Friday 12 October 2012

దటీజ్ నరేంద్ర మోడీ...

2002 నాటి అల్లర్ల నేపధ్యంలో నరేంద్ర మోడీ ని మరియు గుజరాత్ ని బహిష్కరించిన బ్రిటన్ ప్రభుత్వం, ఇప్పుడు పదేళ్ళ తర్వాత బంధాన్ని పునరుద్దరించే చర్యలకు శ్రీకారం చుట్టడం హర్షనీయం...

ఇది కేవలం ఒక ప్రాంతంనో లేక ఒక వ్యక్తినో చూసి తీసుకున్న నిర్ణయం కాదు....

అల్లర్ల నేపధ్యంలో, అందులో ప్రధాన భూమిక పోషించారన్న నిందతో మోడీతో పాటుగా రాష్ట్రంతో పూర్తి స్దాయి తెగతెంపులు చేసుకున్న బ్రిటన్, ఇప్పుడు తన నిర్ణయం మార్చుకోవడం వెనుక వున్న బలమైన కారణం...

గుజరాత్ లో గత పదేళ్ళలో జరిగిన అభివృద్దే అనడంలో సందేహం లేదు....
దానికి అద్యుడైన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ యొక్క కృషిని గుర్తించింది....

ఆనాడు తన మీద నిందతో ఆగ్రరాజ్యాలన దగ్గ దేశాలు నిషేధం విధించినప్పటికీ, వెరవక తనకున్న అసలు బలం ప్రజాబలం అని భావించి, గుజరాత్ లో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధిని పండించారు.

తనపై పడిన నిషేదం గురించి ఆయన ఇసుమంతైన పట్టించుకోలేదు. తాను అనుకున్న పనిని నిస్వార్దంగా చేసారు.
అందుకే నేడు మోడీ అడక్కుండనే ఆగ్రరాజ్యాలే మోడీ ని తమ దేశానికి రావలసినదిగా ఆహ్హనిస్తున్నాయి.

అది భారతీయుడు పవర్.....

ఇది నరేంద్రమోడీ ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక భారతీయుడుగా సాధించిన ఘనత.....

ప్రతి భారతీయుడు ఇలానే ఆలోచిస్తే, ప్రపంచమే మన ముందు మోకారిల్లుతుందనడానికి మోడీ ఉదంతంను ఉదహరించవచ్చు.

అంతేకాని మన ప్రస్తుత ప్రభుత్వం విదేశియులు ముందు మోకారిల్లునట్టు కాదు.....


 

3 comments:

  1. Really that is Modi. I want to see him as our PM

    ReplyDelete
    Replies
    1. nijame meeku kadu, chala mandi ki alane undi..
      thanks for commenting..

      Delete
  2. నరేంద్ర మోడీ గొప్పతనం గురించి http://teluguvartalu.com/2012/09/28/%E0%B0%97%E0%B1%81%E0%B0%9C%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A7-%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6/ చదివి చెప్పండి.

    ReplyDelete