Wednesday, 23 March 2011

ప్రపంచకప్ ఫీవర్

భారత క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న ప్రపంచకప్ పోటిలు రసవత్తర స్దితికి చేరుకున్నాయి. చిరకాలము తర్వాత తిరిగి ఇండియాకు ప్రపంచకప్ సాధించలన్న టీమిండియా కోరిక మరియు తన కెరిర్ లో తొలి ప్రపంచకప్ అందుకోవలన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కోరిక తీరాలన్న  రోజు మధ్యాహ్నం ఆస్టేలియాతో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తప్పక గెలవవలసిన స్దితి. వాస్తవానికి ఇప్పటి మ్యాచ్  క్వార్టర్ ఫైనల్ ఆయినప్పటికి, ఆడే ప్రతి మ్యాచ్ ఫైనల్ గానే భావించాలి. ఎందుకంటే ఇక్కడి నుండి సమరంలో ఓడిపోయే టీమ్ వైదొలగవలసినదే. ఇలాంటి క్లిష్ట సమయములోనే టీమిండియా తన సత్తాను చాటుకోవలసిన అవసరం వచ్చింది.
2003 ప్రపంచ కప్ మన నోటి దాకా వచ్చి చేజారిపోవడంలో ఆస్టేలియా పోరాటపటిమ దోహదపడింది. రోజు ఆస్టేలియా చూపిన పోరాటపటిమకి మనవాళ్ళు దాసోహమయ్యారు. సదరు అప్పటి పరిస్దితిని నేటి మ్యాచ్ లో పునరావృతం కానివ్వకూడదనియే ప్రతి భారతీయుడు అశ. దానిని ఎంత వరకు నిలబెట్టుకుంటారనేది రోజు టీమిండియా అటగాళ్ళ మానసిక ధృడత మీద ఆధారపడియుంది.  మన వాళ్ళు తమ శక్తి సామర్ద్యాల మేరకు ఆడితే ఆస్టేలియా మీద గెలవడం పెద్ద కష్టం కాదు. కాని టీమిండియాలో ఉన్న లోపమేమిటంటే, ఇప్పటికి కూడా ఎవరో ఒకరి ప్రదర్శన మీదే ఆధారపడడం. ఇప్పటికైనా అందరూ కలిసికట్టుగా సమైక్యంగా అడితే విజయము నల్లేరు మీద నడకే.  ఏది ఏమైనా రోజు అస్టేలియాను నిలువరించి మెహలీలో జరిగే సెమీఫైనల్ పోరులో మన దాయాది పాకిస్తాన్ తో తలపడలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

Tuesday, 15 March 2011

మహవిలయం

ప్రపంచ మూడవ అర్దిక శక్తిగా వెలుగొందుతున్న జపాన్, మొన్న ఫసిఫిక్ మహ సముద్రంలో ఏర్పడిన భూకంపం కారణంగా వచ్చిన సునామీ దెబ్బకి కుదేలయ్యింది. సునామీ జపాన్ తీర ప్రాంతం పై విరుచుకుపడుతున్న దృశ్యాలు చూసి ప్రతిఒక్కరూ ఎంతో అవేదనకు గురయ్యారు. రెండవ ప్రపంచ యుద్ద గాయాల నుండి తేరుకొని ఆరు దశాబ్దాల కాలములోనే ప్రపంచ అగ్రరాజ్యముగా ఆవిర్బవం కావడానికి దోహదపడిన దేశ ప్రజల విశేషకృషిని ప్రశంసించకుండా యుండలేము. కాని అభివృద్ది పేరిట ప్రకృతి ధర్మానికి విరుద్దంగా వెళితే, ఇలానే భూకంపాలు, సునామీల బారిన పడవలసియుంటుందని మనమందరం గమనించాలి. రోజు ప్రపంచ దేశాలన్ని అభివృద్ది పేరిట ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. వాస్తవానికి అభివృద్ధిదంతయూ మధ్యయుగ కాలంలోనే సాధ్యమయింది. కాని రోజులలో ప్రకృతి ధర్మమునకు అనుగుణముగానే చేసేవారు. కాబట్టే రోజులలో ఇలాంటి ఉపద్రవాలు చాలా అరుదుగా మాత్రమే వచ్చేవి. ఏది ఏమైనప్పటికి సునామి ధాటికి సర్వం కోల్పోయిన జపాన్ ప్రజలకు సందర్బంలో సరయిన చేయూత నివ్వడమే ప్రస్తుతం మనం ప్రపంచ దేశాలు చేయవలసిన పని.