఎక్కడ
నీతి ఉంది? ఎక్కడ నిజాయితీ ఉంది? అన్ని ప్రశ్నించేవారు ఎక్కువగా ఉన్న నేటి సమాజంలో
ఇదిగో మేమున్నామంటూ ముందుకు వచ్చింది ఆమ్ అద్మీ పార్టి!
మన ఓటు- నిజాయితీపరులకే@ అన్న అంశంపై నా స్నేహితులతో డిస్కస్ వచ్చిన
చాలా సందర్బాల్లో చాలా మంది ఒక్కటే చెప్పేవారు! అదేమిటంటే, ఇప్పుడున్న వారిలో ఎవరు
నిజాయితీపరులు? అందరూ డబ్బులు తినేవాళ్ళే కదా? అలాంటప్పుడు ఎవరో ఒకరికి ఓటు
వేయాల్సిందే! ఉన్న వాళ్ళల్లో కొద్దిగా తక్కువ అవినీతి చేసిన వాడిని(ఇందులో ఇదొక
నిజాయితి) ఎన్నుకోక తప్పడం లేదు అనే వారు....
2009 ఎలక్షన్ల సమయంలో
రాజశేఖర రెడ్డి అంతటి అవినీతిపరుడు లేడు. అక్కడ కేంద్రంలో యూపిఏ ప్రభుత్వము
పీకిందేమి లేదు, అన్నింటా అవినీతే... పైగా కుంభకోణాలు పెరిగిపోయాయి, ధరలు
పెరిగిపోయాయి, అవి పెరిగిపోయాయి, ఇవి నాశనమయిపోయాయి, జనాలు గురించి
ఆలోచించేవాడొక్కడూ లేడు అని వాపోయారు కొంతమంది....
ఇంకొంత మందెమో చంద్రబాబునాయుడంతా
విశ్వాసఘతుకుడు ఇంకెక్కడ లేడు. వాడికి నిలువెల్లా విషమే... వాడి మామకే వెన్నుపోటు
పొడిచాడు. ఉద్యోగులను పీకి తింటాడు. వాడికి ఓటు వేస్తే మనం కొంత విషం తిన్నట్లే అన్నారు.....
ఆ సమయంలో వారికి లోక్ సత్తా పార్టిని
సూచించాను.. జయప్రకాశ్ నారాయణ్ తన ఐ.ఎ.ఎస్. ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతికి
వ్యతిరేకంగా లోక్ సత్తా సంస్దను స్దాపించారు. తదనంతరం అప్పట్లో మొదటిసారిగా లోక్
సత్తా పార్టి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పాలుపంచుకుంది. చాలా మంది నిజాయితీపరులైన యువకులను
రంగంలో నిలబెట్టింది. ప్రచారంలో డబ్బులు, మందు, తాయిలాలు పంచిపెట్టకుండా ఎలక్షన్స్
బరిలోకి దిగింది. తమ పార్టికి వచ్చిన విరాళాలను బహిరంగంపరిచింది. అంతే కాకుండా తమ
అభ్యర్దుల ఎలక్షన్ ప్రచార ఖర్చులను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు.
నిజాయితీగా చేసిన సదరు చర్యలు ప్రజలకేమి
కనిపించలేదు. పైగా లోక్ సత్తా పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉండదు
కాబట్టి ఆ పార్టికి ఓటు వేసినా ప్రయెజనం లేదని చెప్పుకొచ్చారు... అంటే ఇక్కడ చాలా
మంది కోరుకుంటున్నది నిజాయితీపరులైన రాజకీయ నేతలను కాదని చాలా సులువుగా అర్ద్రం
ఆవుతుంది. ఓటు వేసే మనలోనే అవినీతినేతల పట్ల ఎంతో కొంత అభిమానం ఉండి ఓటు వేయడం వేసి
గెలిపించడం వల్లే కదా, ప్రజల సొమ్ము ప్రక్క దారి పడుతుంది!
(ఇప్పుడు లోక్ సత్తా పార్టి మీద చాలా మంది యువత
గుర్రుగా ఉన్నారులెండి. అది వేరే విషయం)
చివరికి ఏమయింది... బాబుని విమర్శించేవారు
రెడ్డికి, రెడ్డిని విమర్శించేవారు బాబుకి ఓట్లు వేసి దులిపేసుకున్నారు. మధ్యలో పానకంలో
పుడకలా చిరంజీవి 18 సీట్లు
కొల్లగొట్టి, తదుపరి కాలములో కాంగ్రెసు పార్టికి గుంపగుత్తగా ఆమ్మేసుకున్నాడు....
ఇలా ప్రభుత్వాలు, అవినీతినేతలు ప్రజలు సొమ్మును
దుర్వినియెగం చేయడం, ఆ విషయమై ప్రజలు నేతలను అసహ్యించుకోవడం ఐదేళ్ళ పదవి కాలంలోని
మామూలు వ్యవహరమే... తిరిగి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మరల వారికే పట్టం కట్టడం
రివాజుగా మారింది....
ఇలాంటి వాటిని చూసి ఎక్కడో మండిన క్రేజివాల్
అనబడే ఒక ఐ.ఆర్.ఎస్. ఆఫీసర్ తన సర్వీసుని వదులుకొని దేశాన్ని ఉద్దరిస్తానని
బయలుదేరారు.. కొంత కాలం అన్నాహజారే అనే పెద్దాయన్ని వెంటబట్టుకొని “అవినీతికి
వ్యతిరేకంగా భారత్” అనే నివాదాన్ని ఎత్తుకొని హడావుడి చేసారు. దానికి భారత్ లో పలు
వర్గాలు, ముఖ్యంగా యువత మద్దతు ప్రకటించారు. పేసుబుక్కుల్లోను, ట్విట్టర్ లోనూ,
మిగతా సామాజిక నెట్టువర్కుల్లోను హోరెత్తించారు. (ఇలాంటివన్నీ వినడానికి,
ప్రక్కొడికి చెప్పడానికి మాత్రమే బాగుంటాయి. మనం స్వయంగా ఆచరించడానికి కష్టంలెండి
అనే బాపతెక్కువ ఇందులో). అలా చాలా కాలం
పెద్దాయనతో కలసి కాంగ్రెసు ప్రభుత్వం మనసు మార్చేద్దాం... దేశ భవితని మార్చేద్దాం
అని ఆశపడ్డారు.. కానీ అతని ఆశ అత్యాశ అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు!
దానితో ఈయనే ఒక పార్టిని ఏర్పాటు చేసి ఎలక్షన్స్ లో పోటి చేసి ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసి దేశాన్ని దున్నేయాలని కంకణం కట్టుకొని, అందులో మొదటి విడతగా ఢిల్లీ
అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి దిగారు.. అక్కడ ఎంపిక చేసిన అభ్యర్దుల సరాసరి వయస్సు 40 మాత్రమే.. అంటే మొత్తం యువ అభ్యర్దులనే
ఎంచుకొన్నారు. పైగా వివిధ రంగాల్లో పనిచేసుకుంటున్న, ఎటువంటి అవినీతి మచ్చలేని
నిజాయితీపరులైన యువకులు వారందరూ! అంతే కాకుండా ఒక్కొక్కొ నియెజకవర్గానికి ఆ
ప్రాంతానికి తగ్గట్టు మేనిపోస్టో తయారుచేసుకొన్నారు. (మిగతా పార్టిలకు దేశమంతా
ఒక్కటే మానిపోస్టో.. ఎందుకంటే మేనిపోస్టో ఏదైనా చివరికి చేసేది ప్రజల సొమ్ము
తినడమే కదా).
ఆ విధంగా ఇప్పుడున్న కాలంలో నిజాయితీపరులు
ఎవరున్నారు అని అమాయకంగా ప్రశ్నించే వారి కోసం, ఇదిగో అంటూ అమ్ అద్మీ పార్టిని
ముందుకు తెచ్చారు క్రేజీవాల్...
పైగా తమ పార్టి గుర్తు ఆయిన చీపురుని
గెలిపిస్తే అవినీతిని చీపురుతో మొత్తం ఊడ్చేస్తానని వాగ్దానమిచ్చారు.....
ఇక మిగతా పార్టిలు కాంగ్రెసు, బిజెపి గురించి
కొత్తగా చెప్పేదెముంది?
మరి ఢిల్లీ ప్రజలు ఎవరికి దారి ఇస్తారో
చూడాలి......
లోక్ సత్తా అధినేత, అమ్ అద్మీ అధినేత ప్రభుత్వ
సర్వీసులను వదులుకొని వచ్చిన వారే... ఇద్దరూ ప్రజలను జాగృతం చేయడానికి పార్టిలను
స్దాపించి ప్రజల తీర్పు కోరిన వారే.. అందులో జయప్రకాశ్ నారాయణ్ ముందుకు
వెళ్ళలేకపోయారు. మరి క్రేజివాల్ ముందుకు వెళతారో, లేక వెనుకడుగు వేస్తారో
వేచిచూడాలి.
ఢిల్లీ యువత సామాజిక నెట్ వర్కుల్లోను,
ఇంటర్నెట్ లోను, రోడ్ల మీద అవినీతిరహిత భారత్ గురించి హోరెత్తించడం కాదు.... అసలైన
ఆయుధం ఇప్పుడు చేతికి చిక్కింది.... ఆ ఆయుధంతోనే మనల్లి ఎప్పటి నుండో పీడిస్తున్న
అవినీతి భూతంని, దాని మీద స్వారీ చేస్తున్నా నేతలని ఒక్క వేటుతో పడగొట్టి
చంపేయాలి!
lol....
ReplyDelete