Thursday 9 February 2012

అగ్నిపధ్ - విందు భోజనం లాంటి సినిమా....


నిన్నంత ఎందుకో కాని చిరగ్గా ఉంది. ఏ పని చేయబుద్ది కావడం లేదని చెప్పి మధ్యాహ్నం సినిమాకు పోదామని ప్లాన్ చేసుకొన్నా. భోజనానికి వెళ్ళేటప్పుడు మెస్ దగ్గర గ్రూప్ సర్వీసులకు ప్రిపేరవుతున్న నా రూమ్మేట్ నాయుడుని అడిగా సినిమాకు వెళ్దాం వస్తావా అని? కాసేపు అలోచించి సరేనన్నాడు. ఏ సినిమాకు వెళ్దామని అడిగితే, వేరే అలోచన లేకుండా అగ్నిపధ్ సినిమాకు వెళ్దామని చెప్పా. అగ్నిపధ్ సినిమా రిలీజ్ ముందు నుండి దాని మీద మనకి చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. అసలు మనకు హిందీ సినిమాల మీద ఇష్టం కలగడమే అశ్చర్యం.

నేను చదువుల నిమిత్తం, ఆ పై ఉద్యోగ రీత్యా కాకినాడలో ఎప్పుటి నుండొ ఉంటున్నాను. కాకినాడ ప్రశాంతతకు మారుపేరు అని మీకు వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. ఎందుకంటే మంచి మంచి ధియేటర్లు ఉండడం వలన. నాలాంటి వారందరూ బుద్దిగా సినిమాలకు పోయి సోది చేయకుండా చూడడం వలన కాకినాడ ప్రశాంతంగా ఉంటుందని మా ప్రెండ్స్ నన్ను ఆట పట్టిస్తుంటారులెండి. మరి అంతలా చూస్తుంటాను సినిమాలను..

కాకినాడలో భానుగుడి వద్ద నున్న గీత్ లేక సంగీత్ ధియేటర్లో ఎప్పుడూ ఏదో ఒక హింది సినిమా ఆడుతుంది. మనం కాలేజి చదువులు వెలగ పెట్టిన రోజుల్లో చూడడానికి తెలుగు సినిమాలన్ని అయిపోతే, మిగిలిన హీంది సినిమాలు, ఇంగ్లీషు సినిమాలకు(పెద్దల సినిమాలు కాదులెండి) వెళ్ళడం అలవాటు ఆయింది. హింది సినిమాల్లో పాటలు, వారి యాక్టింగ్ చూసి, చూసి దిమ్మ తిరిగిపోయి హింది సినిమాలంటే పడిచచ్చేపోయేటంతగా తయారయింది మన కళాపోషణ. ఆ విధముగా కాకినాడలో వచ్చే ప్రతి హింది సినిమాకు నేను రెగ్యులర్ పేక్షకుడుగా మారిపోయాను.

వీడెంటి రా... అగ్నిపధ్ సినిమా టైటిల్ పెట్టి సొల్లంతా చెబుతున్నాడు అని అనుకుంటున్నారా?
అరె నిజమే కదా.... గమనించలేదు... వీడు సినిమా గురించి చెప్పాకుండా వీడి సొల్లు చెబుతున్నాడు అని అనిపించిందా మీకు.....

సరేలే విషయములోకి వచ్చేస్తున్నలెండి..
భోజనమవగానే నేను, నా రూమ్మేట్ కలసి తిన్నగా దేవి మల్టిప్లెక్స్ కి వెళ్ళిపోయాము (సినిమా అక్కడే అడుతుంది మరి). హింది సినిమాలన్ని గీత్, సంగీత్ ధియేటర్లో ఆడతాయని చెప్పి వీడెంటీ దేవి మల్టిప్లెక్స్ పోయాడు అని అనుకోకండి. ఎందుకంటే అగ్నిపధ్ సినిమాను ఇక్కడే రిలీజ్ చేసాడు మరి.

పోయి సినిమా ధియేటర్లో కూర్చున్నాము. మహ ఆయితే ఒక యాబయి మంది వరకు ఉండి యుంటారు లోపల.. ఎ.సి. అన్ చేయడంతో చల్లని గాలులు మమ్మల్లి సీటులో ఒదిగి కూర్చునేలా చేసాయి(చలి వేస్తుంది మరి). ఇంతలో మావోడు అన్నాడు. నాకు హింది రాదు ఎలా అని. వెంటనే నేను ఏమి పర్లేదు... సినిమాను అలా చూస్తుండు... మధ్యలో ఏదైనా జోకులోస్తే, హాలులో మిగతా వాళ్ళందరూ నవ్వుతారు కదా, అప్పుడు మనము కూడా నవ్వుదాం, క్లాప్స్ పడితే, మనము కూడా క్లాప్స్ కోడదాం అని చెప్పా. (నాకు హింది కొద్దిగా అర్ద్రమవుతుంది లెండి)..
ఇక సినిమా విషయానికి వస్తే అగ్నిపధ్ సినిమా విందు భోజనమ్ లాంటి సినిమా అని చెప్పోచ్చు.

చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది (అల్రెడి ఒకసారి చూసేశాను లెండి.. అప్పుడు రాయడానికి కుదరలేదు). అల్రెడి గతములో అమితాబ్ బచ్చన్ తో తీసిన అగ్నిపధ్ సినిమాను, మరల నేడు హృతిక్ రోషన్ ని పెట్టి తీయడమంటే సాహసమే...ఆయినప్పటికి హృతిక్ రోషన్ తన నటన ద్వారా సినిమాకు ప్రాణం పోశాడు. సినిమా చూస్తున్నంత సేపు నాకు ఒక్కప్పటి చిరంజీవి సినిమా చూస్తున్నట్టుగానే ఉంది.

ఇప్పుడు మనము చూస్తున్న సినిమాలన్ని సమెసాలు, బజ్జిలు, బర్గర్ లు ఆయితే, ఈ సినిమా విందు భోజనం లాంటి సినిమా అని చెప్పోచ్చు. ముఖ్యాంగా ఇందులో కధే మెయిన్ రోల్ అని చెప్పోచ్చు. రోటిన్ సినిమాలా కాకుండా కధకు తగ్గట్టుగా సినిమా తీయడంతో బాగా వచ్చింది.

కధకి ఇందులో ఎంత ప్రాముఖ్యత యిచ్చారంటే, సినిమా ప్రారంభమైన ముప్పావు గంట వరకు హిరో ఎంట్రన్స్ ఉండదు. కాని మనకు హిరో ముప్పావు గంట వరకు రాలేదన్న సంగతి తెలియనివ్వలేదు డైరెక్టరు. ఎందుకంటే అందులో నటులు కంటే పాత్రలే ఎక్కువగా కనిపించాయి.
హృతిక్ రోషన్ విజయ్ చౌహన్ పాత్రలో ఇమిడిపోయిన విధానం బాగుంది. ఇక తర్వాత చెప్పుకోవలసినది సంజయ దత్ పోషించిన విలన్ పాత్ర....

ఒకప్పటి బలమైన ప్రతినాయకులుగా ముద్ర వేసిన అంజాద్ ఖాన్, అమ్రిశ్ పురి, రఘవరన్ లాంటి వారిని గుర్తుకు తెచ్చాడు.

మిగిలిన పాత్రల్లో రిషికపూర్, ప్రియాంక చోప్రా, ఓం పురి మె.గు వారు వారి పాత్ర పరిధి వరకు అద్బుతంగా నటించి సినిమా అద్యంతం రక్తికట్టించారు.


ఇక చివరలో వచ్చిన కత్రినా కైఫ్ సాంగ్ గురించి చెప్పాలంటే, నోరు చాలదు. చుక్ను చమేలి అంటు సాగిన సాంగ్ తో సినిమాకు ఒక్క ఊపు తెచ్చేసింది.
ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని విన్నాను. ఒక వేళ అదే నిజమయితే కనుక, తెలుగులో ప్రభాస్ తప్ప వేరే ఎవరూ సూట్ కారు.
ప్రభాశ్ బాడీ ల్వాంగేజికి బాగా సూట్ అవుతుంది సినిమా. మరి సంజయ్ దత్ పాత్ర ఎవరు పోషిస్తే బాగుంటుందంటారు?? ఆ... మెహన్ బాబు ఆయితే కరెక్టుగా సూటవుతాడునకుంటా..... కాని మనోడు ఒప్పుకుంటాడంటారా? ఇక హీరోయిన్ గా తమన్నను తప్ప ఎవరిని తీసుకున్న వేస్టే. ఎందుకంటే ఇందులో హిరోయిన్ యాక్ట్ చేయవలసియుంటుంది కనుక. (ఇప్పుడున్న హిరోయిన్సులో ఎవరికి యాక్టింగ్ చేస్తున్నారో చెప్పండి?)
మీలో ఎవరయినా ఇప్పటికే అగ్నిపధ్ సినిమా చూసియుంటే, మీ అభిప్రాయమేమిటన్నది నాకు కొద్దిగా చెప్పండేయి....
మీకు వీలయితే తప్పక చూడమని రిఫర్ చేస్తాను నేను..........

2 comments:

  1. నాకు పాత సినిమానే నచ్చింది.

    ReplyDelete
  2. @Confused
    అమితాబ్ బచ్చన్ అగ్నిపధ్ తో పోల్చకూడదండీ,
    ఎందుకంటే ఆయనకు నేటి నటుల్లో ఎవరూ సరితూగరు.....
    కాని నేటి సినిమాలతో పోల్చితే బాగుందని నా అభిప్రాయం....
    ఆ మాటకొస్తే షారుఖ్ డాన్, అమితాబ్ డాన్ ముందు తేలిపోయింది కదా......
    ధన్యవాదములు....

    ReplyDelete