చూస్తుంటే రాబోయే ఎలక్షన్స్ తర్వాత
రాష్ట్రంలో మొదటిసారిగా హంగ్ వచ్చే పరిస్దితులు కనిపిస్తున్నాయనిపిస్తుంది.....
మొన్న నా అప్త మిత్రుడి కూతురి మొదటి
పుట్టినరోజు వేడుకలకు రమ్మంటే తప్పనిసరై వెళ్ళాను. అక్కడ ఏమి తోచక సదరు
అప్తమిత్రుడి నాన్నగారితో పిచ్చాపాటి మాట్లాడడం మొదలుపెట్టాను. ఆయన మా ఊరి దగ్గర
ఉన్న ప్రక్క ఊరికి గ్రామ స్దాయి నాయకుడు.
ఏంటి మామ... వచ్చే ఎలక్షన్స్ లో ఎవరూ
వస్తారంటావ్ నేను అడిగాను....
వై.ఎస్.ఆర్.కాంగ్రెసు రావాలమ్మ అన్నాడు
మామ...
.jpg)
అదేంటి మామ అట్టాంటవ్.. ఇప్పటికే
బోలోడెంత ప్రజాధనం మొక్కి జైలుకూడు తింటున్నాడు కదా... ఇక మనకేమి చేస్తాడు అని
అడిగా....
ఆ.. బోడి ఎవడూ తినలేదు నాయనా ఈ
రోజుల్లో.... అది కామన్ ఆయిపోయింది కదా... ఎవడు పట్టించుకుంటున్నాడు ఇప్పుడు
అన్నాడు మామ....
అదేంటి మామ.. అధికారంలో లేకుండానే అంతోటి
అవినీతి చేసి డబ్బు కూడబెట్టిండు.. ఇక అధికారమిస్తే ఇంకెత చేస్తాడు? మనకేమి
చేస్తాడు అని చిన్నపిల్లాడిలా అడిగా...

అహా... ఏమి దహర్ద హృదయం మన తెలుగు
వాళ్ళది అనిపించక తప్పలేదు నా అంతరాత్మకి.....
జై జగన్...జై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్....
జై అవినీతి..... జై అవినీతి తర్వాత అభివృద్ధి అని గొంతెత్తి అరవలనిపించింది.....
మరి అలుపెరగని బాటసారిలా గత ఆరు నెలల
నుండి పాదయాత్ర ఆంటూ రోడ్డెక్కిన చంద్రబాబు పరిస్దితేంటి మామా అని అడిగా...
ఆ కష్టానికి సెక్ండ్ ప్లేస్ వస్తుందిలే,
కాంగ్రెసుకి మూడో స్దానమెస్తుంది అని అన్నాడయన... చాలా సింపుల్ గా....
హతవిధీ అనుకున్నా..... గ్రామ స్దాయి
నాయకుల్లో జగన్ మేనియా ఎంతుందో ఆ విధంగా ఎరుకయింది నాకు...
మర్నాడు టి.డి.పి. వీరాభియైన నా రూమ్మేట్
నాయుడు దగ్గర చెప్పాను జరిగిందంతా....
ఏంటి బాబూ పరిస్దితి అన్నాన్నేను... మరి
బాబు గారు పాదయాత్ర మంచి రేంజ్ లో జరుగుతుందాయే.... ఆ పాదయాత్ర రాబోయో అధికారానికి
బాట అని అందరూ భావిస్తున్నాము కదా......
నాయుడు అంతకన్నా చిదిలాస్వంగా నవ్వి ఇలా
సెలవిచ్చాడు....
బ్రదర్... రాబోయో ఎలక్షన్స్ కి ఏ
పార్టికి మెజారిటి రాదు. తెలంగాణాలో టి.డి.పి., వై.ఎస్.ఆర్.సి.పి.కి డిపాజిట్లు
కూడా రాకపోవచ్చు. అలాగే మిగిలిన సీమాంధ్ర స్దానాలను మూడు పార్టిలు పంచుకుంటాయి.
ఫలితంగా ఏ పార్టికి మెజారిటి రాకపోవచ్చు......
అప్పుడు పైనల్ గా కాంగ్రెసు మరియు
వై.ఎస్.అర్.సి.పి.కలిపి ప్రభుత్వంను ఏర్పాటు చేయోచ్చు... ఇందులో ఆశ్చర్యపోవలసిన
విషయమేమి లేదు...... అని సెలవిచ్చాడు.....
అంటే రాబోయో రోజుల్లో అభివృద్ధి
కాంగ్రెసు మరియు వై.ఎస్.ఆర్.సి.పి. నాయకుల ఇళ్ళలో జరుగుతుందన్న మాట... బాగుంది....
మరి మన ఇళ్ళల్లో అభివృద్ధి ఎప్పుడూ
జరుగుతుందబ్బా......
కల కనాలి ఈ రోజు రాత్రికి......
No comments:
Post a Comment