Friday, 5 December 2014

59, 66, 38, 28..


ఈ కొలతలేంటి! దేనికీ సెట్ కాకుండా వింతగా ఉన్నాయి అనుకుంటున్నారా?

మనం బ్లాగోపాఖ్యానం ప్రారంభించిన తర్వాత సం.రాల వారీగా నా మెదడులోంచి బయటపడిన పనికిమాలిన రాతల దొంతరలు సంఖ్య...

2011 లో మొదలుపెట్టిన నా రొద 59 పోస్టులు నుండి మొదలయి 2012లో ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్ళూరులో భూముల ధరల పెరిగినట్టు 66 కి పెరిగి ఆ తర్వాత 2013, 2014 ల నాటికి పెట్రోలు ధరలు క్రిందకి దిగుతున్నట్టుగా 38 అక్కడ నుండి 28కి పడిపోవడం చూస్తుంటే....

పెరుగుట విరుగుట కొరకే అని పెద్దలు ఏనాడో చెప్పిన సామెత గుర్తుకి వచ్చిందా మీకు!!

కానీ అది నిజ్జం కాదు సుమీ!!

నేర్చుకోవడం అనే ప్రక్రియ కొద్దిగా మందగించింది.. ఎందుకంటే స్వేచ్చగా బ్రతుకుతున్న నన్ను చూసి కొంత మంది కుళ్ళుకొని పెళ్ళి అనే చక్రబంధంలో బంధించేసారు కాబట్టి...  నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త విషయాలు తెలుస్తూ ఉంటేనే ఏదైనా రాయగలము..  అంతే కదండీ!!!

ఇక చెప్పేదేముంది... ఆ తర్వాత నేను నేర్చుకుంటున్నదల్లా ప్రపంచంలో పెళ్ళయిన తర్వాత ప్రతి జీవి పడే జీవిత విన్యాసాలే..... పోనీ అవయినా రాయచ్చుగా అనుకుంటే అలాంటివి చూడడానికే తప్ప రాతలకి అందనివి అని అర్ద్రం చేసుకోవడానికి పెద్దగా సమయం కూడా పట్టలేదు మరి నాకు...







1 comment:

  1. ఇంట్రెస్టింగ్.. టైటిల్ అండ్ పోస్ట్..ఫర్దర్ యేం రాస్తారా అని ఎదురుచూసేలా ఉందండి.

    ReplyDelete