Tuesday 31 May 2011

సాయపడే మనసులింకాయున్నాయి......

మొన్న ఆ మధ్య రౌతులపూడిలోని మా పొలంలో చేస్తున్న పనులను చూడడానికి రమ్మని మా బావ ఫోన్ చేస్తే, సరే ఒకసారి చూసి వద్దామని బయలుదేరాను.. బడలిక దృష్ట్యా బైక్ మీద వెళ్ళేకంటే బస్సు మీద వెళ్ళడం బెటరనిపించి రౌతులపూడి మీదుగా వెళ్ళే కోటనందూరు బస్సులో బయలుదేరాను.
అప్పటికి సాయంత్రం మీదన పనులు పూర్తయిన వాళ్ళందరితో బస్సు కిక్కిరిసి పోయింది.. నాకు మాత్రము బస్సులో కండక్టరు వెనక రెండు లైన్ల వెనక కిటికి ప్రక్కన సీటు దొరికింది....
హమ్మయ్య అనుకొని దొరికిన సీటులో కూర్చుని, బస్సు ముందుకు వెళుతుంటే రోడ్డు ప్రక్కన ఉన్న చెట్లు వెనక్కు పరిగెడుతున్న దృశ్యం చూసి చాలా ఆనందం వేసింది...
అప్పటికి బస్సులో సరదాగా ప్రయాణించి చాలా రోజులయ్యింది... కొంతసేపటికి బస్సు కత్తిపూడి చేరుకుంది. అప్పటికి బస్సులో జనం తగ్గలేదు సరికదా ఇంకొంత మంది జనం తోడయ్యారు...
బస్సు బయలుదేరిన తర్వాత యదాలాపంగా జనంలోకి చూసిన నాకు అక్కడ రోజుల వయసున్న బిడ్డతో ఒకామె మరియు ఆవిడ తల్లి గారు అనుకుంటాను, ఇద్దరు కలసి ఆ బస్సులో ఆ జనాల తోపులాటలో నిలబడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు... వెంటనే లేచి ఆ బిడ్డ తల్లికి సీటు ఇస్తే బాగుంటుందనిపించింది.
 కాని తను నాకు చాలా దూరంలో యుంది. మరియు ఆ గందరగోళ పరిస్దితులో నా పిలుపు వారికి అందలేదు.... ఇక లాభం లేదని పైకి లేచి నిలబడదామనుకొనేసరికి కండక్టర్ వెనక సీటులో ఉన్న యువకుల్లో ఒకతను లేచి ఆ బిడ్దల తల్లికి స్దానం ఇచ్చాడు... కొద్ది సెకనుల్లోనే ప్రక్కనే ఉన్న ఇంకో యువకుడు కూడా లేచి ఆమె తల్లికి సీటు ఇచ్చాడు....  ఆ దృశ్యం చూడగానే నాకు చాలా ఆనందం కలిగింది...
 ఎందుకంటే అంతకు ముందు స్టేజిలోనే సీటు గురించి ఒక పెద్ద మనిషితో గొడవపడి మరి ఆ సీటులో కూర్చున్నాడు. అప్పుడు అనుకొన్నా... ఏంటి మనవాళ్ళు మరి ఇంతగా స్వార్దపరులవుతున్నారని..... కాని అదే యువకుడు ఇప్పుడు ఒక బిడ్ద తల్లికి సీటు ఇచ్చి మనలోని విలువలు ఇంకా బ్రతికేయున్నాయని తెలియపరిచాడు... అంటే మనలో చాలా మందికి స్వార్దమున్నప్పటికి, అవసరమైనప్పుడు సహయము చేయడానికి కూడా మన తెలుగు వారు ఎంత ముందు ఉంటారో తెలిసింది....
  అందుకనే ఇప్పుడు అంటున్నా సాయపడే మనసులింకాయున్నాయి అని......

Wednesday 11 May 2011

వేసవి కాలము- తీపి గుర్తులు

వేసవి కాలము వచ్చిందంటే ఇప్పడు చాలా చిరాకు పడుతున్నాము కాని, ఒకప్పుడు ఇదే వేసవి కోసము సంవత్సరమంతా ఎదురుచూసేవాళ్ళం. చదువుకొనే రోజుల్లో వేసవి కాలానికి ఉన్న క్రేజ్ అంతయింత కాదు. ఎప్పుడు క్లాస్ లు ఆవుతాయా... ఎప్పుడు పరీక్షలు ఆవుతాయా.... ఎప్పుడు సొంత ఇళ్ళకు వెళ్ళిపోతామా......... అని ఎదురుచూపులు చూస్తుండేవాళ్ళం. ఇక వేసవి కాలము రాగానే మా ఇంటికి వెళ్ళగానే, అప్పటికి సుమారు ఇంకో పది మంది వరకు ఉండేవాళ్ళం. అందరం కలసి ఒక పంక్తిలోనే భోజనాలు, మధ్యాహ్నం చలువ పందిరి క్రింద మడత మంచాల మీద పడుకొని కబుర్లు, సాయంత్రం చేలోకి వెళ్ళడం, ముంజుకాయలు(తాటికాయలు) కొట్టించుకొని తినడం, పై ఈతకు వెళ్ళడం, తిరిగి రాత్రికి వెన్నెల్లో ఆరుబయట కూర్చుని అర్దరాత్రి వరకు కబుర్లు చెప్పుకోవడం. వేసవంతా విధముగానే గడిచిపోయేది. అసలు ఎండల దెబ్బ తెలిసేదే కాదు.
కాని ఇప్పుడు, పొద్దున్నే ఆఫీసుకి పోవడం, ఆఫీసులో ఎండ వేడికి ఉక్కపోత రేంజ్ లో ఉండడం, మధ్యాహ్నం మనమొక్కరమే ఏదో భోజనం తిన్నమనిపించడం, ఆఫీసు ఆవగానే ఇంటికి వెళ్ళడం, అప్పటికి ఎండ దెబ్బకి ఇల్లు అగ్నికుంపటి లా భగభగ మనడం.  ఇక ఇంటిలో మనమొక్కరిమే టి.వి.లో ఏదో ఒక చానల్ చూస్తూ పడుకోవడం. పడుకోవడము కూడా యాంత్రిక నిద్ర కావడం. స్వచ్చమైన ప్రకృతి గాలికి బదులు యాంత్రిక ఎయిర్ కండిషనర్ గాలులలో పడుకోవడం గమనిస్తే వేసవి రోజులకు, వేసవి రోజులకి ఎంత తేడా ఉందో తెలుస్తుంది. అందుకే నాకు దేవుడు కనిపించి వరమడిగితే ఎండలు తగ్గించమని అడగను కాని నాకు మరల పాత రోజులను ప్రసాదించవలసినదిగా కోరతాను. మొన్న ఆదివారం మా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తము నా ఐదుగురు మరదళ్ళు, అన్నయ్య, చెల్లి, బావ, ఇద్దరు అత్తయ్యలు, ఇద్దరు మావయ్యలతో ఇళ్ళు కలకలలాడుతు ఉంటే నాకు తిరిగి రావలనిపించలేదు. నిజముగా నాకు రావలనిపించలేదు. కాని తప్పదు కదా....... అందుకే ఆయిష్టంగానే బయలుదేరాను.....

Tuesday 3 May 2011

ఉగ్రవాదం-ఆగ్రరాజ్యకుటిలనీతి

అంతర్జాతియ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా ప్రత్యేక దళాలు పాకిస్తాన్ లో హతమార్చడంపై సర్వత్రా ఆనందం వెల్లువిరించింది. నిజానికి విషయములో అందరూ విధముగా స్పందించడానికి అతను గతములో పాల్పడిన పలు ఘతుకాలు కారణం కావచ్చు. నిజానికి ఒసామా బిన్ లాడెన్ లాంటి వారి వలన ఎంత నష్టమో స్వయంగా అమెరికాకు తెలియడం వలన, దాని యొక్క త్రీవత మిగతా ప్రపంచంనకు తాకింది.

 తమ దేశములోని డబ్యూ.టి.. టవర్స్ ని పేల్చివేసిన తర్వాత మాత్రమే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ యొక్క ఆకృత్యాలు కనిపించాయి. అంతకు ముందే అతను పలు పేలుళ్ళు ద్వారా అనేక మంది చావుకు కారణమైనప్పటికి, తమ దేశం మీద దాడి జరిగిన తర్వాతకి గాని మెలకువలోకి రాలేదు. నిజానికి చెప్పాలంటే, లాడెన్ కు మరియు అల్ ఖైదాకి జవస్వతాలు కల్పించింది అమెరికాయే నన్న విషయము అందరికి తెలుసు. అమెరికా నీతి ఎలా ఉంటుందంటే, తనకు నష్టం జరగనంత వరకు ప్రపంచంమంతా బాగుగానే ఉంటుందనుకొంటుంది. నష్టం జరిగితే అది ప్రపంచం అంతటికి పెద్ద ప్రమాదం జరిగినట్టు చిత్రికరిస్తుంది.

 ఉదహరణకు మన దేశము ఎప్పటినుండో ఉగ్రవాదానికి బలవుతూ వచ్చింది. దానికి ప్రధాన ఆయువుపట్టు పాకిస్తాన్ నుంచే అందుతుందని భారత్ పలుమార్లు మొత్తుకున్నప్పట్టికి అమెరికా పట్టించుకోలేదు. పోని మనము స్వయముగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద తండాల మీద దాడులు చేద్దామంటే, అమెరికా  మధ్యలో కల్పించుకొని అంతర్జాతియ న్యాయ సూత్రాలు వల్లె వేసేంది. దానితో మనము నాటి నుండో అమెరికా యొక్క ద్వంద వైఖరికి అలవాటు పడిపోయాము. అదే అమెరికాకు ఉగ్రవాద సెగ తగలడంతో అల్ ఖైదా ను అంతం చేయడానికి ఆఫఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేయడానికి మాత్రం న్యాయ సూత్రాలు గుర్తుకురావు. ఉగ్రవాదము ఎక్కడున్న దానితో కూకటి వేళ్ళతో సహ పెకిలించవలసినదే. రోజు ఒసామా బిన్ లాడెన్ హత్య, మిగతా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవారికి హెచ్చరికే.  అందుకే మన హిందూ సంప్రదాయములో ఒక సామెత ఉంటుంది. అదేమిటంటే "ఎవడి చేసిన కర్మ వాడు అనుభవించవలసినదే" అని. ఇది అటు అమెరికాకు, ఇటు ఒసామా బిన్ లాడెన్ కి వర్తిస్తుంది. అల్ ఖైదాను తన అవసరాల కోసం పెంచిపోషించినందుకు అమెరికా దక్కిన ప్రతిపలం, మరియు అనేక మంది ఉసురుకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ కు దక్కిన ప్రతిపలం ఎటువంటిదో గమనించవచ్చు.