Wednesday 29 August 2012

దేవుడుతో పాటుగా మనము కూడానా!!




దేవుడు ఏమి చేసిన, దానికో అర్ద్రం ఉంటుందంటారు...

అందరిలా కాకుండా కొంత మందిని లేమితో పుట్టిస్తాడు దేవుడు... ఆయినప్పటికి వాళ్ళలో ఏదోక టాలెంట్ ని ఇస్తాడు..

అందరిలానే ఈ భూ ప్రపంచంలోకి వచ్చిన వారు... అందరిలానే అన్ని పనులు చేసుకోలేరు...

అలాంటి వారు జీవన గమనంలో పరిగెత్తడానికి చాలా కష్టపడవలసియుంటుంది.......

దానికి మనము కొద్దిగా చేయూత ఇవ్వగలిగితే, వారు తమ వైకల్యంను అధిగమించి ఉన్నత శిఖరాలు అందుకోగలరు...

మొన్న ఆదివారం, సోమవారము జరిగిన డి.యస్.సి. ఎగ్జామ్స్ సంబందించి నాకు ఇన్విజిలేటర్ డ్యూటి పడింది. ఎగ్జామ్స్ హాల్ లో క్వొశ్చన్ పేపర్ ను ఇవ్వగానే అందరూ సీరియస్ గా దానిని ఆన్సర్ చేయడంలో మునిగిపోయారు. మొత్తము అటెండెన్సు మరియు యితర కార్యక్రమాలు పూర్తి చేసుకొని, పరీక్షలు రాస్తున్న అభ్యర్దులను గమనించడంలో మునిగిపోయాను. అలా ఉండగా నా దృష్టి రూమ్ బయట క్వొశ్చన్ పేపర్ చదువుతున్న ఒక వ్యక్తి నా దృష్టిపధంలోకి వచ్చాడు.

ఏంటా అని బయటకు వచ్చి చూస్తే, అక్కడ ఒక అంధుడు డి.యస్.సి. ఎగ్జామ్ కొరకు వచ్చియున్నాడు. అతని పేపర్ ను స్వయముగా చూడలేడు. అందుకని అతనికి చదివి చెప్పడానికి ఒక హెల్పర్ ని యిచ్చియున్నారు. ఆ హెల్పర్ చదువుతూ ఉంటే , అది వింటున్న ఆఅంధ అభ్యర్ది దానికి అన్సర్ ని చెప్పి, ఆ హెల్పర్ తో అన్సరింగ్ చేయించాలి. దాని కోసము అతనికి ప్రత్యేకముగా రూమ్ బయట ప్లేస్ ని ఎలాట్ చేసియున్నారు. అంత వరకు బాగానే ఉంది.

        కాని ఆ అంధ అభ్యర్ది కోసం కేటాయించబడిన హెల్పర్ ను గమనించాను. బహుశా అతను ఇంటర్ మీడియట్ కాని లేక టెన్త్ చదివుతున్నవాడయి ఉండొచ్చనుకొన్నాను( నిబంధనల ప్రకారం ఇంటర్మిడియట్ చదువుతున్న విద్యార్దిని హెల్పర్ గా నియమించాలి)..  గమనించగా ఆ హెల్పర్ తెలుగులో ఇవ్వబడిన క్వొశ్చన్స్ ను సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నాడు. బహుశా అతను ఇంగ్లీషు మీడియం విద్యార్ది ఆయి ఉండోచ్చుననుకొంటాను. ఆ అంధ అభ్యర్దికి, సరయిన తెలుగు ఉచ్చరణతో చెప్పలేకపోతున్నాడు. ఒక్కొక్క పదాన్ని కూడబలుక్కుని పదాలు కూర్చి మాట్లాడుతున్నట్టుగా చెపుతున్నాడు. అతను చెబుతున్న దాన్ని బట్టి ఆ హెల్పర్ కి తెలుగు చదవడం సరిగా రాదని అర్ద్రం ఆయింది. సరిగా లేని అతని తెలుగు అర్ద్ర్రం కాక ఆ అంధ అభ్యర్ది చాలా ఇబ్బంది పడుతున్న విషయమును గమనించాను. నాకు చాలా బాధ అనిపించింది, ఆ దృశ్యం చూడగానే. టైమ్ గడుస్తున్న కొద్ది ఆ అంధ అభ్యర్ది చాలా టెన్షన్ పడుతున్నాడు. ఒక ప్రక్క హెల్పర్ చెబుతున్న తెలుగు ఉచ్చరణ అర్ద్రం కాక, ఒక ప్రక్క కరిగిపోతున్న టైమ్ ను తలచుకొని మనసులో పడుతున్న వేదన అతని ముఖంలో ప్రతిబింబిస్తుంది.

నాకు తెలిసి, అతను ఆ ఎగ్జామ్ కొరకు ఎంతో శ్రమతో కష్టపడి వచ్చియుంటాడు. కాని అలాంటి వార్కి హెల్పర్ ని నియమించేముందు అతను సరిగ్గా చదవగలడా, లేదా అనే విషయమును అధికారులు నిర్దారించుకొంటే బాగుంటుంది కదా అనిపించింది. అతను ఎంత కష్టపడిన, సరయిన హెల్పర్ లేని కారణంగా అతను ఉద్యోగము పొందలేకపోవడం చాలా దౌర్బాగము కదా..  చివరకు అతనే క్వొశ్చన్ పేపర్ ని కళ్ళకు బాగా దగ్గరకు పెట్టుకొని అతి కష్టం మీద చూస్తూ, అన్సరింగ్ చేయవలసివచ్చింది. ఈ విషయములో ఉన్నతాధికారులు కొద్దిగా శ్రద్ద పెట్టియుంటే, ఆ అభ్యర్దికి లైఫ్ యిచ్చినట్టుగా అవుదురు కదా....

దేవుడు అతనికి కళ్ళు కనిపించకుండా పుట్టించడం ఒక శిక్ష ఆయితే,  ఇక్కడ మనము సరయిన హెల్పర్ ని యివ్వకుండా ఇంకొక శిక్ష వేయడం భావ్యమా అనిపించింది నా అంతరాత్మకి...

చాలా మందికి  తెలిసో, తెలియకో దేవుడుతో పాటుగా మనము కూడా  శిక్ష వేసేస్తున్నాము ఇలాంటి విషయాలు ద్వారా.  ఆ దేవుడు కనికరించకపోయినా, మనమైన మానవత్వంతో మసలుకుంటే, వాళ్ళు తమ కాళ్ళ మీద నిలబడగలరు.