Monday 22 April 2013

కావల్సినదేమిటి? కఠిన చట్టాలా- నైతిక విలువలా?

ఈ మధ్య కాలంలో మన దేశంలో అందునా రాజధాని నగరంలో వరుస బెట్టి మహిళలపై జరుగుతున్న దురాగతాలు భారతదేశ పరువును ప్రపంచం ముందు నడిబజారులో తీసివేసినట్టయింది....
ఇప్పుడు ఆ దురాగతాలు మహిళలకే కాకుండా అభం శుభం ఎరుగని చిన్నారులపై కూడా జరుగుతుండడంతో భారతదేశం ఎక్కడికిపోతుందన్న భయం కలుగుతుంది.....
వీళ్ళు చేసిన పనికి ఎంత భయం కలుగుతుందంటే... మన ఇంట్లో చిన్నపిల్లలను గమనించే చూపుల్లో ఏ చూపులో ఎటువంటి కౌర్యం ఉందో తెలియనంతగా...
లేదా వాళ్ళు చేసిన పనికి, మనకి తెలిసిన చిన్నపిల్లలను అపాయ్యంగా దగ్గరకు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేతంగా..
దీనికి కారణం మేమిటి? అకృత్యాలకు కఠిన చట్టాలు లేకపోవడమా? లేక మనలో నైతిక విలువలు లోపించడమా?
ఏది ఏమైనప్పటికి ఇది చాలా నిస్సిగ్గుకరమైన చర్య... ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఎంతో ఘనమైన చరిత్ర మరియు విజ్షాన సంపద కల్గిన అతి పురాతన దేశంలో నేడు ఇలాంటి పరిస్దితి దాపురించడానికి చాలా కారణాలున్నాయని అనిపిస్తుంది.....
కఠిన చట్టాలు లేకపోవడం వలనే ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయనీ, ఒక సారి కఠిన చట్టాలు తయారుచేసి సమర్దంగా అమలుచేస్తే ఇంకొకరు అలా చేయడానికి భయపడతారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అందరూ చట్టంనకు దొరుకుతారనీ భావించలేము... ముఖ్యంగా చట్టానికి భయపడి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు కానీ, అవకాశం వస్తే తమలో పశుప్రవృత్తిని చూపించడానికి వెనకాడరు. ఎందుకంటే అది తప్పు అని వారికి వారు భావించనంత కాలం ఇలానే ఉంటుంది....
దీనికి విరుగుడుగా యువతలో నైతిక విలువలు పెంపోదించవలసిన భాధ్యత తల్లిదండ్రులు మీదే ఉంది.నైతిక విలువలను వారి మనసుల్లో నూరిపోయడం ద్వారా పెరిగిన యువతలో ఏది తప్పొ, ఏది ఒప్పో తెలుసుకోగలిగితే ఇలాంటి ఆకృత్యాలను నిలువరించవచ్చు.
మనలో చాలా మంది మన దేశ సంస్కృత్తిని నిర్లక్శ్యం చేయడం వలనే నేటి యువతలో ఒక రకమైన విష సంస్కృత్తి పెరుగుతుందనడం కాదనలేని సత్యం.... ఒక మనిషి మంచిగా లేదా చెడుగా తయారయ్యాడు అంటే అతని చిన్నతనంలో పెరిగిన వాతావరణం, లేదా నేర్చుకొన్న నైతిక విలువలను బట్టి ఉంటుంది...
ఒకప్పుడు పెద్దలు తమ పెంపకంలో పిల్లలకు ఖచ్చితంగా నైతిక విలువలు అలవడేలా పెంచేవారు. కాని నేడు నైతిక విలువలు నూరిపోయకుండా వారు కోరినది తెచ్చి పెడుతున్నారు....
మన దేశ సంస్కృతి,సంప్రదాయాలు పిల్లలను ఎలా పెంచాలన్నదాని మీద బోలెడన్ని సూచనలు చేసాయి. కానీ నేటి పెద్దలు ఆ సూచనలను పెడచెవిన పెట్టి పాశ్చాత ధోరణికి అలవాటు పడిపోయి యువతలో విచ్చలవిడితనంను పెంచి పోషిస్తున్నారు.తద్వారా యువత ఏది మంచో, ఏది చెడో తెలుసుకొనే పరిపక్వత స్వయముగా సాధించలేకపోతున్నారు. ఫలితంగానే ఇలాంటి దారుణాలు మన పరువును గంగలో కలిపేస్తున్నాయి.
చట్టం ద్వారా చేయలేని పనిని నైతిక విలువలు పెంపోందించడం ద్వారా మాత్రమే చేయగలము.....
పెద్దలు తమ పిల్లలను సంప్రదాయాలకు అనుగుణంగా భారత దేశ సంస్కృతి తెలియజేయుచూ పెంచాలి. పెద్దలు తమ పిల్లలకు తాము కల్పిస్తున్న సౌకర్యాలు కన్నా నైతిక విలువలు ఏ మేరకు ఇవ్వగలుగుతున్నామో కూడా అలోచించుకోవాలి....
ఏ ఒక్క వ్యక్తి కూడా తనంతతానుగా నైతిక విలువలు అలవర్చుకోలేడు. ఎక్కడో కొంత మంది తప్ప....
ఒక మనిషి పశువులా ప్రవర్తించాడంటే, ఆ ప్రవర్తనకి ముందుగా తల్లిదండ్రులే భాద్యత వహించాలి... పెళ్ళి చేసుకొని సంసారం చేసి పిల్లలను కనేస్తే సరిపోదు... వారిని ఉత్తమంగా తీర్చగలగాలి. అలాంటి వారే పిల్లలను కనాలి... అంత ఓపిక,తీరిక లేని వారు పిల్లలను కనడమే మానివేయాలి....
 
 

3 comments:

  1. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. నేటి సమాజంలో అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడినవారు, జైలు జీవితం గడుపుతున్న వారు, నేరస్తులు అందరు తలెత్తుకుని నర్వంగా తిరుగురున్నారు. చేసిన పనికి సిగ్గు పడడం లేదు మరియు సంఘంలో తిరస్కరణకు గురికావడం లేదు. గిల్టీ కాన్షియస్ నెస్ పూర్తిగా పోయింది.

    ReplyDelete
  2. మొన్నెప్పుడో ఒక మంత్రి గారు సెలవిచ్చారు , తన మీద ఎన్ని C.B.I కేసులు పెడితే వాళ్ళ జిల్లాలో అంత పాపులారిటీ వస్తుందంట.

    ReplyDelete
  3. మీరు చెప్పినదానిలో నిజం లేకపోలేదు కానీ కేవలం తల్లితండ్రులదే తప్పు అనడం కొంచెం కష్టంగా వుంది. ఈ రోజులలో బయటి ప్రపంచం చాలా మార్పులతో కూడుకుంది. రిసార్ట్స్ , క్లబ్లు , వాటర్ గేమ్ పార్క్స్ వీటన్నింటిలో దేనికి ఫ్యామిలీతో వెళ్ళినా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోగాలిగేలా వున్నాయంటారా . ఆఖరికి స్కూల్ ట్రిప్స్ కూడా ఇలాంటి చోటకే వుంటున్నాయి. అన్ని ఆర్టిఫిషియల్ ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే . సిటీ లో గుడి తప్ప కుటుంబంతో వెళ్ళగలిగే నేచురల్ ప్రదేశాలు వున్నాయా . పార్క్ కు తీసుకు వెళ్ళండి పిల్లలని అక్కడకి లక్ష జంటలు పొదల మాటున, పిల్లలు తిరగేసి ఏమిటి అని పెద్దలని అడగక పోవడం మన అదృష్టంగా వుంటోంది . తాగిన మత్తులో చేసిన నేరాన్ని పరిగణనలోకి తీసుకోఖరలేదని ప్రభుత్వం తీర్మానం చేసి మరీ మద్యపానాన్ని వుద్దరిస్తోంది . తల్లితండ్రులు చెప్పిన నీతుల వల్ల పిల్లలు అంతవరకే ఆలోచించేసి వూరుకునే వాతావరణం అసలు ప్రపంచంలో వుందంటారా. ఏ తల్లితండ్రులూ తమ పిల్లలు అలా భయంకరంగా ప్రవర్తించాలని ఆశించరు కదా. కాబట్టి నైతిక విలువలు నిలబెట్టుకునే వాతావరణం చుట్టూ ప్రపంచంలో కూడా వుండాలన్నది నా వుద్దేశం. టీచర్ వృత్తిలో వుండి ఇటువంటి నేరాలు చేసేవారికి ఎవరు నేర్పగలరు నైతిక విలువలు బాధ్యతలు.

    ReplyDelete