Monday 7 March 2011

ప్రశ్న మాయమైతే- ఎ.కృష్ణారావు

(ఇండియా గేట్- శ్రీ ఎ.కృష్ణారావు గారి వ్యాసం)
భారత
విషయంలో జిజ్ఞాసను అనేక మంది అనేక రూపాల్లో వ్యక్తం చేశారు. అనేక మేధో సమస్యలకు గతితార్కిక పద్ధతిలో పరిష్కారం కనుక్కునే ప్రయత్నాలు ఉపనిషత్తులు, దర్శనాల్లో మనం చూస్తాం. భావ, భౌతిక వాదాల గురించి లోతైన చర్చను కూడా అనేక సందర్భా ల్లో మన పూర్వీకులు చేశారు. పదార్థం అనేది లేకుండా కాలం అనేది లేదని, చలనం అనేది లేకుండా శూన్యం లేదని వాటికి పరస్పర సంబంధాలున్నాయనే చర్చ జరిగింది. రుజువు కాని సత్యా న్ని కూడా తిరస్కరించవచ్చున నే అభిప్రాయాలు వ్యక్తమయ్యా యి. స్థూలంగా చెప్పాలంటే ప్రశ్నించకుండా దేన్నైనా అంగీకరించడం భావ దాస్యానికీ, బానిసత్వానికీ నిదర్శనమని అనేకమంది తత్వవేత్తలు అభిప్రాయపడ్డారు.
రాచరిక సమాజంలో ప్రశ్నలకు ఆస్కారం లేదు. దేవుడు లేడ ని అన్నా, ఉన్నాడని అన్నా తన తరఫున వాదించేందుకు ఆయన ముందుకు రాడు. కాని రాచరిక సమాజంలో రాజును ప్రశ్నిస్తే తల ఎగిరిపోవాల్సిందే. ప్రజాస్వామ్య సమాజంలోనే ప్రశ్న కు విలువైన పాత్ర ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడ మే నిజమైన ప్రాపంచిక దృక్ప థం. ప్రజలకు అవసరమైన,
ఉపయోగకరమైన అంశాలపై ప్రశ్నలు సంధించాల్సిందే. ప్రశ్నకు అవకాశం ఇవ్వకపోవడం నియంతృత్వానికి చిహ్నంగా మనం పరిగణిస్తాం. మౌనానికి విలువ ఉండవచ్చు. కాని ప్రశ్నించకుండా మౌనం పాటించడం అంటే అది ఆత్మవంచనకో, నిస్సహాయతకో, లేక అవకాశవాదాని కో నిదర్శనం అవుతుంది. ప్రశ్నలకు జవాబులివ్వనవసరం లేదంటే పారదర్శకత లోపించినట్లే. ప్రశ్నించే హక్కు రాజ్యాంగం అన్ని ప్రాథమిక హక్కుల్లోనూ కల్పించింది. ప్రశ్నించకూడదంటే హక్కులనన్నీ కాలరాసినట్లే. కాని విచిత్రమేమంటే అధికారంలో ఉన్న వారు, పలుకుబడిగలవారు ప్రశ్నలను నిరుత్సాహపరుస్తారు.
ఆధునిక సమాజంలో, సంస్కరణల అనంతరం సమాజంలో ప్రశ్నలకున్న విలువ మరీ తగ్గిపోతున్న ది. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదు? కేంద్ర విజిలెన్స్ కమిషనర్ లాంటి పదవిలో థామస్ వంటి అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని ఎందుకు నియమించారు? లాంటి ప్రశ్నల కు జవాబులు చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం పడిందంటే, లేదా డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నదంటే జరిగిన అక్రమాల్లో ప్రభుత్వంలో పెద్దల పాత్ర ఉన్నదనడానికే లెక్క. 2జి స్పెక్ట్రమ్ నిధులు ఎవరి జేబులు నింపాయన్న ప్రశ్నలకు సమాధానాలు తెలిసే ఆస్కారమే లేదు.
మహారాష్ట్రలో ఒక జిల్లా అదనపు కలెక్టర్ చమురు మాఫియాను ప్రశ్నించినందుకు ఆయనను సజీవ దహనం చేశారు. ఆయన సజీవ దహనంలో నిందితుడైన పోపట్ షిండే ఎలాంటి వాగ్మూలం ఇవ్వకుండా మరణించారని పోలీసులు చెబుతున్నారు. పోపట్ షిండే ఆయిల్ మాఫియా వెనుక రాజకీయ పెద్ద లు, అధికారుల గురించి తన వాగ్మూలంలో చెప్పాడని, అసలు ఆయనకు మరణించేంత పెద్ద గాయాలు కాలేదని షిండే కుమారుడు అంటున్నారు. అసలు చమురు మాఫియా వెనుక ఉన్న పెద్దల్ని ఎప్పటికైనా పట్టుకోగలరా, వారి పేర్లు ఎప్పుడైనా జనానికి తెలిసే అవకాశం ఉన్నదా? అన్న ప్రశ్నలకు సమాధానం కూడా లభించడం కష్టం.
దేశంలో నల్లధనం ఎవరి వద్ద ఉన్నదో, విదేశాల్లో ఎవరి నల్లధనం బ్యాంకుల్లో జమ అయిందో ప్రభుత్వమే సమాధానం చెప్పడానికి నిరాకరిస్తోంది. మీ వద్ద కొన్ని పేర్లున్నాయి. వారిపై చట్టప్రకారమైనా చర్య తీసుకున్నారా? నల్లధనం ఎంతున్నదో చెప్పేందుకు మీరు అనుసరించే మార్గాలేమిటి? అసలు విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం ఎక్కడినుంచి వెళ్లింది? ఆయు«ధాలు అమ్మడం ద్వారానా, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారానా? అని సుప్రీంకోర్డు ఇటీవల వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పలేకపోయింది.
దాదాపు 7వేల కోట్ల డాలర్ల మేరకు విదేశాల్లో భారత దేశం నుంచి నల్లధనం తరలి వెళ్లిందని ఆర్థిక మంత్రి ప్రణ బ్ ముఖర్జీ అంచనా వేస్తున్నప్పటికీ వాటి వివరాలు మాత్రం తన వద్ద లేవని బుకాయిస్తున్నారు. తన ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధి లో ఉన్న ఆదాయపు పన్ను విభాగం వద్ద వివరాలు కూడా తనకు తెలియవని ఆయన నిండు పత్రికా సమావేశంలో చెప్పడం హాస్యాస్పదం. అసలు బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణా లు ఎగగొట్టిన బడా పారిశ్రామిక వేత్తలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కూడా ప్రభుత్వం చెప్పే పరిస్థితిలో లేనప్పడు విదేశాల్లో ఉన్న నల్లధనం గురించి చెప్పగలుగుతుందా?
నల్లధనానికి మూలం అవినీతి. అవినీతి కుంభకోణాల ద్వారా, పన్ను ఎగవేతల ద్వారా, స్మగ్లింగ్, అక్రమ మార్గాల ద్వారా జరిగిం దో తెలుసుకునే అవకాశం ప్రభుత్వానికి లేదా? అవినీతి, నల్లధనం, మాఫియా కార్యకలాపాలు, మనీ లాండరింగ్, హత్యానేరాలు మొదలైన వాటి విషయంలో సంధించాల్సి ప్రశ్నలెన్నో ఉన్నా వాటికి జవాబులు రావడం కష్టమని మనకు తెలుసు. సిబిఐ లాంటి నేరవిచారణ సంస్థలు, శాంతి భద్రతలను అదుపులో పెట్టాల్సిన భద్రతా సంస్థలు అనేక ప్రశ్నలు వేసే గొంతులను ప్రారంభంలోనే తొక్కిపెడతాయి.
అవి ఆనాటి ప్రభుత్వాల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరిస్తాయన్న విషయం మనకు తెలుసు.ప్రధానంగా మానవ హక్కుల విషయంలో దేశంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా లేదు. మావోయిస్టు నేత ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేల హత్య విషయంలో ప్రభుత్వం ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉన్నదని సుప్రీంకోర్టే పేర్కొంది.
ఇద్దరి ఎన్కౌంటర్ బూటకమని చెబుతూ అందుకు ఆధారంగా వేస్తున్న పలు ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవు. ఛత్తీస్గఢ్లో పేద ప్రజలు తమ దేవుడిలా భావించే వినాయక్ సేన్ను మావోయిస్టుగా ప్రభుత్వం ఎందుకు చిత్రించింది? ఆయనను దేశ ద్రోహం క్రింద జైలులో ఎందుకు నిర్బంధించింది? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు న్నా చెప్పలేదు. మహారాష్ట్రలో దళితులు, మైనారిటీలు సంఘటితమయ్యేందుకు కృషి చేస్తున్న రిపబ్లికన్ పాంథర్స్ నేత సుధీర్ ధావ్లే ను కూడా ఇదే విధంగా అరెస్టు చేసి నిర్బంధించారు.
దేశ వ్యాప్తం గా గిరిజనులు, దళితులు, మైనారిటీల హక్కుల కోసం, సాధికారిత కోసం పోరాడే వారిని సహించలేని తత్వం, అసహనం ఒకటి ఇప్పుడు ప్రభుత్య యంత్రాంగంలో, దాన్ని నడిపించే పెద్దల్లో జీర్ణించుకుపోయింది. తమ పట్టు సాధించుకునేందుకు వారు న్యాయస్థానాలను కూడా ఉపయోగించుకునే సంస్కృతి భారతదేశంలో పెరిగిపోతున్నది. వినాయక్ సేన్ కేసులో రాయ్పూర్ కోర్టు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం.
ఒకర్ని తీవ్రవాదిగా చిత్రించడం, సాక్ష్యాల్ని సృష్టించడం పోలీసులకు పెద్ద పని కాదు. వారు తలచుకుంటే హోంమంత్రి చిదంబరాన్ని కూడా అదే విధంగా చిత్రించగలరు. కాని న్యాయస్థానా లు ఏం చేస్తున్నాయి? నేరం రుజు వు కానంతవరకూ ఎవరైనా అమాయకుడే అన్నది సాధారణ న్యాయసూత్రం. కాని ఆధునిక ప్రజాస్వామ్యంలో నీవు అమాయకుడవని రుజువు కానంతవరకూ నేరస్తుడివేనని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని న్యాయస్థానాలు కూడా ఆటవిక సూత్రాన్ని గౌరవిస్తున్నాయి. అసలు సమాజంలో వర్గం హక్కులకోసం ఎవరు పోరాటం చేసినా అందులో మావోయిస్టులే కనిపిస్తున్నారుఅని ఛత్తీస్ఘడ్ డిజిపి అని వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 9 ఘటన తర్వాత అమెరికా కాంగ్రెస్ చేసిన దేశ భక్తి చట్టం తర్వాత రచన చే యడం నిశ్శబ్దాన్ని ఛేదించడంలా ఉన్నదని, అమెరికా నిర్వచనంలో దేశ భక్తులు కాని వారందరూ ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారని సారా పారెట్స్కీ అన్న రచయిత్రి రాశారు. ఇదే నమూనాను భారత దేశ అధికార యంత్రాంగం కూడా పాటిస్తున్నట్లు కనిపిస్తున్నది. కార్పొరేట్ దోపిడీ సంస్కృతి, ప్రభుత్వ ప్రయోజనాలు ఒకటే అయినప్పుడు జరిగే పరిణామం ఇది.
వినాయక్ సేన్ వంటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తులనే జైలు పాలు చేయగలిగినప్పుడు ప్రశ్నించేందుకు చాలా తక్కువ మంది సాహసిస్తారని, ఎన్ని ఆపరేషన్లనైనా ఎవరూ ప్రశ్నించకుండా చేయవచ్చునని ప్రభుత్వం ధీమా. దౌర్భాగ్యమేమంటే సెజ్ నుంచి ఓపెన్కాస్ట్ మైనింగ్ వరకూ పోరాడిన,సామాన్యులపై హత్యాకాండను ప్రశ్నించిన బాలగోపాల్, అనేక మంది హక్కులకు నీడలా నిలబడిన కన్నబిరాన్ లాంటి ప్రశ్నిం చే మానవీయ శక్తులు అదృశ్యమవుతున్నాయి.
ప్రశ్నించాల్సిన రాజకీయ పార్టీలు తమ ఓట్లవేటలో తలమునకలై ఉన్నాయి. ఒక చిదంబరం, ఒక మన్మోహన్, ఒక రమణ్ సింగ్, ఒక నరసింహ న్, ఒక అంబానీ, ఒక గాలి జనార్దన్ రెడ్డి, ఒక జగన్ వీరే పాఠ్య పుస్తకాల్లో భాగం కానున్నారు. భారతీయ సంస్కృతికి ప్రాణ ప్రదమైన ప్రశ్నే అదృశ్యమవుతున్నదా? అన్నది పట్టి పీడిస్తున్నది
దేశంలో నమ్మకాలకు, విశ్వాసాలకు ఎంత విలువున్న దో, ప్రశ్నలకూ కూడా అంతే విలువున్నది. భారతీయ శాస్త్రా లు, తత్వశాస్త్రం ప్రశ్నించడానికి ఎంతో విలువనిచ్చాయి. సూర్యు డు, కాంతి, గాలి, వాయువు, అగ్ని, వేడి వీటన్నిటి ఉనికి గురించి మనకు ప్రశ్నలు, చర్చలు ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తాయి. ప్రపంచానికి మూలం ఏమిటి? జలమా, అణువా అన్న

No comments:

Post a Comment